
తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ రూమర్స్ గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవల విడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పలు ఈవెంట్స్, వెకేషన్‌లలో కలిసి కనిపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఫోటోలు షేర్ చేసేవారు. కానీ ఇటీవల వీరిద్దరు విడివిడిగా కనిపించడం..సోషల్ మీడియా నుంచి ఫోటోలను తొలగించడంతో బ్రేకప్‌అయినట్లు రూమర్స్ వచ్చాయి.
అవి నిజమే అన్నట్లుగా అటు తమన్నా, ఇటు విజయ్‌ల మాటలు ఉన్నాయి. రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్ లాగా ఆస్వాదించాలి, అప్పుడే సంతోషంగా ఉంటారని విజయ్ అంటే.. ప్రేమను వ్యాపార లావాదేవీలా చూడటం ప్రారంభించినప్పుడే సమస్యలు మొదలవుతాయని తమన్నా అంటోందీ. పెళ్లి విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్రతిపాదించగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత చూపలేదట. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తి, చివరకు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
హాట్ ఫోటోలతో హల్‌చల్
బ్రేకప్ రూమర్స్‌పై తమన్నా, విజయ్‌లలో ఒకరు కూడా స్పందించలేదు. పైగా వీరిద్దరు కూడా విడివిడిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా అయితే వరుస సినిమాలతో పాటు పలు ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్‌తో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. బ్రేకప్ తర్వాత తమన్నా మరింత సంతోషంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల విషయాకొస్తే.. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 లో నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.