
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది.
కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..
రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.
