War 2: Not Jr NTR, But Vijay Devarakonda and Prabhas Were First Choices - Sakshi

War 2: ఆ హీరో బ్యాడ్‌లక్‌.. సినిమా ఫ్లాప్‌ కావడంతో ఆఫర్‌ ఎన్టీఆర్‌ చేతికి వచ్చిందట

Published Tue, Apr 11 2023 1:07 PM | Last Updated on Tue, Apr 11 2023 1:58 PM

War 2: Not Jr Ntr But Vijay Devarakonda And Prabhas Were First Choices - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమా విజయంతో మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సూపర్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఇక హీరోగానే కాకుండా యంగ్ టైగర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఇదివరకే జై లవకుశ సినిమాలో చూపించాడు. ఆ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో దుమ్ముదులిపాడు తారక్‌.

ఇప్పుడు మరో స్టార్‌ హీరోతో తలపడితే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలవడం ఖాయం. హృతిక్‌ రోషన్‌ నటిస్తోన్న వార్‌ -2లో తారక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే వార్‌-2కి విలన్‌గా ఎన్టీఆర్‌ కంటే ముందు ఇద్దరు స్టార్‌ హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయట. అందులో మొదటగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ దగ్గరకి ఆఫర్‌ వెళ్లిందట.

అయితే ఇప్పటికే ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్‌ సున్నితంగా నో చెప్పాడట. అంతేకాకుండా మల్టీస్టారర్‌ కూడా అంతగా ఇంట్రెస్ట్‌ లేకపోవడంతో ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారట. ఇక ఎన్టీఆర్‌కు ముందు విజయ్‌ దేవరకొండను ఈ ప్రాజెక్టులో తీసుకోవాలని మొదట భావించారట.

కానీ లైగర్‌ సినిమా రిజల్ట్‌ తర్వాత అంచనాల తలకిందులయ్యాయి. దీంతో విజయ్‌ స్థానంలో ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్‌ విశేషం ఏంటంటే..ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వరకు రూ. 45కోట్ల పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్‌ వార్‌-2 కోసం రూ. 100కోట్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement