సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే? | Jr NTR is set to portray an Indian agent in War 2 | Sakshi
Sakshi News home page

సీక్రెట్ ఏజెంట్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే?

Published Wed, Mar 6 2024 12:01 AM | Last Updated on Wed, Mar 6 2024 6:35 AM

Jr NTR is set to portray an Indian agent in War 2 - Sakshi

హిందీ చిత్రం ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ విలన్‌గా కనిపిస్తారా? అసలు ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు చిన్న క్లూ దొరికింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ పాత్ర పాజిటివ్‌గా ఉంటుందట. ఇక యశ్‌రాజ్‌ స్పై యూనివర్శ్‌లో భాగంగా రూపొందుతున్న ‘వార్‌ 2’ మల్టీస్టారర్‌ మూవీ అనే విషయం తెలిసిందే.

హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్‌ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. ఇంకో విషయం ఏంటంటే... ‘వార్‌ 2’లో రహస్య గూఢచారిగా యుద్ధం చేసే ఎన్టీఆర్‌తో ఆ తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్‌ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే ఈ స్పై చిత్రాల్లో కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా అనుకుంటున్నారట. ఇక ‘వార్‌ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement