
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
నల్లగొండ : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని మదీనా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన పాల్గొన్నారు. అ సందర్భంగా మాట్లాడుతూ మదీన మసీద్ ర్యాంప్ అభివృద్ధి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్ష పదవిని ముస్లింలకే ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మదీన మసీదు పెద్దలు మౌలానా తదితరులు పాల్గొన్నారు.