
మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్ ఫెయిల్ అయిన, ఇంప్రూవ్ మెంట్ రాసుకునే విద్యార్థులుకు మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూనాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ రెండు పూటల పరీక్ష ఉంటుందని.. సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఫ్టస్, సెకండియర్ పరీక్ష ఫీజు రూ.520తోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ.180 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
నల్లగొండ టూటౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని హజ్ హౌజ్‌లో వంద మంది హజ్ యాత్రికులకు గురువారం వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ధరిచేరవని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మ, జిల్లా ఉప వైద్యాధికారి ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ బి.అరుందతి, ఆర్.వీరారెడ్డి, పి.కృష్ణ, మాజిద్‌అలీ, జి.రాము పాల్గొన్నారు.
పంట మార్పిడితో అధిక లాభాలు
కనగల్ : రైతులు పంట మార్పిడి వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఆర్డీఓ అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం తిమ్మాజిగూడెంలో రైతు కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జిల్లా ఉద్యాన అధికారి పి.అనంతరెడ్డి, నల్లగొండ, కనగల్ వ్వవసాయాధికారులు శ్రీనివాస్, అమరేందర్‌గౌడ్‌తో కలిసి మఖానా విత్తనాలను నారుమడిలో చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఖాన ఎకరానికి 32–34క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఒక కేజీ రూ.300 నుంచి రూ.800 ధర పలుకుతుందన్నారు. ఎకరానికి దాదాపు రూ.60వేల నుండి రూ.80వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
మర్రిగూడ : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలన్నారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు యరగండ్లపల్లి నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ జి.చినమునయ్య, ఏపీఎం వెంకట్, సీసీ భారతమ్మ, ఏఈఓ విజయ్‌కుమార్, సిబ్బంది శంకర్, రాజ్యం ఉన్నారు.
పోషకాహారంపై
అవగాహన
నల్లగొండ : గర్భిణులు సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని భారత ఆహార సంస్థ నల్లగొండ సీనియర్ అధికారి కృష్ణవేణి అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా, రామగిరి లోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పిల్లలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు ఆదిమల్ల శంకర్, ఉద్యోగులు సునంద, సతీష్ రెడ్డి, అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకురాలు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు