Top Stories
ప్రధాన వార్తలు

విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో మంటలు ఎగిసిడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విశాఖలో మెడికో ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

GT VS DC: డబుల్ సెంచరీ పూర్తి చేసిన కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో సిక్సర్ల డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఐపీఎల్లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్‌కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (286), విరాట్ కోహ్లి (282), ఎంఎస్ ధోని (260), సంజూ శాంసన్ (216), సురేశ్ రైనా (203) సిక్సర్ల డబుల్ సెంచరీ పూర్తి చేశారు. ఓవరాల్‌గా రాహుల్‌కు ముందు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్ (251), డేవిడ్ వార్నర్ (236), కీరన్ పోలార్డ్ (223), సంజూ శాంసన్, ఆండ్రీ రసెల్ (212), సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 1052గా ఉంది. అక్షర్ పటేల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (8) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్ మూడో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉంది. పంజాబ్ రెండు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్ రాయల్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్‌ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.

అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
విజయవాడ, సాక్షి: లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్ వన్ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

సినిమాను ఖూనీ చేద్దామని దుష్టశక్తుల ప్రయత్నం.. విజయశాంతి వార్నింగ్
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. మిశ్రమ స్పందన మధ్య సినిమా తొలిరోజు దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా మంగళవారం లోపు తిరిగి వచ్చేస్తుందని కళ్యాణ్ రామ్ ధీమాగా ఉన్నాడు. అయితే విజయశాంతి మాత్రం సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే మా హెచ్చరిక..శనివారం ఏర్పాటు చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సక్సెస్ మీట్లో విజయశాంతి (Vijayashanthi) మాట్లాడుతూ.. సినిమాను ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక.. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలి. కొంత మంది కావాలనే శాడిజంతో సినిమాల్ని ఇబ్బండిపెడుతున్నారు. ప్రతి ఒక్క మూవీ ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగోలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి.సినీ ఇండస్ట్రీని బతికించండిసినిమా నచ్చలేదని.. ఖూనీ చేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రజలు మా మూవీ చూసి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి.. అంతేకానీ మంచి చిత్రాలను చంపే హక్కు మీకు లేదు. సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు అని విజయశాంతి పేర్కొంది.చదవండి: నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు..

అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించాలని, ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.
జేఈఈ మెయిన్ ఫలితాలు.. 110 మందికి షాక్!
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
'ప్రేమలు' హీరో బాక్సింగ్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్ట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి
ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగింపు
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
చల్లటి కబురు!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
విశ్వమూ భ్రమిస్తోంది
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
హమ్మయ్య.. బంగారం ఆగింది!
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
పెరుగుతున్న మత సమ్మతి
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
రొయ్యకు లోకల్ మార్కెట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
అమ్మా..ఊపిరాడలేదు!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
చాలెంజర్స్‌పై పంజా...
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
సైన్యాన్ని దింపండి.. రాష్ట్రపతి పాలన పెట్టండి
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
విద్యార్థుల వీసాలపై పిడుగు
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
జేఈఈ మెయిన్ ఫలితాలు.. 110 మందికి షాక్!
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
'ప్రేమలు' హీరో బాక్సింగ్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్ట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి
ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగింపు
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
చల్లటి కబురు!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
విశ్వమూ భ్రమిస్తోంది
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
మూతపడిన జిందాల్ స్టీల్స్
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
హమ్మయ్య.. బంగారం ఆగింది!
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
పెరుగుతున్న మత సమ్మతి
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
రొయ్యకు లోకల్ మార్కెట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
అమ్మా..ఊపిరాడలేదు!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
చాలెంజర్స్‌పై పంజా...
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
సైన్యాన్ని దింపండి.. రాష్ట్రపతి పాలన పెట్టండి
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
విద్యార్థుల వీసాలపై పిడుగు
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
సినిమా

తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?
ఈ వారం థియేటర్లలో తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో తమన్నా 'ఓదెల 2'(Odela 2 Movie) ఒకటి. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ కలెక్షన్సే(Odela 2 Collection) మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా రావట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది.రెగ్యులర్ గా రిలీజయ్యే శుక్రవారం కాకుండా గురువారం (ఏప్రిల్ 17న) ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తొలిరోజు చాలాచోట్ల థియేటర్లు సరిగా ఫుల్ కాలేదు. దీంతో రూ.85 లక్షలే వచ్చాయని, రెండో రోజుకి ఇది మరింత తగ్గి రూ.59 లక్షలే వచ్చాయని సమాచారం. మొత్తంగా రూ.1.44 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)దాదాపు రూ.24 కోట్ల మేర బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే వీకెండ్ తర్వాత థియేటర్లలో నిలబడుతుందా అనే సందేహం వస్తోంది. మరి లాంగ్ రన్ లో 'ఓదెల 2'కి ఎన్ని కోట్ల వస్తాయనేది చూడాలి?కథ పరంగా యావరేజ్ టాక్ వచ్చింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ తరహా వసూళ్లు ఎందుకొస్తున్నాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు. 'అరుంధతి' సినిమాతో పోలిక రావడం ఏమైనా మైనస్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. తమన్నా(Tamannaah Bhatia) శివశక్తిగా డిఫరెంట్ గెటప్ వేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు)

నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు.. అయినా!
సినీనటుడు విష్ణు ప్రసాద్ (Vishnu Prasad) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు పేర్కొన్నారు. దీనికి రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, దయచేసి సాయం చేసి ఆదుకోమని విష్ణు ప్రసాద్ కుటుంబసభ్యులు అర్థిస్తున్నారు. నటుడి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండటంతో అతడి కుటుంబసభ్యులే కాలేయదానానికి ముందుకొచ్చారు. అది సరిపోదువిష్ణు కూతురు.. కాలేయం దానం చేసి తండ్రిని బతికించుకోవడానికి సిద్ధమైంది. కానీ ఈ మేరకు ఆపరేషన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని ఆత్మ సంస్థ (ద అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్) పేర్కొంది. తమది చిన్న సంస్థ అని.. కొంత మొత్తం ఆర్థిక సాయం చేశామని.. చికిత్సకు అది సరిపోదని ఆత్మ వైస్ ప్రెసిడెంట్, నటుడు మోమన్ అయిరూర్ పేర్కొన్నాడు. సంస్థ సభ్యులను తోచినంత సాయం చేయాలని కోరినట్లు తెలిపాడు.ఎవరీ విష్ణు ప్రసాద్?విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ ఐఏఎస్, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు. View this post on Instagram A post shared by Vishnu Prasad (@vishnu.prasad18) చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్

బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు
విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు బాబీ సింహా. స్వతహాగా తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇతడి కారు వల్ల పలువురికి గాయాలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?నటుడు బాబీ సింహకు చెందిన కారు.. శనివారం ఉదయం ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్ పోర్ట్ రోడ్డులో వెళ్తున వాహనాలపై దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సుమారు ఆరు వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఇలా జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగిన టైంలో బాబీ సింహ కారులో లేరని పోలీసులు తేల్చారు.తమిళ మూవీ 'జిగర్తాండ'తో మంచి ఫేమ్ సంపాదించిన బాబీ సింహ.. పేట, వాల్తేరు వీరయ్య, డిస్కో రాజా, 777 చార్లీ, సలార్, ఇండియన్ 2 తదితర చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.(ఇదీ చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్)

దసరా నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన షైన్ టామ్ చాకో అక్కడినుంచి పరారైనట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తు నుంచి దూకి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఆ విజువల్స్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా పోలీసు విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్‌స్టేషన్‌కు ఆయన వచ్చారు. విచారణ అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటారని గతంలోనే పలుమార్లు వార్తలు వచ్చాయి. రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై పదునైన విమర్శలు చేసింది. సినిమా సెట్లోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో తన పట్ల చాలా అభ్యంతరకరంగా ఆయన వ్యవహరించారని ఆమె చెప్పింది. దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్‌కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్

ICC WC Qualifier: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
వన్డే ప్రపంచకప్ ఆడాలన్న స్కాట్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. ఐసీసీ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్కాటిష్ జట్టు ఓటమిపాలైంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీ (ICC Women's ODI World Cup) జరుగనున్న విషయం తెలిసిందే.ఒక్క వికెట్ తేడాతోఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా ఇందుకు సంబంధించి క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో స్కాట్లాండ్ (Ireland Beat Scotland)ను ఓడించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిచి... శనివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేది. కానీ స్కాట్లాండ్ ఆశలపై ఐర్లాండ్ నీళ్లు కుమ్మరించింది.కేథరీన్ బ్రైస్ అజేయ సెంచరీ వృథాలాహోర్ వేదికగా ఐర్లాండ్‌తో పోరులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు సాధించింది. కెప్టెన్ కేథరీన్ బ్రైస్ (Kathryn Bryce- 137 బంతుల్లో 131 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసి స్కాట్లాండ్కు గౌరవప్రద స్కోరు అందించింది. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..అనంతరం ఐర్లాండ్ జట్టు సరిగ్గా 50 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సారా ఫోర్బ్స్ (55; 6 ఫోర్లు), కెప్టెన్ గ్యాబీ లూయిస్ (61; 9 ఫోర్లు), లౌరా డెలానీ (57 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేసి ఐర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ తమ ఐదు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకొని నాలుగు పాయింట్లతో వరుసగా మూడో, నాలుగో స్థానంలో నిలిచాయి.పాక్ బెర్తు ఖరారుఇక చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్.. థాయ్‌లాండ్ జట్టుతో వెస్టిండీస్ శనివారం తలపడతాయి. ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజయాలతో పాకిస్తాన్ ఇప్పటికే వరల్డ్‌కప్‌కు అర్హత పొందగా... రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్ రేసులో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం

డేవిడ్ వార్నర్‌కు మరో ఆఫర్.. ఈసారి..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సీటెల్ ఒర్కాస్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీటెల్ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమతో జట్టు కట్టినట్లు తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఎన్నో టీ20 లీగ్‌లలో వార్నర్ భాగమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్ (ఇంగ్లండ్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (UAE), పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో వివిధ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.12956 పరుగులు.. సగం ఐపీఎల్లోనేఇక టీ20 ఫార్మాట్లో వార్నర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు 402 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 12956 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్లో ఆడిన మ్యాచ్‌లు 184 కాగా.. సాధించిన పరుగులు 6565. 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన వార్నర్ నిలకడైన ఆటతో రాణించాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఅంతేకాదు 2016లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ అందించాడు. చివరగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు ఢిల్లీ వార్నర్‌ను వదిలేయగా.. వేలంలోనూ అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.పీఎస్ఎల్లో అత్యధిక ధరఈ క్రమంలో పీఎస్ఎల్ వైపు దృష్టి సారించిన వార్నర్.. ఈ పాక్ టీ20 లీగ్‌లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కరాచీ కింగ్స్ అతడిని రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక పీఎస్ఎల్ ఏప్రిల్ 11- మే 18 వరకు జరుగనుండగా.. అమెరికా టీ20 లీగ్ MLCని జూన్ 12- జూలై 13 వరకు నిర్వహించనున్నారు.సీటెల్ ఒర్కాస్తో తాజా ఒప్పందంఈ నేపథ్యంలో సీటెల్ ఒర్కాస్ వార్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తానికి అతడి సేవలు వినియోగించుకోబోతోందో మాత్రం వెల్లడించలేదు. కాగా వార్నర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్.. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఈ ఏడాది జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతేకాదు.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి 405 పరుగులతో లీగ్‌లో అత్యధిక వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐఎల్టీ20లో ఈ ఏడాది టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో వార్నర్ సభ్యుడు. ఇక ది హండ్రెడ్ లీగ్‌లో అతడు లండన్ స్పిరిట్‌కు ఆడుతున్నాడు. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం

అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ సాధించాడు.ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్‌లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్‌లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్‌ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా
బిజినెస్

ఫోన్ రీచార్జ్‌లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్‌లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్‌లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్‌లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్‌లో టెలికాం టారిఫ్‌లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్‌ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్‌ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్‌పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్‌ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు.

జాబ్ ఆఫర్ లేకుండానే యూఎస్‌లో పని
అమెరికా వెళ్లడం చాలామంది కల. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని నిపుణులకు యూఎస్ తమ కెరియర్ పురోగతికి అంతిమ గమ్యంగా తోస్తుంది. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, మెరుగైన వేతనాలు, శాశ్వత నివాసానికి అవకాశాలు ఉండటంతో అమెరికాలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే యూఎస్ వెళ్లేందుకు వర్కింగ్ వీసా పొందడం కష్టమే. దీనికి సాధారణంగా యూఎస్ కంపెనీ యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం అవుతుంది. కానీ జాబ్ ఆఫర్ లేకుండానే అమెరికాలో పని చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇందుకోసం కింది రెండు వీసాలు ఎంతో ఉపయోగపడుతాయి.ఈబీ-2ఈబీ-2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ (ఎన్ఐడబ్ల్యూ) అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డ్) కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా అధునాతన డిగ్రీలు (మాస్టర్స్ లేదా పీహెచ్డీ వంటివి) లేదా యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు.ఈబీ-2కు ఎవరు అర్హులు?సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు దీనికి అర్హులు. యజమానిపై ఆధారపడే హెచ్ -1బీ మాదిరిగా కాకుండా ఈబీ-2 కోసం ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పనిచేయవచ్చు.ఓ-1 వీసాఓ-1 వీసా అనేది ఒకే యజమాని నుంచి స్పాన్సర్షిప్ అవసరం లేని వీసా. ఇది అసాధారణ సామర్థ్యాలు ఉన్నవారికి ఇస్తారు. ఇది నిపుణులు విభిన్న సంస్థల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అనుమతిస్తుంది. ఆయా రంగాల్లో అసాధారణ సామర్థ్యాలున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్..?సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీరి పేరుపై ఆయా రంగాల్లో రికార్టులుండాలి. ఆ విజయాలకు జాతీయ లేదా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఓ-1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా లభిస్తుంది.

బెంగళూరు, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ఔట్..?
గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ప్రకటనలు, సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ లేఆఫ్స్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.గూగుల్ ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. తాజాగా మళ్లీ ఇలా లేఆఫ్స్ వార్తలు వస్తుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటానికి సంస్థ ప్రయత్నిస్తున్నందున నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: కోత కోసి.. పూత పూసి..అయితే భారత్‌లో మాత్రం ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి గూగుల్ కాస్త మెరుగ్గా వ్యవహరిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌ల్లో టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా ఆదాయం సమకూరే ఇతర ప్రాజెక్టుల్లో కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పులు చేసింది. గత సంవత్సరం తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. దాంతో భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గింపు కోసం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది. విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో తమ ఉద్యోగులకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది.

హమ్మయ్య.. బంగారం ఆగింది!
దేశంలో బంగారం ధరలు (Gold Prices) గత కొన్ని వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,730- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే ఇక్కడ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ట్రాయ్ ఔన్స్‌కు 3,340 డాలర్ల వద్ద ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.బంగారం ధరలు రాబోయే రోజుల్లో రూ.1,00,000 (10 గ్రాముల 24 క్యారెట్) మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ

ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్‌నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్‌మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్‌నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్‌నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్‌నగర్‌గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్‌సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్‌బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు.

Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్ చీరను ధరించి స్పెషల్ లుక్‌లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్ అండ్ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్ అండ్ డైమండ్స్ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.

స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..)

బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఫొటోలు


తిరుమలలో సమంత సహా పలువురు సెలబ్రిటీలు (ఫోటోలు)


దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)


రెడ్ రోజ్ డ్రెస్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్యూటీ మీనాక్షి చౌదరి


రెట్రో లుక్‌లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)


విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)


బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రీతి జింటా (ఫోటోలు)


శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)


రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక (ఫొటోలు)
అంతర్జాతీయం

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు.

విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025

FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025
జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది మావోలు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 33 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 17 మందిపై మొత్తం రూ.49 లక్షల రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. వీరిలో 9 మంది మహిళలు సహా 22 మంది సీఆర్పీఎఫ్ ఎదుట, మరో ఇద్దరు మహిళలు సహా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. సైద్ధాంతిక బలం లేని మావోయిస్ట్ పార్టీ స్థానిక గిరిజనులపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నందునే తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వీరు చెప్పారన్నారు. లొంగిపోయిన వారిలో సుమారు 22 మంది ఛత్తీస్‌గఢ్‌లోని మా, ఒడిశాలోని నౌపడలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కిరణ్ చవాన్ వివరించారు. లొంగుబాట పట్టిన వారిలో ప్రముఖంగా పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా(33), అతడి భార్య, అదే స్క్వాడ్‌కు చెందిన జోగి(28) ఉన్నారని వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఇంకా కమిటీ సభ్యులైన కికిడ్ దెవె(30), మనోజ్‌లపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.

ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి.

2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్తహీనత ముక్త్ భారత్’ పథకంలో అమలులో భాగంగా 2023–24లో పిల్లలు, బాలికలు, గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించే ప్రక్రియలో 91.1శాతం కవరేజీతో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 82.9శాతం కవరేజీతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024–25 రెండో త్రైమాసికంలో 15.4 కోట్ల మంది పిల్లలు, కౌమార బాలికలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అందించినట్లు తెలిపింది. ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురికి అందుతున్న ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటోందని పేర్కొంది. పురుషుల్లోనూ 25శాతం మందిలో.. జాతీయ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం భారతదేశంలో 67.1శాతం మంది 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న పిల్లలు, 59.1శాతం మంది 15 నుంచి 19 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 15–49 సంవత్సరాల మధ్య ఉన్న 52.2శాతం మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంది. అయితే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య పురుషుల్లో రక్తహీనత ప్రభావం మహిళలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. ఈ వయసులోని మహిళల్లో 57శాతం రక్తహీనత ఉంటే.. పురుషుల్లో 25శాతం రక్తహీనత నమోదైంది. అదే సమయంలో తెలంగాణలోని 70శాతం మంది పిల్లల్లో, 64.7శాతం కౌమార బాలికల్లో, 53.2శాతం గర్భిణుల్లో రక్తహీనత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 63.2శాతం పిల్లల్లో, 60.1శాతం బాలికల్లో, 53.7శాతం గర్భిణుల్లోలో రక్తహీనత సమస్య ఉందని జాతీయ ఆరోగ్య సర్వే–5 గుర్తించింది. కాగా.. రక్తహీనత ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల 500 మిలియన్ల మహిళలను, 5 సంవత్సరాలలోపు (6–59 నెలలు) 269 మిలియన్ల పిల్లలను ప్రభావితం చేస్తోందని కేంద్రం తెలిపింది. కాగా దాదాపు 30శాతం గర్భిణులు కాని స్త్రీలు (539 మిలియన్లు), దాదాపు 37శాతం గర్భిణులు (32 మిలియన్లు) రక్తహీనతతో బాధపడుతున్నారు.

Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది.

ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.

ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ చేసి ఎస్సైని కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్ ఎస్సైగా పని చేస్తున్నారు.
వీడియోలు


పెద్దిలో మగధీర కాంబినేషన్?


పార్టీ మారిన కార్పొరేటర్ల పై వరుదు కళ్యాణి సీరియస్ కామెంట్స్


విద్యార్థిని మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు


విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య


భారత్ కు ఇలాన్ మస్క్


విజయసాయి రెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు


అల్లు అర్జున్, అట్లీ మూవీకి పుష్ప సెంటిమెంట్!


కుట్రలు, కుతంత్రాలతో కూటమి మ్యాజిక్ ఫిగర్


మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా షాక్


గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్