
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
‘మహా కుంభమేళా సందర్భంగా తీర్థరాజ సంగమం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారనే వార్త వినడం హృదయ విదారకంగా ఉంది’ అని మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ లో రాశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
महाकुंभ के दौरान, तीर्थराज संगम के तट पर हुई भगदड़ से कई लोगों की जान गई है और अनेकों लोगों के घायल होने का समाचार बेहद हृदयविदारक है।
श्रद्धालुओं के परिजनों के प्रति हमारी गहरी संवेदनाएँ और घायलों की शीघ्रातिशीघ्र स्वास्थ्य लाभ की हम कामना करते हैं।
आधी अधूरी व्यवस्था,…— Mallikarjun Kharge (@kharge) January 29, 2025
ఇదే పోస్టులో ఆయన మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన నిలదీశారు. విస్తృత ఏర్పాట్లు, విఐపిల కదలిక, నిర్వహణ కంటే స్వీయ ప్రమోషన్‌పై అధికంగా దృష్టి పెట్టడం, నిర్వహణలో లోపాలే తొక్కిసలాటకు కారణమని ఆయన పేర్కొన్నారు.
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అటువంటి బలహీన వ్యవస్థను కలిగి ఉండటం ఖండించదగినది. ఇంకా కొన్ని రాజ స్నానాలు మిగిలి ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను మెరుగుపరచాలని ఖర్గే సూచించారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను మరింతగా విస్తరించాలని, సాధువులు కూడా ఇదేకోరుకుంటున్నారని అన్నారు. బాధితులకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందించాలని మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి