
న్యూఢిల్లీ: దేశంలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ఇచ్చింది. రానున్న రోజుల్లో దక్షిణ, ఉత్తర భారతాల్లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అయితే ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రాజధాని ఢిల్లీలో వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 36.4డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ కావడం గమనార్హం. రానున్న ఐదు రోజుల్లో విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి.. మండే ఎండల్లో వర్ష సూచన