
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలు(పిల్)పై రేపు(గురువారం) విచారణ జరగనుంది. దాంతో పాటు కశ్మీర్ కు వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతపై కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలకు ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలైంది.
కశ్మీర్ కు చెందిన మహ్మద్ జునైద్, ఫతేష్ సాహు, విక్కీ కుమార్ లు దాఖలు చేసిన ప్రయోజన ప్రయోజన వాజ్యాలు దాఖలు చేయగా రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ మూడు పిల్ లను కలిపి విచారించనుంది.
జమ్మూ కశ్మీర్ ప్రాంతమైన పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో అక్కడకు వెళ్లిన టూరిస్టులు 26 మంది మృత్యువాత పడగా. కొంతమంది తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు.