
మరాఠీ భాషా దినోత్సవాన్ని(Marathi Language Day) ప్రతీయేటా ఫిబ్రవరి 27న జరుపుకుంటారు. ప్రముఖ మరాఠీ కవి విష్ణువామన్ శివాడ్కర్(Vishnuvaman Sivadkar) జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. విష్ణువామన్ శివాడ్కర్‌ను ‘కుసుమాగ్రజ’ అని కూడా అంటారు. ఈ రోజున మరాఠీ సాహిత్యానికున్న గొప్పదనాన్ని గుర్తిస్తూ, మరాఠీ భాషా రచయితలను సన్మానిస్తుంటారు.
మరాఠీ భాష ఆధునిక ఇండో- ఆర్యన్ భాషలలో అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. క్రీస్తు శకం 900 నుంచి మరాఠీ భాష మనుగడలో ఉంది. 1999లో కుసుమాగ్రజ మరణానంతరం ప్రభుత్వం ‘మరాఠీ అధికారిక భాషా గౌరవ దినోత్సవం’ను ఆయనకు గుర్తుగా నిర్వహిస్తూ వస్తోంది. అలాగే ఈరోజు మరాఠీ భాషా సాహిత్యంలో విశేష కృషి చేసినవారిని సన్మానిస్తుంటారు. మరాఠీ భాషా దినోత్సవం సందర్భంగా ఈ భాషకున్న కొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం.
మరాఠీ ప్రత్యేకతలు
1. హిందీ, బెంగాలీ తరువాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష మరాఠీ. మరాఠీ భాషను తొమ్మిది కోట్లమంది మాట్లాడుతుంటారు.
2. మరాఠీలో మొత్తం 42 రకాల యాసలు ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాలను అనుసరించి మారుతుంటాయి.
3. మరాఠీని కూడా దేవనాగరి లిపి(Devanagari script)లో రాస్తారు. మరాఠీకి లిపి ఉంది. దీనిని మోదీ లిపి అని అంటారు.
4. మరాఠీ లిపిని గుర్తిస్తూ పోస్టల్ శాఖ(Postal Department) ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.
5. 11వ శతాబ్ధంలో మరాఠీ భాషలో తొలి గ్రంథం వెలువడింది.
6. మరాఠీ భాషకు ప్రత్యేక వ్యాకరణం కూడా ఉంది. మరాఠీ భాషను మహారాష్ట్రీ, మరహట్టీ అని కూడా పిలిచేవారు.
ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..