
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్‌మేట్, ప్రియుడు సంభవ్ జైన్‌ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.

డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం.
చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
అందంగా వధూవరులు
తన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్‌తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్‌కూడా హైలైట్‌గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్‌గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్‌తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.

ఎవరీ సంభవ్ జైన్
హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్‌లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్‌తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్‌ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు.