India-Maldives Row: ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే! | Israel Makes Point With Post On Lakshadweep Amid India Maldives Row | Sakshi
Sakshi News home page

India-Maldives Row: ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే!

Published Tue, Jan 9 2024 7:51 AM | Last Updated on Tue, Jan 9 2024 10:57 AM

Israel Makes Point With Post On Lakshadweep Amid India Maldives Row - Sakshi

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదురుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమూ చేపట్టారు. ఈ అంశంపై తాజాగా ఇజ్రాయెల్‌ స్పందించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్‌లో #ExploreIndianIslands ట్యాగ్‌తో లక్షద్వీప్ చిత్రాలను  షేర్ చేసింది. అద్భుతమైన ఆకర్షణ కలిగిన లక్షద్వీప్ దీవులను సందర్శించాలని కోరింది.  ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.

డీశాలినేషన్ కార్యక్రమం..

 లక్షదీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. డీశాలినేషన్ (నీటిని శుభ్రపరిచే ప్రక్రియ) ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు గత ఏడాది లక్షదీవుల్లో ఇజ్రాయెల్ నిపుణులు పరిశీలించారు. మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నెలకొన్న వేళ డీశాలినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు.

మంత్రుల  వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్‌ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి.

 ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement