
న్యూఢిల్లీ: భారత నావికాదళం కోసం ఫ్రాన్సు నుంచి 26 రఫేల్ (మెరైన్)యుద్ధ విమానాలను రూ.64 వేల కోట్లతో కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఫ్రాన్స్ రక్షణ రంగ కంపెనీ డసో ఏవియేషన్ నుంచి కొనుగోలు చేయనున్న విమానాలను ఐఎన్‌ఎస్ అరిహంత్‌పై మోహరించనున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ ఈ డీల్‌కు మూడు వారాల క్రితమే పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల తర్వాత యుద్ధ విమానాల రాక మొదలు కానుంది. అనుబంధ ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలతోపాటు విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం భారత్‌కు బదిలీ చేయనుంది.