france
-
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కోర్టు తీర్పు పూర్తిగా వెలువడకముందే లీ పెన్ కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. కరుడుగట్టిన అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందిన మెరీన్ లీ పెన్ 2027లో జరిగే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూలంగా తీర్పు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆమెకు ఉపశమనం దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పై కోర్టులో విచారణ జరగడం, తీర్పు రావడం కష్టమేనని అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు లీ పెన్‌పై ఆరోపణలు వచ్చాయి. 2004 నుంచి 2016 మధ్య సుమారు 33 లక్షల డాలర్లను సొంత పార్టీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో లీ పెన్‌తోపాటు మరో 12 మందిని సైతం న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. లీ పెన్ గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మానుయేల్ మేక్రాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్‌లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
ఫ్రాన్స్ లో గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
-
ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు!
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది. పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు. -
ఈసారి జెలెన్స్కీ వెంట మాక్రాన్, స్టార్మర్!
పారిస్: అమెరికా అత్యున్నత పరిపాలనా పీఠం శ్వేతసౌధం సాక్షిగా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా అనూహ్యంగా పట్టుసడలించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లూ చేసిన సైనిక, నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జెలెన్స్కీ వైఖరిలో మార్పు రావడం గమనార్హం. ఒంటరిగా వచ్చిన జెలెన్స్కీ ఆనాడు ట్రంప్, జేడీ వాన్స్‌తో మాటల యుద్ధానికి దిగి దౌత్యమంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్, బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్లు జెలెన్స్కీని అమెరికాను వెంటబెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భేటీ ఎప్పుడనేది ఇంకా నిర్ధారణకాలేదు. ‘‘ఉక్రెయిన్, అమెరికా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషిచేస్తున్నాయి. ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది’’ అని గురువారం తెల్లవారు జామున జెలెన్స్కీ ఒక ప్రకటనచేశారు. బుధవారం ట్రంప్‌కు జెలెన్స్కీ ఒక లేఖ రాయడం, ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెల్సిందే. ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యురోపియన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు పంపే వీలుంది. రష్యా దూకుడుకు ఈ బలగాలు అడ్డుకట్టవేస్తాయి. డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం పారిస్‌లో ఈయూ దేశాల సైనిక చీఫ్‌లతో చర్చలు జరుపుతాం’’ అని మాక్రాన్ చెప్పారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే!అమెరికా, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూని యన్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే, పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ను అమెరికాకు దగ్గరచేయాలని ఈయూ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జెలెన్స్కీని అమెరికా రప్పించి ‘శాంతి, ఖనిజ ఒప్పందం’ కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి. అందులోభాగంగా మాక్రాన్, స్టార్మర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
రూ.50 లక్షలు, బెంజ్ కారు కావాలి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాలేజీ నుంచి ప్రేమ వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. పొద్దున పెళ్లనగా గొడవ వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు. -
పుతిన్ నియంత కాదు: ట్రంప్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ‘నియంత’ అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘పుతిన్‌ను నియంతగా భావిస్తున్నారా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. తాను ఆ పదాలను అంత తేలికగా ఉపయోగించనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అనంతరం సోమవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తెలివిగా వ్యవహరిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం తొందరగా ముగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘మనం స్మార్ట్ కాకపోతే అది కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుందా అనేది కీలక చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘‘సంప్రదింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే.. రష్యా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం సంతకం చేయడానికి త్వరలోనే జెలెన్స్కీ అమెరికా వస్తారని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఏరోస్పేస్, వైద్య, సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన ఖనిజాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అయితే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌కు అందించిన 180 బిలియన్ డాలర్ల అమెరికన్ సహాయంలో కొంత భాగాన్ని భర్తీ చేయడానికి ఖనిజాలపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల అనంతరం పుతిన్‌ను కలుస్తానని ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరిస్తారని, అతను మరింత యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదు: మాక్రాన్ అయితే.. ఉక్రెయిన్ సార్వబౌమత్వాన్ని పణంగా పెట్టి ఏ శాంతి ఒప్పందం జరగకూడదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఏ శాంతి ఒప్పందంలోనైనా భద్రతా హామీలు ఉండాలని, శాంతి అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదని మాక్రాన్ హెచ్చరించారు. ఒప్పందం కుదిరితే ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి పనిచేస్తామని మాక్రాన్ తెలిపారు. సుస్థిరత్వాన్ని ఏర్పరచడానికి యూరప్ సిద్ధంగా ఉందని, ఆ శాశ్వత శాంతిని సాధించడానికి బలమైన అమెరికా జోక్యం అవసరమని మాక్రాన్ నొక్కి చెప్పారు. అట్లాంటిక్ విభేదాలున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడితో చర్చలు ముందుకు సాగాయని మాక్రాన్ నొక్కి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొత్త దౌత్య అవకాశం లభించిందన్నారు. -
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
మోదీ విదేశీ పర్యటన.. విమానానికి బెదిరింపులు..
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్ అయ్యారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్‌లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi's aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…— ANI (@ANI) February 12, 2025 -
ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్త
పారిస్: మూడు రోజుల ఫ్రెంచ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి పారిస్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అధ్యక్షుడు మాక్రాన్‌తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్ –ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా, వర్క్ పర్మిట్లను పారిస్ ప్రకటిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.ఇంతకుముందు బిగ్ ఫోర్‌గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలు నాలుగు గమ్యస్థానాలుగా ఉండేవి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్ దేశాలు ముఖ్యంగా ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్‌గా మారింది. హెచ్ఈసీ పారిస్ బిజినెస్ స్కూల్, సోర్బోన్ విశ్వవిద్యాలయం, ఎకోల్ పాలిటెక్నిక్ వంటి 75 కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, వ్యాపారం, కళలు, సాంకేతికత, శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది.2023–24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లోని విద్యాసంస్థల్లో చేరారు. 2030 నాటికి ఈ సంఖ్య 200 శాతం పెరుగుతుందని అంచనా. 2024 జనవరిలో రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని ఆనాడు మాక్రాన్ తన మనసులో మాట చెప్పారు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన క్యూఎస్ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31 శాతం మంది భారతీయ విద్యార్థులు చెప్పడం విశేషం. భారతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫ్రాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు.ఫ్రెంచ్ నేర్చుకుంటే.. ట్రంప్ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్ ఉదంతంతో భారత్–కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్‌తోపాటు ఇంగ్లీష్ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కు అనుమతిస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి, ఫ్రాన్స్‌లో ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్థులు ఐదేళ్ల షార్ట్–స్టే స్కెంజెన్ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్ మాస్టర్స్ డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల పోస్ట్–స్టడీ వర్క్ వీసాను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం రెండేళ్లపాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.ఖర్చు తక్కువ..భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్‌తోపాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య ఖర్చు మిగతా బిగ్‌ఫోర్ దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్ అందిస్తోంది. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం కూడా తక్కువే. పారిస్‌లో నెలకు సగటున రూ.1.54 లక్షలు, లియోన్‌లో రూ.1.01 లక్షలు వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతర నగరాల్లో సగటు జీవన వ్యయం నెలకు లక్ష రూపాయల కన్నా తక్కువ. ఫ్రాన్స్‌లోని విశ్వవిద్యాలయాలు చాలా మంచి ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. -
మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi
-
10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్‌లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ట్రంప్‌ను ఒప్పిస్తారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్‌తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్‌గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. -
భార్యకు మత్తిచ్చి.. ఏకంగా పదేళ్లపాటు పలువురితో సామూహిక అత్యాచారం
ఒక సామూహిక అత్యాచార కేసు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆమె కథలోని భయంకర నిజాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆమెను జీవచ్ఛంగా మార్చి, స్వయంగా భర్తే పలువురితో (72మందికిపైగా) దాదాపు పదేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది. ఈ కేసును విచారించిన కోర్టు జెసిల్ మాజీ భర్తకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన మరో 51 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులోని షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయిజెసిల్ పెలికో కేసు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అత్యాచార కేసు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. జెసిల్ ఫెలికో భర్త డొమినిక్ పెలికో. జిసిల్కు ముగ్గురు పిల్లలు, మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. 57 ఏళ్ల వయసులో ఉండగా భర్త ఎవ్వరూ ఊహించని విధంగా ఆమెపై భయంకరమైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.తన భార్యపై అత్యాచారానికి రావాల్సిందిగా ఆన్లైన్ చాట్ రూమ్స్ ద్వారా ఆహ్వానం పలికాడు. ఇలా వచ్చిన వాళ్లు 20-72 వయస్సున్నవారున్నారు. ఇలా ఒకటి రెండూ కాదు ఏకంగా పదేళ్ల పాటు, భార్యకు మత్తుమందు ఇచ్చి తన అకృత్యాన్ని కొనసాగించాడు. ఈ విషయాలను చిత్రీకరించి, భద్రపరిచాడు కూడా. ఈ నేరానికి పాల్పడిన వారిలో కొందరు ఒక్కసారి, మరికొందరు ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితురాలు పూర్తి అచేతనంగా, దాదాపు కోమాలాంటి పరిస్థితిలో ఉండగా జరిగినట్టు పోలీసులు ధృవీకరించుకున్నారు.అయితే ఇంత జరుగుతున్నా, అనేక సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆమెకు ఏమాత్రం తెలియలేదు. ఆమెకు తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి 2020లో పోలీసుల ద్వారా మాత్రమే తెలిసింది.వెలుగులోకి ఎలా వచ్చింది2020లో ఒక షాపింగ్ మాల్లో యువతులపై అభ్యంతరంగా వీడియో చూస్తున్న క్రమంలో పోలీసులు అతగాణ్న అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసులు విచారణలో తాను చేసిన మొత్తం దురాగతాల్ని బహిర్గతం చేశాడు. దీంతో విచారణాధికారులే నివ్వెరపోయారు. అతని ల్యాప్‌టాప్‌లో వేల వీడియోలను కనుగొన్నారు, దాదాపు 200 అత్యాచారాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని అంతటినీ ‘అబ్యూజ్’అనే ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టాడు. ఈ వీడియోలను పోలీసులు జెసికా(ఆమె అనుమతి మేరకు) చూపించారు. దీంతో ఆమె కదిలిపోయింది. తనపై అత్యాచారం చేసిన వాళ్లలో తన మనవడు వయస్సున్న వాడు ఉన్నాడంటూ తీరని ఆవేదనకు గురైంది జెసికా. దాదాపు ఇదే తరహాలో కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే వీటిని డొమినిక్ ఖండించాడు.ఈ కేసు విచారణ సందర్బంగా వందలాదిమంది ఆమెకు మద్దతుగా కోర్టుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తీర్పుకోసం ఎదురు చూశారు. అనేకమంది స్త్రీవాద గీతాలను ఆలపించారు. అటు జెసికా ముగ్గురు పిల్లలు కూడా కోర్టు ఆవరణలో తీర్పు వెలువరిస్తున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. యుక్తవయస్సులో ఉన్న ఆమె మనవడు తొలిసారి ఆమె పక్కన నిలబడి, ఆమె మీడియాను ఉద్దేశించి ఆమె భుజంపై చేయి భరోసా ఇచ్చాడు. అయితే దోషులకు విధించిన శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.71 ఏళ్ల జెసిల్ పెలికా మీడియాతో ఈ విచారణ సందర్భంగా జెసికా మాటలు ఆమెలోని అంతులేని ఆవేదనతోపాటు, తెగువకు నిదర్శంగా నిలిచాయి. నేరస్తులు సిగ్గుపడాలి తప్ప, తానెందుకు కృంగిపోవాలని అంటూ ధైర్యంగా ముందుకొచ్చింది ఇంతటి ఘోరం సమాజానికి తెలియాలి తన గొంతును వినిపించింది. ఇలాంటివి మరో చోట మరొకరికి జరగకూడదని నినదించింది. అంతేకాదు అత్యాచారాలకు ఆడవాళ్ల వేషధారణే, వారి వ్యవహారమే కారణమన్న వాదనను గట్టిగా తోసిపుచ్చింది. స్త్రీల పట్ల చాలా మంది పురుషుకున్న ఇలాంటి అసహ్యకరమైన వైఖరి మారాలని నినదించింది. దీనిపై చర్చ జరగాలని, ఈ కేసుపై నిజా నిజాలు ప్రపంచానికి తెలియజెప్పాలని కూడా మీడియాను కోరింది. తనపై జరిగిన దుర్మార్గంపై బహిరంగ విచారణ జరగాలని కోరుకున్న ధీర ఆమె.2021లో పోలీసులు తమ ప్రాథమిక విచారణను నిర్వహించినప్పుడు అరెస్టయిన దోషుల్లో చాలా మంది ఇప్పటికే జైలు జీవితం గడిపారు. కనుక కొంతమంది త్వరలో విడుదల కానున్నారు. మరోవైపుతాజా తీర్పుపై అప్పీల్లా? వద్దా? అనేది ఆలోచిస్తున్నానని డొమినిక్ న్యాయవాది తెలిపారు. అప్పీల్‌కు వెళ్లేందుకు 10 రోజుల సమయం ఉంది. గత వారం (డిసెంబరు 19)న తీర్పు వెలువడినప్పటి నుండి, పారిస్ ఆసుపత్రి హెల్ప్‌లైన్ నెంబర్లు కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందట. -
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
90 ఏళ్ల తర్వాత.. గడగడలాడించిన చిడో తుపాన్
పారిస్ : చిడో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. హిందు మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను తీవ్రతతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తుపాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలా కుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ,ఆస్తినష్టం భారీ ఎత్తున జరిగిందని అన్నారు.గత 90 ఏళ్లలో మయోట్‌ను తాకిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం చిడో తుఫాన్ ప్రారంభంలో 11మంది మరణించగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు ధృవీకరించింది. అయితే మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేసింది. 🚨 Intense Tropical #CycloneChido hit Cabo Delgado, Nampula & Niassa early Sunday with winds over 200km/h & heavy rains, impacting an estimated 1.7M people in 🇲🇿IOM, govt & partners are on the ground, assessing needs & coordinating early response, with PSEA measures reinforced. pic.twitter.com/KUd1N5Zbkb— IOM Mozambique (@IOM_Mozambique) December 15, 2024 శనివారం తుఫాను కారణంగా మయోట్ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్‌లు.. మెడిసిన్, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. -
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్‌కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్‌లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 2019లో యోగా టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
ఫ్రాన్స్ ప్రధానిగా ఫ్రాంకోయిస్
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్ మాక్రాన్ శుక్ర వారం అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. గత వారం నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఓడిపోవడంతో మైకేల్ బెర్నియర్ ప్రభుత్వం గద్దె దిగడం తెలిసిందే. ఫ్రాన్సు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న బైరూ అందరికీ తెలిసిన వ్యక్తి. పార్లమెంట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే సత్తా బైరూకు ఉందని భావిస్తున్నారు. -
అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్రాన్స్ అమ్మాయి.. గొల్లపల్లి అబ్బాయి
హిందూపురం: ప్రేమకు హద్దులు లేవని ఓ జంట నిరూపించింది. ఫ్రాన్స్ దేశస్తురాలైన ఆడ్ సవివ్, శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గొల్లపల్లికి చెందిన గొల్లసందీప్ యాదవ్ శుక్రవారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో హిందూపురంలో ఘనంగా జరిగింది. గొల్లపల్లికి చెందిన సామాన్య రైతు కేశప్ప, గంగమ్మ 11వ సంతానమైన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సీఎన్‌ఆర్‌లో సైంటిస్ట్‌గా స్థిరపడ్డారు. అక్కడ గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశస్తురాలు ఆడ్ సవివ్తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. సందీప్ యాదవ్ అన్న ‘అక్షరమాల’ శ్రీనివాసులు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని మైకేల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మితవాద, అతివాద విపక్షాలు చేతులు కలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 577 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోవాల్సి రావడం గమనార్హం. ప్రధాని తన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు అందజేశారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత అరవై ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రం అధ్యక్షుడు మేక్రాన్ చేతికొచ్చాయి. ఇటీవలి కాలంలోనే ఈయన రెండు సార్లు ప్రధానులను ఎంపికచేశారు. జూలైలో పగ్గాలు చేపట్టిన గేబ్రియల్ కొద్దికాలానికి వైదొలగగా ఇప్పుడు బార్నియర్ అదేబాటలో పయనించారు. దీంతో మేక్రాన్ తాజాగా మూడోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్ పదవికి సంబంధం లేదు. దీంతో మేక్రాన్ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు.France's government officially collapses after a no-confidence vote against French Prime Minister Michel Barnier. pic.twitter.com/t0vP2LoA9D— Spacy (@TheSpacy_) December 5, 2024 -
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్‌లో ప్లాంట్లు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్ వివరించారు. ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్ వద్దు..!
అలెక్స్ హేలీ ‘రూట్స్’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్ పురాతన ఫ్రెంచ్ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. పెరిగిన జాత్యాహంకార నేరాలు ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్ మెర్జౌక్ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్ ఆఫ్రికన్ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.మా విశ్వాసాలంటే చులకన 2015లో ఇస్లామిక్ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్లో స్థిరపడ్డారామె. ‘‘ఫ్రాన్స్ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. వెంటాడుతున్న వివక్ష.. మెంకా గోమెస్దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్–వర్డ్ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జర్నలిజం నేరం కాదు: జూలియన్ అసాంజే
వికీలీక్స్ వ్యవస్థపకుడు జూలియన్ అసాంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జర్నలిజం నేరం అని ఒప్పుకున్నందుకే విడుదల అయినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తొలిసారి మంగళవారం అసాంజ్.. స్ట్రాస్‌బర్గ్ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ హక్కుల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘నేను స్వేచ్ఛగా లేను. ఎందుకంటే వ్యవస్థ అలా సాగుతోంది. అయితే కొన్ని ఏళ్ల నిర్భందం తర్వాత నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. దానికి గల కారణం జర్నలిజం నేరాన్ని ఒప్పుకున్నాను. అందుకే నిర్భందం నుంచి బయటపడ్డాను. చివరికి అవాస్తవమైన న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. నాకు న్యాయం ఇప్పుడు అసాధ్యంగా మారింది. నేను ప్రస్తుతం 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నా. అయితే జర్నలిజం నేరం కాదు. పౌర సమాజానికి, స్వేచ్ఛకు ఒక మూల స్తంభం. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏం లేదు. కానీ, జర్నలిస్టులుగా తమ విధులు నిర్వహిస్తున్నవారిని విచారించవద్దు’ అని అన్నారు. అదేవిధంగా తాను ఖైదీగా ఉన్న సమయంలో తనకు సంబంధించిన భూమిని కోల్పోయానని తెలిపారు. నిజం చెప్పినందుకు శిక్ష, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లు అయిందని అసాంజే పేర్కొన్నారు."I want to be totally clear. I am not free today because the system worked. I am free today because after years of incarceration I pleaded guilty to journalism. I pleaded guilty to seeking information from a source" - Julian Assange, Council of Europe pic.twitter.com/N0Ix58CeSu— WikiLeaks (@wikileaks) October 1, 2024 గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను ఇటీవల అసాంజ్ అంగీకరించారు. దీంతో ఆయన్ను అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా బ్రిటన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న అసాంజే.. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో విడుదలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.చదవండి: WikiLeaks: అసాంజ్‌కు విముక్తి -
UNSC: భారత్‌కు బూస్ట్.. మద్దతు ప్రకటించిన యూకే
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్‌కు మద్దతుగా ఉన్నట్టు పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా.. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చను ఉద్దేశించి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ..యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలి. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటోంది. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే, ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలనుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అంతకుముందు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన మూడు దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది.ప్రస్తుతం, యూఎస్సీపీలో ఐదు శాశ్వత సభ్యులు, పది తాతాల్కిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.ఇది కూడా చదవండి: అమెరికాలో గన్ కల్చర్‌పై బైడెన్ కొత్త చట్టం -
వాళ్లలా నేనూ రేపిస్ట్‌నే
అవిగ్నోన్(ఫ్రాన్స్): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్చేశానని ఏడుస్తూ చెప్పాడు. వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్ పెలికోట్ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్ మంగళవారం కోర్టులో మాట్లాడాడు. ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్ భార్యను రేప్ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం. -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా.. ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది. దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదురోవాల్సి ఉండనుంది. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు(నేరాలుగా పరిగణిస్తూ..) పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అంతేకాదు.. యాప్‌లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే అరోపణలకుగానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు. దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని రష్యా అంటోంది... గత శనివారం సాయంత్రం అజర్బైజాన్ నుంచి పారిస్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 39 ఏళ్ల పావెల్ దురోవ్‌ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలోనే ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఫ్రాన్స్ అధికారులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్‌లో ఓ ఎయిర్‌షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్‌వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
పారాలింపిక్స్ సమయం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ‘ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన పారా అథ్లెట్లు ఒలింపిక్స్ వరకు చేరుకున్నారు. ‘పారిస్’ పారాక్రీడల్లో సత్తా చాటి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. ఈ బృందంలో చాలా మంది అథ్లెట్లు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా లబ్ది పొందినవారే. అథ్లెట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వక్రీడల్లో అధిక సంఖ్యలో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంపొందించాలి’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్ పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్íÙప్లోనూ బంగారు పతకం సాధించాడు. మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది. ఈ నేపథ్యంలో పీసీఐ అధ్యక్షుడు ఝఝారియా మాట్లాడుతూ.. ‘విశ్వక్రీడల ఆరంభ వేడుకలో సుమిత్, భాగ్యశ్రీ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకముంది. అనేక క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దాని వెనక వారి కఠోర శ్రమ, కృషి ఉంది. పారిస్ పారాలింపిక్స్‌లో దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఈ క్రీడల్లో తెలంగాణ నుంచి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో జివాంజి దీప్తి పోటీపడనుంది. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్‌గా జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్‌బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్‌గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్‌బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్‌గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్‌లో 8, జిమ్నాస్టిక్స్‌లో 3, బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్‌లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
ఫ్రాన్స్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ ఫుట్‌బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్‌తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
కొలనులో కొత్త కెరటం
ఒలింపిక్స్‌లో ఈత పోటీలు అనగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మైకేల్ ఫెల్ప్స్! మకుటం లేని మహారాజులా స్విమ్మింగ్‌పూల్‌ను ఏలిన ఈ అమెరికా స్విమ్మర్.. విశ్వక్రీడల్లో ఏకంగా 28 పతకాలు సాధించి అదుర్స్ అనిపించుకున్నాడు. అందులో 23 స్వర్ణాలు ఉన్నాయంటే.. విశ్వక్రీడల్లో అతడి హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ నయా స్విమ్మర్ లియాన్ మర్చండ్.. అమెరికా దిగ్గజం బాటలో దూసుకెళ్తున్నాడు. పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడల్లోనే నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకొని ఫెల్ప్స్‌కు తానే సరైన వారసుడినని అనిపించుకుంటున్నాడు. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణాలు సాధించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన మర్చండ్.. ‘పారిస్’ క్రీడల్లో నాలుగో పసిడి చేజిక్కించుకున్నాడు. నాలుగు భిన్న రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన మర్చండ్.. ఈ నాలుగింట ఒలింపిక్ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఫ్రాన్స్ యువ స్విమ్మర్ లియాన్ మర్చండ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే నాలుగో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే మూడు స్వర్ణాలు నెగ్గిన మర్చండ్.. ఆదివారం పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసులో 1 నిమిషం 54.06 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో పసిడి పతకాలు గెలుచుకున్న 22 ఏళ్ల మర్చండ్.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని అంటున్నాడు. మర్చండ్ పోటీపడ్డ తొలి రేసును కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మక్రాన్.. అతడి ప్రతిభకు ముగ్ధుడయ్యారు. వారం రోజుల వ్యవధిలో కొలనులో సంచలన ఫలితాలు సాధించి రికార్డులు తిరగరాసిన మర్చండ్కు తాను అభిమాని అయిపోయానని వెల్లడించారు.‘అభిమాన సందోహం మధ్య పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చొని అభివాదం చేస్తుంటే.. ఇన్నేళ్లు పడ్డ కష్టం అంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది’ అని నాలుగో పసిడి పతకం గెలిచిన అనంతరం మర్చండ్ అన్నాడు. తనను తాను సిగ్గరిగా చెప్పుకునే మర్చండ్.. తాజా క్రీడల్లో చివరగా బరిలోకి దిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించాడు. మూడు పతకాలు గెలిచిన గర్వం కానీ, మరో పతకం సాధించాలనే ఒత్తిడి కానీ ఏమాత్రం లేకుండా బరిలోకి దిగి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు. ‘నాలుగు స్వర్ణాలు గెలవడం నమ్మశక్యంగా లేదు. మొదట ఒక పతకం గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ తర్వాత వరుసగా మంచి ప్రదర్శనలు కనబర్చా. ఫలితం నాకు అనుకూలంగా వచ్చింది’ అని మర్చండ్ పేర్కొన్నాడు. ఫ్రెంచ్ ఫెల్ప్స్... ఈత కొలనులో సంచలనాలు నమోదు చేస్తున్న మర్చండ్ను అభిమానులు ముద్దుగా ‘ఫ్రెంచ్ ఫెల్ప్స్’ అని పిలచుకుంటున్నారు. అయితే అది తనపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని.. ఒకింత ఆనందంగా కూడా ఉందని మర్చండ్ పేర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు ఒలింపిక్స్‌లో ఏకఛత్రాధిపత్యం కనబర్చిన ఫెల్ప్స్ నమోదు చేసిన రెండు ఒలింపిక్ రికార్డుల (400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల మెడ్లే)ను మర్చండ్ తాజాగా బద్దలు కొట్టాడు. మరోవైపు ఫెల్ప్స్ కూడా మర్చండ్ ఫీట్‌కు ఫిదా అయిపోయాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మర్చండ్ స్వర్ణాలు గెలిచిన సందర్భంలో ఫెల్ప్స్ సంబరాలు జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఫెల్ప్స్తో పోల్చినప్పుడు గర్వంగా ఉంటుంది. స్విమ్మింగ్ రూపురేఖలను మార్చిన ఘనత అతడిది’ అని మర్చండ్ అన్నాడు. ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించేందుకు ఫెల్ప్స్ ఇచ్చిన సూచనలు కూడా పనిచేశాయని వెల్లడించాడు. అయితే ‘పారిస్’ క్రీడల్లో మర్చండ్తో పోటీపడిన సహచరులు మాత్రం.. ఫెల్ప్స్ కన్నా మర్చండ్ కఠిన ప్రత్యర్థి అని ప్రశంసించారు. మర్చండ్తో కలిసి 400 మీటర్లు, 200 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో బరిలోకి దిగిన అమెరికా స్విమ్మర్ కార్సాన్ ఫాస్టర్ మాట్లాడుతూ.. ‘పోటీలో పాల్గొన్న వారందరికీ.. అత్యుత్తమ స్విమ్మర్తో బరిలోకి దిగిన అనుభవం ఎదురైంది. పోటీ పడిన నాలుగు ఈవెంట్లలోనూ స్వర్ణాలు గెలవడం మామూలు విషయం కాదు’ అని పేర్కొన్నాడు. –సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కలకలం. పారిస్ వేదికగా ఓ వైపు సమ్మర్ ఒలింపిక్స్ 2024 (జులై 26) ప్రారంభం కావడం.. మరోవైపు పారిస్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌ను గుర్తు తెలియని అగంతకులు పెద్ద మొత్తంలో విధ్వంసం చేయడం ఆందోళన నెలకొంది. ఫలితంగా ఫ్రాన్స్ ఇంటర్సిటీ హై స్పీడ్ రైల్ సర్వీస్ నెట్వర్క్ స్తంభించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీ సొసైటీ నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ ఫ్రాంకైస్ (ఎస్ఎన్సీఎఫ్) తెలిపింది.నిందితులు ఏకకాలంలో దాడులు చేయడంతో అట్లాంటిక్, తూర్పు-ఉత్తర రైల్వే లైన్లలో కార్యకలాపాలు ఆగిపోయాయిని ఎస్ఎన్సీఎఫ్ అధికారులు వెల్లడించారు.France's high-speed rail network has been hit by "malicious acts" including arson attacks that have disrupted the transport system, train operator SNCF said, hours before the opening ceremony of the Paris Olympics. “This is a massive attack to paralyse the Railway” https://t.co/RaAzI1URZC pic.twitter.com/JPHZXmO1k8— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) July 26, 2024 ‘రైల్వే కార్యకలాపాల్ని దెబ్బతీసేందుకు రైల్వే లైన్లను విధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభావిత మార్గాలలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తులు నిర్వహించి, పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మత్తులు చేసిన రైల్వే ట్రాక్‌లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే వారం రోజుల సమయం పడుతుంది’ అని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లిస్తున్నాం. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు తమ రైల్వే ప్రయాణాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని ఎస్ఎన్సీఎఫ్ విజ్ఞప్తి చేస్తోంది. -
స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, స్టైల్‌కి ఐకాన్ అయిన నటాషా పూనావాల ఎప్పటికప్పుడూ సరికొత్త ఫ్యాషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె స్వతహాగానే ఫ్యాషన్‌గా ఉంటుంది ఆమె ఆహార్యం. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ని సెట్ చేసే సరికొత్త డిజైనర్ వర్ దుస్తులతో తుళ్లక్కుమంది. అలానే ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన సమ్మర్ గాలా 2024 కోసం క్రిస్టల్స్‌తో అలంకరించిన గౌనుని ధరించింది. ఈ గాలా ఈవెంట్లో నటాషా ధరించిన మార్టిన్ గ్లాస్ ఆకృతి పర్సు హైలెట్‌గా నిలిచింది. ఈ పర్సు వోడ్కా, జిన్, కాక్టెయిల్ వంటి జ్యూస్‌లనే సర్వ్ చేసే మార్టిన్ గ్లాస్ ఆకృతిలో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టిని ఈ పర్సు ఎక్కువగా ఆకర్షించింది. అంతేగాదు సోషల్ మీడియాలో సైతం అందుకు సంబంధించిన ఫోటోల్లో కనిపించిన ఈ పర్సే అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ నటాషా ముగ్ధమనోహరంగా ఉండేలా ట్రాన్స్పరేంట్ క్రిస్టల్ గౌనులో మెరిసిపోయింది. అందుకు తగ్గట్లు చేతికి ధరించిన పర్సు ఎవర్ గ్రీన్‌గా ఉంది. అంతేగాదు ఈ మార్టిన్ గాజు ఆకృతి పర్సుని క్రిస్టల్స్‌తో అలంకరించడంతో నటాషా దివి నుంచి భువి వచ్చిన దేవకన్యలా ధగ ధగ మెరిసిపోయింది. ఈ పర్సు ఓపెనింగ్ అద్దం మాదిరిగా ఉంటుంది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కి చెందిన ఈ పర్సు ధర ఏకంగా రూ. 4.85 లక్షలు పైనే ఉంటుందట. నటాషా ఎప్పుడూ డిఫెరెంట్ ఫ్యాషన్ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ సారి ఆమె ధరించి గ్లాస్ ఆకృతి పర్సు అందరి మనసులను దోచుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను ఈ పర్సు ఎంతగానో ఆకట్టుకుంది. అంతా వాటే ఏ స్టైలిష్ పర్సు అని ప్రశంసిస్తున్నారు కూడా. ఎవరీ నటాషా?భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అదార్ పూనావాలా భార్యే నటాషా పూనావాలా. ఆమె అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. 2023 నాటికి, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విలువ రూ. 1.92 లక్షల కోట్లుగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేగాదు ఆమె సైరస్ పూనావల్ల గ్రూప్‌లోని వివిధ కంపెనీల కోసం సృజనాత్మకతతో కూడిన వ్యాపార వ్యూహాలతో లాభాల బాట పట్టించడంలో నటాషా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అత్తగారి గౌరవార్థం 2012లో స్థాపించబడిన కుటుంబ ఫౌండేషన్ అయిన విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే భారతదేశం కోసం బ్రిటీష్ ఆసియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. పైగా బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌కు ఇండియా అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యురాలు కూడా.(చదవండి: హీరోయిన్ కత్రినా అనుసరించే రెండుపూటల భోజనం, షట్పావళి డైట్ ప్లాన్ అంటే..?) -
షారూఖ్ ఖాన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం.. భారత్‌లో ఏకైక హీరోగా రికార్డ్
ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ మ్యూజియం ప్రత్యేకంగా ఆయన పట్ల గౌరవాన్ని చూపించింది. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన షారుఖ్‌ను ఇప్పటికే పలు అవార్డ్స్‌తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. తాజాగా ఆయన పేరుతో బంగారు నాణేలు ముద్రించి షారుఖ్ పట్ల తమ అభిమానాన్ని ఆ మ్యూజియం చాటుకుంది.గతేడాదిలో వరుస సూపర్ హిట్లు అందుకున్న షారూఖ్ ఖాన్‌ను ఫ్రాన్స్‌లోని గ్రేవిన్ మ్యూజియం సత్కరించనుంది. ఆయన పేరుతో బంగారు నాణేలను ముద్రించి ఆయన పట్లు తమ అభిమానాన్ని చాటుకుంది. భారతీయ సినిమా రంగంలో 100కుపైగా సినిమాల్లో నటించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆగష్టు 10 అవార్డుతో పాటు షారుక్ ఖాన్ బంగారు నాణేలను గ్రేవిన్ మ్యూజియం విడుదల చేయనుంది. దీంతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయడిగా షారూఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశారు.లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌లో షారుక్లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను 'కెరీర్ అఛీవ్మెంట్ అవార్డు'కు తాజాగా ఎంపిక చేసింది. ఆగస్టు 7 నుంచి 17 వరకు లొకర్నో (స్విట్జర్లాండ్)లో ఈ కార్యక్రమం జరగనుంది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ 77వ ఎడిషన్ కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 10న ఈ అవార్డును షారుక్ అందుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్లో హిట్ సినిమాల లిస్ట్‌లో ఒకటైన 'దేవ్‌దాస్'ను అక్కడ ప్రదర్శించనున్నారు. ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా షారుక్ నిలిచారు. -
Paris Olympics: విశ్వ క్రీడల వేదికలివే.. ఆ ఐదు ప్రత్యేకం
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమైంది. ఫ్రాన్స్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.జూలై 26 నుంచి ఆగష్టు 11 వరకు విశ్వ క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు 33 భిన్న వేదికలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి ఆ వేదికలు, అక్కడ జరిగే ఈవెంట్స్ ఏమిటో తెలుసుకుందాం!ఐకానిక్ సైట్స్.. ఈ ఐదూ స్పెషల్ఈఫిల్ టవర్ఈ ప్రఖ్యాత కట్టడం సమీపంలోనే బీచ్ వాలీబాల్(ఐరన్ లేడీ పాదాల చెంత), జూడో, రెజ్లింగ్(చాప్స్ డీ మార్స్ పార్క్) నిర్వహించనున్నారు.కాగా ఈఫిల్ టవర్‌ను 1889లో ప్రారంభించగా.. ప్యారిస్ ఐకానిక్ సింబల్‌గా మారింది. పర్యాటకుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది.గ్రాండ్ పలైస్వరల్డ్ ఫెయిర్ 1900లో భాగంగా రూపొందించిన గ్లాస్ అండ్ స్టీల్ మాస్టర్‌పీస్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని మిలిటరీ తాత్కాలిక ఆస్పత్రిగా మార్చారు.ఇక 21వ శతాబ్దంలో తిరిగి ఆర్ట్ గ్యాలరీగా మారిపోయిన గ్రాండ్ పలైస్‌లో.. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆరిస్టుల పెయింటింగ్‌లతో నిండిపోయింది. ఇప్పుడు ఫెన్సింగ్, తైక్వాండో క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.ప్లేస్ డి లా కాన్కోర్డేప్యారిస్లోని మేజర్ పబ్లిక్ స్క్వేర్స్‌లో ఒకటి. చాంప్స్- ఎలిసీస్కు తూర్పు భాగంలో ఉంటుంది. ఫ్రెంచి విప్లవ సమయంలో ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.దీంతో తాత్కాలికంగా రివల్యూషన్ స్క్వేర్గానూ ఈ ప్లేస్ పేరును మార్చారు. తర్వాత మళ్లీ ప్లేస్ డి లా కాన్కోర్డేగానే పిలుచుకుంటున్నారు.ఇక్కడ BMX(బైస్కిల్, మోటోక్రాస్ స్టంట్) ఫ్రీస్టైల్ స్కేట్ బోర్డింగ్, 3X3 బాస్కెట్‌బాల్ క్రీడలు నిర్వహించనున్నారు.ప్యాలస్ ఆఫ్ వెర్సైల్స్డ్రెస్సేజ్, షోజంపింగ్, ఈక్వెస్ట్రియన్లకు వేదిక. ప్యారిస్ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మారథాన్, పెంటథ్లాన్ ఈవెంట్లకు కూడా వేదిక కానుంది.17వ శతాబ్దంలో ‘ది సన్ కింగ్’ లూయీస్ XIV వెర్సైల్స్‌ను ఫ్రెంచి రాజ నివాసంగా మార్చాడు. దాదాపు పది వేల మంది సిబ్బందితో ఇక్కడ నివసించాడు.ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వెర్సైల్స్ ప్యాలస్ 1979 నుంచి పర్యాటకుల ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయింది.మర్సెలీఅధునాతన ఫ్రాన్స్‌లోని పట్టణాల్లో పేరెన్నికగన్నది సిటీ ఆఫ్ మర్సెలీ. ఇక్కడ సెయిలింగ్ పోటీలు నిర్వహించనున్నారు. మూడు వందలకు పైగా సెయిలర్లు మర్సెలీలోని నదీ జలాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఈ పట్టణం పది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా గతంలో ఆతిథ్యం ఇచ్చింది.మిగిలిన వేదికలు, అక్కడి ఈవెంట్లు ఇవే👉ఆక్వాటిక్స్ సెంటర్- ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో👉బెర్సీ ఎరీనా- ఆర్టిస్టిక్ జిమ్మాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ట్రంపోలిన్👉బోరీయాక్స్ స్టేడియం- ఫుట్‌బాల్👉చెటారౌక్స్ షూటింగ్ సెంటర్- షూటింగ్👉ఎలాన్కోర్ట్ హిల్- సైక్లింగ్ మౌంటేన్ బైక్👉జెఫ్రాయ్- గీచర్డ్ స్టేడియం- ఫుట్‌బాల్👉హోటల్ డి విల్లే- అథ్లెటిక్స్👉ఇన్వాలిడ్స్- ఆర్చరీ, అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉లా బ్యూజౌరీ స్టేడియం- ఫుట్‌బాల్👉లీ బౌర్గెట్ స్పోర్ట్ క్లైంబింగ్ వెన్యూ- స్పోర్ట్ క్లైంబింగ్👉గోల్ఫ్ నేషనల్-గోల్ఫ్👉లియాన్ స్టేడియం- ఫుట్‌బాల్👉నైస్ స్టేడియం- ఫుట్‌బాల్👉నార్త్ ప్యారిస్ ఎరీనా- బాక్సింగ్, మోడర్న్ పెంటాథ్లాన్👉పార్క్ డెస్ ప్రిన్సెస్- ఫుట్‌బాల్👉ప్యారిస్ లా డిఫెన్స్ ఎరీనా- స్విమ్మింగ్, వాటర్ పోలో👉పియరీ మౌరాయ్ స్టేడియం- బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్👉పోన్ట్ అలెగ్జాండ్రీ III- సైక్లింగ్ రోడ్, మారథాన్ స్విమ్మింగ్, ట్రిథ్లాన్👉పోర్టే డీ లా చాపెల్లె ఎరీనా- బ్యాడ్మింటన్, రిథమిక్ జిమ్నాస్టిక్స్👉స్టాడే రొలాండ్- గ్యారోస్- బాక్సింగ్, టెన్నిస్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ బీఎంఎక్స్ స్టేడియం- సైక్లింగ్ బీఎంఎక్స్ రేసింగ్👉సెయింట్ క్వెంటిన్ ఎన్ వెలీన్స్ వెలొడ్రోమ్స్- సైక్లింగ్ ట్రాక్👉సౌత్ ప్యారిస్ ఎరీనా- హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్👉స్టాడే డి ఫ్రాన్స్- అథ్లెటిక్స్, రగ్బీ సెవెన్స్👉టీహుపో టాహిటి- సర్ఫింగ్👉ట్రొకాడెరో- అథ్లెటిక్స్, సైక్లింగ్ రోడ్👉వైర్స సర్ మార్నే నాటికల్ స్టేడియం- కానో స్లాలమ్, కాన్స్ స్ప్రింట్, రోయింగ్👉వెస్-డూ- మానియర్ స్టేడియం- హాకీ.చదవండి: Paris Olympics 2024: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
EURO CUP 2024: సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
అంచనాలు తలకిందులు.. హంగ్ దిశగా ఫ్రాన్స్ ఫలితాలు!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 577 స్థానాలకుగాను మూడు పార్టీల కూటములకు స్పష్టమైన తీర్పు రాలేదు. అంచనాలు తలకిందులై ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకుండా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 289 ఎంపీ సీట్లు గెలవాలి.ఇక మొదటి దశ పోలింగ్‌లో అతివాద కూటమి నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) 33 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. లెఫ్ట్ వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) కూటమి 28 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. అయితే అధికార ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కేవలం 21 శాతం ఓటు షేర్‌తో మూడోస్థానానికి పరిమితమైంది. ఇక.. ఆదివారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో లెఫ్ట్ పార్టీ న్యూ పాపులర్ ఫ్రంట్ అనూహ్యంగా 182 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాల్సింది ఉంది. మొదటి రౌండ్ పోలింగ్‌లో అత్యధిక పాపులర్ ఓటు షేర్ సంపాధించిన రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ రెండో దశ పోలింగ్ అనంతరం 143 స్థానాలు మాత్రమే గెలచుకొని మూడో స్థానంలోకి వెళ్లింది. ఇక అధికార మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కూటమి 163 ఎంపీ స్థానాలు గెలచుకొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మొదటి నుంచి ఈసారి ఎన్నికలల్లో రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ పార్టీ అధిక సీట్లు గెలచుకొని అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా లెఫ్ట్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలోకి రాగా.. రైట్ వింగ్ పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. ఈ అనూహ్య ఫలితాలతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే.. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ప్రస్తుతం ఫలితాలతో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకొంది. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
French elections 2024: ఫ్రాన్స్ రెండో దశలో... రికార్డు పోలింగ్
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. జూన్ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్లో 67 శాతం పోలింగ్ జరిగింది. ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్ ఎన్‌సింబల్ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. తొలి రౌండ్లో అతివాద నేషనల్ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్ లీ పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. -
సెమీఫైనల్లో ఫ్రాన్స్
హాంబర్గ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ‘షూటౌట్’ ద్వారా మరో మాజీ విజేత పోర్చుగల్‌ను ఓడించింది. నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయం ముగిశాక కూడా ఇరు జట్లు 0–0తో సమంగా నిలవగా షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఫ్రాన్స్ 5–3తో పోర్చుగల్‌పై విజయం సాధించింది. ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో తన జాతీయ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. ఆరో సారి యూరో కప్‌లో బరిలోకి దిగిన రొనాల్డో ముందే ఇది తనకు చివరి యూరో అని ప్రకటించాడు. 2026 వరల్డ్ కప్‌లో 41 ఏళ్లు ఉండే అతను వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు! పేరుకు రెండు పెద్ద జట్లే అయినా ఈ క్వార్టర్స్ పోరు పెద్దగా ఉత్కంఠ, మలుపులు లేకుండా సాగింది. ఇరు జట్లూ కూడా డిఫెన్స్‌కే ప్రాధాన్యనివ్వడంతో ఆటలో వేగం కనిపించలేదు. అటు రొనాల్డో, ఇటు ఎంబాపె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పోర్చుగల్ ప్లేయర్లలో బ్రూనో ఫెర్నాండెజ్, వితిన్హ కొట్టిన షాట్లను ప్రత్యర్థి గోల్‌కీపర్ మైక్ మెగ్నన్ నిలువరించగా...ఫ్రాన్స్ ఆటగాళ్లు రాండల్, కామవింగాలకకు గోల్స్ అవకాశం వచి్చనా కీపర్ రూబెన్ డయాస్‌ను దాటి బంతి వెళ్లలేకపోయింది. అదనపు సమయంలో రొనాల్డో కొట్టిన ఒక కిక్ కూడా గోల్ బార్ మీదనుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు జాగ్రత్తగానే ఆడాయి. షూటౌట్లో తొలి నాలుగు ప్రయత్నాల్లో ఫ్రాన్స్ తరఫున డెంబెలె, ఫొఫానా, కౌండే, బార్కొలా గోల్స్ కొట్టగా...పోర్చుగల్ తరఫున రొనాల్డో, బెర్నార్డో సిల్వ, న్యూనో మెండెస్ గోల్ సాధించగా జోవో ఫెలిక్స్ విఫలమయ్యాడు. దాంతో స్కోరు ఫ్రాన్స్ పక్షాన 4–3తో నిలిచింది. ఐదో షాట్‌ను కూడా ఫ్రాన్స్ ప్లేయర్ హెర్నాండెజ్ గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2–1 తేడాతో ఆతిథ్య జర్మనీని ఓడించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ షూటౌట్లో 5–3తో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్ చేరింది. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
1300 ఏళ్ల నాటి మేజిక్ ఖడ్గం మాయం : అందోళనలో స్థానికులు
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైందిగా పేరుగాంచిన కింగ్ ఆర్థర్‌కు చెందిన ఖడ్గం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన పౌరాణిక ఖడ్గం చోరీకి గురై ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ది టెలిగ్రాఫ్ కథనం రోకమడోర్ పట్టణంలో 1,300 ఏళ్లుగా ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన విశేషం ఖడ్గం చోరీకి గురైందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఖడ్గం అదృశ్యం కావడం స్థానికుల్లో కలవరం రేపింది. ఎందుకంటే దొంగ దానిని తస్కరించాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైంది అనేది ఇపుడు హాట్ టాపిక్.. శతాబ్దాలుగా రోకామడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తోందని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.ఈ ఖడ్గం విశేషాలుస్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. డురండల్గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పదునైన కత్తి, నాశనంలేనిది. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగల సామర్థ్యం దీని సొంతం. 11వ శతాబ్దానికి చెందిన ది సాంగ్ ఆఫ్ రోలాండ్ అనే పురాణ పద్యం కత్తి అద్భుత లక్షణాలను వివరించింది.ఈ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.ది లెజెండ్ ఆఫ్ ఎక్సాలిబర్: పురాణ ఖడ్గం ఎక్సాలిబర్ కింగ్ ఆర్థర్ యాజమాన్యంలోనిది. దీనికి అనేక మాంత్రిక సామర్థ్యాలున్నట్లు ది సన్ రిపోర్ట్ చేసింది.మధ్యయుగ పురాణం ప్రకారం, 8వ శతాబ్దంలో నాటి రోమన్ చక్రవర్తి రాజు చార్లెమాగ్నే ఒక దేవదూత నుండి డురాండల్ను అందుకున్నాడు. దీన్ని తరువాత సైనికాధికారి రోలాండ్ కిచ్చాడు. యుద్ధంలో తన మరణానికి ముందు, రోలాండ్ ఈ ఖడ్గాన్ని శత్రువులు దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాళ్ళపై దానిని పగలగొట్టడానికి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు దాన్ని కాపాడేందుకు గాలిలోకి విసిరాడు. అయితే ఇది అద్భుతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, రోకామడోర్ రాక్ ఫేస్‌లో దిగబడినట్లు చెబుతారు. -
"టూర్ డి ఫ్రాన్స్" టైటిల్ గెలిచిన బినియం గిర్మే.. తొలి ఆఫ్రికన్‌గా రికార్డు
ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్ సైకిల్ రేసు) స్టేజ్ టైటిల్ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్ డి లీ కంటే ముందే రేస్ ఫినిష్ చేసి టైటిల్ గెలిచాడు.Biniam Girmay makes history as the first African rider to win a Tour de France stage🇪🇷 pic.twitter.com/AB8xvzyxox— Typical African (@Joe__Bassey) July 3, 202424 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్ టైటిల్ గెలిచాడు. మరోవైపు టూర్ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్ పొగాకర్ నుంచి పసుపు జెర్సీని (రేస్ లీడర్) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.టూర్ డి ఫ్రాన్స్ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
ఫ్రాన్స్ ఎన్నికలు: మెక్రాన్‌కు ఎగ్జిట్‌పోల్స్ గుబులు
పారిస్: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల్లో.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు ఘోర పరాభవం తప్పదా?. ఇప్పటికప్పుడు అంచనాకి రాలేకపోయినప్పటికీ.. తొలి రౌండ్ పోలింగ్ అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి గుబులు పుట్టిస్తున్నాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ కూటమి స్థానానికే పరిమితమవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు తొలి రౌండ్ పోలింగ్ ముగిసింది. అనంతరం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మెరైన్ లే పెన్కు చెందిన నేషనల్ ర్యాలీ(RN)కు అనుకూలంగా వచ్చాయి. ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓటింగ్‌తో.. గెలుపు దిశగా దూసుకెళ్తోందని సర్వే సంస్థలు వెల్లడించాయి. మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి 20.5-23 శాతం ఓటింగ్ రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్(NFP) కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయని వెల్లడించాయి. అయితే ఈ నెల ఏడున మలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు(RN Party) ఘన విజయం సాధించడంతో మెక్రాన్ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. త్రిముఖ కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మ్యాచ్ ‘డ్రా’
లీప్జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్‌లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్‌ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్‌ను ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్‌లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది. -
కమ్మగా నోరూరించే.. వెజ్ నాన్‌వెజ్ వంటకాల తయారీ ఎలాగో తెలుసా!
వెరైటీ వంటకాలు.. కొంచెం కారంగా, కొంచె తీయగా.. అటు వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్లను మిక్స్ చేస్తూ సరికొత్తగా వంటకాలను తయారుచేయండిలా...యాపిల్ ప్రాన్స్..కావలసినవి..పెద్ద రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి)మిరియాల పొడి – పావు టీ స్పూన్,కార్న్‌పౌడర్ – అరకప్పుమైదా పిండి – ఒకటిన్నర కప్పులు,గుడ్డు – 1,కొత్తిమీర తురుము – కొద్దిగానీళ్లు – కావాల్సినన్ని,నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా,కెచప్ – పావు కప్పు, ఉప్పు – తగినంత,యాపిల్స్ – 3 (గింజలు తొలగించి.. సగం పేస్ట్‌లా చేసుకుని.. మిగిలిన సగం నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, గ్రీన్ ఆపిల్ లేదా అవకాడో లేదా మామిడికాయనూ తీసుకోవచ్చు గార్నిష్ కోసం!)కారం, మిరియాల పొడి, ధనియాల పొడి – కొద్దికొద్దిగా (అన్నీ బాగా కలుపుకోవాలి)తయారీ..ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కార్న్ పౌడర్, మైదా పిండి, గుడ్డు వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా కలపాలి.కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బ్లెండర్ సాయంతో కాస్త జారుగా కలుపుకుని.. అందులో రొయ్యలువేసి, కలుపుకొని ఆ బౌల్‌కి పైన ఓ కవర్ చుట్టబెట్టి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.అనంతరం నూనెలో వాటిని డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో యాపిల్ గుజ్జు, కెచప్ బాగా కలుపుకుని పెట్టుకోవాలి.సర్వ్ చేసుకునే సమయంలో కొన్ని రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకుని.. దానిపైన కొద్దిగా యాపిల్–కెచప్‌ల మిశ్రమాన్ని వేసుకుని.. దానిపైన కారం మిశ్రమాన్ని జల్లుకుని.. అవకాడో లేదా మామిడి కాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ రొయ్యలు.అవకాడో–పొటాటో కట్లెట్..కావలసినవి..బంగాళాదుంపలు – 2 మీడియం (మెత్తగా ఉడికించుకోవాలి),అవకాడో – 1 పెద్దది (పండినది)ఓట్స్ – అరకప్పు (పౌడర్లా చేసుకోవాలి)మెంతికూర – అర కప్పు (తురుముకుని పేస్ట్‌లా చేసుకోవాలి),పచ్చిమిర్చి ముక్కలు – 2 లేదా 3 (చిన్నగా తరగాలి),వెల్లుల్లి తురుము – కొద్దిగాలవంగాల పొడి – కొద్దిగానిమ్మరసం – 1–2 టేబుల్ స్పూన్లుఉప్పు – రుచికి, నూనె – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని.. బంగాళదుంప ముక్కలు, అవకాడో ముక్కలు వేసుకుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.ఓట్స్ పౌడర్, మెంతికూర పేస్ట్, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, లవంగాల పొడి, ఉప్పు, నిమ్మరసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.అనంతరం పాన్ లేదా కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఫ్రిజ్‌లోని మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ.. కట్లెట్స్లా చేసుకుని దోరగా వేయించుకోవాలి.పచ్చి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.అవకాడో–పొటాటో కట్లెట్, బీట్రూట్ స్వీట్ పొంగనాలుబీట్రూట్ స్వీట్ పొంగనాలు..కావలసినవి..బీట్రూట్ – 2 కప్పులు,బెల్లం పాకం – ముప్పావు కప్పు (వడకట్టినది),కొబ్బరి కోరు,గోధుమ పిండి,బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున,ఏలకుల పొడి – పావు టీ స్పూన్ బేకింగ్ సోడా – చిటికెడు,నూనె,ఉప్పు – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్లో బీట్రూట్ గుజ్జు, బియ్యప్పిండి, కొబ్బరి కోరు, గోధుమ పిండి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, బెల్లం పాకం వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత పొంగనాల పాన్ కు బ్రష్‌తో నూనె రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని.. ఉడికించుకోవాలి.వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
‘ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ వ్యాఖ్యలు సరికాదు’
సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా తనను దేశం విడిచి వెళ్లమని భారత హోంశాఖ చెప్పినట్లు ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ చేసిన ఆరోపణలపై భారత్ శనివారం స్పందించింది. భారత దేశం వదలి వెళ్లాల్సి వచ్చిందని సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ పునరుద్ధరణ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.‘ఫ్రాన్సిస్ ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అయితే జర్నలిజం కవరేజీకి సంబంధించి కొన్ని నిబంధనలకు అనుమతి కలిగి ఉండాలి. 2024 మేలో ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును తాము పరిశీలిస్తున్నాం. ఇక దేశం బయట ఆయన చేసే ప్రయాణానికి సంబంధి పూర్తి హక్కులు ఉన్నాయి ’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.‘2024 సార్వత్రిక ఎన్నికల కవరేజీ చేయకుండా బలవంతంగా నేను భారత్ వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 17న భారత్ నుంచి వెళ్లిపోయాను. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన జర్నలిస్ట్ అనుమతిని పునరుద్దరించడానికి నిరాకరించింది. సాధారణ ఎన్నికలను కవర్ చేసేందుకు తిరస్కరించింది. 2011 నుంచి నేను జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నా. నేను భారతీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ప్రభావితం అవుతుంది’ అని సెబాస్టియన్ ఫ్రాన్సిస్ ‘ఎక్స్’లో తెలిపారు. -
ఫ్రాన్స్‌కు బిగ్ షాక్.. ఎంబాపేకు తీవ్ర గాయం! టోర్నీ నుంచి ఔట్?
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. సోమవారం డసెల్డార్ఫ్ అరేనా వేదికగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. 90 నిమిషాల గేమ్‌లో ఫ్రాన్స్ ఒక్క గోల్ సాధించగా.. ఆస్ట్రియా మాత్రం ఒక్కగోల్ కూడా నమోదు చేయలేకపోయింది.ఫ్రాన్స్‌కు బిగ్ షాక్..ఇక ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె గాయపడ్డాడు. ఎంబాపే ముక్కుకు బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ 86వ నిమిషంలో ఎంబాపే, ఆస్ట్రియన్ ఫార్వడ్డర్ కెవిన్ డాన్సో ఇద్దరూ అనూహ్యంగా ఒకరొకరు ఢీకొన్నారు.ఈ క్రమంలో కెవిన్ డాన్సో భుజం ఎంబాపే ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే ఫిజియో వచ్చి ఎంబాపేకు చికిత్స అందించాడు. అయినప్పటకి రక్తం ఆగకపోవడంతో మైదానం నుంచి అతడిని బయటకు తీసుకువెళ్లారు. మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా.. ముక్కు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఎంబాపే గాయంపై ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అప్డేట్ ఇచ్చింది. ముక్కు ఎముక విరిగినట్లు ఎఫ్ఎఫ్ఎఫ్ సైతం ధువీకరించింది."కైలియన్ ఎంబాపే ఆస్పత్రి నుంచి తిరిగి ఫ్రెంచ్ జట్టు బేస్ క్యాంప్‌నకు తిరిగి వచ్చాడు. సోమవారం డ్యూసెల్డార్ఫ్లో జరిగిన ఆస్ట్రియా-ఫ్రాన్స్ మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో ఎంబాపే ముక్కుకు గాయమైంది. దురదృష్టవశాత్తూ అతడి ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయింది. మా కెప్టెన్‌కు తొలుత వైద్య సిబ్బంది చికిత్స అందించగా.. ఆ తర్వాతి ఆస్పత్రిలో డాక్టర్ ఫ్రాంక్ లే గాల్ పరిశీలించారు. అతడికి ముక్కు ఎముక విరిగినట్లు ఫ్రాంక్ లే నిర్ధారించాడు. అతడు కొద్ది రోజుల పాలు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు.అయితే ఎంబాపేకు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అతడు గాయం నుంచి కోలుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన మాస్క్‌ను ఇవ్వనున్నారు. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నామని ఎఫ్ఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎంబాపే టోర్నీ మొత్తానికి దూరమైతే ఫ్రాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.🚨🇫🇷 Kylian Mbappé has just left the hospital after it was confirmed that he broke his nose.Mbappé will not undergo surgery despite initial indications, waiting to decide how to manage him for upcoming two games. pic.twitter.com/Fhbhft1OAO— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2024 -
రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..!
ఇటీవల యువతలో లక్షల జీతాలు కోసం వెంపర్లాడేవారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనుకున్న కొలువులో ఉద్యోగం కొట్టి గ్రేట్ అనిపించుకునేవారు. కానీ ఇప్పడు ఆ ఉద్యోగాలే వారికి విసుగు తెప్పించి బయటకొచ్చేలా చేస్తున్నాయి. పైగా సాదాసీదా ఉద్యోగాలు చేస్తూ..అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కొందరు. అలాంటి కోవకు చెందిందే యూఎస్‌కు చెందిన మహిళ. మంచి ఉద్యోగం, లక్షల్లో వేతనం వదులుకుని ఎలాంటి ఉద్యోగం చేస్తుందో తెలిస్తే షాకవ్వుతారు.వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన 34 ఏళ్ల మహిళ వాలెరీ వాల్కోర్ట్ గూగుల్, అమెజనా వంటి పలు కార్పోరేట్ కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత సీటెల్‌లో అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ పార్టనర్‌గా ఏకంగా రూ. 83 లక్షల వేతనం అందుకున్నారు. 2020 వరకు పలు కార్పొరేట్ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. ఇక వాటిల్లో ఉండే ఒత్తిడిలు, టెన్షన్లకు తట్టుకోలేక ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఉద్యోగం చేయాలనుకుని డిసైడ్ అయ్యింది వాల్కోర్ట్. అలా ఆమె ఫ్రాన్స్‌కు వెళ్లి పేస్ట్రీ స్కూల్లో జాయిన్ అయ్యి మూడెళ్ల పాట్ర శిక్షణ తీసుకుంది. అక్కడ రెస్టారెంట్ ఇంటర్నెషిప్లలో ఆహ్లదకరంగా ట్రైనింగ్ పూర్తి అయ్యిందని, ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకున్నానని చెబుతోంది వాల్కోర్ట్. ప్రస్తుతం ఆమె మైసన్ చబ్రాన్ రెస్టారెంట్లో పేస్ట్రీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. యూఎస్‌లోని కార్పొరేట్ ఉద్యోగాల్లో లక్షలు సంపాదిస్తున్నప్పుడూ కంటే ఇప్పుడే మానసికంగా చాలా సంతోషంగా ఉన్నానని చెబుతోంది. అంతేగాదు మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విలువైన జీతం కంటే మనసుకు సంతోషాన్ని, హాయిని ఇచ్చే ఉద్యోగమే బెటర్ అంటోంది వాల్కోర్ట్. ప్రస్తుతం చాలామంది యువతలో ఈ ధోరణి ఎక్కువ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(చదవండి: హాట్‌టాపిక్‌గా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ డ్రెస్సింగ్ స్టైల్..!) -
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. -
ఇండో–ఫ్రాన్స్ కలయికతో ‘త్రిష్ణా’
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సెంటర్ నేషనల్ ఎట్యుడస్ స్పాటైలెస్ (సీఎన్ఈఎస్) అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా త్రిష్ణా (థర్మల్ ఇన్ఫ్రా–రెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్మెంట్) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్–ఫ్రాన్స్‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, ఉద్గారత, బయో ఫిజికల్, రేడియేషన్, అధిక టెంపోరల్ రిజల్యూషన్ పర్యవేక్షణ కోసం ఇరు దేశాలు సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నాయి. ఈ ఉపగ్రహంలో రెండు పెద్ద పేలోడ్స్‌ను అమర్చి పంపబోతున్నట్లు ఇస్రో తెలిపింది. త్రిష్ణా ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని, క్లిష్టమైన నీరు, ఆహారభద్రత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ఇప్పటిదాకా ప్రయోగించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఒక ఎత్తయితే త్రిష్ణా శాటిలైట్ మరో ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగాన్ని సతీ‹Ù ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. -
తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి..!
నెల రోజుల తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలో భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్లో జరుగుతున్న బీఎన్పీ పరిబా ప్రైమ్రోజ్ ఏటీపీ–175 చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 2–6, 2–6తో ప్రపంచ 130వ ర్యాంకర్ హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.ఇవి చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..! -
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. అయితే అతడిని కార్యాలయం బయటికి తీసుకువచ్చిన పోలీసులు తొలుత తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతడి వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరాన్ రాయబార కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. కాగా, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఇరాన్లో భారీ పేలుళ్లు -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
రైతుకు ‘వినియోగ’ ఆసరా!
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, వినియోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో రైతుకూ, వినియోగదారుకూ మధ్య సంబంధం ఇద్దరికీ లాభదాయకం అవుతుంది. తద్వారా అది ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. 2016లో ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ‘ఎవరు బాస్?’ అనే ఆలోచన వచ్చింది. ఫ్రెంచ్ డెయిరీ రైతులు కష్టాలను అధిగమించడంలో సహాయపడటానికి ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నమే ‘ఎవరు బాస్?’. తర్వాత ఇది తనకుతానుగా ఒక ప్రత్యేకమైన వినియోగదారుల ఉద్యమంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా దాని రెక్కలను విస్తరించింది. స్థిరమైన, పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థలకు దారితీసే ఆరో గ్యకరమైన పరివర్తన దిశగా వ్యవసాయ ఆహార పరిశ్రమ పని చేస్తుందని నిర్ధారిస్తూ, ఫ్రెంచ్ ఆహార సహకార బ్రాండ్‌గా ‘ఎవరు బాస్’ అనే అవగాహనోద్యమం రైతులకు జీవనాధారంగా ఉద్భవించింది. రైతులకు అధిక ధర ఇవ్వడం మార్కెట్లను కుప్పకూలుస్తుంది అని నమ్మే వారందరికీ, ఇక్కడ నేర్చుకోవడానికి గొప్ప అభ్యాసం ఉంది. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, విని యోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మరింతగా క్రమాంకనం చేస్తే, ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగ దారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో, ఈ క్విడ్ ప్రోకో (నీకిది, నాకది) సంబంధం మరింత పెరిగింది. ఇది ఆ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. సగటున 31 శాతం పైగా పెరిగింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ భారతీయ రైతులు నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుందని భయపడే ప్రధాన ఆర్థికవేత్తలు, మీడియా, మధ్యతరగతి వారు ఆగ్రహించిన తరుణంలో ఈ క్విడ్ ప్రో కో భావన ప్రాముఖ్య తను సంతరించుకుంది. ఫ్రాన్స్, ఇతర ప్రాంతాలలో వినియోగ దారులు స్వచ్ఛందంగా ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు భయాందోళనలను సృష్టించే బదులు, భారత ఆర్థికవేత్తలు పంటలకు సరసమైన ధరను నిరాకరించడం వ్యవసాయ జీవనోపాధిని ఎలా చంపుతుందో గ్రహించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఈ ప్రయత్నం ఎంత కీలకమో వినియోగదారులకు అవగాహన కల్పించాలి. మొత్తానికి, వినియోగదారులు రైతుల కష్టాల పట్ల సున్నితంగా ఉంటారు. సరైన అవగాహనతో, వారు వినియోగ ప్రవర్తనను సులభంగా మార్చ గలరు. అది మార్కెట్ శక్తులను సైతం మార్చేలా చేస్తుంది. మిగులు ఉత్పత్తి కారణంగా ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ఆ పరిణామం ఫ్రెంచ్ పాడి పరిశ్రమ పతనానికి దాదాపుగా దారి తీసింది. పాడి రైతులు షట్టర్లు మూసివేయడం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు పెరి గాయి. ఆ కష్ట సమయాల్లో నికోలస్ చబన్నే. ఒక పాడి రైతు అయిన మార్షల్ డార్బన్ ను కలుసుకున్నాడు. చబన్నే స్థానిక పాడి పరిశ్రమ సహకార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారు రైతు సంఘం దుఃస్థితిని, చుట్టుపక్కల ఉన్న రైతుల బాధలను చర్చించినప్పుడు, రైతులను ఆదుకోవడానికి వినియోగదారులను ఒకచోట చేర్చే ఆలో చన రూపుదిద్దుకుంది. ‘‘ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ప్రయత్నించడం విలువైనదే’’ అని నికోలస్ నాతో అన్నారు. ఇలా ‘ఎవరు బాస్?’ అనేది రూపొందింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకోవడమే దీని లక్ష్యం. ‘‘మనకు ఆహారం అందించే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి ఇది అవసరం’’ అని చబన్నే అన్నారు. 2016 అక్టోబర్‌లో, ఆపదలో ఉన్న 80 కుటుంబాలకు సహాయం చేస్తూ 7 మిలియన్ లీటర్ల పాలను విక్రయించే లక్ష్యంతో పాల కోసం బ్లూ కార్టన్ డిజైన్ ప్యాక్ ప్రారంభమైంది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి సోషల్ మీడియాను ఉపయో గించారు. రైతు చేయాల్సిందల్లా ఒక యూరో నమోదు రుసుము చెల్లించి, మంచి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడమే! ఇది ప్రారంభమైన ఏడేళ్లలో, ’హూ ఈజ్ ది బాస్’ సంఘీభావ బ్రాండ్ 424 మిలియన్ లీటర్ల పాలను లీటరుకు 0.54 యూరోల హామీతో కూడిన సరసమైన ధరకు విక్రయించింది. అయితే అది మార్కెట్ ధర కంటే 25 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఇది నేడు ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పాల బ్రాండ్‌గా ఉద్భవించింది. పైగా దాదాపు 300 వ్యవసాయ కుటుంబాలకు (వివిధ ఉత్ప త్తుల కోసం సుమారు 3,000 మందికి) ఇది అండనిస్తోంది. మార్కె ట్లో పనిచేసే ధరల వ్యత్యాసాల లాగా కాకుండా, మార్కెట్ ధోరణు లతో హెచ్చుతగ్గులు లేని స్థిరమైన ధరను రైతులు పొందుతారు. ఫ్రాన్స్‌లో 38 శాతం రైతులు కనీస వేతనం కంటే తక్కువ సంపా దిస్తారనీ, పైగా 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవించి ఉన్నారని లెక్క. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే ప్రకారం 75 శాతం మంది ప్రజలు తమ కొనుగోలుకు మరికొన్ని సెంట్లు జోడించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించడం హర్షించదగినది. ఇది ఉత్పత్తిదారులకు సరస మైన ధరకు హామీ ఇస్తుంది. ఇది పాలతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ సంఘీభావ బ్రాండ్ సేంద్రియ వెన్న, సేంద్రియ కాటేజ్ చీజ్, ఫ్రీ–రేంజ్ గుడ్లు, పెరుగు, ఆపిల్ రసం, ఆపిల్ పురీ, బంగాళాదుంపలు, పిండిచేసిన టమోటాలు, గోధుమ పిండి, చాక్లెట్, తేనె, ఘనీభవించిన గొడ్డు మాంసం(గ్రౌండ్ స్టీక్)తో సహా దాదాపు 18 ఉత్పత్తులకు విస్తరించింది. సహకార సంఘం సాగుదారులకు సరసమైన ధరను అందజేస్తున్నప్పటికీ, వారు ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటంటే వంటకాల్లో లేదా పశువుల దాణాలో పామా యిల్ ఉపయోగించకపోవడం, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలను వాడకపోవటం. సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు జంతు వులను మేపడం వంటివి. ఈ భావన ఇప్పుడు జర్మనీ, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మొరాకో, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలోని 9 దేశాల వినియోగ దారులకు చేరువవుతోంది. ఇక్కడ ఫ్రెంచ్ మాతృ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందంతో వినియోగదారుల వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్రాన్ ్స తన పండ్లు, కూరగాయల అవసరాలలో 71 శాతం దిగుమతి చేసుకుంటుందని, ఇది స్థానిక ఉత్పత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని గ్రహించిన నికోలస్ దేశీయ రైతులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘మేము సుదూర ప్రపంచం నుండి రవాణా చేయకూడదనుకుంటున్నాము. మన స్థానిక ఉత్పత్తిదారులను, వారు ప్రతిరోజూ మన ఇంటి ముంగిట ఉత్పత్తి చేసే ఆహారాన్ని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులకు సహాయం చేయడానికి, సహకార బ్రాండ్ ఇటీవల తన ఆహార బాస్కెట్లో స్ట్రాబెర్రీ, తోటకూర, కివీ పళ్లను పరిచయం చేసింది. మార్కెట్లు పోటీని తట్టుకునేందుకు అట్టడుగు స్థాయికి దూసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఎవరు బాస్’ అనే ఆలోచన వారికి కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, వ్యవసాయ ఆదాయాలను పెంపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైన సాగుదారు లను మార్కెట్లు కలిగి ఉన్నందున, రైతులకు వినియోగదారుల మద్దతుపై చాలావరకు ఈ ‘ఎవరు బాస్’ ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్‌లోని 16 మిలియన్ల మంది ప్రజలు సాపేక్షంగా ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తే, నికోలస్ ప్రారంభించిన సంస్థ కచ్చితంగా చాలా ముందుకు వచ్చినట్లే అవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
మాక్రాన్ Vs పుతిన్: ఫ్రాన్స్‌కు రష్యా మాస్ వార్నింగ్..
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న ఫ్రాన్స్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్‌కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది. కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్‌లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్‌లో ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్‌కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్‌కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్‌కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్‌లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్‌గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్‌కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్‌గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్‌తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్‌తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్‌లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్‌కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్‌కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్‌కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్‌కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్‌లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్‌లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ పురస్కారం
కాంగ్రెస్ ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ లభించింది. ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్.. శశి థరూర్‌ను సత్కరించారు. ఆగస్టు 2022లో థరూర్‌కు ఈ అవార్డును అందజేస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం అందించినందుకు ఫ్రాన్స్‌కు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసినందుకు, అంతర్జాతీయ శాంతి, సహకారంలో చేసిన కృషికి గుర్తింపుగా థరూర్‌కు ఈ గౌరవం లభించిందని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో అధికారులు.. శశి థరూర్ ప్రతిభ, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా, భారతదేశంలో రాజకీయ నేతగా, రచయితగా థరూర్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో థరూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా థరూర్ పనిచేశారు. థరూర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించారు. థరూర్ ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. కమ్యూనికేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. -
ఫ్రాన్స్ పాస్‌పోర్టు చాలా పవర్ఫుల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్‌పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది! అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్‌పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్‌పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్‌పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్‌పోర్టు ర్యాంకు 58. ఈ పాస్‌పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది. -
ఈఫిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు
ముంబై: ఇకపై ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ–కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆన్లైన్లో ఈఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్ఐపీఎల్ తెలిపింది. -
వందేళ్ల ఫ్రాన్స్ బామ్మగారికి పద్మశ్రీ!
యోగా అనేది మన దేశానికి చెందినది. అయితే మన దేశంలో కూడా అంతలా శ్రద్ధగా చేసేవాళ్లు తక్కువే. యోగా చేస్తున్న అతి పెద్ద వయసు వృద్ధులు లేరు కూడా. కానీ ఫ్రాన్స్‌కి చెందిన ఓ బామ్మ మాత్రం అతి పెద్ద వయసు యోగా టీచర్. ఆమె ఫ్రాన్స్‌లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకుగానే భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్న పురస్కారం ఆమెను పద్శ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నలుగురు ఫ్రెంచ్ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. గతేడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడూ తొలిసారిగా పారిస్‌లో షార్లెట్ చాపిన్ను కలిశారు. ఆమె చాలా చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్దావిడి అంతలా ఎలా చలాకీగా ఉన్నారని ఆరా తీశారు మోదీ. అప్పుడే తెలిసింది మోదీకి ఆమె ఒక యోగా గురవని. ఈ విషయాన్నే ఆయన మనకీబాత్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ చాపిన్ ఈ యోగా విద్య ఎలా నేర్చుకుందో వింటే ఆశ్చర్యపోతారు. ఆమెకు ఏడేళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడూ ఈ యోగా విద్య గురించి తెలిసుకుందంట. అక్కడ కొందరూ మగపిల్లలు ఈ యోగాసనాలు వేయడం చూసి, తాను అలా వేయగలనా? అని మనసులోనే అనుకుందట ఆ బామ్మ. అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్ వెళ్లిపోవడంతో...ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్ రూమ్ డ్యాన్సర్‌గా కెరియర్ని మొదలుపెట్టింది. ఈ డ్యాన్స్‌ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల మూడుసార్లు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి కోలుకొనే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ‘అప్పట్నుంచీ యోగమార్గమే నా జీవితం అయ్యింది. యాభై ఏళ్లుగా నేను చేస్తూ, ఎంతో మందితో చేయిస్తున్నా. లెక్కల ప్రకారం చూస్తే నాకిప్పుడు వందేళ్లు. కానీ పాతికేళ్లే అనుకుంటారు. యోగావల్లనే ఆ హుషారు, ఉత్సాహం’ అనే చాపిన్ ఫ్రాన్స్‌లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. అంతేగాదు ఆమె పలు టీవీ షోలు కూడా చేస్తున్నారు. ఈ యోగాసనాలతో గిన్నిస్ రికార్డునీ కూడా సొంతం చేసుకున్నారు. వయసు మీరడం వల్ల ఆమె మాట ముద్దగా ఉంటుందేమో కానీ... ఆమె వేసే యోగాసనాల్లో మాత్రం వణుకూ లేకపోవడం విశేషం. ఇక మోదీ ఆమెను చూసి యోగా కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలకు చేరుకుంటుంది. అది కేవలం షార్లెట్ వంటి వారి కృషి వల్లే జరుగుతుందంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. (చదవండి: ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..) -
టీ హబ్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెయిరి బెర్తెలోట్ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు కాన్సుల్ జనరల్ బెర్తెలోట్కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్‌లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్ సంస్థల ఏర్పాటు ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి శ్రీధర్‌బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు. -
ఇండో–ఫ్రెంచ్ సంబంధాల్లో నవశకం
భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను ఎదుర్కోవాలంటే, సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పర్యటన ఇరుదేశాల సంబంధాలను మరింత దృఢతరం చేస్తుంది. గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ కారిడార్ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను స్వీకరించేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఇక ‘ఇండో–ఫ్రెంచ్ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్‌మ్యాప్’ ఇరుదేశాలనూ కొనుగోలుదారు–విక్రేత సంబంధాన్ని దాటి చూస్తోంది. మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం వల్ల కూడా ఈ పర్యటన ప్రత్యేకంగా మారింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన భారత పర్యటనను ఇటీవలే ముగించారు. ఇది ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మకమైన పర్యటనగా మార వచ్చని భావిస్తున్నారు. ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన గౌరవ అతిథి కావడం వల్ల ఈ పర్యటన సందర్భమే... ఆడంబరం, సంకేతాలతో కూడుకుని ఉన్నది. అయితే, ఆయన పర్యటనలో స్పష్టంగా కనిపించని అంశాన్ని చూడటం, భౌగోళిక–వ్యూహాత్మక చిక్కులను పరిశీలించడం చాలా ముఖ్యం. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పరస్పరం చక్కగా కలిసిపోతారు. ఎమ్–ఎమ్ (మోదీ, మెక్రాన్)అంశం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి పలు విషయాలను జోడించింది: నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేసింది, పైగా ఒక దార్శనికతను అందించింది. ఈ క్రమంలో, ఇది బ్యూరోక్రాటిక్ జడ త్వాన్ని, అతి భారమైన ఆలోచనలను అధిగమించడంలో సహాయ పడింది. ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో తీవ్రమైన అల్లకల్లోలం నేపథ్యంలో మెక్రాన్ తాజా పర్యటనను చూడాల్సి ఉంటుంది. రెండు ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ లో, మరొకటి గాజాలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కష్టంగా కనిపిస్తోంది. బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ప్రపంచ వాణిజ్య సంస్థ అవసాన దశలో ఉండటం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం చిందరవందరగా ఉంది. ప్రబల శక్తి అయిన అమెరికా దేశీయ రాజ కీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. కనీవినీ ఎరుగని ఈ భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను భారత దేశం ఎదుర్కోవాలంటే... నష్ట భయం తగ్గించుకోవాలి, దేశాలతో సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి, బహుళ ఒడంబడికల ఆధారంగా విదేశాంగ విధానాన్ని కొనసాగించాలి. అమెరికా ఎల్లప్పుడూ భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామిగా ఉంటుంది. అయితే, అది ఎప్పటికప్పుడు, కొన్ని దేశీయ ఒత్తిళ్లకు, చైనా–అమెరికా సంబంధాల స్థితి వంటి బాహ్య కారకాలకు కూడా లోబడి ఉంటుంది. జపాన్‌తో సంబంధాలను చూస్తే, భారతీయ వస్తూత్పత్తిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయి. కానీ రక్షణ, భద్రతా సహ కారం జరిగే అవకాశం కాస్త పరిమితంగా ఉంది. రష్యా విషయానికి వస్తే, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశ వైఖరి గురించి సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఇతర శక్తులతో తన రక్షణ సంబంధాలను విస్తరించుకోవాలని భారత్ కోరు కోవడాన్ని రష్యా అర్థం చేసుకోగలదని ఆయన చెప్పడం గమనార్హం. పై దృష్టాంతం ప్రకారం చూస్తే, ఫ్రాన్స్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండో –ఫ్రెంచ్ సంబంధాలు... వ్యూహాత్మక ఏకీభావం, స్వయంప్రతిపత్తి, ఇరు దేశాలలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. అయితే మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న అసాధారణమైన వ్యక్తిగత స్నేహసంబంధాలు... ఇండో–ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని నిజంగా ప్రత్యేకమైనదిగా మార్చింది. ‘బాసిల్ డే’(ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ గత ఏడాది జూలైలోనే పారిస్‌కు వెళ్లారనీ, అప్పుడే ఇరు నేతలూ వివరణాత్మక పత్రం ‘హొరైజన్ 2047’కు అంగీకరించారనీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత పర్యటన నుండి కూడా నాటకీయ ప్రకటనలను ఆశించడం అవాస్తవికంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ పర్యటన నుండి బయటపడిన అత్యంత ముఖ్యమైన ఫలితం ‘ఇండో –ఫ్రెంచ్ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యం కోసం రోడ్‌మ్యాప్’. ఇది క్లాసిఫైడ్ అయినప్పటికీ, ఇందులోని ఆంశాలేమిటో చూచాయగా తెలుస్తున్నాయి. ఈ రోడ్‌మ్యాప్ ఇరుదేశాలనూ కేవలం కొనుగోలు దారు–విక్రేత సంబంధంలో చూడటం లేదు. భారత సాయుధ దళాల రక్షణ అవసరాలు తీర్చడమే గాక, సహ డిజైన్, సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఇతర స్నేహపూర్వక దేశా లకు నమ్మకమైన రక్షణ సామగ్రిని అందించేందుకూ అంగీకరిస్తోంది. ఇది ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళిక. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’కు మాత్రమే కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా గణ నీయంగా దోహదపడుతుంది. ఫ్రెంచ్ సంస్థ సాఫ్రెన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల గురించి మాత్రమే కాకుండా రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, కార్యకలాపాల స్థాపనలో పురోగతి గురించి ఉమ్మడి ప్రకటనలో సూచనలు ఉన్నాయి. సాఫ్రెన్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థల మధ్య సమగ్ర భాగస్వామ్యం అనేది 100 శాతం సాంకేతికత బదిలీతో బహుళ–పాత్ర పోషించే హెలికాప్టర్ ఇంజిన్ ల అభి వృద్ధికి ఉద్దేశించబడింది. అదనంగా, స్కార్పెన్ జలాంతర్గాములు భారత్‌లో గణనీయమైన స్వదేశీకరణతో నిర్మించడాన్ని కొనసాగిస్తాయి. టాటా అడ్వాన్్సడ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ భారత దేశంలో పౌర హెలికాప్టర్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఇది రెండు దేశాల ప్రైవేట్ రంగానికీ మొట్టమొదటిది. ఇరుపక్షాలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఉమ్మడి ట్రైసర్వీసెస్ కార్యక్రమాన్ని పరిశీలి స్తున్నాయి. ఇరుదేశాల సంబంధాల్లో అంతరిక్ష రంగం కూడా ముఖ్య స్థానంలో ఉంది. రెండు దేశాలు ఆరు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో సహకరించుకున్నాయి. 2023 జూన్‌లో ప్రారంభించిన సంస్థాగత వ్యూహాత్మక అంతరిక్ష సంభాషణ మరింత ముందుకు సాగుతోంది. వాస్తవానికి, రక్షణ అంతరిక్ష భాగస్వామ్యంపై రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అంగీకార లేఖ ఈ ఫలితాలలో ఒకటి. రక్షణ, అంతరిక్షం కలిసి ఈ భాగస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరోప్ కారిడార్ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. రెండు వైపులా ఈ కార్యక్రమం గురించిన వ్యూహాత్మక ప్రాముఖ్యతను పున రుద్ఘాటించడమే కాకుండా, ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ప్రతినిధిని మెక్రాన్ నియమించడాన్ని మోదీ స్వాగతించారు. బహుశా, ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి భారతదేశం కూడా అదే పని చేయాలి. వ్యూహాత్మక భాగస్వామ్య కొనసాగింపు... స్పష్టంగా ఆవిష్కరణ, సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మేధ, అడ్వాన్్సడ్ కంప్యూటింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌లో సహకారాన్ని తీవ్ర తరం చేయాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్ స్వీకరించడం గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు అంగీకరించారు. ఇది చాలావరకు సాధ్యమే. భారతదేశం – యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇద్దరు నాయకులు తమ దృఢమైన మద్దతును పునరుద్ఘాటిస్తుండటం స్వాగతించదగినది. సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశానికి ఈ ఒప్పందం ప్రధాన వాణిజ్య విధాన లక్ష్యా లలో ఒకటిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం 30పైగా వ్యూహా త్మక భాగస్వామ్యాలను కలిగి ఉంది. వాటిలో కొన్ని పరస్పర అవస రాలపై, రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఇండో –ఫ్రెంచ్ భాగస్వామ్యం మాత్రం పరస్పర ఎంపికపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఇది ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మోహన్ కుమార్ వ్యాసకర్త ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి; ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ డీన్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
భారత్‌లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్‌కు యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్‌లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్‌లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్‌కు ఫ్రాన్స్‌లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్‌లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన కంపెనీ.. భారీ ఫైన్‌తో తిక్కకుదిరింది!
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఫ్రాన్స్ గోప్యతా రక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది. తమ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు, కార్యాచరణను పర్యవేక్షించడానికి అత్యంత అనుచిత వ్యవస్థను ఉపయోగించినందుకు అమెజాన్‌పై 35 మిలియన్ డాలర్ల (రూ.290 కోట్లు) జరిమానా విధించింది. అమెజాన్ ఉపయోగిస్తున్న మానిటరింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ లాజిస్టిక్ విభాగంలోని మేనేజర్లను ఉద్యోగులను చాలా దగ్గరగా పర్యవేక్షించడానికి అనుమతించిందని, ఇది యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (CNIL) తన వెబ్సైట్లో పేర్కొంది. "స్టౌ మెషిన్ గన్" అని పిలిచే స్కానర్లతో ఉద్యోగులను పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులు ఈ స్కానర్ల ద్వారా పార్సిళ్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పార్సిళ్లను చాలా త్వరగా అంటే 1.25 సెకన్ల కంటే తక్కువ సమయం చేస్తే వారి పనితీరులో లోపంగా కంపెనీ గుర్తిస్తోంది. ఈ పర్యవేక్షణ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకతను, పని అంతరాయాలను కొలవడానికి ఉపయోగిస్తున్నారని సీఎన్ఐఎల్ ఆరోపిస్తోంది. అటువంటి వ్యవస్థను సెటప్ చేయడం యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాల ప్రకారం చట్టవిరుద్ధమని సీఎన్ఐఎల్ వాదిస్తోంది. అయితే ఈ వాదనలను అమెజాన్ తోసిపుచ్చింది. సీఎన్ఐఎల్ చేసిన ఆరోపణలతో తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, అప్పీల్ ఫైల్ చేసే హక్కు తమకు ఉందని తెలిపింది. "వేర్‌హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు పరిశ్రమ ప్రమాణాలు, కార్యకలాపాల భద్రత, నాణ్యత సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, సమయానికి, కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్యాకేజీల నిల్వ, ప్రాసెసింగ్‌ను ట్రాక్ చేయడానికి అవసరమైనవి" అని అమెజాన్ తన ప్రకటనలో వివరించింది. -
France PM Gabriel Attal: ఒక ‘గే’ ఫ్రాన్స్‌కు ప్రధానిగా ఎలా ఎదిగారు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. గాబ్రియేల్ అటల్‌కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు. గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్తో సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్‌లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు. అటల్ పారిస్‌లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు. అటల్ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది. -
ఫ్రాన్సు ప్రధానిగా గాబ్రియెల్ అట్టల్
పారిస్: ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్క్ డైన 34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర రాజకీ య ఒతిళ్లు ఎదురవుతు న్న నేపథ్యంలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మా క్రాన్ మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమ వారం రాజీనామా చేశారు. ఆమె స్థానంలో అట్టల్‌ను నియమిస్తున్నట్లు మంగళవారం మాక్రాన్ ప్రకటించారు. మంత్రి వర్గంలో కొందరు కీలక మంత్రులు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ం ప్రతినిధిగా, విద్యాశాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ గాబ్రియెల్ అట్టల్ ప్రధాని పదవి చేపట్టడం ఆసక్తికరంగా మారింది. గే అని ప్రకటించుకున్న ఫ్రాన్స్ మొట్టమొదటి ప్రధాని అట్టల్ కావడం గమనార్హం. బోర్న్ మంత్రి వర్గంలో అట్టల్ అత్యధిక ప్రజాదరణ కలిగిన మంత్రిగా ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. -
ఒక ప్రవాహం
మనుషుల మీద లేబుల్స్ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్’, ‘ద ప్యూర్ అండ్ ది ఇంప్యూర్’ లాంటి రచనలు చేసిన కొలెట్ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం. తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్ కొలెట్. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్ విల్లర్స్ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు. మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్ సహజంగానే రైటర్ మెటీరియల్. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్ ఎట్ స్కూల్’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది. వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్ స్టాల్మెంట్ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్ ఇన్ పారిస్’, ‘క్లాడైన్ మేరీడ్’ రాసింది కొలెట్. క్లాడైన్ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్‌తో సిగరెట్లు, లింజెరీ, పెర్ఫ్యూమ్ కూడా విల్లీ ప్రారంభించాడు. విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్ రూజ్’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది. ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు. కొలెట్ అంటే ఒక స్కాండల్. పరస్పర వైరుద్ధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు. సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్ ఒక బైసెక్సువల్. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్ అండ్ బటర్’’ అన్నారు. అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్–లిఫ్ట్’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి. ‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్ జానెట్ ఫ్లానర్. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి! -
అది ‘డంకీ’ విమానమేనా?.. ఆ పాతిక మంది పరిస్థితి ఏంటో?
ముంబై, సాక్షి: ఎట్టకేలకు.. ఉత్కంఠకు తెరపడింది. భారతీయులతో ఉన్న విమానం స్వదేశానికే తిరిగి చేరుకుంది. మానవ అక్రమ రవాణా అనుమానాల నేపథ్యంలో రొమేనియన్ ఎయిర్సర్వీస్కు చెందిన ఈ విమానాన్ని ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజులపాటు విచారణ తర్వాత క్లియరెన్స్ లభించడంతో.. మంగళవారం వేకువ ఝామున ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది ఆ విమానం. ఉదయం 4గం. సమయంలో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో.. 276 మంది స్వదేశానికి చేరారు. అయితే.. పాతిక మంది ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇందులో 20 మంది పెద్దలు, ఐదుగురు మైనర్లు ఉన్నట్లు సమాచారం. వాళ్ల పౌరసత్వ గుర్తింపు తేలకపోవడంతోనే నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీళ్లను శరణార్థులుగా పరిగణిస్తామని.. ఫ్రాన్స్ అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాళ్లను వెనక్కి పంపడం కుదరని చెబుతున్నారు వాళ్లు. Maharashtra | Visuals of the passengers who arrived in Mumbai today, after the plane they were travelling in was grounded in France for four days over suspected human trafficking pic.twitter.com/IKOKiJUeYN — ANI (@ANI) December 26, 2023 అది డంకీ విమానమేనా? ఏదైనా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించే వారిని డంకీ అని పిలుస్తారు. ఈమధ్యే షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అదే కాన్సెప్ట్‌తో వచ్చింది. ప్రస్తుతం ఆ పదం ట్రెండింగ్‌లో ఉండడంతో.. ఆ విమానం డంకీ విమానమేనంటూ చర్చ నడుస్తోంది. వాళ్ల పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్ మీడియా చానెల్స్ కథనం ప్రకారం.. మొత్తం 303 భారతీయ ప్రయాణికుల్లో 11 మంది మైనర్లు ఎవరి సాయం లేకుండానే ప్రయాణిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట. వీళ్లలో భారతీయ పౌరసత్వం గుర్తింపు ఉన్నవాళ్లను మాత్రమే వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. వీళ్లను తరలిస్తున్న ఇద్దరు ప్రధాన నిందితుల్ని సైతం అక్కడి దర్యాప్తు ఏజెన్సీలు విచారిస్తున్నాయి. ఈ ఘటనపై అటు ఫ్రాన్స్.. ఇటు భారత అధికార వర్గాలు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. #WATCH | Maharashtra | Plane with Indian passengers that was grounded in France for four days over suspected human trafficking arrived in Mumbai, earlier today (Outside visuals from Chhatrapati Shivaji Maharaj International Airport) pic.twitter.com/OIMPO0c4Hx — ANI (@ANI) December 26, 2023 ఏం జరిగిందంటే.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ ఏ340 ఛార్టర్ విమానం 303 మంది ప్రయాణికులతో డిసెంబర్ 23వ తేదీన యూఏఈ(దుబాయ్) నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో ఆగింది. అయితే అప్పటికే మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో.. ఫ్రాన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఎయిర్‌పోర్టులోనే ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంకోవైపు ఈ నాలుగు రోజులపాటు ప్రయాణికులందరికీ అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ఈ తరలింపు వెనుక.. మనుషుల్ని అక్రమంగా పలు దేశాలకు పంపించే కరడుగట్టిన ముఠా హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్రాన్స్ నేర పరిశోధన నిఘా సంస్థ జునాల్కో దర్యాప్తు చేస్తోంది. భారత్ నుంచి వీళ్ల ప్రయాణం అసలు ఎలా మొదలైంది? ఎలా దుబాయ్‌కి చేరారు? అనే విషయాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. నేరం గనుక రుజువు అయితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇన్నిరోజులు అదుపులోనా? ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి నేలపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. అక్కడి కోర్టులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో ఇంకో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టవచ్చు. అక్రమంగా వెళ్లే క్రమంలో? అక్రమంగా దేశాల్ని తరలించే ఉద్దేశంతోనే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణం ఈ కేసులో బలపడుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో భారతీయులు ఎంతమంది అనేదానిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆందోళన కలిగించే అంశమే! ఇదసలు అక్రమంగా మనుషుల్ని తరలించడమేనా?. ఒకవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అక్రమ చొరబాట్లు.. శరణార్థుల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ విమానం మధ్య అమెరికా దేశం నికరాగువాకు వెళ్తుండడం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. అమెరికా కస్టమ్స్ & బార్డర్ ప్యాట్రోల్(CBP) గణాంకాల ప్రకారం.. అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 2023 సంవత్సరానికిగానూ ఆ సంఖ్య 96,917 మందిగా నమోదు అయ్యింది. గతేడాదితో పోలిస్తే ఇది 52 శాతం పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్ !
పారిస్: మానవ అక్రమ రవాణా అనుమానంతో మూడ్రోజులపాటు తమ అ«దీనంలో ఉంచుకున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. 303 మందికిపైగా ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరిన ఆ విమానం ఇంధనం నింపుకునేందుకు ఫ్రాన్స్‌లోని పారిస్ దగ్గర్లోని వ్యాట్రీ విమానాశ్రయంలో గురువారం దిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది భారతీయులే. ఈ విమానం ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందంటూ వచ్చిన సమాచారంతో ఫ్రాన్స్ అధికారులు దాన్ని తమ అ«దీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలెట్టడం తెల్సిందే. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన నలుగురు జడ్జీలు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందంటూ మొత్తం కేసు విచారణనే రద్దుచేశారు. దాంతో విమానం టేకాఫ్‌కు అడ్డంకులు తొలిగాయి. వాస్తవానికి ఈ విమానం నికరాగువాకు వెళ్లాలి. తాజా ఉదంతం నేపథ్యంలో అది నికరాగువా వెళ్తుందా, లేక భారత్కో, దుబాయ్‌కో తిరిగొస్తుందా అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. -
ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు
ప్యారిస్: ఫ్రాన్స్ నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఇందులో ఆశ్రయం కోరుతూ ఆరుగురు మైనర్లు ధరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల నిర్బంధాన్ని మరో ఎనిమిది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసుపై నేడు విచారణ కొనసాగనుంది. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రాన్స్‌లో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్ లోని భారత్ ఎంబసీ.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సిస్ లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరింది. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం నికరాగ్వాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని వాట్రి విమానాశ్రయానికి చేరుకోగానే ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం వచ్చిన కారణంతో విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. "ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతిక నిలిపివేత సమయంలో దుబాయ్ నుండి నికరాగ్వాకు బయలుదేరిన విమానాన్ని నిలిపివేశారు. ఇందులో దాదాపు 303 మంది భారతీయ మూలాలు కలిగినవారే ఉన్నారు. విమానం నిలిపివేత గురించి ఫ్రెంచ్ అధికారులు మాకు సమాచారం అందించారు. పరిస్థితిని పరిశీస్తున్నాం" అని భారత ఎంబసీ అధికారులు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక వసతి గృహాలకు తరలించారు. ఒక్కొక్కరిని అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల నుంచే నిజానిజాలను కనుక్కునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదీ చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత
ప్యారిస్: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బస్ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్ వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది. అక్రమ చొరబాటు కోసమే? అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్ ఎంబసీ ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. -
Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిస్సింగ్ కేసుని చేధించిన ఆ 'ఎమోషనల్ ఫేస్బుక్ సందేశం"
ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్‌లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్లో టైప్ చేసి చెక్‌చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో అతను వెంటనే ఆ టీనేజర్ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్బుక్లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్‌లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్‌లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు
ఓ మహిళ గత పది రోజులుగా తీవ్ర కడుపునొప్పిని అనుభవిస్తోంది. భరించలేక ఆస్పత్రికి వెళ్లితే తాను గర్భవతినని తెలుసుకుని షాక్ అయ్యింది. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..ఆ పిండం స్కానింగ్‌లో ఎక్కడ పెరుగుతోంది చూసి వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు. ఒకవేళ గర్భాశయంలో కాక వేరే ఎక్కడ పెరిగినా ఆ పిండం పూర్తిగా మనుగడ సాగించడం అసాధ్యం ఏదో ఒక సందర్భంలో విచ్ఛిత్తి లేదా అబార్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఆమె విషయంలో అలా జరగకపోవడం మరింత విచిత్రం. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌కి చెందిన 37 ఏళ్ల మహిళ పదిరోజులుగా తీవ్ర కడుపు నొప్పిని భరిస్తోంది. తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేసి చూడగా ఒక్కసారిగా విస్తుపోయారు వైద్యులు. ఆమె కడుపులో పిండం ప్రేగుల్లో పెరుగుతుండటాన్ని చూసి షాకయ్యారు. నేచరల్‌గా పిండం గర్భశయంలో పెరుగుతుంది. కొందరికి తాము ప్రెగ్నెన్సీ అని తెలియని ఎన్నో మహిళల కేసులు చూశాం. గానీ ఇలా పేగుల్లో బేషుగ్గా పిండం పెరగడం చూడటం ఇదే తొలిసారని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే..? ఒకవేళ పిండం గర్భశయం ట్యూబ్‌లో గాక బయట ఎక్కడ పెరిగినా..పిండవిచ్ఛత్తి అవ్వడం లేదా గర్భం నిలవకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరంగా పిండం పేగుల్లో నిక్షేపంగా పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. సరిగ్గా అప్పుడామె 23 వారాల గర్భవతని కూడా వైద్యులు నిర్థారించారు. ఇలా ప్రేగుల్లో పిండం పెరగడాన్ని 'ఉదర ఎక్టోపిక్ గర్భం' అని పిలుస్తారని చెప్పారు. అయితే వ్యైదులు ఆ మహిళను తమ పర్యవేక్షణ ఉంచుకుని 29 వారాల అనంతరం విజయవంతంగా ఆమెకు ప్రసవం చేశారు. మూడు నెలల అనంతరం తల్లి, బిడ్డ క్షేమంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇలాంటి ఎక్టోపిక్ గర్భాలు అంతర్గత రక్తస్రావం అయ్యి ట్యూబ్ పగిలిపోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లి, బిడ్డలిద్దరికి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని ఆమెకు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో దాదాపు 90% వరకు శిశువులను కోల్పోయే అవకాశాలే ఎక్కువుగా ఉంటాయని అన్నారు. ఒకవేళ శిశువు జీవించినా కూడా పుట్టుకతో వచ్చే లోపాలు లేదా మెదడు దెబ్బతినే అవకాశాలు ఉంటాయన్నారు. కానీ ఈ మహిళ విషయంలో అలాంటివి జరగనివ్వకుండా విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆరోగ్యంగా ఉన్న శిశువును బయటకు తీయగలిగామని తెలిపారు. (చదవండి: రెండు ప్రంచ యుద్ధాలను చూసిన బామ్మ! చివరి క్షణాల్లో..) -
V R Lalithambika : వీఆర్ అంటే విజయ సంకేతం
ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ‘ఫెయిల్యూర్’ ఎదురొచ్చి భయపెట్టాలని చూసింది. ‘అంతా గందరగోళం’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సందేహం వచ్చినప్పుడు ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే భయం ఉండేది. అయినా సరే... ‘ఇస్రో’ రహదారిలో లలితాంబిక ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు. అడుగడుగునా పాఠం నేర్చుకుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో టాప్ ఇంజనీర్లలో ఒకరిగా ఎదిగింది. తాజాగా... అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ‘ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్’ను అందుకుంది వీఆర్ లలితాంబిక... కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది లలితాంబిక. తండ్రితో సహా చుట్టాలలో ఎక్కువమంది ఇంజినీర్లు. గణితశాస్త్రంలో దిట్టగా పేరున్న తాత వల్ల లలితకు శాస్త్రీయ విషయాలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తే ఇస్రో వరకు తీసుకువెళ్లింది.చదువు పూర్తికాగానే పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత కూడా చదువుకు విరామం ఇవ్వలేదు లలిత. ఎంటెక్ చేస్తున్న కాలంలో ఆమెకు కూతురు జన్మించింది. కాలేజీకి విరామం ఇచ్చినప్పటికి స్నేహితురాలు తెచ్చి ఇచ్చిన క్లాసులకు నోట్స్ ఇంట్లోనే చదువుకునేది. 1998లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరింది. కొద్దిరోజుల్లోనే తాను పనిచేస్తున్న ఏరియాలో కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల ఫెయిల్యూర్ ఎదురైంది. ‘ఆ రోజుల్లో ప్రతిదీ కొత్తగానే అనిపించేది. ప్రతిరోజూ ఒక సవాలుగానే ఉండేది. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఉండేవి కాదు. సీనియర్లను అడగాలంటే భయంగా ఉండేది. ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగానే ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లలిత. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు లలిత యంగ్ మదర్. ఒకవైపు... ఏ టైమ్‌కు ఇంటికి వెళతారో తెలియనంత ఊపిరి సలపని పని. మరోవైపు... పని విరామంలో పదే పదే గుర్తుకు వచ్చే బిడ్డ. 1993లో పీఎస్ఎల్వీ లాంచ్ ఫెయిల్ అయింది. అదే సంవత్సరం రెండో ప్రయత్నానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. పని ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి క్లిష్టమైన కీలక సమయంలోనూ ఎప్పుడూ ‘ఇక చాలు. ఈ ఉద్యోగం చేయడం మన వల్ల కాదు’ అనుకోలేదు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంది. ‘ఆ సమయంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నాం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఇస్రో సంస్కృతిలో ఒకటి’ అంటుంది లలిత. సెకండ్ పీఎస్ఎల్వీ లాంచ్ సక్సెస్‌కు సంబంధించిన ఆనందం లలితకు ఆత్మస్థైర్యం, అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘పీఎస్ఎల్వీలో ఆటోపైలట్ సిస్టమ్ విభాగంలో చాలాకాలం నుంచి ఉన్నాను. లాంచ్ రోజులు ఉత్కంఠభరితమైనవి. అదే సమయంలో సంతోషం రూపంలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేవి. ప్రతి ఫెయిల్యూర్ కొత్త పాఠం నేర్పేది. ప్రతి సక్సెస్ కొత్త శక్తిని ఇచ్చేది’ అంటుంది లలిత. ‘మీ విజయరహస్యం?’ అనే ప్రశ్నకు లలిత చెప్పే మాట... ‘ఫ్యామిలీ సపోర్ట్’ ‘లాంచ్‌కు సంబంధించిన రోజుల్లో పనే లోకంగా ఉండేవాళ్లం. ఏ టైమ్‌కు ఇంటికి చేరుతామో తెలియదు. ఇలాంటి సమయంలోనూ నాకు కుటుంబ మద్దతు రూపంలో ప్రోత్సాహం, బలం లభించాయి. వ్యక్తిగత త్యాగాలను కూడా ఇష్టపూర్వకంగా చేసే రోజులు అవి. స్త్రీ, పురుషులను వేరు వేరుగా చూడడం అనే సంస్కృతి ఇస్రోలో కనిపించేది కాదు. ఎవరైనా ఒక్కటే అన్నట్లుగానే ఉండేది. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు’ అంటుంది లలిత. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం విషయానికి వస్తే... ఫ్రాన్సు, మన దేశం మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడంలో చేసిన విశేష కృషికి ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగామ్ మాజీ డైరెక్టర్ అయిన వీఆర్ లలితాంబికను ఫ్రెంచ్ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి మాథ్యూ నుంచి ఈ అవార్డ్ అందుకుంది లలిత. ‘అంతరిక్ష సాంకేతికతలో విశిష్ట శాస్త్రవేత్త’ అని మాథ్యూ లలితాంబికను కొనియాడారు. ‘ఈ గౌరవం మరింత మంది మహిళలు స్టెమ్ రంగాలలోకి రావడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటుంది వీఆర్ లలితాంబిక. -
ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!
చాలా విభన్నమైన స్టయిలిష్ కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తుంటారు డిజైనర్లు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా స్టయిల్. వెస్ట్రన్ స్టయిల్ కొందరూ దేశీ సంస్కృతిని మిళితం చేసేలా ఇంకొకరు ఎంచుకుని మరి కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌ని తయారు చేస్తారు. వాటి ధరలు కూడా ఎక్కువే. ప్రముఖ సెలబ్రెటీలకు మంచి బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ అందించేది వారే. రాను రాను ఎలా డిజైన చేయాలో తెలియాక ఒక్కొసారి ఇలా పిచ్చిగా డిజైన్ చేస్తారో లేక ఏం తోచక ఇలా చేస్తారో గానీ ఇదే వెర్రీ అనిపించేలా ఉంటాయి ఆ కాస్ట్యూమ్‌లు. అది కూడా మంచి పేరుగాంచిన ఓ ప్రముఖ కంపెనీ యే ఇలాంటి డిజైన్ని తీసుకొస్తే..ఛీ ఏంటీ ఇవి కూడా ఇలా దిగజారిపోతున్నాయా? లేక బ్రాండ్ పడిపోయిందా? అనిపిస్తాయి. అలాంటి పిచ్చి కాస్ట్యూమ్‌నే ఓ ప్రముఖ కంపెనీ విడుదల చేసి అందర్నీ కంగుతినేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ బాలెన్సియగా ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అత్యంత వెరైటీగా ఓ టవల్ స్కర్ట్ డిజైన్వేర్ని పరిచయం చేసింది. అది మన ఇళ్లలోని పెద్ద చిన్న మగవాళ్లంతా ప్రతి రోజు కనిపించే తీరు తరహా స్టయిలే అది. అది ఎవర్నీ ఆకర్షించకపోగా దాని ధర చూసి ఒక్కసారిగా భగ్గమంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ టవల్ స్కర్ట్ డిజైన్ వేర్ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఫ్యాంట్‌పై టవల్ కట్టుకునేలా స్టయిల్. నిజానికి ఇది స్టయిల్ కాదు. మన ఇంట్లో మగవాళ్లు ఫ్యాంటు తీసే ముందు ఇదే తరహాలో టవల్ చుట్టుకుని ఉంటారు. దీన్నే గ్రేట్ డిజైన్ అంటూ విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, ధర ఏకంగా రూ 76,000 వేలు అని ప్రకటించడం మరింత విడ్డూరం. దీంతో ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఐకియా ఈ డిజైన్‌కి అయ్యే ఖర్చు జస్ట్ రూ. 1700/- కంటే ఎక్కవ అవ్వదంటూ అందుకు సంబంధించిన సేమ్ మోడల్ని నెట్టింట షేర్ చేసింది. పలువులురు నెటిజన్లు కూడా ఐకియాకు మద్దతు ఇస్తూ అవును అంతకంటే ఎక్కువ ధరేమి ఉండదు. పోనీ ఆ టవల్ జస్ట్ కాటన్ టర్కీ టవల్. దాని ధర కూడా అంత ఉండదు. కానీ ఏకంగా ఫ్యాంట్ విత్ టవల్ కలిపి అంత ధర ప్రకటించారని మండిపడ్డారు. మరో నెటిజన్ ప్రతి కుటుంబంలోని డాడీలు ఉండే స్టయిలే అది బాస్ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by IKEA UK (@ikeauk) (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
వేస్ట్ అనుకొంటే..రూ. 36 కోట్లు పలికింది: షాకైన జంట కోర్టుకు
ఎందుకూ పనికి రాదులే అనుకుని ఒక వృద్ధ జంట తమ దగ్గరున్న ఒక రేర్ ఆఫ్రికన్ మాస్క్‌ను చాలా తక్కువ ధరకే ఒక ఆర్ట్ డీలర్ విక్రయించారు. ఆ తరువాత ఆ డీలర్ దానికి కోట్లకు రూపాయలకు విక్రయించడంతో మోసపోయమాని గుర్తించి లబోదిబోమన్నారు. మోస పోయామంటూ కోర్టును ఆశ్రయించారు. ఫ్రాన్స్‌లోని నిమెస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. MailOnline ప్రకారం 2021లో 81 ఏళ్ల వృద్ధురాలు, ఆమె 88 ఏళ్ల భర్త ఇంటిని శుభ్రం చేస్తుండగా, పురాతన మాస్క్‌ను గుర్తించారు. పాత సామానుల అమ్ముతున్న క్రమంలోనే ఈ మాస్క్‌ను కూడా స్థానిక డీలర్‌కు 158 డాలర్లకు (రూ.13000) విక్రయించారు. అయితే ఆర్ట్ డీలర్ కొన్ని నెలల తర్వాత ఆ మాస్క్‌ను వేలం వేసి రూ.36 కోట్లు (3.6 మిలియన్ పౌండ్లకు విక్రయించాడు. ఈ విషయాన్ని పేపర్లలో చదివి నివ్వెరపోయారు. మాస్క్ చాలా విలువైనదని అప్పుడు తెలుసు కున్నారు. దీంతో ఆలేస్లోని జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. డీలర్ తమను మోసం చేశాడని, ఉద్దేశపూర్వకంగా ఆ వస్తువు విలువ గురించి తెలిసి కూడా మౌనంగా దాన్ని ఎగరేసుకుపోయాడని వాదించారు. పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. దీనికి పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ డీలర్‌పై దావా వేశారు. ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ ఇది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ పెద్దాయన తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్‌గా ఉన్నప్పటిదని తెలుస్తోంది. "కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్‌ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అయితే తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్‌ని కాదని కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు. దీంతో దిగువ న్యాయస్థానం డీలర్ పక్షాన నిలిచింది. ఈ తీర్పుపై దంపతులు నవంబర్‌లో నిమ్స్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. అంతే కాదు వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలకు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు రికార్డుల ప్రకారం, డీలర్ ఈ మస్క్‌ను కొన్న తరువాత డ్రౌట్ ఎస్టిమేషన్ అండ్ ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం హౌసెస్ వారిని సంప్రదించాడు. దీని విలువ చాలా గొప్పదని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్‌పెల్లియర్‌లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. కాగా ది మెట్రో న్యూస్ ప్రకారం, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళా ఖండం. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజల వినియోగిస్తారు. వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్‌ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్‌లు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. -
నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!
రొయ్యల పచ్చడికి కావలసినవి: ఎండు రొయ్యలు – కప్పు ఉల్లిపాయ – ఒకటి పచ్చిమిర్చి – ఐదు నూనె – టేబుల్ స్పూను కొత్తిమీర – పావు కప్పు జీలకర్ర – టేబుల్ స్పూను వెల్లుల్లి రెబ్బలు – పది ధనియాల పొడి – టేబుల్ స్పూను కారం – టేబుల్ స్పూను గరంమసాలా పొడి – అరటేబుల్ స్పూను. తయారీ విధానం: రొయ్యల తల, తోక తీసేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన రొయ్యలను ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండాలి∙ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా తరిగి బాణలిలో వేయాలి∙ పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించి తీసేయాలి∙ ఇదే బాణలిలో నూనె వేయాలి. కాగిన నూనెలో పిండిపెట్టుకున్న రొయ్యలను వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీజార్‌లో వేయించిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించిన రొయ్యలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..) -
ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. ఒలింపిక్ ఆటగాళ్ల ఒళ్లు గుల్లే?
నల్లులు జాతీయ సమస్యగా మారనున్నాయా? అని ఫ్రెంచి వారిని అడిగితే ‘అవును’ అనే సమాధానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పారిస్ బెడ్‌బగ్స్ (నల్లులు)తో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇక్కడి మెట్రో, విమానాశ్రయం, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా ప్రతిచోటా నల్లులు నక్కి ఉంటున్నాయి. పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నల్లులను ప్రజలంతా తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రులంతా దీనిపై హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఫ్రాన్స్ 2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో విదేశీ ఆటగాళ్లు నల్లులకు బలికాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. రాజధాని ప్యారిస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నల్లుల బెడద సోకింది. పొంచివున్న ప్రమాదం నుంచి ఇక్కడివారు ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రజలనుఉద్దేశించి ‘మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు. అవి మిమ్మల్ని తాకినప్పుడు, అవి మీతో పాటు మీ ఇంటికి వస్తాయి’ అని హెచ్చరించారు. అలాగే గ్రెగోయిర్ ఫ్రాన్స్ స్టేట్ రేడియో సర్వీస్ ‘ఫ్రాన్స్ ఇన్ఫో’తో మాట్లాడుతూ ‘నల్లుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సను బీమా పాలసీలో చేర్చాలి. ఇది బెడ్‌బగ్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని’ ఆయన మీడియాకు తెలిపారు. మూడేళ్ల కిందట కూడా ఇదేవిధంగా నలుల్ల బెడద దాపురించింది. వెంటనే స్పందించిన ఫ్రెంచ్ ప్రభుత్వం తన ప్రత్యేక వెబ్సైట్, సమాచార హాట్‌లైన్ సాయంతో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల మెట్రోలో బెడ్‌బగ్‌లు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారు. పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ కూడా రాశారు. 1950లో ఫ్రాన్స్‌లో ఇదే విధమైన నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. -
రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్ గార్లిక్ ఫ్రాన్స్ చేయండిలా..!
గ్లారిక్ బటర్ ప్రాన్స్‌కి కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఐదు వెన్న – రెండు టేబుల్ స్పూన్లు నూనె – టేబుల్ స్పూను కారం – టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను నిమ్మరసం – టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు – పావు కప్పు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. (చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!) -
బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ..
ఈ విచిత్ర నిర్మాణం ఫ్రాన్స్‌లోనిది. పీయెయిర్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త ఈ భవనాన్ని కట్టించుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వినూత్నంగా భవనాన్ని నిర్మించాలని కోరడంతో ఫిన్నిష్ ఆర్కిటెక్ట్ యాంటీ లోవాగ్ 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బుద్బుద భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణానికి పద్నాలుగేళ్లు పట్టింది. చూడటానికి విచిత్రంగా బుడగల మాదిరిగా కనిపించే ఈ భవన నిర్మాణాన్ని 1975లో మొదలుపెడితే, 1989లో పూర్తయింది. ఇందులోకి వచ్చిన రెండేళ్లకే బెర్నార్డ్ మరణించాడు. తర్వాత దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ పీయెయిర్ కార్డిన్ కొనుగోలు చేశాడు. భవనం పాతబడినట్లు అనిపించడంతో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఓడిల్ డెక్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిపించి, కొత్త హంగులు సమకూర్చాడు. దీనిని 2017లో 350 మిలియన్ యూరోలకు (రూ.3120 కోట్లు) అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా 2020లో కార్డిన్ మరణించాడు. ఇప్పుడు దీన్ని విహారయాత్రలకు వచ్చే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు. (చదవండి: 16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..) -
యాపిల్‌కి మరోషాక్: ఆ ఐఫోన్ అమ్మకాలపై బ్యాన్
France Bans Apple iphone 12 స్మార్ట్ఫోన్దిగ్గజం యాపిల్‌కు మరో భారీ షాక్ తగిలింది. పరిమితికి మించి స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు (SAR) విడుదల చేస్తోందంటూ ఐఫోన్ 12వాడకాన్ని ఫ్రాన్స్ బ్యాన్ చేసింది.ఇప్పటికే చైనాలో అధికారులు, ఇతర ఏజెన్సీల ఐఫోన్ల వాడకంపై ఆంక్షల మధ్య తాజా నిషేధం ఐఫోన్ లవర్స్‌కు షాకిచ్చింది. (యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్) థ్రెషోల్డ్ రేడియేషన్ స్థాయిల కంటే ఎక్కువ ఉన్నందున ఐఫెన్ 12 మోడల్‌ను ఫ్రాన్స్‌లో విక్రయించడం మానేయాలని ఫ్రాన్స్ డిజిటల్ ఎకానమీ జూనియర్ మంత్రి ప్రకటించారు. అనుమతించిన విద్యుదయస్కాంత తరంగాల కంటే ఎక్కువగా విడుదల చేస్తుందని రెగ్యులేటరీ ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) పేర్కొంది. అధిక స్థాయిలో రేడియేషన్ రిలీజ్ చేస్తున్నఈ ఫోన్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని వెల్లడించింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఐఫోన్ 12 సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు అధికంగా ఉందని, ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా, జేబులో ఉన్నా కూడా 5.74 వాట్స్ పవర్ రిలీజ్ అవుతున్నట్లు గుర్తించింది. మూడేళ్ల యాపిల్ స్మార్ట్‌ఫోన్‌తో సహా, 141 ఫోన్లను ఏజెన్సీ పరీక్షించింది. మరోవైపు 2020 సెప్టెంబర్‌లో ఐఫోన్ 12నిలాంచ్ చేసింది. ఇప్పటికే పది మిలియన్ల యూనిట్లను విక్రయించింది. అలాగే ఐఫోన్ 15ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఐఫోన్12 అమ్మకాలను నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నిషేధం అమ్మకాలపై ప్రభావం చూపక పోవచ్చంటున్నారు నిపుణులు. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్‌కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్‌కు చేసిన కరోనా టెస్ట్‌లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్‌కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్‌లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్‌పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్‌ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్‌కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుడ్ న్యూస్: 30 వేల మంది భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ ఆహ్వానం..
ప్యారిస్: విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్-స్టే స్కెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను ఫ్రాన్స్ రూపొందించింది. ప్రధాన మంత్రి మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాల్లో భాగంగానే ఫ్రాన్స్ ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాషతో సహా ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్ధపడిందని రాయభార కార్యాలయం తెలిపింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రెసిడెంట్ మాక్రాన్, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను భారతీయులతో పంచుకోవడానికి ఆసక్తిని ఫ్రాన్స్ కలిగి ఉంది. భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ మంచి స్నేహితునిలా పనిచేస్తుంది.'అని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. ఫ్రాన్స్ విద్యావకాశాలు విద్యార్థులకు పరిచయం చేసేలా చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. అక్టోబర్‌లో జరగనున్న ఈ వేడుకకు దాదాపు 40 ఇన్స్టిట్యూషన్లకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదీ చదవండి: జీ20 సదస్సుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
France: బుర్ఖా నిషేధంపై రగడ
ప్యారిస్: ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు. 'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. ఇదీ చదవండి: ప్రిగోజిన్ మృతి చెందాడా..? రష్యా జన్యు పరీక్షల్లో ఏం తేలింది..? -
వైన్ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు
పారిస్: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్ మద్యానికి డిమాండ్ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు. తక్కువ ధరకు లభించే బీర్‌కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్ బదులుగా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. చాలా మంది ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా వైన్‌కి డిమాండ్ పడిపోయింది. మరోవైపు వైన్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్ ప్రాంతంలో వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్‌ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది. అదనంగా ఉన్న వైన్‌ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్‌ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్‌కు డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్ వినియోగం యూరప్ దేశాలైన ఇటలీలో ఏడు శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం మేర తగ్గిపోయింది. -
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్‌తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్‌తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
Eiffel Tower: బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ
ప్యారిస్: సుందర కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ప్యారిస్లో ఉన్న ఈ టవర్‌కు శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలో దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు అమర్చామంటూ బెదిరించారు. దీంతో హుటాహుటినా టవర్లలోని ఫ్లోర్లన్నింటిని ఖాళీ చేయించారు అధికారులు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించగా.. కిందటి ఏడాది 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. FRANCE 🇫🇷 The Eiffel Tower has been evacuated due to a bomb threat. This is developing. They don’t seem to be in much of a hurry evacuating. Hmmmm pic.twitter.com/Iabb9SqdXY — Forever Trumper (@FanaTeresafana) August 12, 2023 -
సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ
నియామే: నైగర్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకించిన కారణంగా ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీలు చేశారు సైనిక మద్దతుదారులు. దీంతో నైగర్‌లో ఉండే ఫ్రాన్స్ దేశస్తులకు హాని ఉందన్న కారణంతో వారిని వెంటనే వెనక్కు రప్పించనున్నట్లు తెలిపింది ఫ్రాన్స్ ఎంబసీ. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన నైగర్‌లో 2021లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగాయి. అందులో అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ బజోమ్స్ పరిపాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని సైన్యం ఆరోపిస్తూ ఆయనను గద్దె దించాలని నిర్ణయించుకుంది సైన్యం. ఇటీవలే ఆయను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించారు సైన్యాధ్యక్షుడు కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే. నైగర్‌లో సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్ దేశం సైనిక తిరుగుబాటును వ్యతిరేకించగా రష్యా సమర్ధించింది. ఈ నేపథ్యంలో నైగర్‌లో తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు రష్యాకు జేజేలు పలుకుతూ ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో భారీగా ప్రదర్శన చేశారు. దీంతో ఫ్రాన్స్ దేశస్తులకు నైగర్‌లో ప్రమాదమని భావించి వారిని వెనక్కు రాపించే ప్రయత్నం చేస్తోంది ఫ్రాన్స్ ఎంబసీ. ఇది కూడా చదవండి: కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష.. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ క్లబ్‌కు) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కాంట్రాక్ట్ ఈ సీజన్ అనంతరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంబాపె ఏ క్లబ్లో చేరనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఎంబాపెకు ఏడాది కాంట్రాక్ట్ కోసం భారీగా ఆఫర్ చేసింది. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు మంగళవారం పారిస్‌కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు అల్ హిలాల్ క్లబ్లో చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పాడు. వాస్తవానికి పీఎస్జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఎంబాపె కొంతకాలం ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఎంబాపె రియల్ మాడ్రిడ్ క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్‌జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి. మొదట ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడని పీఎస్జీ క్లబ్ పదేళ్ల కాలానికి గానూ దాదాపు రూ.10వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఎంబాపె ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో పీఎస్జీ ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఇంటర్ మియామీ క్లబ్ రికార్డు ధరకు మెస్సీని కొనుగోలు చేసింది. దీంతో పీఎస్జీ తరపునే ఆడుతున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడింది. కానీ తాజాగా ఎంబాపె ఆఫర్‌ను తిరస్కరించడంతో అల్ హిలాల్ క్లబ్‌కు నిరాశే మిగిలింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: #KylianMbappe: 'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి -
మీకు తెలుసా? ఆ వ్యాధి వస్తే..నాన్‌స్టాప్‌గా డ్యాన్సే..డ్యాన్స్
ఎన్నో వింత వింత వ్యాధులు గురించి విన్నాం. ఈ వ్యాధి గురించి మాత్రం వినే ఛాన్సే లేదు. అసలు విని ఉండరు. చూసి ఉండరు. అత్యంత అరుదైన వింత వ్యాధి. ఆ వ్యాధి వస్తే మనిషి అనియంత్రంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. అది కూడా నాన్‌స్టాప్‌గా చేస్తారట. ఏంటీ ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా! అని షాకవ్వకండి. ఎందుకంటే ఇది నిజం. ఈ వ్యాధి వందలమందికి సోకిందట కూడా. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌లో అల్సాస్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో ఈ వింత వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వస్తే ఆ వ్యక్తికి నృత్యం చేయాలనే కోరిక పుడుతుందట. దీంతో ఆ వ్యక్తి ఆపకుండా భయానకంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడట. ఈ ఘటన ఫ్రాన్స్‌లో 1518లో జూలైలో జరిగిందని చరిత్రకారుల చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని స్టాస్బర్గ్ వీధుల్లో ట్రోఫీ అనే మహిళ మొదటగా నృత్యం చేస్తూ కనిపించింది. ప్రజలు దీన్ని అప్పుడు అంతగా సీరియస్‌గా తీసుకోలేదు కూడా. ఐతే ఆమె ఏకాంతంగ అదేపనిగా నృత్యం చేస్తుందనే విషయం ఊరంతా దావానలంలా వ్యాపించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు, ముగ్గురు.. ఆమెలానే చేయడం జరిగింది. ఇక రోజులు గడిచిన కొద్ది ఆ సంఖ్య కాస్తా వందల సంఖ్యకు చేరుకుంది. ఉన్మాదపూరితంగా సుమారు 400 మంది దాక నాన్‌స్టాప్‌గా నృత్యం చేయడం ప్రారంభించారు. అలా వారంతా కుప్పకూలిపోయి పడిపోయేంత వరకు చేశారట. చివరికి శరీరం మూర్చపోయి మెలికలి తిరిగి పడిపోయేవారని చరిత్రాకారులు పేర్కొన్నారు. వారిని నృత్యం చేయకుండా ఆపడం ఎవరితరం అయ్యేది కాదట. ఐతే నృత్యం చేస్తున్నవాళ్లు కూడా వాళ్లు సంతోషంతో చేస్తున్నట్లు కనిపించలేదని, ఏదో హింసాత్మకంగానూ, నిరాశ నిస్ప్రుహలతో చేస్తున్న విలయ తాండవంలా ఉందట. దీంతో ఈ వ్యాధిని ఎలా నిర్వచించాలలో నాటి పండితులకు అర్థం కాలేదు. ఆపుకోలేని నృత్య కోరికే ఈ వ్యాధి లక్షణం కాబట్టి దీనిని వారంతా కలిసి 'డ్యాన్స్ ప్లేగు' వ్యాధి అని పిలిచారు. ఇది ప్రజల రోజువారి జీవితాన్ని గందరగోళంలో పడేసింది. ఏం చేయాలో పాలిపోక అధికారులు ఆవ్యాధి సోకిన వాళ్ల కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. అందులో వారు సొమ్మసిల్లేంత వరకు డ్యాన్స్ చేసుకుంటారు. పైగా ఎవరికి సోకదని భావించారు. కానీ ఈ డ్యాన్స్ ప్లేగు వ్యాధికి మూల కారణం ఏమిటో ఎవ్వరికి తెలియలేదు. ఐతే కొందరూ దీన్ని హిస్టీరియా లక్షణం అని, ఆర్థిక కష్టాలు, రాజకీయ ఒత్తిడిలతో ఇలా చేస్తున్నారని, మానవుని విపరీతమైన ప్రవర్తనకు సంబంధించినదని, మరికొందరూ సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇలా జరిగిందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. నృత్య శాస్త్రంలో కూడా దీని గురించి ఉందని, అక్కడ నుంచి సాముహిక నృత్యం వచ్చిందని ఐరోపా వాసులు విశ్వసిస్తారు. ఏదీఏమైన ఈ అంతుపట్టని 'డ్యాన్స్ ప్లేగు' అనే వ్యాధి ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ అంతుపట్టిని మిస్టరీలా ఉండిపోయింది. (చదవండి: కండ్లకలక బారిన పడకుండా ఉండొచ్చా? వర్షాకాలంలోనే ఇవి వస్తాయా?) -
'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.కాంట్రాక్ట్ పొడిగించుకోవడానికి ఎంబాపె ఇష్టపడకపోవడంతో అతన్ని వదులుకోవాలని పీఎస్జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంబాపె వదులుకున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం అని చెప్పొచ్చు. ఎంబాపెతో బంధాన్ని కొనసాగించేందుకు పీఎస్జీ క్లబ్ అతనికి పదేళ్ల కాలానికి గానూ దాదాపు 1 బిలియన్ యూరోలు(ఇండియన్ కరెన్సీలో సుమారుగా 9వేల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎంబాపె అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ప్రస్తుతం లీగ్ వన్ క్లబ్లో ఆడుతున్న ఎంబాపెకు పీఎస్జీ తరపున ఇదే చివరి సీజన్ కానుంది. ఆ తర్వాత జరగనున్న ప్రీ-సీజన్ జపాన్ టూర్‌కు ఎంబాపె వేరే క్లబ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత పీఎస్జీ క్లబ్ ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే భారీ ఆఫర్‌ను మూటజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎంబాపె తిరస్కరించడంతో చేసేదేం లేక అతన్ని వదులుకోవడానికి సిద్ధమైంది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: Smriti Mandhana: 'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!' MLC 2023: నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్ -
ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!
ఫ్రాన్స్‌లో గత నెలలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఒక యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఫ్రాన్స్‌ను ఒక్క కుదుపు కదుపేసింది. ఒక్కరాత్రిలో ఫ్రాన్స్ రణరంగంలా మారిపోయింది. మైనార్టిలపై పోలీసులు అకృత్యాలు కొత్తేమి కాదంటూ ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంది. ఆ యువకుడిని చంపడాన్ని నిరశిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టించారు. పోలీసులు కావలనే ఇలా చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. ఒక్కసారిగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో దేశం ఒక్కసారిగా అగ్ని గుండలా మారిపోయింది. నాటి ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందకు పోలీసులు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్ కోర్టుల వారిపై మోపిన అభియోగాలను విచారించి నాటి ఘటనలో అల్లర్లకు పాల్పడిని సుమారు 700 మందికి జైలు శిక్ష విధించింది. వారంతా పోలీసు అధికారులపై దాడిచేయడం, ప్రభుత్వా ఆస్తులను పాడుచేయడం తదిత వాటిల్లో దోషులుగా నిర్థారించి ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ..న్యాయస్థానం నాటి ఘటనపై సీరియస్‌గానే స్పందించింది. దేశ శాంతి భద్రతలకే కోర్టు ప్రాముఖ్యతనిస్తుంది. ఇలాంటి విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమి గాదు గతంలో కూడా ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో..) -
Leena Nair: ఫ్యాక్టరీ ఫ్లోర్లో పనిచేసిన తొలి మహిళ!
ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీని కలుసుకున్న ప్రముఖులలో లీనా నాయర్ ఒకరు. మోదీ ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. మేనేజ్మెంట్ ట్రైనీ నుంచి గ్లోబల్ బ్రాండ్ చానల్(ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ)కి సీయివో కావడం వరకు ఆమెది స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.... లీనా నాయర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పుట్టింది. అక్కడి హోలీ క్రాస్ హైస్కల్, ది న్య కాలేజ్‌లో చదువుకుంది. మహారాష్ట్ర, సంగ్లీ పట్టణంలోని ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. హిందూస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) లో .మేనేజ్మెంట్ ట్రైనీగా ద్యోగ ప్రఉస్థానం మొదలు పెట్టిన లీన ఫ్యాక్టరీ ఫ్లోర్లో పని చేసిన తొలి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన తొలి మహిళ, మేనేజ్మెంట్ కమిటీలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న లీన ‘మేనేజ్మెంట్’ వైపు రావడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లోనే...‘‘చిన్న పట్టణంలో పుట్టి పెరిగాను. ఆ రోజుల్లో అమ్మాయిల కోసం సరిౖయెన బడులు ఉండేవి కావు. అమ్మాయిలు ఇవి మాత్రమే చేయాలి....ఇలా రకరకాల ఆంక్షలు ఉండేవి. పెద్దగా నవ్వడం కూడా పెద్ద తప్పయ్యేది! చిన్నప్పటి నుం నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం. అలా ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్‌లో ఉండే ఇంటలెక్చువల్ చాలెంజ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఇంజనీర్‌గా ఉద్యోగజీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాను. అదృష్టవశాత్తు ఒక ప్రొఫెసర్ దగ్గర మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకున్నాను. నీలో అరుదైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అంటూ ఆయనే నన్ను మేనేజ్మెంట్ దిశగా ప్రొత్సహించారు. మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటున్నాను అని నాన్నతో చెబితే ఆయన చాలా నిరాశకు గురయ్యారు. నీలాంటి ప్రతిభ గల ఇంజనీర్ అటు వైపు వెళ్లడం ఏమిటి? అన్నారు. ఆయన అలా అనడంతో నాకు చాలా నిరాశగా అనిపింంది. తరువాత బాగా ఆలోంచాను. అప్పుడు నాకు నేనే గురువుగా మారిపోయా. ‘నీ మనసు చెప్పింది చెయ్. ఎవరో ఏదో అనుకుంటారని సంశయించవద్దు. నీ కంట ఒక లక్ష్యంతో బయలుదేరు’... అలాగే చేశాను. నా కలను నిజం చేసుకున్నాను’’. ప్రతి అనుభవం, ప్రతి పని ఒక పాఠం నేర్పుతుంది. ఫ్యాక్టరీ ఫ్లోర్లో పనిచేసిన అనుభవం నుంచి లీన నేర్చుకున్న పాఠం ఏమిటి? తాను ఫ్యాక్టరీ ఫ్లోర్‌లోకి అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. ఒక మహిళ తమ ఫ్యాక్టరీలో పనిచేస్తుందని వారు ఊహించలేదు. తన కోసం ఒక టాయిలెట్ నిర్మించేలా చేయడంలో విజయం సాధించింది లీనా. ‘హెచ్‌యూఎల్’లో పనిచేస్తున్న కాలంలో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్‌కు సంబంధిం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అవన్నీ తన కెరీర్‌కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. ఫ్యాక్టరీలో యంత్రాలలో యంత్రమై పనిచేయలేదు లీన. చీఫ్ హ్యమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా ఉద్యోగులను కనిపెట్టుకొని ఉండేది. ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతున్నా, పనిఒత్తిడితో సతమతం అవుతున్నా....వారిని ఆ స్థితి నుంచి బయటికి తీసుకువచ్చేది. పాకిస్థాన్‌లో ‘హెచ్‌యూఎల్’ షాప్ ఫ్లోర్ కోసం కొందరు అమ్మాయిలు ఉద్యోగంలో చేరారు. అయితే వారి తల్లిదండ్రులకు రకరకాల సందేహాలు ఉండేవి. ఇది గమనింన లీన వారిని కంపెనీ గెస్ట్‌హౌజ్‌లో రెండు వారాల పాటు ఉండేలా చేసింది. తమ పిల్లలు షాప్ ఫ్లోర్లో చేస్తున్న పని ఏమిటి? అక్కడ ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి...మొదలైనవి ప్రత్యక్షంగా చసుకునే అవకాశం వారికి లభించింది. ‘మాకిప్పుడు ఎలాంటి సందేహాలు లేవు. మా పిల్లలు మంచి ఉద్యోగాన్ని ఎంచుకున్నారు’ అన్నారు వారు వెళ్లేటప్పుడు. ‘ప్రతి సమస్యకు ఒకేఒక పరిష్కారం ఉండదు. సందర్భాలు, దేశాలను బట్టి కొత్త పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు అన్వేషించాల్సి ఉంటుంది’ అంటోంది గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానల్’ సీయివో లీనా నాయర్. (చదవండి: పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు) -
తడికలపూడి టు ఫ్రాన్స్
సాక్షి, అమరావతి: కోకో పంటకు ప్రపంచస్థాయి బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు స్థానికంగా మాత్రమే కోకో గింజలను విక్రయిస్తున్న రైతుల ద్వారా ఫైన్ ఫ్లేవర్డ్ కోకో గింజల్ని ఉత్పత్తి చేసి వాటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడంతో ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. కోకో సాగు, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏపీలో సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 21వేల హెక్టార్ల నుంచి 39,714 హెక్టార్లకు విస్తరించింది. తద్వారా 10,903 టన్నుల కోకో గింజలు ఉత్పత్తి వస్తుండగా దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్ట్లే, క్యాంప్కో వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. అదనపు ధర కల్పించడమే లక్ష్యంగా.. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం మరోవైపు గింజల్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ వల్ల ప్రీమియం చాక్లెట్స్ తయారీకి అవసరమైన ఫ్లేవర్ కోకో గింజలకు వస్తుంది. వీటికి మార్కెట్ ధర కంటే 30% అదనంగా చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు, శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్ చేస్తే మరో 15% అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ప్రీమియం చాక్లెట్స్ తయారీలో ఉపయోగించే ఫైన్ ఫ్లేవర్డ్ గింజల ఉత్పత్తే లక్ష్యంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం 35% సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ గోదావరి కోకోకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించడమే లక్ష్యంగా ముందుకొచ్చే రైతులు, ఎఫ్పీఓలకు సబ్సిడీపై ఆర్ధిక చేయూతనిస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరింతమంది రైతుల ద్వారా ప్రీమియం కోకో గింజలను ఉత్పత్తి చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ -
ఫ్రాన్స్ మాక్రాన్ భార్యకు అరుదైన బహుమతిచ్చిన మోదీ.. విలువెంతంటే?
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, ప్రధాని మోదీ.. మాక్రాన్ భార్యకు ఇక్కత్ చీరను బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు.. లక్ష రూపాయల వరకు ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన ఇక్కత్ చీరల నేత కార్మికుడు గోలి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. మేము నేసిన చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పలలో ఇక్కత్ చీరల తయారీ జరుగుతోంది. దేశంలో మరెక్కడా ఇక్కత్ చీరలు తయారు చేయరు. పురాతన కాలం నుంచి ఇక్కత్ చీర కళను కాపాడుతున్నామని తెలిపాడు. మోదీ బహుమతిగా ఇచ్చిన చీరకు దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. -
భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక..
పారిస్: భారత ప్రధాని పర్యటనను గుర్తు చేసుకుంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీతో గడిపిన క్షణాలను పొందుపరచి ఇది భారతీయ ప్రజలకు, వారి నమ్మకానికి, స్నేహానికి అని రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు అజరిగిన ప్రధాని పర్యటనలో అపురూప క్షణాలన్నిటినీ వీడియోగా మలచి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదే వీడియోని ప్రధాని మళ్ళీ రీట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్- భారత్ మన బంధం కాలాతీతమైనది. ఇందులో మన విలువలు, కలిసికట్టుగా కన్న కలలు ప్రతిధ్వనిస్తుంటాయి. నా ప్రియ స్నేహితుడైన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. నేను ఈ దఫా ఫ్రాన్స్ లో గడిపిన ప్రతి క్షణాన్నీ నెమరు వేసుకుంటూనే ఉంటానని రాశారు. To the people of India, trust and friendship. pic.twitter.com/s8b3Hb7cf8 — Emmanuel Macron (@EmmanuelMacron) July 15, 2023 ఫ్రాన్స్ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియో భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించడడంతో మొదలైంది. అనంతరం జులై 14న జరిగిన బాస్టిల్ డే ఉత్సవాల్లో ప్రధానితో కలిసి మెక్రాన్ పాల్గొన దృశ్యాలు.. అందులో సైనిక, వైమానిక దళాల విన్యాసాలను ఇద్దరు కలిసి తిలకిస్తున్న సన్నివేశాలున్నాయి. ఫ్రాన్స్ దేశాధినేతలతో ఎల్సీ ప్యాలెస్ లో జరిగిన సమావేశం.. అందులోని ఒప్పందాలు.. ఫ్రాన్స్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులతో మంతనాలు.. లౌవ్రే మ్యూజియంలో డిన్నర్ అన్నిటినీ దృశ్యాల సమాహారంగా చేసి చివర్లో ప్రధాన మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. వీడియో చివర్లో భారతీయ నటుడు మాధవన్ కూడా తళుక్కున మెరిశారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్న దృశ్యం వీడియోకే హైలైట్. India and France…a bond that transcends time, echoing in our shared values and kindling our collective dreams. I will always cherish my recent visit to France. Thank you my friend, President @EmmanuelMacron. https://t.co/R6rcvhMKoj — Narendra Modi (@narendramodi) July 16, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు.. -
ఆస్పర్టెమ్తో క్యాన్సర్ ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
లియోన్: డైట్ సోడా తదితర ఎన్నో ఆహారపదార్థాల్లో వాడే నాన్ షుగర్ స్వీట్నర్(ఎన్ఎస్ఎస్) ఆస్పర్టెమ్తో కేన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. తమ అధ్యయనంలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్(ఐఏఆర్సీ) తెలిపింది. ఆస్పర్టెమ్‌లో కేన్సర్ కారకాలుండేందుకు అవకాశమున్నట్లు మనుషులు, జంతువులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఐఏఆర్సీ తెలిపింది. అయితే, ఆస్పర్టెమ్ పరిమిత వాడకం సురక్షితమేనంటూ ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ), డబ్ల్యూహెచ్‌వో ఎంపిక చేసిన నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాన్సెస్కో బ్రాంకా మాట్లాడుతూ.. ఆస్పర్టెమ్‌ను మొత్తానికే మానేయాలని అనడం లేదు, మితంగా వాడాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అత్యధికంగా వాడే వారు మాత్రమే తగ్గించుకోవాల్సి ఉంటుంది. కాస్త ఎక్కువగా వాడినా ఎటుంటి అనర్థాలు ఉండవని బ్రాంకా చెప్పారు. ‘ఆస్పర్టెమ్తో కాలేయ క్యాన్సర్ రావొచ్చనేందుకు మాత్రం ఆధారాలు పరిమితంగానే లభించాయి. ప్రస్తుతం వినియోగించే స్థాయిల్లో ఆస్పర్టెమ్ ప్రమాదకరమని చెప్పేందుకు బలమైన ఆధారం దొరకలేదు. ఆమోదయోగ్యమైన వినియోగ స్థాయిలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులేదు. పరిమితంగా, మార్గదర్శకాలకు లోబడి వాడితే ఆస్పర్టెమ్ వల్ల సాధారణంగా ఎటువంటి హాని కలగదు’అని ఎఫ్‌డీఏ తెలిపింది. సాధారణంగా రోజుకు 14 కేన్ల వరకు ఆస్పర్టెమ్ ఉన్న డ్రింకులను తాగొచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ స్పీగెల్హాల్టెర్ తెలిపారు. -
ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్ టవర్ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు. యూపీఐ విషయంలో భారత్ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్–సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్‌లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్పీసీఐ సీఈవో రితేష్ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్పీసీఐ అని తెలిసిందే. ఎలా పనిచేస్తుంది? ఫ్రాన్స్‌కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్వర్క్స్తో ఎన్పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్‌ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్ఆర్ఐలు ఇక నుంచి లైరా నెట్వర్క్ ఆధారిత అన్ని చెల్లింపుల టెరి్మనళ్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్‌లో బ్యాంక్ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్లో భీమ్ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్ ఖర్చులు సైతం తగ్గుతాయి. రోజుకు 100 కోట్ల లావాదేవీలు యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తుండడంతో రానున్న రోజుల్లో చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు సీమాంతర చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా చేసుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంది. 2025 నాటికి రోజువారీ బిలియన్ లావాదేవీలకు (100 కోట్లు) చేరుకుంటామని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు యూకే, నేపాల్, భూటాన్, సింగపూర్, ఆ్రస్టేలియా, ఒమన్, ఫ్రాన్స్‌లో యూపీఐ లావాదేవీలకు అవకాశం ఏర్పడినట్టు చెప్పారు. భారత్ 13 దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అవన్నీ తమ దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రకటించడం గమనార్హం. -
మోదీ ఫ్రాన్స్ పర్యటన.. మరింత పదునెక్కిన చెలిమి!
అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించటంలో సారూప్యత కలిగివుండే భారత్–ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి ఇరవై అయిదు వసంతాలు పూర్తయిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో శుక్రవారం ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికా దళ అవసరాల కోసం ఉద్దేశించిన 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, మూడు స్కార్పీన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతున్నాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే రెండో పెద్ద సరఫరాదారు కాబోతోంది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ విమానాలు, ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములు కొనుగోలు చేశాం. ఇరు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ను చేజిక్కించుకొనేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్కిర్క్ పట్టణంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో పారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తుచేసుకుంటూ శుక్రవారం బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్‌కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాతనుంచీ రెండు దేశాల మధ్యా అణు, అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గత 25 సంవత్సరాలుగా భారత్–ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్ర రాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్నివిధాలా అండగా నిలబడింది. యూరోప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌ను అభిశంసిస్తూ, దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానం ప్రతిపాదించబోయినప్పుడు వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే. చదవండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలగుతూనే ఏదోమేరకు స్వతంత్రతను పాటించటం భారత్, ఫ్రాన్స్‌లు మొదటినుంచీ అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించటంలోనూ భారత్, ఫ్రాన్స్లమధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వాలంబన సాధించటం అవసరమని గుర్తించటంలోనూ ఇద్దరూ ఇద్దరే. బహుశా అందువల్లే కావొచ్చు... పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. అమెరికా మనతో సఖ్యంగా ఉంటున్నా ఆ చెలిమికి ఎప్పుడూ పరిమితులుంటున్నాయి. ఆ దేశంతో మనం కుదుర్చుకునే రక్షణ ఒప్పందాలకు ఎన్నో అవరోధాలుంటాయి. అక్కడి కాంగ్రెస్ వాటిని ఆమోదించాలి. రక్షణ పరికరాలకు సంబంధించి అమల్లోవుండే ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలను దాటాలి. ఈ క్రమంలో ఎక్కడైనా ఆగిపోవచ్చు. లేదా జాప్యం చోటుచేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్షణ కొనుగోళ్లకు అంగీకరించినా, సాంకేతికత బదిలీ సాధ్యపడదు. ఉదాహరణకు మన తేలిక రకం యుద్ధ విమానం తేజస్‌కు జీఈ ఎఫ్ 414 ఇంజిన్ అమర్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాని సాంకేతికత బదిలీకి మాత్రం అంగీకరించలేదు. ఫ్రాన్స్‌తో ఈ పేచీ లేదు. దానితో కుదుర్చుకునే ఒప్పందాలకు అవాంతరాలుండవు. సాంకేతికత బదిలీకి అభ్యంతరాలుండవు. జీఈ ఎఫ్ 414 ఇంజిన్ మాదిరే పనిచేసే ఫ్రాన్స్ సఫ్రాన్ ఇంజిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సాంకేతికత బదిలీ చేయటం వల్ల కేవలం రక్షణ ఉత్పత్తులు విక్రయించే దేశమే కాక, కొనుగోలు చేస్తున్న దేశం కూడా లబ్ధిపొందటానికి అవకాశముంటుంది. రెండు దేశాలూ పర్యావరణ రంగంలో కూడా పరస్పరం సహకరించుకోవటానికి ఇప్పటికే నిర్ణయించాయి. నిరుడు అక్టోబర్‌లో గ్రీన్ హైడ్రోజన్‌పై ఒప్పందం కుదుర్చుకుని, పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన హరిత ఇంధనాన్ని అందించే దిశగా ఇరు దేశాలూ అడుగులు వేస్తున్నాయి. ఇంకా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, 6జీ తదితర అంశాల్లో సమష్టిగా పనిచేస్తున్నాయి. క్వాడ్, జీ 20 తదితర వేదికల్లో ఒకే గళం వినిపిస్తున్నాయి. అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం దురాక్రమణ ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, ఈయూ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించటంలేదు. అలాగే చైనా విషయంలోనూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ భిన్న వైఖరితో ఉన్నారు. విభేదించుకునే అంశాల్లో అవతలి పక్షం అవగాహన తెలుసుకోవటం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయటంలోనే దౌత్య నైపుణ్యం వెల్లడవుతుంది. చిరకాల మిత్ర దేశమైన ఫ్రాన్స్ మోదీ పర్యటన తర్వాత మనకు మరింత సన్నిహితమవుతుందని ఆశించాలి. -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్ -
ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్.. జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు. '' ఇవాళ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న కైలియన్ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. #WATCH | French football player Kylian Mbappe is superhit among the youth in India. Mbappe is probably known to more people in India than in France, said PM Modi, in Paris pic.twitter.com/fydn9tQ86V — ANI (@ANI) July 13, 2023 ఇక 2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్లో ఓడి ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్ చేశాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా?
లాస్ వెగాస్: ప్రఖ్యాత పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కు లాస్ వెగాస్ లోని ఓ హోటల్లో ఘోర అవమానం జరిగింది. ప్రముఖ ఎన్బీఏ స్టార్ ఫ్రాన్స్ కు చెందిన విక్టర్ వెంబన్యామ(19)కు వీరాభిమాని అయిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో ఒక ఫోటో కోసం వెంటపడగా సెక్యూరిటీ వారు ఆమెను నెట్టివేశారు. ఈ సంఘటన వైరల్ కావడంతో ఒకప్పుడు తన పెర్ఫార్మెన్స్ లతో యువతను ఉర్రూతలూగించిన క్రేజీ పాప్ స్టార్ కు ఇంతటి అవమానమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిట్నీ స్పియర్స్ డిన్నర్ చేయడానికి వెగాస్ లోని అరియా హోటల్ కి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ప్రముఖ స్పర్స్ ఆటగాడు విక్టర్ వెంబన్యామ కనపడటంతో అతడితో ఒక ఫోటో తీసుకోవాలని అతడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఎన్బీఏ స్టార్ చుట్టూ అభిమానులు మూగడంతో బ్రిట్నీ అతని వీపు మీద వెనుకనుండి చరిచింది. అక్కడే ఉన్న వెంబన్యామ సెక్యూరిటీ చీఫ్ డామియెన్ స్మిత్ ఇది గమనించి ఆమెను బలంగా తోసేశాడు. దీంతో బ్రిట్నీ స్పియర్స్ కింద పడిపోయింది. ఆమె కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. తర్వాత బ్రిట్నీ లేచి తన టేబుల్ వద్దకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సెక్యూరిటీ చీఫ్ స్మిత్ ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఆ సమయంలో స్మిత్ ను క్షమించినట్టే కనిపించిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో కొద్దిసేపు నవ్వుతూ సంభాషించింది కూడా. కానీ డిన్నర్ పూర్తయిన తర్వాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంబన్యామ మాట్లాడుతూ.. ఎవరో తనను వెనుక నుండి బలంగా హత్తుకున్నారని, సెక్యూరిటీ వారిని బలంగా నెట్టి వేశారని తెలుసు.. తర్వాత తెలిసింది వారు తోసింది బ్రిట్నీ స్పియర్స్ నని. కానీ ఆమె చెబుతున్నట్లుగా ఆమె మెల్లగా తట్టలేదు బలంగా హత్తుకుందని వివరణ ఇచ్చాడు. దీనికి మళ్ళీ బ్రిట్నీ స్పందిస్తూ.. తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని సున్నితంగా పిలిచానని చెబుతూ విషయమంతా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కూడా చదవండి: భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు.. View this post on Instagram A post shared by Maria River Red (@britneyspears) -
Wimbledon 2023: అల్కరాజ్ అలవోకగా...
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–0, 6–2, 7–5తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ పది ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. చార్డీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన ఈ స్పెయిన్ స్టార్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు. నెట్ వద్దకు తొమ్మిదిసార్లు దూసుకొచ్చిన అల్కరాజ్ ఏడుసార్లు పాయింట్లు గెలిచాడు. 38 విన్నర్స్ కొట్టిన అతను 14 అనవసర తప్పిదాలు చేశాడు. మరో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కూడా అలవోక విజయంతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రియాన్ పెనిస్టన్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముర్రే 6–3, 6–0, 6–1తో విజయం సాధించాడు. వర్షం కారణంగా రెండో రోజు పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. పైకప్పు కలిగిన సెంటర్ కోర్టు, నంబర్‌వన్ కోర్టులోని మ్యాచ్‌లు సజావుగా సాగాయి. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) కష్టపడి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. రిబాకినా 4–6, 6–1, 6–2తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిషియా) 6–3, 6–3తో మగ్ధలినా ఫ్రెచ్ (పోలాండ్)ను ఓడించింది. సోమవారం ఆలస్యంగా ముగిసిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 4–6, 6–4, 2–6తో 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
మూలానికి మందు వేయాలి!
ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్ తగలబడుతూనే ఉంది. ప్యారిస్‌కు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్‌ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్‌ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి. ఆఫ్రికన్, అరేబియన్ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్ సంతతికి చెందిన టీనేజర్ నహేల్ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు. ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్‌లైవ్స్ మేటర్’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం. ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట. ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్ తక్షణం రద్దు చేయాలి. పోలీస్ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్‌లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర. అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్‌బాల్‌లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్ దేశాల లానే ఫ్రాన్స్ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్‌లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం. అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్‌లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. లేదంటే, ఇవాళ ఫ్రాన్స్‌లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! -
రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..
పారిస్: ఫ్రాన్స్ దేశంలో నహేల్ అనే ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇప్పటికింకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, దుకాణాలను లూటీ చేస్తున్నారు. తాజాగా కొన్ని అల్లరి మూకలు ఒక కార్ షోరూంని కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు నుండి నేటివరకు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తూ భగ్గుమంటూనే ఉంది. ఇంతవరకు ఈ అల్లర్లలో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేయగా పోలీసు బలగాల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకునేందుకు 45000 మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరిమూకలను చెదరగొడుతున్నా ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ఆందోళనకారులు పారిస్ నగరంలో ఎక్కడికక్కడ దుకాణాల్లోకి చొరబడి చేతికి దొరికిన వస్తువును తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కొంతమంది నిరసనకారులు అక్కడి వోక్స్ వ్యాగన్ కార్ షోరూంని కొల్లగొట్టి అందులోని ఖరీదైన కార్లను దొంగిలించారు. ఎంత కష్టపడితే మాత్రం ఇలాంటి లగ్జరీ కార్లను కొనడానికి జీవితకాలం సరిపోదని భావించారో ఏమో. షోరూంలోనో కార్లన్నిటినీ లూటీ చేశారు. దుండగులు కార్లను ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనికి కామెంట్ల రూపంలో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు వీక్షకులు. Car dealership looted in #FranceRiots. pic.twitter.com/fkKHil7H8J — Paul Golding (@GoldingBF) July 2, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
ఫ్రాన్స్‌లో ఐదో రోజూ అల్లర్లు
పారిస్: ఫ్రాన్స్‌లో అల్లర్లు ఐదో రోజూ కొనసాగాయి. ఆందోళనకారులు మేయర్ నివాసంపైకి మండుతున్న కారుతో దూసుకువచి్చ దాడికి యతి్నంచారు. పోలీసులతో ఆందోళనకారులు పలు చోట్ల బాహాబాహీకి దిగారు. అయితే, గత నాలుగు రోజులతో పోలిస్తే అల్లర్ల తీవ్రత తగ్గింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు శనివారం రాత్రి మరో 719 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. మంగళవారం పారిస్ శివారులోని నాంటెర్రెలో ట్రాఫిక్ పోలీసులు నేహల్ అనే యువకుడిని కాల్చి చంపడంతో ఆగ్రహజ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. నేహల్ అంత్యక్రియలు శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. శనివారం రాత్రి పారిస్‌లో చాంప్స్ ఎలిసీస్ వద్ద గుమికూడిన యువకుల గుంపును పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. ఫ్రెంచి గుయానాలో తుపాకీ బుల్లెట్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. పారిస్ ఉత్తర ప్రాంతంలో నిరసనకారులు బాణసంచా కాల్చుతూ, రోడ్లపై అడ్డంకులు పెట్టారు. టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి వారిని పోలీసులు చెదరగొట్టారు. -
రగులుతున్న ఫ్రాన్స్
-
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్‌లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy — Ian Miles Cheong (@stillgray) July 1, 2023 ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్‌లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్లో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్‌ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్సెయిల్, లియోన్లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్‌లు స్నాప్ చాట్, టిక్‌టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
ఫ్రాన్స్‌లో ఆగని నిరసనలు
పారిస్: ఫ్రాన్స్‌లో పోలీసు కాల్పుల్లో యువకుడి మృతి ఘటన అనంతరం మొదలైన ఉద్రిక్తతలు మూడో రోజు రాత్రి కూడా కొనసాగాయి. నిరసనకారులు వీధుల్లో అడ్డంకులు ఏర్పాటు చేసి, కార్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెడుతున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. బాణసంచా కాల్చి పోలీసుల పైకి వదులుతున్నారు. పారిస్ శివారుల్లో ఆందోళనకారులు ఒక బస్‌డిపోకు, రోడ్లపై కార్లకు నిప్పుపెట్టారు. పారిస్‌లోని 12వ డిస్ట్రిక్ట్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. రివోలీ వీధిలోని కొన్ని దుకాణాలను, నగరంలోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరం డెస్ హాలెస్‌ను దోచుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అధికారులు 40వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆందోళనకారుల దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. అదుపులోకి తీసుకున్న 667 మంది ఆందోళనకారుల్లో 307 మంది పారిస్ రీజియన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కఠినంగా వ్యవహరిస్తామని అంతరంగిక శాఖ మంత్రి గెరాల్డ్ ప్రకటించారు. ఇలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 ఏళ్ల నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో మరో ఇద్దరిని కూడా పోలీసులు తనిఖీల సమయంలోనే కాల్చి చంపినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. బాహాబాహీకి దిగిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆందోళనకారులు భవంతులకు, వాహనాలకు నిప్పుపెట్టారని ప్రభుత్వం తెలిపింది. టీనేజర్లను బయటకు రానివ్వకండి: తల్లిదండ్రులకు మాక్రాన్ వినతి దేశమంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో టీనేజీ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లకు సోషల్ మీడియానే హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి అనంతరం అశాంతిని వ్యాపింపజేయడంలో సోషల్ మీడియానే ప్రముఖంగా ఉందన్నారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు. వీడియో గేమ్‌లు యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నాయని, దీంతో కొందరు అస్తమానం వీధుల్లోనే గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. -
'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్లోని లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు. ''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు. 2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..
ఫ్రాన్స్: చాలాకాలం క్రితం రోమ్ నగరం తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతోంది. తాజాగా అదే కథనాన్ని గుర్తు చేస్తూ ఒకపక్క ఫ్రాన్స్ దేశంలో అల్లర్లు చెలరేగుతుంటే మధ్యలో కూర్చుని ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ కనిపించాడు. పారిస్ లోని నాంటెర్రేలో ట్రాఫిక్ స్టాప్ వద్ద నల్ల జాతీయుడైన 17 ఏళ్ల యువకుడు నాహేల్ ను పోలీసులు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఘర్షణలు పెచ్చుమీరేలా చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య పరస్పర దాడులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నగరమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మూకలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. పారిస్ పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలతో ఒకపక్క అంతటి విధ్వంసం చెలరేగుతుంటే మరోపక్క ఒక యువకుడు మాత్రం ఇదేమీ పట్టనట్టుగా చాలా ప్రశాంతంగా కూర్చుని సాండ్ విచ్ తింటూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. 🚨🇫🇷INSOLITE - Un homme continue de manger son sandwich alors qu'il est au milieu de violents affrontements entre émeutiers et policiers à #Nanterre. (témoins) pic.twitter.com/VzLtpfRmty — AlertesInfos (@AlertesInfos) June 29, 2023 ఇది కూడా చదవండి: మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు -
భగ్గుమన్న ఫ్రాన్సు
పారిస్: పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి ఘటనతో ఫ్రాన్సు భగ్గుమంది. పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద మంగళవారం నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు నిప్పంటించారు. రాళ్లు రువ్వారు. వీటిని నిలువరించేందుకు పోలీసులు పలుమార్లు బాష్పగోళాలు ప్రయోగించారు. దాడుల్లో 100కు పైగా ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నట్లు అంచనా వేసింది. ఆందోళనకారుల దాడుల్లో 170 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఫ్రాన్సు ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు, రైలు సర్వీసులను నిలిపివేసింది. దీని ఫలితంగా రాజధాని, శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాడులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ప్రస్తుతమున్న పోలీసుల సంఖ్యను 9 వేల నుంచి 40 వేలకు పెంచింది. నిరసనకారులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. యువకుడిపై కాల్పుల ఘటనకు కారకులపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
చుక్కేసుకుంటారా?. చుక్కల్లోకి చూసి..
-
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు. -
భార్యకు తెలియకుండా డ్రగ్స్.. బయటి వారితో అత్యాచారం.. ఇలా పదేళ్లు!
మనువాడిన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడో భర్త. జీవితాంతం ఆమెను కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన భర్త.. అత్యంత నీచానికి దిగజారాడు. భార్యకు తెలియకుండా ప్రతిరోజు ఆమెకు డ్రగ్స్ ఇస్తూ ఇతరులతో అత్యాచారం చేయించాడు. ఈ షాకింగ్ ఘటన ఫ్రాన్స్ దేశంలో వెలుగు చూసింది. వివరాలు.. ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్ ప్రాంతంలో డొమినిక్ పీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 50 ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఈ క్రమంలో భర్త ప్రతి రోజు రాత్రి భార్యకు యాంటీ యాంగ్జయిటీ డ్రగ్స్ ఇచ్చేవాడు. ఆమెకు తెలియకుండా భోజనంలో కలిపి ఇచ్చేవాడు. భార్య నిద్రలోకి జారుకోవడంతో తనకు తెలిసిన కొంతమంది వ్యక్తులను ఇంటికి పిలిపించి భార్యపై అత్యాచారం చేయించేవాడు. అంతేగాక వారు లైంగిక చర్యలో పాల్గొన్న సమయంలో వీడియోలు రికార్డు చేసి.. వాటిని ఓ యూఎస్బీ డ్రైవ్‌లో భద్రపరిచేవాడు. ఇలా 2011 నుంచి 2020 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ వ్యవహారం నడిపాడు. మూడేళ్ల కిత్రం 2020లో డొమినిక్ పీ దుస్తులు మార్చుకునే గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి మహిళ వీడియోలు చిత్రీకరించినట్లు అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అత్యాచార వీడియోల బండారం బయటపడింది. అతడు రికార్డు చేసిన వీడియో డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యపై 92 సార్లు ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ఊహించని షాక్ ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అత్యాచారానికి పాల్పడిన 51 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిలో 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. వీరిలో అగ్నిమాపక సిబ్బంది, లారీ డ్రైవర్లు, స్థానిక కౌన్సిల్ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, జైలు గార్డులు, నర్సులు, పాత్రికేయులు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది మళ్లీ మళ్లీ డొమినిక్ ఇంటికి వెళ్లి అఘాయిత్యాలకు పాల్పడేవారని తేలింది. ఆన్లైన్లో ఓ గ్రూప్ ద్వారా డొమినిక్ వీరితో మాట్లాడికి ఇంటికి రప్పించేవాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే వాసనలకు తన భార్యకు మెలుకువ రాకుండా ఉండేందుకు ఇంటికి వచ్చేవారిని పొగాడు, పర్ఫ్యూమ్ వాడొద్దని ముందే చెప్పేవాడని తెలిపారు. అలాగే ఇంటికి దూరంగా ఉన్న స్కూల్ వద్ద వాహనం నిలిపి పొరుగువారికి అనుమానం రాకుండా రాత్రి సమయంలో వారిని ఇంటికి రప్పించేవాడని వెల్లడించారు. అకస్మాత్తుగా మనిషి టెంపరేచర్ మారకుండా ఉండటానికి ఇంటికి వచ్చిన వారిని వేడి నీటిలో చేతులు కడుక్కోవాలని చెప్పేవాడని పేర్కొన్నారు. చివరికి వీడియో రికార్డుల గురించి మహిళకు చెప్పడంతో ఆమెపై జరిగిన అఘాయిత్యాల విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా విలపించి ఆందోళనలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె శారీరక సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. -
సైకో వీరంగం.. గుమ్మం నుంచి బామ్మను లాగి..
ఫ్రాన్స్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్‌గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9 — Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు -
French Open 2023: గార్సియాకు షాక్
పారిస్: మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కరోలిన్ గార్సియాకు అనూహ్య ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈ ఫ్రాన్స్ స్టార్ రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ గార్సియా 6–4, 3–6, 5–7తో ప్రపంచ 56వ ర్యాంకర్ అనా బ్లింకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో గార్సియా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 50 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా నాలుగో ఏడాది ఈ టోర్నీలో ఆడుతున్న బ్లింకోవా ఐదుసార్లు గార్సియా సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండోసారి మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2017 చాంపియన్, 17వ ర్యాంకర్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా) కూడా రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఒస్టాపెంకో 3–6, 6–1, 2–6తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో ఇరీనా షిమనోవిచ్ (బెలారస్)పై, తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా) 6–3, 6–4తో వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–3, 6–1తో స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)పై గెలుపొంది మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) తొలి సెట్‌ను 6–2తో గెల్చుకున్నాక ఆమె ప్రత్యర్థి కామిల్లా జియార్జి (ఇటలీ) గాయం కారణంగా వైదొలిగింది. అల్కరాజ్ ముందుకు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అల్కరాజ్ 6–1, 3–6, 6–1, 6–2తో టారో డానియల్ (జపాన్)పై, సిట్సిపాస్ 6–3, 7–6 (7/4), 6–2తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై, ఖచనోవ్ 6–3, 6–4, 6–2తో రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలిచారు. 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 4 గంటల 38 నిమిషాల పోరులో 6–3, 5–7, 3–6, 7–6 (7/4), 3–6తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
అది అత్యంత వింత రోడ్డు..రోజుకు 2 గంటలే కనిపించి..
ఇప్పుడున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్ రోడ్లను నిర్మించే పనిలో తలమునకలై ఉన్నాయి. అయితే ఈరోజుకీ కొన్ని రోడ్లు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారు. కొండ ప్రాంతాలోని రోడ్లు భీతిగొలుపుతుంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఆ రోడ్డు మీదుగా ఎవరు ప్రయాణిస్తుంటారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో ఉంది. ఈ రోడ్డు ప్రధాన భూభాగాన్ని నోయిర్ మౌటియర్ ద్వీపంతో కలుపుతుంది. ఈ ప్రాంతం ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ వద్ద ఉంది. ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. ఈ రోడ్డును ‘పాసేజ్ డూ గోయిస్’ పేరుతో పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘గోయిస్’ అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం. ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనిపిస్తుంది. ఈ రోడ్డు తొలిసారిగా 1701లో మ్యాప్‌లో కనిపించింది. ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం. రోజులో రెండు గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది. రోడ్డుకు రెండు పక్కల నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువు పాలవుతుంటారు. మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు. తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. 1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారు. 1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై ‘టూర్ ది ఫ్రాన్స్’ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తూ వస్తోంది. -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను: శ్రుతీహాసన్
‘‘ఓ సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్ సమానమైన పారితోషికాన్ని అందుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 76వ కాన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రుతీహాసన్. ఈ సందర్భంగా ‘హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకోవడానికి నాకు రెండు దశాబ్దాలు పట్టింది’’ అన్న ప్రియాంకా చోప్రా మాటలపై మీ స్పందన ఏంటి? అన్న ప్రశ్న శ్రుతీకి ఎదురైంది. ఈ విషయంపై శ్రుతీహాసన్ స్పందిస్తూ– ‘‘ప్రియాంకా చోప్రా అద్భుతం సాధించారు (హాలీవుడ్లో హీరోకి సమానంగా పా రితోషికం అందుకున్న విషయాన్ని ఉద్దేశించి). మేమంతా ఇంకా కష్టపడుతున్నాం. మన దగ్గర సమాన వేతనం అనే అంశం గురించి కనీసం చర్చ కూడా లేదు. కానీ హీరోలతో పాటుగా హీరోయిన్లకి కూడా సమాన వేతనం లభించే రోజు రావాలని ఎదురు చూస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో నేను కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో పా ల్గొన్నాను. ఈసారి నేను నటించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ‘ది ఐ’ కోసం కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నాను. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్న కాన్స్ వేడుకల్లో దేశం తరఫున నేను ఓ ప్రతినిధిగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి.. నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఈ వేడుకల్లో సినీతారలు ప్రత్యేక దుస్తుల్లో తళుక్కున్న మెరిశారు. ఐశ్వర్యారాయ్‌తో పాటు మరో నటి ఊర్వశి రౌతేలా సైతం రెడ్ కార్పెట్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. అయితే ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి డ్రెస్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మీరు డిజైనర్‌ను మార్చండి అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ ఐశ్వర్యారాయ్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్‌పై కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్‌తో తయారు చేసిన నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఆ నెక్లెస్ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త అని కామెంట్స్ చేశారు. బ్లూ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్న ఊర్వశి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023.. తారల సొగసులు
ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత సినీ తారలు మెరుస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ వేడుకలు 27 వరకు జరుగుతాయి. ఇప్పటికే కాన్స్ రెడ్ కార్పెట్‌పై సారా అలీఖాన్, ఈషా గుప్తా, ఊర్వశీ రౌతేలా క్యాట్ వాక్‌తో ఆకట్టుకున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ తాజాగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, ఖుష్భూ, అమీ జాక్సన్, దర్శక–రచయిత, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్, దర్శక–నటుడు ప్రదీప్ రంగ నాథన్లు పాల్గొన్నారు. ఇక మృణాల్ ఠాకర్, ఐశ్వర్యా రాయ్ అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. మొత్తానికి కాన్స్‌లో దేశీ హంగామా బాగానే కనబడుతోంది. -
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్‌లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్‌కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్‌ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్‌లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్‌లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్‌వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
రెడ్ కార్పెట్‌పై మెరవనున్న సీతారామం బ్యూటీ
Mrunal Thakur: ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌కి కాన్స్ నుంచి కబురొచ్చింది. ప్రతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే కాన్స్ చిత్రోత్సవాలు ఈ నెల 16న ఆరంభమయ్యాయి. 27 వరకు కొనసాగుతాయి. ఈ చిత్రోత్సవాల్లో మృణాల్ రెడ్ కార్పెట్‌పై తొలిసారి మెరవనున్నారు. ఈ విషయంపై మృణాల్ మాట్లాడుతూ – ‘‘అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్‌మేకర్స్‌తో మాట్లాడటానికి ఈ వేదిక నాకు ఉపయోగపడుతుంది. భారతీయ చలన చిత్రపరిశ్రమ ఖ్యాతిని నేను అక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను’’ అన్నారు మృణాల్. ఈ నెల 17 నుంచి 19 తేదీల్లో మూడు రోజుల పాటు మృణాల్ కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తారట. -
ఎప్పటికీ ‘మేధావులు’ అవసరమే!
ఫ్రెంచ్ సమాజంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘మేధావులు’ ఆవిర్భవించారు. అయితే ఈ మేధావులు అనే మాటను వామపక్షీయులను ఉద్దేశించి వాడింది సంప్రదాయవాదులు (రైట్‌వింగ్), కాకపోతే నిందాపూర్వకంగా! వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే పరి స్థితి ఉండటం గమనార్హం. అయితే మేధావులు ఈ దాడులను మొదటినుంచీ తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. సమాజంలో జరిగే వ్యవహారాలకు మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకుని ఉండలేరు. కానీ మునుపటిలా శక్తిమంతంగా వారు పోరాడుతున్నారా అన్నది సందేహం. 1993లో ‘బీబీసీ రీత్ ప్రసంగం’ చేస్తూ పాలస్తీనియన్ –అమెరికన్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ సెడ్ ఇలా ప్రశ్నించారు: ‘‘సృజనాత్మకతకూ, దౌర్బల్యుల పట్ల నిబద్ధ తకూ మధ్య సమతౌల్యత సాధించడం ఎలా?’’ ఇంకా ఆయన ఇలా కొనసాగించారు: ‘‘అదిభౌతికమైన ఉద్వేగాలు, ఆసక్తి ఉండని న్యాయం, సత్యం వంటి సూత్రాలు కదిలించినప్పుడల్లా అసలైన మేధావులు ఎన్నడూ లేనంత తాముగా ఉన్నారు. వారు అక్రమాలను నిరసించారు, బలహీనుల పక్షాన నిలిచారు, అధికారాన్ని ప్రశ్నించారు.’’ ప్రజా మేధావి అన్న భావన మొట్టమొదట 1894 డిసెంబరులో ఫ్రాన్ ్సలో పుట్టుకొచ్చింది. ఆర్మీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్‌పై దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. జర్మన్లకు మిలటరీ రహస్యాలు అమ్మేశాడన్నది ఆయనపై ఆరోపణ. ఇదే అదనుగా యూదు వ్యతిరేక సంస్థలు చెల రేగాయి. ఉదాహరణకు ఎడువార్డ్ డ్రూమాంట్ సంపాదకత్వంలో నడిచిన ‘లా లిబ్రే’ ఫ్రెంచ్ యూదులు విశ్వాస ఘాతకులన్నట్టుగా కథనాలు ప్రచురించింది. కొంతమంది డ్రేఫస్‌కు మద్దతుగా నిలిచారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం బలహీనంగా ఉంది. ఫెర్డినాండ్ వాల్సిన్ ఈస్టర్‌హేజీ అనే మరో అధికారిపై ఇలానే దేశద్రోహ ఆరోప ణలు వస్తే మిలటరీ కోర్టు వాటిని కొట్టివేసింది. జరిగిన అన్యాయం గురించి అందరికీ స్పష్టంగా అర్థమైంది. జాతి వివక్ష కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ నేపథ్యంలో మేధావులు తమ సొంత ప్రపంచాల్లో కళ్లుమూసుకు ఉండలేని పరిస్థితి. విఖ్యాత నవలా రచయిత ఎమిలీ జోలా ‘జా అక్యూస్’ పేరుతో రాసిన బహి రంగ లేఖ ‘లా అరోర్’ పత్రికలో ప్రచురితమైంది. డ్రేఫస్‌ను అక్రమంగా దోషిగా నిర్ధారించి ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఎమిలీ ఆ లేఖలో సైన్యాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది మరో వివాదానికి దారితీసింది. జోలా మద్దతుదారులు సైన్యాన్ని కించ పరచడం ద్వారా దేశాన్ని బలహీన పరిచారని సంప్రదాయవాదులు (రైట్ వింగ్) విరుచుకుపడ్డారు. మండించే స్వభావం గల అలంకార ప్రాయమైన దేశభక్తి కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ఉదారవాద వామ పక్షీయులు మద్దతిచ్చారు. సంప్రదాయవాదులు వారిని ‘మేధావులు’ అని నిందాపూర్వకంగా పిలిచారు. వారి దృష్టిలో ఈ మేధావులు దేశ వ్యతిరేకులు. నేటి భారత్‌లో కూడా అదే జరుగుతోంది. అయితే మేధావులు ఎప్పుడూ ఈ దాడులను తమ లక్ష్య సాధనలో ప్రాసంగికత లేనివిగా కొట్టిపారేస్తారు. అన్యాయం, నిరంకుశాధికారం, మత ఘర్షణల మీద పోరాటమే తమ లక్ష్యమని చెబుతారు. తత్వవేత్త, రచయిత జా పాల్ సార్త్ర్ 1980లో మరణించినప్పుడు సుమారు యాభై వేల మంది ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. వివాదానికి దూరంగా ఉండే హక్కు మేధావికి లేదనే వారు సార్త్ర్. అన్నింటికీ అతీతంగా ఉంటామనే సౌలభ్యం కూడా వారికి నాస్తి అంటారాయన. సమాజాన్ని మార్చేందుకు ప్రజా మేధావి అనేవాడు తన సొంత విషయాలను పక్కనబెట్టాలనీ, వ్యక్తిగత జీవితం వంటివి అతడు లేదా ఆమెకు ఉండవనీ అంటారు. 1935లో ఫ్రెంచ్ మేధావులు అంతర్జాతీయ రచయితల సంఘం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్యారిస్ సంస్కృతి పరిరక్షణ దీని ఉద్దేశం. ఈ సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఏకమయ్యారు. జూన్ నెలలో జరిగిన ఈ సదస్సుకు సజ్జాద్ జహీర్, ముల్క్‌రాజ్ ఆనంద్ వంటివారూ హాజరయ్యారు. తరువాతి కాలంలో వీరిద్దరూ భారతీయ సాహిత్యం, ఉర్దూ కవిత్వంలో మార్పునకు కృషి చేశారు. ఆల్డస్ హక్స్లీ, ఈఎం ఫార్స్టర్, బోరిస్ ప్యాస్టర్‌నాక్, బెర్తోల్ట్ బ్రెష్ట్, ఇంకా ఇతర దిగ్గజ రచయితలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో తలెత్తిన వివాదాలు కాస్తా ప్యారిస్ వీధుల వరకూ విస్తరించాయి. సోవియట్ యూనియన్ చరిత్రకారుడు ఇల్యా ఎహ్రెన్ బర్గ్ ‘దోపిడిదారులను దునుమాడేందుకు ఆయుధంగా మారని ఏ కళ అయినా నిష్ప్రయోజనమైంది!’ అన్నారు ఇల్యా మీద ఆండ్రే బ్రెటన్ లాంటివారు బహిరంగంగానే విమర్శించారు. చివరకు ఆ సదస్సు ఫాసిస్టులకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యనైతే ఏర్పాటు చేయలేకపోయింది. సదస్సుకు హాజరైన వారందరూ ఫాసిజాన్ని ద్వేషించారు. కానీ సోవియట్ యూనియన్ తరహా పరి ష్కారం ఉండాలన్న ఆకాంక్షపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. అధివాస్తవికులు, కమ్యూనిస్టుల మధ్య సయోధ్య కోసం రెనె క్రేవెల్ (అధివాస్తవికుడు) విఫలయత్నం చేశారు. ఆ నిస్పృహలో రెనె తన ఇంటికొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ఏవగింపు’ అని రాసి ఉన్న నోట్ అతడి కోటు జేబుకు అతికించి ఉండింది! ప్రగతిశీల రచయితల బాధ్యత రచయితలు, కవుల సామాజిక బాధ్యతలపై అదే కాలంలో భారత్‌లో కూడా ఎన్నో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కవులు, రచయితలు సామాన్యులతో కలిసిపోవాలంటే వారు తమ వ్యక్తిగత ఆనందాలు, కోరికలు, ఉద్వేగాలు, నిస్పృహలకు అతీతంగా తమ రచనలు, కవితలను తీసుకెళ్లాలన్న నమ్మకంతో 1936లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం) ఏర్పడింది. మతం, జాతీయత రాజకీయాల నుంచి పేద రికం, వివక్ష, వర్గం వైపు కవులను మళ్లించిన ఘనత దీనిదే. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటలీ కాలమిస్ట్ ఆంటోనియో గ్రాంసీ రచనలను అప్పటికి చదివి ఉండేందుకు అవకాశం లేదు. ఆయన ‘ప్రిజన్ నోట్‌బుక్’ 1970లలో ఆంగ్లంలో ప్రచురితమైంది. కానీ ముస్సోలిని అపఖ్యాతి జైలు వ్యవస్థలో మగ్గిన గ్రాంసీ రాసినదానిలో ఈ ప్రగతిశీల రచయితలు నమ్మకం ఉన్నవారే. అదేమిటంటే... మేధావి అనేవాడు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు అవసర మైన వాతావరణాన్ని సృష్టించాలి. ఉదారవాదులు రాజకీయ జీవితంలోకి ప్రవేశించాలి! ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ సభ్యుడైన కె.ఏ. అబ్బాస్ తన ఆత్మకథలో ‘నేనేమీ ఓ ద్వీపాన్ని కాదు’ అన్న వాక్యం ఉంటుంది. 1946 నాటి బాంబే గురించి ఈ వ్యాఖ్య. అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య బాంబే రెండుగా విడిపోయి ఉండేది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ , ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఓ శాంతి ప్రదర్శన ఏర్పాటు చేశాయి. పృథ్వీరాజ్ కపూర్‌కు చెందిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు సుమారు 52 సాంస్కృతిక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నాయి. కపూర్లు(పృథ్వీరాజ్, రాజ్, షమ్మీ), దేవానంద్, బల్రాజ్ సహానీ, అభ్యుదయ ఉర్దూ కవులు, రచయితలు సజ్జాద్ జహీర్, మజ్రూహ్ సుల్తాన్ పూరి, అలీ సర్దార్ జాఫ్రీ, కైఫీ అజ్మీ, సాహిర్ లూధి యాన్వీతో పాటు మరాఠీ, గుజరాతీ రచయితలు కూడా బోరిబందర్ నుంచి బాంద్రా వరకూ సాగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. శాంతి, సామరస్యాలు, సౌభ్రాతృత్వాలను సూచించే పాటలు పాడుతూ సాగిందా ఊరేగింపు. తద్వారా మత ఘర్షణల గాయాలకు మందు పూసే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతానికి వస్తే... మన నటులను అధికార పక్షంపై ప్రశంసలు కురిపించేలా బలవంతం చేస్తున్నారు. జైలుకెళ్లాల్సి వస్తుందని రచ యితలు భయపడుతున్నారు. విప్లవాత్మక ఆలోచనలున్న నాటక రంగం కనుమరుగైంది. కవులు రాస్తున్నారు కానీ వారి వారి ఏకాంతాల్లో! విద్యావేత్తలు తమ ఉపకులపతుల ఆగ్రహానికి గురి కాకుడ దన్న రంధిలో ఉన్నారు. ఏతావాతా... సమాజపు చేతన కాస్తా నిశ్శబ్దంలో అంగలారుస్తోంది. ఇది ఉపమాలంకారమే కావొచ్చుగానీ, మేధావుల చుట్టూ సంకెళ్ల శృంఖలాలు చుట్టుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలపాటు ఫాసిస్టు వ్యతిరేక కూటమి కట్టిన శక్తులు మమ్మల్ని మళ్లీ ఆవహిస్తే బాగుండు. సామాజిక మేధావులు లేని సమాజం నశించిపోతుందనీ, అది కూడా చాలా నెమ్మదిగా కానీ కచ్చితంగా జరుగు తుందనీ ఆ శక్తులు గుర్తుచేస్తున్నాయి. నీరా చంఢోక్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ బిలియనీర్ వారసుడి కోసం కసరత్తు: అదృష్టం ఎవరికి దక్కేనో?
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ప్రముఖ వ్యాపారవేత్త పంచంలోని అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) తన వారసుడి కోసం వేట మొదలుపెట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్స్ నివేదిక ప్రకారం, లూయిస్ విట్టన్ సీఈవో తర్వాత వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో అనేది ఆర్నాల్ట్ నిర్ణయించాలని తన ఐదుగురు పిల్లలను నెలకోసారి కలుసుకుని మరీ చర్చిస్తున్నారు. విలాసవంతమైన సామ్రాజ్యానికి వారసులుగా ఆర్నాల్ట్ తన పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు. ప్రపంచ లగ్జరీ ప్రాడక్ట్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ చైర్మన్ ,సీఈవో ఆర్నాల్ట్ ప్రస్తుతం వారసుడికోసం వెతుకున్నారు. ఈ కసరత్తులో భాగంగానే తన ఐదుగురి పిల్లలతో విట్టన్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో లంచ్ సమయంలో కలిసారట. ఈసందర్భంగా కంపెనీకి సంబంధించిన అంశాలు, వ్యూహాలను చర్చించినట్టు వాల్ స్ట్రీట్ నివేదించింది. దాదాపు 90 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఆర్నాల్ట్ వారసుడి కోసం పిల్లలతో విస్తృత చర్చలు జరుపుతున్నప్పటికీ ఎవర్ని ఆ అదృష్టం వరించనుందనే దాన ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. కుమార్తె డెల్ఫిన్ ఇప్పటికే పలు కీలక బాధ్యతల్లో సంతానం ఆర్నాల్ట్ పిల్లలు కంపెనీలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా కుమార్తె డెల్ఫిన్ రెండవ అతిపెద్ద బ్రాండ్ క్రిస్టియన్ డియోర్‌కు హెడ్‌గా ఉండగా, కుమారుడు ఆంటోయిన్ లూయిస్ విట్టన్ హోల్డింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్ TAG హ్యూయర్ సీఈవోగా ఉన్నాడు. అలెగ్జాండ్రే ఆర్నాల్ట్ టిఫనీలో ఎగ్జిక్యూటివ్, ఆర్నాల్ట్ తోబుట్టువులలో చిన్నవాడు, జీన్, లూయిస్ విట్టన్ వాచ్ డిపార్ట్మెంట్ కోసం మార్కెటింగ్ , ప్రొడక్ట్ డెవలప్మెంట్ బాధ్యతల్లో ఉన్నాడు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్థానం మార్చి 5, 1949న ఫ్రాన్స్‌లోని రౌబైక్స్లో వ్యాపార కుటుంబంలో జన్మించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. ఎకోల్ పాలిటెక్నిక్‌లో చదివిన తరువాత అతను ఫెర్రేట్ సవినెల్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా కరియర్‌ను మొదలుప ఎట్టి, 1978లో సంస్థ ఛైర్మన్ పదవికి ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై అతని ఆసక్తితొ ఒక లగ్జరీ బ్రాండ్‌ను లాభదాయక కంపెనీగా అభివృద్ధి చేశాడు. 1989 నుండి లూయిస్ విట్టన్ మె కంపెనీకి చైర్మన్, సీఈవోగా ఉన్నారు. రెండు వివాహాల ద్వారా బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని అధిగమించి ఆర్నాల్ట్ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఏప్రిల్ 19 నాటికి అతని సంపద 208 బిలియన్ డాలర్లు. -
ప్లేబాయ్ కవర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. పొలిటికల్ ప్రకంపనలు!
ఫ్రాన్స్ మహిళా మంత్రి కవర్ పేజీ ఫొటో తాజాగా వివాదాస్పదంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారడంతో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. కాగా, మహిళా నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది. వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ మహిళా మంత్రి మర్లీన్ షియప్పా(40) ఫొటోను ప్లేబాయ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ప్రచురించారు. ఈ సందర్భంగా మర్లీన్.. ప్లేబాయ్ పత్రికకు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, LGBTQ హక్కులపై ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు తమ శరీరాలతో ఏమైనా చేయవచ్చు అని అన్నారు. మహిళల హక్కులను డిఫెండ్ చేయడంలేదని ఆమె చెప్పారు. అనంతరం, ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని ఆమె తన ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ఇక, మర్లీన్ వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు పుట్టించాయి. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీలు కూడా తప్పుబట్టారు. అటు ప్రతిపకాలు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాక్రన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్రణాళికలపై ఒకవైపు భారీ ప్రదర్శనలు జరుగుతుండగా.. తాజాగా మహిళా మర్లీన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోని నెట్టాయి. ఆమె వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి మర్లీన్ వైఖరిని తప్పుబట్టారు. ఆమె ప్రవర్తన కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls — Jeanne Baron (@jeannebarontv) April 2, 2023 -
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా ఎంబాపె
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్‌బాల్ జట్టు నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్చాంప్స్తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది. దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, 66 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్‌కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను యూరో 2024 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు. -
ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్ బిల్లుకు ఆమోదం
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.