ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ మ్యూజియం ప్రత్యేకంగా ఆయన పట్ల గౌరవాన్ని చూపించింది. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన షారుఖ్‌ను ఇప్పటికే పలు అవార్డ్స్‌తో పాటు మంచి గుర్తింపు కూడా దక్కింది. తాజాగా ఆయన పేరుతో బంగారు నాణేలు ముద్రించి షారుఖ్ పట్ల తమ అభిమానాన్ని ఆ మ్యూజియం చాటుకుంది.
గతేడాదిలో వరుస సూపర్ హిట్లు అందుకున్న షారూఖ్ ఖాన్‌ను ఫ్రాన్స్‌లోని గ్రేవిన్ మ్యూజియం సత్కరించనుంది. ఆయన పేరుతో బంగారు నాణేలను ముద్రించి ఆయన పట్లు తమ అభిమానాన్ని చాటుకుంది. భారతీయ సినిమా రంగంలో 100కుపైగా సినిమాల్లో నటించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆగష్టు 10 అవార్డుతో పాటు షారుక్ ఖాన్ బంగారు నాణేలను గ్రేవిన్ మ్యూజియం విడుదల చేయనుంది. దీంతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయడిగా షారూఖ్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశారు.
లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌లో షారుక్
లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను 'కెరీర్ అఛీవ్‌మెంట్ అవార్డు'కు తాజాగా ఎంపిక చేసింది. ఆగస్టు 7 నుంచి 17 వరకు లొకర్నో (స్విట్జర్లాండ్)లో ఈ కార్యక్రమం జరగనుంది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్ 77వ ఎడిషన్ కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 10న ఈ అవార్డును షారుక్ అందుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్‌లో హిట్ సినిమాల లిస్ట్‌లో ఒకటైన 'దేవ్‌దాస్'ను అక్కడ ప్రదర్శించనున్నారు. ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా షారుక్ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment