
కర్ణాటక,సాక్షి: కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టించిన మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతీకి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజాగా, కర్ణాటక సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ (Snehamayi Krishna) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ముడా స్కాం కేసును రాష్ట్ర లోకాయిక్త పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా సీఎం సిద్ధరామయ్య దంపతులకు నోటీసులు పంపింది. ఆర్టీఐ యాక్టివిస్టు దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.