
శ్రీనగర్:తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధానికి సమర్పిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)నేత ఒమర్‌అబ్దుల్లా అన్నారు.నియోజకవర్గాల పునర్విభజన,రాష్ట్ర హోదా వరుసగా ఉంటాయన్నారు.కొందరు నేతలు జమ్ముకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఒమర్ మండిపడ్డారు.
కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చొద్దన్నారు.దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు.కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని,హోంమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.2019 వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంగానే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పి అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి అని పేర్కొన్నారు.