
పాకిస్థాన్ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు కేంద్రంగా మారిందని అధికారులు గుర్తించారు.
2022లో ఆపరేషన్ సర్హద్‌లో 36 మంది అనుమానిత గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐఎస్‌ఐ.. భారత సైనిక కార్యకలాపాల సమాచారం సేకరించేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని గుర్తించారు. భారత దేశ జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు గూఢచర్యం పాకిస్తాన్‌కు ఒక సాధనంగా మారింది. భారత్-పాకిస్థాన్‌ల భౌగోళిక-రాజకీయ పోరాటంలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.