
న్యూఢిల్లీ: భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయనను ఆరు గంటలపాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
మొత్తం మూడు రోజుల్లో 16 గంటలపాటు వాద్రాను ప్రశ్నించడం గమనార్హం. మూడో రోజు తన భార్య ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై రాజకీయ క్షుద్ర వేట జరుగుతోందని ఆరోపించారు. రాబర్ట్ వాద్రాపై ఈడీ త్వరలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.