
ఇంఫాల్:మణిపూర్‌లో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త సంవత్సరం తొలి రోజే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో కాల్పులు, బాంబుల మోత మోగింది. కదంగ్‌బండ్ ప్రాంతంలో బుధవారం(జనవరి1) తెల్లవారకముందే ఉదయం మిలిటెంట్ల దాడి జరిగింది. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడమే కాకుండా బాంబులు విసిరారు మిలిటెంట్లు.
మిలిటెంట్ల దాడితో వెస్ట్ ఇంఫాల్‌లోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల దాడిలోప్రాణ నష్టం జరగలేదన్నారు.
మణిపూర్‌లో జాతుల మధ్య భారీ హింస చెలరేగిన 2023 మే నెలలో కదంగ్‌బండ్‌లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. మణిపూర్ ప్రశాంతంగా ఉండాలని నూతన సంవత్సర వేళ సీఎం బీరేన్‌సింగ్ ఆకాంక్షించిన వెంటనే మిలిటెంట్ల దాడి జరగడం గమనార్హం.
ఇదీ చదవండి: లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెల్ల హత్య