
న్యూఢిల్లీ: లోక్‌సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు డిప్యూటీ స్పీకర్లు లేకపోవడంపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
ప్రతిపక్ష నేతకు దక్కరాదనే ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘1956లో ప్రధాని నెహ్రూ ప్రతిపక్ష నేత, తన విధానాలను తీవ్రంగా విమర్శించే అకాలీదళ్ ఎంపీని సర్దార్ హుకుం సింగ్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించారు’అని అప్పటి ఘటనను జైరాం రమేశ్ ఉదహరించారు.