
నిర్మల్
ముందస్తు ప్రణాళిక మేలు
ముందస్తు ప్రణాళికతో పంటల సాగుకు వెళ్తే ప్రయోజనముంటుంది. వేసవి దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటే పనులు సకాలంలో పూర్తవుతాయి.
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
8లోu
నిర్మల్: సోన్ మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ గత శుక్రవారం దుబాయిలో ఓ మతోన్మాద పాకిస్థానీ చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురించి వెంటనే చెబితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య, తల్లి ఏమవుతారోనని, కొంతకాలంగా తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఆ పిల్లలు ఎలా స్పందిస్తారోనని కుటుంబసభ్యులు, బంధువులు ప్రేమ్‌సాగర్ మరణవార్తను వారికి తెలియనివ్వడం లేదు. ఈ హృదయవిధారక పరిస్థితి మిగతా కుటుంబసభ్యులు, గ్రామస్తులు, తెలిసినవాళ్లందరినీ కలచివేస్తోంది. ప్రేమ్‌సాగర్‌లాగే జిల్లాకు చెందిన పలువురు ఉపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయా రు. కొంతమంది ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా జాడ లేదు. వాళ్ల కుటుంబాలన్నీ ఇప్పటికీ తమవాళ్లను తలచుకుంటూనే ఉన్నాయి.
ఒక్కగానొక్క కొడుకు..
‘ఉన్న ఒక్కగానొక్క కొడుకని గార్వంగ పెంచుకున్నం. మేమిద్దరం రెక్కల కష్టం చేసి కొడుకును సదివించినం. సదువుడు కాంగనే గోదావరిఖని పోయి మెకానిక్ పని నేర్సుకున్నడు. ఊళ్లే అందరూ దేశం పోతున్నరు.. నేను కూడా కొన్నేండ్లు పోయస్తనని చెప్పిండు. కొడుకు అడిగిండు గదా అని, పోరా.. అనుడే మా తప్పైపోయింది. రెండు లక్షలు అప్పు చేసి పంపినం. అట్ల పన్నెండేండ్ల కిందట పోయిన కొడుకు ఇప్పటికీ ఇంటికి రాలె. ఇదే బాధకు మా ఆయన కూడా కాలం చేసిండు. దేశంకాని దేశంల కొడుకు యాడున్నడో.. ఎట్లున్నడో.. ఏమైపోయిండో..’ అని నీళ్లు తిరుగుతున్న కళ్లతో ఇప్పటికీ ఎదురుచూస్తోంది సోన్ మండలం కూచన్‌పెల్లికి చెందిన సాయమ్మ. గ్రామానికి చెందిన ఈర్ల సాయమ్మ, రాజారెడ్డి దంపతులు కొడుకై న కృష్ణ (కృష్ణారెడ్డి) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఏజెంట్ ఇచ్చిన కంపెనీ వీసాపై 2013లో దుబాయి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మూడురోజులు సదరు కంపెనీలో పనిచేశాడన్న సమాచారం ఉంది. ఆ తర్వాత నుంచి ఆయన జాడ లేకుండా పోయా డు. అక్కడ అసలేం.. జరిగిందనే విషయాలేవీ ఇప్పటికీ తేలలేదు. అక్కడున్న గ్రామస్తులు గాలించినా.. ఎంబసీకి చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఇదే బాధలో రాజారెడ్డి చనిపోయాడు. ఉన్న ఇల్లు అమ్మే సి, అప్పులు కట్టి సాయవ్వ అద్దె ఇంట్లో ఉంటోంది. భర్త చనిపోవడం, కొడుకు జాడ లేకుండా పోవడంతో బీడీలు చుట్టుకుంటూ కాలం వెళ్లదీస్తోంది.
పట్టించుకునేదెవరు?
జిల్లా నుంచి ఇప్పటికీ గల్ఫ్‌దేశాలకు వందలసంఖ్య లో వెళ్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొక్కరు చొ ప్పున వెళ్లి వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. కానీ.. అక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే మాత్రం ఎంబసీ, గల్ఫ్‌సంఘాలు మినహా.. ప్రభుత్వం నుంచి పక్కాగా పట్టింపు ఉండటం లేదన్న ఆరోపణలు న్నాయి. అక్కడ చనిపోతే చాలా సందర్భాల్లో నెలల తరబడి మృతదేహాలూ ఇంటికి రాని దుస్థితి ఉంది. అసలు.. ఏదైనా ఘటన జరిగితే, వెంటనే ఎవరిని కలవాలనే దానిపై కూడా స్పష్టత లేదు. తెలిసిన వాళ్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు, ఎంబసీలకు ఫోన్లు చేయించచి తెలుసు కోవాల్సిన దుస్థితి ఉంది.
ఈనెల 7న దుబాయ్‌లో చనిపోయిన యాకర్‌పల్లికి చెందిన రాజు మృతదేహం
జిల్లాలో ఎందరో..
దూరదేశం పోయొస్తే.. సంపాదించిన పైసలు మిగుల్చుకోవచ్చని, వాటితో తమ కుటుంబాన్నైనా బాగా చూసుకోవచ్చని కొన్ని వందలమంది ఇళ్లు, ఊళ్లు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులకు దూరంగా గల్ఫ్‌బాట పడుతున్నారు. ఎడారిదేశాల్లో కఠినమైన పనుల్లో ఏళ్లకేళ్లు ఉంటూ తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలవుతూ కొందరు ఏకంగా తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. మరికొందరు జాడలేకుండా పోతున్నారు.
సారంగపూర్ మండలకేంద్రానికి చెందిన కొత్తూరు గంగన్న (అడెల్లు) 1986లో సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఆర్నెళ్లకే ఆయనకు ఓ కేసులో జైలుశిక్ష పడింది. అప్పటినుంచి ఆయన ఇంటికి రాలేదు.
ఇదే మండలం జామ్ గ్రామానికి చెందిన ఎండీ ఇస్మాయిల్ దుబాయి వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. అక్కడే చనిపోయిన ఆయన మృతదేహాన్ని కూడా ఇంటికి పంపలేదు. తమ ఇంటిపెద్ద ఆఖరిచూపుతో పాటు ఎలాంటి పరిహా రమూ బాధిత కుటుంబానికి దక్కలేదు.
యాకర్‌పల్లి గ్రామానికి చెందిన నిర్మల రాజు (41) దుబాయిలో ఈనెల 7న అనారోగ్యంతో చనిపోయాడు.
సోన్ మండలం కూచన్‌పెల్లికి చెందిన పిండి మల్లేశ్, మెట్టు సాగర్, ఎలిగేటి రాజన్న ఉపాధి కోసం గల్ఫ్‌దేశాల్లో అనారోగ్యంతోనే మృత్యువాత పడ్డారు.
ఒక్క 2024 సంవత్సరంలోనే.. కడెం మండలం పెద్దబెల్లాలకు చెందిన బత్తుల నర్సయ్య (సౌదీ అరేబియా), ఇదే మండలం లింగాపూర్‌కు చెందిన ఎండీ నబీరసూల్ (సౌదీఅరేబియా), మామడ మండలం కొర్టికల్‌కు చెందిన గవ్వల రవి (ఖతర్), ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్‌కు చెందిన పుల్కం రాజేశ్వర్ (యూఏఈ), లక్ష్మణచాంద మండలం బోరిగాంకు చెందిన మక్కల వెంకటి (బహ్రెయిన్), ముధోల్ మండలం మచ్కల్‌కు చెందిన మల్లెపూల సాయన్న (దుబాయి), సారంగపూర్ మండలం చించోలి (బి)కి చెందిన అప్పాల నవీన్ (అబుదాబి)లో మృతిచెందారు.
న్యూస్‌రీల్
‘గల్ఫ్’లో జిల్లావాసుల మరణాలు
ఉపాధి కోసం వెళ్తే ఊపిరాగుతోంది!
మృతదేహాలూ ఇంటికి రాని వైనం
జాడ లేకుండా పోయినోళ్లెందరో..
ఏళ్లు గడిచినా పట్టించుకునేవారేరి?
‘అమ్మా.. అమ్మా.. నాన్నెప్పుడొస్తడు..!? నేను.. నాన్నన్ని ఎప్పుడు చూస్తా..!? అక్కానేను అడిగిన బొమ్మలు తీసుకొస్తడా..!?’ అంటూ వచ్చిరాని మాటలతో తండ్రి గురించి ఆ చిన్నారి అడుగుతుంటే.. ‘వస్తడమ్మా.. త్వరలోనే వస్తడు.. మీ ఇద్దరికీ బొమ్మలు తెస్తడు.. సరేనా..!’ అంటూ ఆ తల్లి సర్దిచెబుతోంది. అమ్మ చెప్పిన మాటలతో ఆ చిన్నారులిద్దరూ ఆనందంగా ఆటలో మునిగిపోయారు. కానీ.. తమ నాన్న తిరిగిరాడన్న సంగతి ఆ పసిమనసులకు తెలియదు. ఒకవేళ వచ్చినా బొమ్మలా అట్టపెట్టెలో విగతజీవిగా వస్తాడని.. తమను ఇంకెప్పుడూ ఇక చూడలేడనీ వాళ్లు ఊహించనూ లేరు. అసలు.. ఆ పిల్లలకు కాదు.. వారికి సర్దిచెబుతున్న ఆ తల్లికీ తెలియని విషయమేమంటే.. తమ కోసం ఎడారి దేశానికి వెళ్లిన తన భర్త ఐదురోజుల క్రితమే హతుడయ్యాడని. అందుకే.. నిత్యం తమతో మాట్లాడే ఆయన గొంతు మూగబోయిందని.
ప్రేమ్‌సాగర్ కుటుంబానికి పరామర్శ
సోన్: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల దుబాయిలో పాకిస్తాన్ వ్యక్తి చేతిలో హత్యకు గురైన మండల కేంద్రానికి చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ కుటుంబాన్ని బుధవారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వినోద్‌కుమార్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుబాయి రాయబార కార్యాలయానికి ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్‌రావు, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి, మాజీ సర్పంచ్ వినోద్‌కుమార్ తదితరులున్నారు.
ప్రయత్నం చేస్తున్నాం
తాజాగా దుబాయిలో చోటుచేసుకున్న ఘటనతో పాటు గల్ఫ్‌దేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. వారికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి నివేదించనున్నాం.
– స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్‌వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ అడ్వైజరీ మెంబర్

నిర్మల్

నిర్మల్