AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ | AP MLC Elections Voting Updates And Top News Headlines, Check Voters And Other Details Inside | Sakshi
Sakshi News home page

AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

Published Thu, Feb 27 2025 7:39 AM | Last Updated on Thu, Feb 27 2025 4:09 PM

AP MLC Elections Voting Updates

ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌.. 

  • ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

  • ఏపీలో మూడు స్థానిలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

  • రెండు పట్టభద్రుల స్థానాలకు, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్‌

  • వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్‌

 

  • మరో గంటలో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్..
  • ఇప్పటికే 80శాతం పైగా పోలింగ్ నమోదు..
     

విశాఖ: 

  • కొనసాగుతున్న ఉత్తరాంద్ర టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్
  • మధ్యాహ్నం 2 గంటల వరకు 79.54 శాతం నమోదు

డబ్బులు పంచుతున్న కూటమి నేతలు

  • కాకినాడ..
  • పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకి నోటు
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టపగలే డబ్బులు పంచుతున్న కూటమి నేతలు
  • పిఠాపురంలో బరితెగించిన కూటమి నేతలు
  • కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌కి ఓటు వేస్తే మూడు వేలు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న నేతలు
  • మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఓటుకు రూ.3 వేలు పంచుతున్న వైనం
  • ఓటుకి మూడు వేలు పంచుతున్నా చర్యలు తీసుకోని అధికారులు

విశాఖ:

  • టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్..
  • ఆరు జిల్లాల్లో 12 గంటల వరకు  57.71% పోలింగ్ నమోదు..

కృష్ణాజిల్లా..

  • ఎమ్మెల్సీ ఎన్నికల  పోల్ పెర్సెంటేజ్.....
  • మధ్యాహ్నం 12.00గంటల వరకు..
  • మొత్తం ఓటర్లు: 63,114
  • పోలైన ఓట్లు  :19,306
  • పురుషులు: 11,330
  • స్త్రీలు  :7,976
  • ఓటింగ్‌ శాతం:  30.59%.
     

విశాఖ..

  • ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్ హాజరవుతున్న ఉపాధ్యాయులు..
  • విశాఖ జిల్లాలో మొదటి నాలుగు గంటల్లో 44.4 శాతం పోలింగ్ నమోదు..

టీడీపీ నేతల బరితెగింపు..

  • కృష్ణాజిల్లా..
  • ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల ప్రలోభాలు
  • పోలింగ్ కేంద్రాల వద్దే బరితెగిస్తున్న టీడీపీ నేతలు
  • ఓటుకు రెండు వేలు ఇస్తున్న టీడీపీ నేతలు
  • పెడనలో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బు పంపకాలు
  • ఓటు వేసేందుకు వెళ్తున్న గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తున్న అధికార పార్టీ నేతలు

పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హల్‌చల్‌..

  • కృష్ణాజిల్లా..
  • గుడివాడలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు హల్‌చల్.
  • నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రమైన ఎస్పీఎస్ స్కూల్ ప్రధాన గేటు ముందు తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు.
  • ఓటు వేసేందుకు వెళుతున్న పట్టభద్రులకు.. కూటమి అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రాము, నేతలు.
  • టీడీపీ నేతల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు.
  • గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన సీపీఎం నాయకుడు ఆర్‌సీపీ రెడ్డి.
  • నిబంధన ప్రకారంగా నిర్దేశించిన దూరంలో ఉండాలంటూ టీడీపీ నేతలకు సూచించిన ఆర్డీఓ బాల సుబ్రమణ్యం.
  • ఆర్డీవో వెళ్లిన తర్వాత తిరిగి గేటు వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు.

విశాఖ.. 10 గంటల వరకు 21.66 శాతం పోలింగ్ నమోదు..

  • విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ..
  • పోలింగ్ స్టేషన్లకు ఓటు వేసేందుకు క్యూ కడుతున్న టీచర్స్...
  • కొనసాగుతున్న 144 సెక్షన్
  • పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.
  • పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్..
  • ఉత్తరాంధ్ర జిల్లాలలో 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...
  • మొత్తం ఓటర్లు 22,493 మంది...
  • బరిలో 10 మంది అభ్యర్థులు...
  • ఇప్పటివరకు 6% పోలింగ్ నమోదయింది...
  • ఇప్పటి వరకు సమస్యత్మీక ప్రాంతాలు ఏవి గుర్తించలేదు
  • సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది...
  • 90 శాతం వరకు ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నాం..
  •  

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

👉పోలింగ్‌ కోసం 6,287 మంది పోలింగ్‌ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్‌ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్‌వెబ్‌ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ స్థానానికి 35 మంది పోటీ 
👉ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు.

👉ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు.

👉ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement