BRS MLA Candidates List 2023: KCR Clarity Alliance With AIMIM In Hyderabad - Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, మజ్లిసే గెలుపు’

Published Mon, Aug 21 2023 4:27 PM | Last Updated on Thu, Aug 24 2023 4:15 PM

BRS MLA Candidate List: KCR Clarity Alliance With AIMIM In HYD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ గెలుస్తాయి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని తెలిపారు. 

2014 నుంచి ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు.  ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మరింత ఉజ్వలమైన తెలంగాణ సాధన కోసంప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
చదవండి: Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement