
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలి?. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌దేనని విశేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: జనాలు లేరు..‘జెండాలూ’ లేవు.. నీరసంగా లోకేశ్ యువగళం