బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్‌ | Harish Rao Comments On Revanth Reddy And Chandrababu | Sakshi
Sakshi News home page

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్‌

Published Wed, Mar 5 2025 7:18 PM | Last Updated on Wed, Mar 5 2025 8:03 PM

Harish Rao Comments On Revanth Reddy And Chandrababu

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ

సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.  ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్‌ గుర్తు చేశారు.

‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్‌ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు.

..చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్‌రావు నిలదీశారు.
 

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement