
సాక్షి,వికారాబాద్‌జిల్లా:మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు.
నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు.