
పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.
బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.
గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు.
