
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం(నవంబర్ 11) ఆదేశాలు జారీ చేసింది.
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్,పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించారు. కాగా, ఇటీవల వైఎస్సార్‌సీపీలో పలు కీలక పదవులను పార్టీ ముఖ్య నేతలతో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ప్రశ్నిస్తామనే ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్