గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం.