Kutami Prabhutvam
-
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్ అన్నారు. -
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భగా తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. వచ్చే వారం తానే స్వయంగా వస్తానని ఆయన చెప్పారు.అంతకు ముందు.. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకే బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు (TDP) పొట్టనపెట్టుకున్నారని వైఎస్ జగన్ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. -
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు. -
ఏపీలో కక్ష రాజకీయాలకు బలవుతున్న బడుగు, బలహీన వర్గాలు
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న అరాచకాలను, అఘాయిత్యాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. మళ్లీ పగడ విప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి.. తాజాగా రాప్తాడులో బలైన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఉదంతంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏపీలో చట్టబద్ధపాలన లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలమీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికారపార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయి. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. .. రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉంది. రామగిరిలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల(TDP Atrocities) దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారు. అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం. లింగమయ్య కుటుంబానికి అండగా.. .. కురబ లింగమయ్య(Kuruba Lingamaiah) హత్యను ఖండిస్తున్నా. అధికారపార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్సార్సీపీకి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. కురుబ లింగమయ్య కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: హత్య చేయించి పరామర్శకు వస్తారా?.. టీడీపీ ఎంపీకి చేదు అనుభవం -
Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!
తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు
-
ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్ సిక్స్‌ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. -
అయినను రాజకీయ భక్తులు నోరు విప్పరేం?
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పనిసరైతేనే అబద్దాలు చెబితే చెప్పవచ్చు. కానీ దైవసన్నిధికి వెళ్లినప్పుడు మాత్రం అలా అసత్యాలు చెప్పడానికి వెనుకాడతాం. రాజకీయ నేతలకు ఈ విషయంలో కూడా మినహాయింపే ఉన్నట్లు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు.. అంతా పవిత్రంగా భావించే తిరుమలను సైతం తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో విపక్షంలో ఉన్నప్పుడు కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాని ఆరితేరినట్లు కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు పురస్కరించుకుని తిరుమలకు వెళ్లినప్పుడు ఆయన చెప్పిన విషయాలలో అబద్దాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత భూమన వాదన విన్న తర్వాత తిరుమల యాత్ర సందర్భంగా కూడా అబద్దాలు చెబుతున్నారన్న విమర్శలకు సీఎం ఎందుకు ఆస్కారం ఇస్తున్నారనే భావన కలుగుతోంది. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే నీచత్వం చంద్రబాబు, పవన్లదని భూమన అన్నప్పుడు దానిని ఖండించవలసిన టీడీపీకాని, ప్రభుత్వంలోని వారు కాని అసలు పట్టించుకోలేదంటే దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి లేదనే అర్ధం అవుతుంది కదా!. 👉వైఎస్ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశాన్ని.. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా గోరంతలు కొండంతలు చేసి తిరుమల అపవిత్రం అయిపోతోందంటూ చంద్రబాబు, పవన్, లోకేష్ ఆరోపణలు గుప్పించేవారు. వాటిలో అత్యధికం అసత్యాలే అనే సంగతి అప్పట్లోనే రుజువు అయ్యింది కూడా. కానీ జగన్ ప్రభుత్వానికి జరగవలసిన డామేజీ అప్పటికే జరిగిపోయింది. ఉదాహరణకు తిరుమలకు వెళ్లే బస్‌ల టిక్కెట్లపై అన్యమత ప్రచారం ఉందని, కొండపై శిలువ రూపంలో లైట్లు ఉన్నాయని.. ఇలా ఒకటేమిటి దారుణమైన అబద్దాలు ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా పోటీపడి ఈ అసత్యాలను జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేసేవి. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిన ఈ పద్దతి మానుకున్నారా? అంటే లేదు. అదే ధోరణి అనుసరిస్తున్నారు. 👉చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అత్యంత ఘోరమైన అపచారం.. తిరుమల లడ్డూ విషయంలో చేశారు. కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు ఆరోపణ చేశారు. దానికి అదనంగా అయోధ్యకు పంపిన లడ్డూలలో కల్తీలడ్డూలు వెళ్లాయని దారుణమైన అబద్దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. తీరా చూస్తే ఇవేవి నిజం కాదని వెల్లడైంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి సరఫరా అయితే దానిని టీటీడీ అధికారులు వెనక్కి పంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాంటప్పుడు జంతు కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూలో ఎలా వాడతారన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. అలాగే అయోధ్యకు లడ్డూలను తయారు చేయించి పంపించింది ప్రస్తుతం టిటిడి సభ్యుడిగా ఉన్న సౌరబ్ బోరా అని తేలింది. ఆయన స్వచ్చమైన ఆవు నేయితో తయారు చేసిన లడ్డూలను పంపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పుడు ఆరోపణ చేశారు. పోనీ ఆయన తన అభిప్రాయానికి కట్టుబడి బోరా పై ఏమైనా చర్య తీసుకోవాలని కోరారా? అంటే అదీ లేదు. ఇవన్నీ తిరుమలేషుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం కాదా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఉండదు. చంద్రబాబు తాజా తిరుమల టూర్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఏడుకొండలను ఆనుకుని ఉన్న ప్రాంతం స్వామివారి సొంతం అని, అక్కడ ఓబెరాయ్ హోటల్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి అభివృద్ది సంస్థ ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని మాత్రం కప్పిపెట్టారు. పైగా ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగానే ఎల్లో మీడియా రాయలసీమలోనే మొదటి సెవెన్ స్టార్ హోటల్ అంటూ ఊదరగొట్టింది. మొత్తానికి.. సాధువుల నిరసనలతో ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేవలోక్ ప్రాజెక్టు కు కేటాంచిన భూ అనుమతిని కూడారద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి టిడిపి ప్రభుత్వమే విల్లాలు,గదుల నిర్మాణం నిమిత్తం అనుమతి ఇచ్చింది. గతంలో అసెంబ్లీలో.. ఏడు కొండలు లేవు.. రెండు కొండలే ఉన్నాయని కొందరన్నారని మరో అసత్య వచనం చెప్పారు. దానిపై అప్పట్లో పోరాడనని చంద్రబాబు అంటున్నారు. అప్పుడు కూడా చంద్రబాబు అబద్దమాడినట్ట్లు ఒకటికి పదిసార్లు రుజువు అయినా అదే అసత్యం చెబుతూ ఉంటారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జి,ఓ.746 ఇచ్చారని ప్రస్తుత ఈఓ శ్యామలరావు హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో తెలిపారు. 👉ఒక వదంతిని సృష్టించడం, దానిని నిజమని ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన గురించి తెలిసినవారు వ్యాఖ్యానిస్తుంటారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామని ఒకసారి , దానిని కొనసాగిస్తామని మరోసారి చెబుతున్నారు. ఇది కాకుండా కొత్తగా ఆలయాల నిర్మాణం కోసం ఇంకో ట్రస్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజానికి శ్రీవాణి ట్రస్టు ను ఏర్పాటు చేసింది టీడీపీ హయాంలోనే అట. దానిని వైఎస్సార్సీపీ హయాంలో సమర్ధంగా నిర్వహించి విదేశాలలో, దేశ వ్యాప్తంగా 3600 దేవాలయాలను నిర్మించిందని భూమన చెప్పారు. అనేక చోట్ల కళ్యాణోత్సవాలను కూడా జరిపించారు. ఇది వాస్తవమా?కాదా?.. ఇప్పుడేదో కొత్తగా దేశంలో టీటీడీ(TTD) తరపున ఆలయాలు నిర్మించబోతున్నట్లు బిల్డప్ ఇవ్వడం అవసరమా?. నిజంగానే శ్రీవాణి ట్రస్టు ను రద్దు చేసి ఆ నిధులను టీటీడీ సాధారణ నిధులలోకి తీసుకువస్తే రూ. 600 కోట్ల జీఎస్టీని చెల్లించవలసి వస్తుందని భూమన చెప్పారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఈ ట్రస్టును రద్దు చేసి మరో కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారో తెలియదు. గతంలో శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని చంద్రబాబు ఆరోపించేవారు. అది నిజం కాదని పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారనుకోవాలి. ఇక.. తిరుమలకు నీటి కొరత రాబోతోందని, ఆలయం మూసివేయాలని ఒక అధికారి తనతో చెప్పారంటూ చంద్రబాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ అధికారి పేరు ఎందుకు చెప్పలేదు. నిజంగానే నీటి సమస్య వస్తే భక్తులను కొండపైకి రాకుండా ఆపుతారేమో కాని, స్వామివారి నిత్య కైంకర్యాలను ఆపి ,ఆలయాన్ని మూసివేయడం ఎక్కడైనా జరుగుతుందా? అనేదానికి జవాబు దొరకదు. ఆఖరికి సెంటిమెంట్ విషయాలలో కూడా చంద్రబాబు ఇలా మాట్లాడడమేమిటో అర్ధం కాదు. గతంలో అప్పటి ఈఓ ధర్మారెడ్డి తనయుడు ఆకస్మికంగా చనిపోతే.. కర్మకాండ ముగిసిన తర్వాత ఆయన ఆలయానికి వస్తే దానిని తప్పుపడుతూ ఆలయాన్ని అపవిత్రం చేస్తారా? అని చంద్రబాబు, పవన్‌లు అన్నారన్న సంగతిని భూమన ప్రస్తావించారు. మరి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించి నెలలు తిరగకముందే.. చంద్రబాబు కుటుంబం తిరుమలకు ఎలా వస్తారని, ఇది అపవిత్రం కాదా? అని భూమన ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు లేదంటే ఆయన తరపున టీటీడీ వాళ్లైనా జవాబు ఇవ్వాలి కదా!. కిక్కురుమన్నట్లు లేదు. అంతేకాదు.సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడా వ్యాఖ్య ఒకటి కనిపించింది. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు స్పూన్ తో ప్రసాదం స్వీకరించడాన్ని కూడా ఆక్షేపించి తమ రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు వాడుకున్నారట. మరి అదే చంద్రబాబు తన మనుమడితో పాటు స్పూన్ తోనే ప్రసాదం తీసుకుంటున్న ఫోటో కనిపించింది. నిజానికి ఇది పెద్ద అంశం కాదు. కాని చంద్రబాబు దేనినైనా రాజకీయం చేయగలరని.. తనవరకు వస్తే మాత్రం ఏమి జరగనట్లే ఉంటారని చెప్పడానికే ఇలాంటి నిదర్శనాలు అవుతాయి. పాపనాశనం రిజర్వాయిర్‌లో బోటింగ్ పెట్టారట. అదే జగన్ టైంలో పెట్టి ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎంత గగ్గోలు పెట్టేవో?. ఇప్పుడేమో వివాదం అయ్యేసరికి అధికారులు ఏవో సాకులు చెబుతున్నారు. తిరుమల అదనపు ఈవో అచ్చంగా రాజకీయవేత్త మాదిరి.. స్థానికంగా వైఎస్సార్సీపీ అభిమానులన్న అనుమానంతో చిరువ్యాపారులను బెదిరిస్తున్నారట. సామాన్యులకే స్వామివారి దర్శనంలో ప్రాధాన్యత అని చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఊదరగొడుతుంటారు. కాని ఆచరణలో మాత్రంఅందుకు భిన్నంగా ప్రస్తుతం రోజుకు ఎనిమిదివేల మందికి వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారట. వీటిలో అత్యధికం ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందట. దాంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు. ఇక ఆలయాల కూల్చివేతలు, మఠాల భవనాల ధ్వంసం చేయడం వంటివి జరుగుతున్నా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు నోరు విప్పి మాట్లాడం లేదు. హిందూ మత ఉద్దారకులమని ప్రచారం చేసుకునే బీజేపీ సైతం వీటిని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మతాన్ని,దైవక్షేత్రాలను రాజకీయాలకు వాడుకుంటున్న వీరికి నిజంగా భక్తి ఉందా? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. వీరు అపర భక్తులా? లేక రాజకీయ భక్తులా అంటే ఏమి చెబుతాం?.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
Chittoor: ఎమ్మెల్యే గురజాల అనుచరుల వీరంగం
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు. -
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది. సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టుప్రెస్మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి పాలనలో ఒకవైపు యధేచ్చగా జరుగుతున్న ఆలయాల కూల్చివేతలు, మరోవైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్న ఆయన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్(YS Jagan) ట్వీట్లో ఏమన్నారంటే.. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రం(Kasinayana Kshetram)లో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మం(Hindu Dharmam)పై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?.. .. అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఆలయాలపట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణపట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. .. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు(Chandrababu)గారి ఆదేశాలమేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడిచేశారు. ఇవిగో ఆధారాలు, ఏమిటీ మీ సమాధానం? తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? .. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. .. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని వైఎస్ జగన్ నిలదీశారు.నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే.., దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో… pic.twitter.com/gTRsvBfnia— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2025 -
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
కూటమిపై ఇదెక్కడి మాస్ ట్రోలింగ్ మావా!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే.. సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య. 👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు. 👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్లను వేసుకుని ఉండాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!. 'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు. పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీలో చేరిన బెట్టింగ్ డాన్ కుటుంబ సభ్యులు
సాక్షి : క్రికెట్ బెట్టింగ్ డాన్‌గా గుర్తింపు పొందిన కీలక బుకీ అతడు.. క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న వారికి ఇతని పేరు తెలియకుండా ఉండదు. ప్రొద్దుటూరు వాసే అయినా జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లకు బాగా సుపరిచితుడు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో 25వ వార్డుకు చెందిన అతడు ఒక బెట్టింగ్ సామ్రాజ్యాన్నే నడిపిస్తున్నాడు. ప్రారంభంలో జిన్నారోడ్డుకు చెందిన ఒక బుకీ వద్ద గుమాస్తాగా పని చేసేవాడు. తర్వాత అతని వద్దే సబ్ బుకీగా పని చేస్తూ నేడు రాయలసీమలోనే పేరు పొందిన క్రికెట్ బుకీగా మారాడు. సీమ జిల్లాల్లో అతనికి వందలాది మంది సబ్ బుకీలు ఉన్నా రు. మ్యాచ్‌లు జరిగే సమయంలో వీరి నుంచి ప్రతి రోజు రూ.కోట్లలో టర్నోవర్ సదరు బెట్టింగ్ డాన్‌కు చేరుతుంది. అతను కొంత బెట్టింగ్ మొత్తాన్ని తనే ఉంచుకొని మిగతా టర్నోవర్‌ను ముంబైలోని సేట్లకు పంపిస్తుంటాడు. ఇలా చాలా ఏళ్ల నుంచి అతను బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఏపీతో పాటు తెలంగాణా, ముంబై తదితర ప్రాంతాలకు చెందిన బడా బుకీలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచే అధిక టర్నోవర్ ... ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడ బడా బుకీలతో పాటు సబ్ బుకీలు అనేక మంది క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఈ డాన్కే టర్నోవర్ ఉన్న బుకీలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్లే గాక పందేల డబ్బులు వసూలు చేసేందుకు అనేక మంది యువకులు కొరియర్ బాయ్‌లుగా వీరి కింద పని చేస్తున్నారు. వీరికి బైక్‌తో పాటు మెయింటెనెన్స్ కోసం డబ్బు, ఖరీదైన సెల్‌ఫోన్, మందు ఆశ చూపడంతో అనేక మంది యువకులు వారికి తెలియకుండానే క్రికెట్ బెట్టింగ్ రొంపిలోకి దిగుతున్నారు. కాగా క్రికెట్ మ్యాచ్‌లకు సంబం«ధించి రాయలసీమలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రొద్దుటూరు నుంచే రూ. కోట్లలో టర్నోవర్ ఇతడికి వెళ్తుండడం విశేషం. అనేక బెట్టింగ్ కేసులు బెట్టింగ్ డాన్‌పై అనేక కేసులున్నాయి. హోమ్ స్టేషన్ అయిన ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై సస్పెక్ట్ షీట్ ఉంది. ఇదే స్టేషన్లో 10కి పైగా బెట్టింగ్ కేసులు ఉన్నాయి. అలాగే టూ టౌన్, త్రీ టౌన్, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అనేక క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు అయ్యాయి. కడపలోని రెండు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అలాగే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు ముగ్గురు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన వన్‌టౌన్ పోలీసులు సదరు బెట్టింగ్ డాన్ ప్రమేయం కూడా ఉందని నిర్ధారణ కావడంతో అతని పేరు కూడా కేసులో చేర్చారు. అలాగే ఇదే కేసులో నెల్లూరు, అనంతపురానికి చెందిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం టీడీపీలో చేరిక...క్రికెట్ బెట్టింగ్‌లే ఆదాయ మార్గంగా ఎంచుకున్న సదరు ‘బెట్టింగ్ డాన్’ కుటుంబీకులు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో 25వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహరూన్, ఆమె భర్త ఖాద్రి, బావ నూరి టీడీపీలో చేరారు. వీరంతా బెట్టింగ్ డాన్ రక్తసంబం«దీకులు. ఖాద్రిపై కూడా క్రికెట్ బెట్టింగ్ కేసులు ఉన్నాయి. కేవలం అధికార పార్టీ అండకోసమే ‘డాన్’ కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారని సమాచారం. తమ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెంటే నడిచామని ఈ సందర్భంగా నూరి చెప్పడం గమనార్హం.అన్ని వేళ్లూ వరద వైపే...క్రికెట్ డాన్‌గా గుర్తింపు పొందిన సదరు బుకీ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంపై విమర్శకుల వేళ్లన్నీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైపే చూపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే జూదం, క్రికెట్ బెట్టింగులను అంతం చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అదే వ్యక్తులను అధికార పారీ్టలో చేర్చుకోవడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశి్నస్తున్నారు. ప్రొద్దుటూరులో ఇప్పటికే యధేచ్ఛగా జూదం కొనసాగుతుంది. మరోవైపు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఎమ్మెల్యే చెంతన ఉంటే అడ్డగించే సాహసం చేసేదెవరని పరిశీలకులు నిలదీస్తున్నారు. సొంతంగా యాప్‌ల నిర్వహణ ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్‌లో యాప్‌ల హవా నడుస్తుండటంతో బుకీలు కూడా అప్డేట్ అయ్యారు. ప్రొద్దుటూరుకు చెందిన ‘బెట్టింగ్ డాన్’తో పాటు పలువురు సొంతంగా యాప్‌లను నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో యాప్‌ల నిర్వహణ కోసం రూ. లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా టెక్నికల్ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ఐడీల ద్వారా స్థానికంగా ఉన్న బుకీలు యాప్‌ల ద్వారానే క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న అతను ఐపీఎల్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో సింగపూర్, కువైట్, దుబాయ్ దేశాల్లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ఒకే చోట ఉండకుండా 15–20 రోజులకు మకాం మారుస్తుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ పందేలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
-
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు. -
చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన
తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన కల్యాణ్‌లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి... తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్ పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు ఆ ట్రస్ట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్ రిపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు. -
దావోస్ జస్ట్ ఒక వేదిక అంతే!: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ‘‘ఏపీకి పెట్టుబడులను వెల్లువలా తీసుకురాబోతున్నాం’’ ఈ ఏడాది జనవరిలో దావోస్‌కు వెళ్లడానికి ముందు కూటమి ప్రభుత్వం (Kutami Prabhutvam)చెప్పిన మాట. ‘‘పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాం.. సుమారు 15 కంపెనీల అధిపతులతో సమావేశమయ్యాం..’’ ఇది దావోస్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతున్న టైంలో చెప్పిన మాట. ఇప్పుడేమో.. దావోస్ వెళ్లింది ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కాదంటూ అసెంబ్లీ సాక్షిగా ఇంకో మాట చెప్పేసింది. కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, నారా లోకేష్ అండ్ కో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారనేది తెలిసిందే. అయితే ఆ పర్యటనపై మండలి సాక్షి గా ఏపీ ప్రభుత్వం వింత భాష్యం చెప్పింది. దావోస్ పర్యటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రబాబు, కవురు శ్రీనివాస్‌లు ప్రశ్న సంధించారు. అయితే తమ ప్రభుత్వం అక్కడికి వెళ్లింది ఎంవోయూలు చేసుకోవడానికి కాదని సమాధానం కూటమి ఇచ్చింది. అది కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే.. మేం అక్కడికి వెళ్లింది ఎలాంటి పెట్టుబడులు చేసుకోవడానికి కాదు’’ అని సమాధానం విడుదల చేసింది. -
నిన్న నన్ను.. ఇవాళ మండలి చైర్మన్‌ను అగౌరవపరిచారు: బొత్స
సాక్షి,గుంటూరు: శాసన మండలిలో చైర్మన్ సహా వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తాజాగా మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్‌పై వివక్ష చూపించారని అన్నారాయన. శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ..క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారు. శాసన మండలిని అవమానించారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్‌ను ఇలా కించపరచడం సమంజసం కాదు.నిన్న ఉమ్మడి ఫొటోకు పిలిచి అక్కడ నాకు కుర్చీ వెయ్యలేదు. నాకు కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదు.వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలి చైర్మన్‌ను ఇప్పుడు అగౌరవ పరిచారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బొత్స అభ్యంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆమోదించారు. రేపు శాసన మండలిలో చర్చించాలి. కానీ అజెండాలో లేకుండా ఈరోజే పాస్ చేయాలనుకోవడం సమంజసం కాదు. ఈ బిల్లు పై చర్చ జరగాలన్నది మా అభ్యంతరం. రేపు సభ లేకపోతే ఈరోజు ఆమోదించాలి. కానీ ఇప్పుడే ఆమోదించేంత అత్యవసరం ఏముంది. మీకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. ఉద్యోగులకు జీతాలు రేపు ఇస్తారా..?. యనమల చెప్పినట్టు బిల్లుపై చర్చ జరగాలి.బీఏసీలో రెండు రోజులు రిజర్వ్ పెట్టింది. అలాంటప్పుడు అసలు బిల్లు చూసుకునే అవకాశమే లేకుండా చర్చ పెట్టేస్తే ఎలా..?’ అని ప్రశ్నించారు. -
మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. ‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత(Home Minister Anita) అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై 70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్‌గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె. .. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్‌ను తెచ్చారు. దిశా యాప్ పైన ఇదే మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు. మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది... కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్లో ఉండేది. సెబ్‌ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.కేంద్రం వద్ద దిశ చట్టం(Disha Act) పెండింగ్ లో ఉంది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయించొచ్చు కదా అని అనితను ఉద్దేశించి కల్యాణి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మభ్యపెట్టే మాటలు మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి వరుదు కల్యాణి హితవు పలికారు.ఇదే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే మహిళా పోలీసుల పై దాడులు జరుగుతున్నాయన్న ఆమె.. శక్తి యాప్ కూడా దిశా యాప్ మాదిరిగానే పనిచేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
ప్చ్.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్‌తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్‌కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండిదీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం. -
విశాఖ స్టీల్‌ప్లాంట్: కేంద్రం ట్విస్ట్.. చంద్రబాటు నాటకాలు బట్టబయలు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గడం ఉత్తమాటేనని తేల్చేసింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నాటకాలు.. మోసాలు బట్టబయలు అయ్యాయివైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఇప్పటిదాకా లభించలేదు. కానీ, అది జరగనివ్వబోమంటూ ఏపీలోని కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేస్తూ వస్తోంది. అయితే మరోవైపు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడం చూస్తున్నదే. ఈ తరుణంలో.. పబ్లిక్ గ్రీవెన్స్‌కు కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బదులిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కార్పొరేట్ సంస్థ అయిన RINL ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.కేంద్రం తాజా ప్రకటనపై పోరాట సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలన్నదే మా మొదటి, ప్రధాన డిమాండ్. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకుంటాం అంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్‌ను కాపాడాలి.:::అయోధ్య రామ్, పోరాట కమిటీ కన్వీనర్ -
‘విద్య’లో గందరగోళం.. లక్ష్యం బడికి తాళం. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను భ్రష్టు పట్టిస్తోన్న కూటమి ప్రభుత్వం
-
ఇప్పటికైనా మించిపోయింది లేదు! ఇకనైనా..
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది. చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు. 👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పాలిటిక్స్‌లో బిల్డప్ బాబాయ్ అవతారమెత్తిన పీకే!
-
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్‌అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్‌ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్‌లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్‌గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?
విశాఖపట్నం, సాక్షి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్ ఇప్పటిదాకా కాలేదు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్ అన్నారు. -
టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం
నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్చల్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పవన్, లోకేశ్ క్షమాపణ రాజకీయాలపై ఆసక్తికర చర్చ
సాక్షి, అమరావతి : కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య నడుస్తున్న అధిపత్య పోరుకు నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టిన లోకేశ్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను పవన్‌కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు అప్పట్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ మంత్రిత్వ శాఖ పరిధిలో కూల్చివేతలను లోకేశ్ తప్పుబట్టడం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా పవన్‌కు టిట్ ఫర్ టాట్‌గా సమాధానమిచ్చారనే చర్చ నడుస్తోంది. అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారనే వార్తలు రాగా.. లోకేశ్ ఏరికోరి బీఆర్ నాయుడిని చైర్మన్‌గా ఎంపిక చేయించారని.. దీనిపై పవన్‌కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ అప్పట్లో డిమాండ్ చేశారు. తాజాగా ఇప్పుడు పవన్ పర్యవేక్షణలోని అటవీ శాఖ అధికారులు కాశినాయన అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకున్న లోకేశ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో టీటీడీ వ్యవహరంలో పవన్‌కళ్యాణ్ వ్యహరించిన తీరుకు ప్రతిగా ఇప్పుడు లోకేశ్ గట్టిగా చురకలు వేసినట్టయ్యింని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలో నెలకొన్న లుకలుకలకు ఇదో ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం.. కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్‌ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.— Subramanian Swamy (@Swamy39) March 12, 2025అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు. -
ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి.. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?. మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?. పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా. -
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్‌తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్‌కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్‌కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. -
కోడిగుడ్డుపై ఈకల కోసం.. షాడో సీఎం పాకులాట
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి. తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్‌కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
అఫీషియల్: జగన్ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!
అమరావతి, సాక్షి: వైఎస్ జగన్ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.2014 జూన్ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి 2023-24.. జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇదిపబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.అప్పులపై బాబు అబద్ధాలుచంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది. -
కూటమి పెద్దలు.. ష్.. గప్‌చుప్..!
ఏపీలో అధికార కూటమి అపరాధ భావనతో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన పక్షం.. విపక్ష వైఎస్సార్సీపీ ఆత్మస్థైర్యంతో సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు సైతం చెప్పలేకపోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజల తరపున వేస్తున్న ప్రశ్నలకు కూటమి పెద్దలు గుటకలు మింగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎన్నికలకు ముందు చెప్పిన అబద్దాలను ప్రజల ముందు ఉంచడంలో జగన్ సఫలమయ్యారు. జగన్ తాజా మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్‌ల అసత్యాల చిట్టాను బయటపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ప్రతిదానికి ఆధార సహితంగా ఆయన మాట్లాడారు. గతంలో జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబు, పవన్‌లు ఆధారాలతో నిమిత్తం లేకుండా నోటికి వచ్చిన అబద్దాలు ఆడారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టమవుతోంది. జగన్ మాటలు వింటే వీరిద్దరు అపరాధ భావనతో కుంగిపోవాలి. అబద్దాలతో ప్రజలను మోసం చేశామన్న సంగతి తెలిసిపోతుందే అని సిగ్గుపడాలి. అయితే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనుక వారు అలాంటివాటిని పట్టించు కోకపోవచ్చు!. అయితే..ఏపీ బడ్జెట్ ఎంత డొల్లగా ఉన్నది, టీడీపీ, జనసేనలు తాము చేసిన వాగ్దానాలకు ఎలా తూట్లు పొడిచింది కళ్లకు కట్టినట్లు జగన్ వివరించే యత్నం చేశారు. అప్పుల గురించి బడ్జెట్ పత్రాలలోను, సామాజిక, ఆర్ధిక సర్వేలోను ఇచ్చిన అంకెలను వివరించి కూటమిని నిలదీశారు. కూటమి ప్రతినిధులుగా పనిచేసే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలపై నోరు మెదపలేకపోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ఏపీ అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక మాదిరి అవుతోందని టీడీపీ, జనసేనలతో పాటు ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేశాయి. రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేసినా, రూపాయి ఆదాయం లేకపోయినా జగన్ సమర్థంగా పనిచేశారన్న సంగతి ప్రజలకు బాగా అర్ధమైంది. ఇక.. తెలుగుదేశం తన వెబ్సైట్లో జగన్ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసింది. చంద్రబాబు, పవన్ ,లోకేష్‌లు పది నుంచి రూ.14 లక్షల కోట్ల వరకు తమకు తోచిన అంకెలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అవకాశం ఉన్న ప్రతిసారి నీచమైన రీతిలో పిచ్చి లెక్కలు, నిపుణుల పేరుతో దిక్కుమాలిన వాళ్లందరిని పోగు చేసి విష ప్రచారం చేసింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వాస్తవాలు ఒప్పుకోక తప్పలేదు. 👉ప్రభుత్వ గణాంకాల ప్రకారమే జగన్ ప్రభుత్వ టర్మ్ పూర్తి అయ్యేనాటికి అప్పు రూ.4.92 లక్షల కోట్లుగా వెల్లడైంది. ఇందులో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు సుమారు రెండు లక్షల కోట్లు, విభజన నాటికి ఉన్న అప్పు రూ.95 వేల కోట్లు కూడా ఉంది. అంటే జగన్ టైమ్ లో రెండు లక్షల కోట్ల మేరే బడ్జెట్ అప్పులు చేసినట్లు అర్థమవుతుంది. కాని ఈనాడు 2023 ఫిబ్రవరి 14న ఒక కథనాన్ని ఇస్తూ పార్లమెంటులో అప్పటికి రూ.4.24 లక్షల కోట్ల అప్పే అని చెప్పినా, ఏపీ అప్పు రూ.9.25 లక్షల కోట్లు అని, మిగిలిన అప్పులను జగన్ రహస్యంగా దాచేశారని పిచ్చి వాదన చేసింది. అది నిజమే అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది కదా! ఆ రహస్య అప్పులేవో బయటపెట్టి ఉండవచ్చు కదా! అంటే అప్పుడు కావాలని అబద్దాలు ప్రచారం చేసి పాఠకులను ఈనాడు ,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మోసం చేసినట్లే కదా! 👉ఈ విషయంపై జగన్ కాగ్, ఆర్థిక సర్వేలలోని అంకెలను చూపుతూ ప్రశ్నించారు. దానికి అటు టీడీపీ నుంచి కాని, ఇటు ఎల్లో మీడియా నుంచి కాని సౌండ్ లేదు. అంతేకాదు... ఇప్పుడు ఏ సంక్షోభం లేకపోయినా, అప్పుడే చంద్రబాబు సర్కార్ రూ.70 వేల కోట్ల అప్పు చేయగా, మరో రూ.డెబ్బైవేల కోట్ల అప్పు సమీకరిస్తోంంది. ఇక సూపర్ సిక్స్‌కు గుండుసున్నా అంటూ కూటమి ఇచ్చిన ఒక్కో హామీని చదివి వినిపిస్తూ జగన్ అస్త్రాలు సంధించారు. అయినా కూటమి నేతలు, ఎల్లో మీడియా కిక్కురుమనలేదు.ఇవే కాకుండా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన 143 వాగ్దానాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. సూపర్ సిక్స్ హామీలకే రూ.79179 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ.17,179 కోట్లు కేటాయించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఆర్ధిక మంత్రి కేశవ్ వివరణ ఇవ్వలేకపోయారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఇప్పటికే బాకీ పడ్డారని, వచ్చే ఏడాది కూడా ఇవ్వడం లేదని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని, దాంతో అది రూ.36 వేలు అయిందని ఆయన చెప్పారు. అలాగే నిరుద్యోగులకు కూడా అదే ప్రకారం రూ.72 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున బాకీ పడ్డారని అంటూ ఆయా స్కీముల పరిస్థితి, ప్రజలు ఏ మేర కూటమి చేతిలో మోసపోయింది ఆయన విశ్లేషించి చెప్పారు. ఫించన్వెయ్యి రూపాయలు పెంచినా నాలుగు లక్షల పెన్షన్లలో కోత పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైందని అడిగారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ చిన్నదే అయినా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని, ఆయన కడుతున్న అమరావతిని రాయలసీమ నుంచి కూడా ఉచిత బస్‌లలో వచ్చి చూద్దామనుకున్న మహిళలకు నిరాశ మిగిల్చారని జగన్ ఎద్దేవ చేయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే అమరావతి గురించి ప్రస్తావిస్తూ అధికారం వచ్చింది కనుక, వారు తాము అనుకున్న విధంగా నిర్మాణం చేసుకోవచ్చని, కాని అందులో కూడా అబద్దాలు చెప్పడం ఏమిటని అన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వ డబ్బు రూపాయి వ్యయం చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు, అప్పుల కింద రూ.31 వేల కోట్లు ఎలా తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీని గురించి కూడా చంద్రబాబు కాని, మున్సిపల్ మంత్రి నారాయణ కాని నోరు విప్పడం లేదు. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని చంద్రబాబు చెప్పడంపై జగన్ మండిపడ్డారు. అలా అన్నందుకు చంద్రబాబును తక్షణమే పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌కు సూచించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కలిసిపోయారట. తనకు చంద్రబాబుతో వైరం ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని దగ్గుబాటి అన్నారు. మరో వైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ఎలా చెబుతున్నారు. చివరికి వైఎస్సార్సీపీ వారికి టీడీపీ వారు ఎవరైనా బంధువులు ఉన్నా, వారు కలుసుకున్నా పార్టీలో ఒప్పుకోవడం లేదట. చంద్రబాబు, దగ్గుబాటి కలవవచ్చు కాని, వేర్వేరు పార్టీలలో ఉన్న బంధువులు కలిస్తే తప్పని టీడీపీ నాయకత్వం ప్రచారం చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ ఈ పరిణామాన్ని గుర్తించి, వైఎస్సార్సీపీలో లేదా ఇతర పార్టీలలో ఉన్న తమ బంధువులతో గొడవలు పడవద్దని సలహా ఇవ్వాలి. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న డైలాగును జగన్ వాడుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చంద్రబాబు బడ్జెట్లో ఉన్న అంకెల గారడీని విడమరిచి చెప్పగలిగారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఎక్కువగా ఉండడంతో వారు వీటిని ప్రస్తావిస్తుంటే మంత్రి లోకేష్తోసహా ఏ మంత్రి కూడా నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. దాంతో కూటమి సర్కార్ ప్రతిష్ట దెబ్బతింటుండడంతో ఎర్రబుక్ పేరుతో వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ వద్ద మంత్ర దండం లేదని చెబుతూ, చంద్రబాబు బ్రాండ్ ఉందని అన్నారు. చంద్రబాబు బ్రాండ్ అంటే అబద్దాలు చెప్పడమా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేరు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ మాట్లాడకపోయినా అవే విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించడం ద్వారా చంద్రబాబు, పవన్ ,లోకేష్ లను ఆత్మరక్షణలో పడేశారని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP High Court: పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
రెడ్‌బుక్ రూల్స్‌లో పవన్ వాటా! తిలాపాపం.. తలా పిడికెడు
ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక్షన్ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే.. దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి. అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా! అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా. పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు. పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది. రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు. ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు! అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్ కల్యాణ్ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. -
మోసాల బడ్జెట్.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్కోర్స్.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్ సిక్స్.. సెవెన్ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ పెన్షన్ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్ఓఆర్ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్ఓఆర్ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్ టాక్స్ రెవెన్యూ: 2024–25లో మిస్లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్ యాక్షన్ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్ వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని జగన్ సెటైర్ వేశారు. -
తల్లికి వందనంపై పచ్చి దగా.. అడ్డంగా దొరికిపోయిన లోకేష్
అమరావతి, సాక్షి: బడి పిల్లలను, వాళ్ల తల్లులను భరోసా పేరిట వంచించాలనుకుంటున్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం.. శాసన మండలి సాక్షిగా బయటపడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనం(Thalliki Vandanam)పై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం అడుగు ముందుకు పడడం లేదు. పైగా కిందటి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా.. అమలు మాత్రం చేయలేదు. విచిత్రంగా.. ఈ ఏడాది మే నెల నుంచి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఇవాళ.. ‘‘ఈ ఏడాది తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు?’’ అని విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే.. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పని మంత్రి నారా లోకేష్.. నిధుల లెక్కలు చూపించాలంటూ అధికారులను పురమాయించారు. ప్రజలను, సభను మభ్యపెట్టేలా విద్యాశాఖ లిఖితపూర్వక సమాధానం ఇప్పించారు. అందులో రూ.9,400 కోట్లు కేటాయించామంటూ బడ్జెట్ లెక్కలు చెప్పారు. కానీ, ఇది వచ్చే ఏడాది పథకం తాలుకా నిధుల లెక్కకు సంబంధించింది. ఏపీలో పేద విద్యార్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందించింది. అయితే.. అదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో మార్చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. కూటమి నేతలైన పవన్, నారా లోకేష్ కూడా ఈ విషయాన్నేన్నికల ప్రచారంలో నొక్కి మరీ చెప్పారు. పైగా ఇంట్లో ఎంత మంది ఉంటే(విద్యార్థులు) .. అంత మందికీ వర్తింజేస్తామని ప్రకటించారు. దీనిపై ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన వీడియో ఒకటి ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. తీరా అధికారంలోకి వచ్చాక.. మార్గదర్శకాల పేరుతో హడావిడి చేశారే తప్ప పైసా విదిల్చింది లేదు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో.. 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనానికి ఎగనామం పెడుతూ .. 80 లక్షల పిల్లలు, వారి తల్లులను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం మోసం చేసినట్లయ్యింది. -
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో ఇలాగే ఉంటుంది మరి!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?. ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే. అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు. సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్‌ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్‌ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్‌లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది. 2014-19 టర్మ్‌లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట. టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025 అప్డేట్స్.. సమావేశాల్లో భాగంగా కూటమి హామీల ఎగవేతను, అరాచక పాలనను, గత ప్రభుత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని శాసన మండలిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్సీపీ 👉 శాసన మండలి రేపటికి వాయిదావీసీల బలవంతపు రాజీనామాలపై చర్చ..వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు ఇస్తే విచారణ చేస్తామని గతంలో మంత్రి లోకేష్ ప్రకటనసభకు ఆధారాలను అందజేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపించాలని డిమాండ్చేనేతపై చర్చ..చేనేత రంగానికి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని కోరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుసమాధానం దాటవేస్తూ వైఎస్సార్సీపీపై మంత్రి సవిత విమర్శలుబొత్స సత్యనారాయణను మాట్లాడకుండా అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ సభ్యులువైఎస్ జగన్ నేతన్న ద్రోహి అంటూ తీవ్ర విమర్శ చేసిన మంత్రి సవితమంత్రి సవిత వ్యాఖ్యలపై బొత్స ఫైర్శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్గత 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలను మోసం చేసిందినేతతన్నలకు రుణమాఫీ చేస్తామని చేయలేదుచేనేతల సమస్యలపై అధ్యయనం చేస్తామని చేయలేదు.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామని ఇవ్వలేదు.వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకానికి 969 కోట్లు ఇచ్చాం.మేము తప్పు మాట్లాడితే మాపై చర్యలు తీసుకోవచ్చు.మా సభ్యులు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పటం లేదుచేనేతల వ్యవహారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం.దిశ యాప్‌ను కొనసాగిస్తారా లేదా?ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలిపనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారుదిశ యాప్ ఉంటే ఎంతో ఉపయోగపడేదిదిశ యాప్‌ను కొనసాగిస్తారా లేదా?దిశ యాప్ స్థానంలో మరొక యాప్ తీసుకొస్తారా లేదా సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కామెంట్స్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రశ్నోత్తరాలుఛార్జీలు పెంచబోమని చెప్పి యూనిట్ పై 2 రూపాయలు భారం వేశారుసర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు భారం వేశారుగత టీడీపీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది2014 నుంచి 19 వరకూ 13 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే2019 నుంచి 24 వరకూ 47 వేల కోట్ల రూపాయల సబ్సిడీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరించిందిరేట్లు పెంచకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరించాలిఉన్నదానిని తగ్గిస్తామని మాటిచ్చారుఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..విద్యుత్ చార్జీలు పెంచమని టీడీపీ రకరకాలుగా ప్రచారాలు చేసిందిట్రూ అప్ తో పాటు సర్దుబాటు ఛార్జీలు.. టైమ్ ఆఫ్ ది డే ఛార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారుమీరిచ్చిన మాటేంటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటిటారిఫ్, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారా.. ఇది మాటతప్పడం కాదా? YSRCP ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభంమండలి లో వైస్సార్ర్సీపీ వాయిదా తీర్మానంనిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన YSRCP ఎమ్మెల్సీ లుఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్ హామీ ఇచ్చిన కూటమి9 నెలలు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ పూర్తి కాని వైనంమెగా డీస్సీపైనా జాప్యం ఏది విధ్వంసం.. ఎవరిది విధ్వంసం?అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలుఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే చెత్తబుట్టకు చేరిన మేనిఫెస్టో పైగా గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా?ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్లో కోతలు పెట్టిన చంద్రబాబు చేసేది విధ్వంసమా? ఎవరిది విధ్వంసం? ఎవరు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు.జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం:::కూటమి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులుఇదీ చదవండి: సీఎం పదవిలో ఉన్నవాళ్లెవరైనా అలా మాట్లాడతారా? -
దోపిడీ జరిగిందన్నారు.. మరి బిల్లులెందుకు చెల్లించారు?: బొత్స
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు. రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన. అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన. -
అరరే కేశవా.. ఎన్టీఆర్, బాబులను బద్నాం చేస్తే ఎలా?
గాలి కబుర్లు...సోది లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడండి! ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడేందుకు.. షాడో సీఎం లోకేష్‌ను సంతోషపెట్టేందుకు మంత్రిగారు రాష్ట్ర ఇమేజీని దెబ్బతీసేందుకూ వెనుకాడలేదు.. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడలేదు! బడ్జెట్ ప్రసంగం మొత్తం మ్మీద వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, గత ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించి కేశవ్ తన లోపలి భయాన్ని బయటపెట్టేసుకున్నట్లు అనిపించింది. కాకపోతే ఈ క్రమంలో ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలనను కూడా విధ్వంసంతో పోల్చేశారు. ఒకపక్క రాష్ట్రానికి రుణాలు వచ్చే అవకాశం సున్నా అంటూనే.. ఇంకోపక్క లక్ష కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్నామని చెప్పడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి అవసరం లేదంటూనే బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు వ్యయం చేయబోతున్నామని అంటారు. అంతేకాదు.. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకువస్తూ ఆ మాటను ధైర్యంగా చెప్పలేని దుస్థితి కేశవ్‌ది. 👉సాధారణంగా ఎవరైనా తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ఉంది. గొప్పగా పని చేస్తున్నామని చెప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో నడుస్తోంది. రాష్ట్రం నాశనమైపోయిందని, విధ్వంసమైందని.. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు దాడికి బుగ్గయిన హిరోషిమాతో పోల్చడం ఎంత దుర్మార్గం!. ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమాభిమానాలు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి దిక్కుమాలిన పోలికలు చేస్తారా?. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదా! ఈ మాటలను సీరియస్‌గా తీసుకుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?. అంతేకాదు.. 👉ఏకంగా ఏపీకి రుణం తీసుకునే సామర్ధ్యం సున్నా అని రాశారంటే ఏమనుకోవాలి? అది నిజమే అయితే కొత్త బడ్జెట్లో రూ.1.03 లక్షల కోట్ల రుణం తెచ్చుకుంటామని ఎలా చెప్పారు? ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1.31 లక్షల కోట్ల రుణం ఎలా తీసుకువచ్చారు? ఎవరినో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరికి ప్రయోజనం. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టిన వీరు.. YSRCP ప్రభుత్వ హయాంలో వచ్చినదానికంటే తక్కువ ఆదాయం వచ్చిన దానిపై మాత్రం కిమ్మనరు! రుణాలే సంపద అనుకోవాలనా?. ప్రతి వైఫల్యాన్ని గత జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే.. ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు చేస్తున్న విమర్శలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవే కదా! అయినా జగన్ కంటే మూడు రెట్లు అధికంగా హామీలు ఎలా ఇచ్చారంటే జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్, తదితర హామీలన్నీ ఎగవేయడానికి వైఎస్సార్సీపీ ఆరోపణలు చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తారా?. ఇదేమైనా ధర్మమేనా!. అదే సమయంలో చంద్రబాబును పొగడడం కోసం ఎన్టీఆర్‌ను సైతం భ్రష్టు పట్టించేశారు. 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదట. దానికి కారణం ఒక్క ఎన్టీఆరేనా? ఆయన తీసుకొచ్చిన పథకాలేనా? అలాంటప్పుడు అదే ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్నదెవరు? చంద్రబాబే కదా?. పయ్యావుల కేశవ్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవం ఏమిటో ఈ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోయింది. గత ఏడాది బడ్జెట్ లో ఏమి చెప్పాం..ఏమి చేశాం..అన్నదానితో నిమిత్తం లేకుండా ఒక ఉపన్యాసం తయారు చేసుకుని శాసనసభలో చదివితే సరిపోతుందా?. విచిత్రం ఏమిటంటే.. 2024-25 బడ్జెట్‌ను రూ.2.94 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినా అందులో ఎంత శాతం అమలైందన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాతో వేసిన బడ్జెట్ అది. అయితే జనవరి నాటికి వచ్ని ఆదాయం కేవలం ఒక లక్ష ఒక వెయ్యి కోట్లు మాత్రమే. అంటే సగం ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే.. తాజా బడ్జెట్ కేటాయింపులు ఎకాఎకిన రూ.3.22 లక్షల కోట్లు అని ఎలా చెప్పారో అర్థం కాదు. కేవలం కాకి లెక్కలతో పుస్తకాలు నింపేసి ప్రజలను మభ్యపెట్టడం కాకపోతే? ఒకవైపు రాష్ట్రం ఆర్ధికంగా విధ్వంసమైందంటూనే.. మరోపక్క ఆదాయం పెరుగుతుందని ఎలా అంటారు?. సూపర్ సిక్స్ వంటి ఆచరణ కాని హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఎలా అనేదానిపైనే అధికంగా దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ధైర్యం ఉంటే టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి అమలుకు బడ్జెట్లో జరిపిన కేటాయింపులు ఎంత? కేటాయించకపోతే ఎందుకు చేయలేకపోయారు అన్నవి మాటమాత్రం మాట్లడకుండా ఊకదంపుడు కబుర్లు చెబితే ఏమి ఉపయోగం?. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం పథకం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి వ్యయం చేయలేదు. అలాగే.. అన్నదాత సుఖీభవ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతుకు నయాపైసా ఇవ్వలేదు. అంటే..పేరుకు కేటాయింపులు జరపడం.. ఆ తర్వాత గాలికి వదలి వేయడం అనేకదా! ఆడపడుచుకుల నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి పేరిట సాయంమహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బీసీలకు యాభై ఏళ్లకే ఫించన్.. వీటి ఊసే లేదు. అలాగే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేశారు. 👉అమరావతి కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారు కానీ.. అంతా ఖర్చు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఏమైపోయినా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే చాలన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన నెలకొంది. అంతేకాదు. రూ.31 వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్న విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోకపోవడం గమనార్హం. అదేదో కేంద్రం ఊరికే ఇస్తున్న డబ్బు అన్నట్లు పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇదంతా ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలపై పడే భారమే అవుతుంది.వారు చెల్లించే పన్నులనే వాడుకోవాలి. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్కూళ్లు బాగు చేసి అనేక సంస్కరణలు తీసుకువస్తే కేశవ్ తన ప్రసంగంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతలా దిగజారవలసిన అవసరం లేదు. చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోతుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. కాని తీరా చూస్తే జగన్ టైమ్‌లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయం వస్తే, చంద్రబాబు సర్కార్ పది నెలల పాలనలో అది రూ. తొమ్మిది వేల కోట్లకు కూడా చేరలేదు!. కేటాయింపుల గురించి చూస్తే ఫించన్లకు రూ.33 వేల కోట్లు అవసరమని గవర్నర్ ప్రసంగంలో చెబుతారు. బడ్జెట్లో మాత్రం రూ.27 వేల కోట్లే చూపుతారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న ఎన్నికల హామీపై మాటమార్చిన చంద్రబాబు ఒక ఏడాది ఎగ్గొటడమే కాకుండా.. తాజా బడ్జెట్లో సరిపడా కేటాయింపులూ చేయలేదు. తల్లికి వందనం కింద విద్యార్ధులు ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు రూ.12 వేల కోట్లు అవసరం కాగా.. కేటాయించింది రూ. ఎనిమిది వేల కోట్లే. పైగా స్పీచ్ లో ఎక్కడా ప్రతి విద్యార్థికీ అని చెప్పకుండా ప్రతి తల్లికీ అని తెలివిగా చెప్పారు. దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి. కేశవ్ బడ్జెట్ ప్రసంగం మొత్తమ్మీద 22 సార్లు విమర్శలు చేయడం ద్వారా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కూటమి సర్కారు ఎంత భయపడుతున్నది బయటపెట్టుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ ద్వారా ప్రజలను మళ్లీ మభ్య పెట్టే యత్నం చేసే క్రమంలో వారి డొల్లతనాన్ని వారే బయట పెట్టుకున్నారు. కాకపోతే ఈనాడు ,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియాకు మాత్రం ఇది బాహుబలిగా.. పండంటి ప్రగతికి పది సూత్రాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే ప్రజలకంటే ఈ ఎల్లో మీడియా వారికే వారికే ఈ ప్రభుత్వం వల్ల అధిక గిట్టుబాటు కనుక.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?
సాక్షి, చిత్తూరు: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ(ACB) అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లంచావతారమెత్తిన అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్‌ల కోసం భారీగా డిమాండ్ తలెత్తింది. అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లించినట్టు అప్పట్లో దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏపనికి వెళ్లినా మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! ‘చంద్రగిరి(Chandragiri) పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్‌లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్దినేష్ను డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వర య్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ దినేష్ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు చంద్రగిరి మేజర్ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
పవనూ.. మరీ ఇంతకు దిగజారాలా!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమాషాగా ఉన్నాయి. ‘‘కింద పడతాం.. మీద పడతాం.. అవి మా ఇంటి విషయాలు.. కూటమి విషయాలు. ఒక మాట అనవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలో అడుగు పెట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పొంతన లేని అంశాలను బలవంతంగా అతికినట్టుగా అనిపిస్తుంది. ‘‘ఇది తన గురించో, చంద్రబాబుల గురించి కాదని, ప్రజల కోసం నిలబడి ఉన్నామని, కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతామని, అందుకే మాటిస్తున్నానని అంటూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమనించి మరో పదిహేనేళ్లు కలిసి ఉంటాము’’ అని పవన్ అనడం దేనికి సంకేతం?.. తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని పవన్ కల్యాణ్ ఎలాగోలా శాసనసభలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అది సంతోషమే. కానీ ఆయన సమస్యలపై ప్రశ్నించకుండా.. ప్రభుత్వంలో జరిగే తప్పులపై గొంతెత్తకుండా ఆత్మపరిశీలన చేసుకోకుండా, చేసిన బాసలను గాలికి వదలి పలాయన వాదంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యల కన్నా ఉదాహరణ అవసరం లేదేమో!.👉ఇంతకీ పవన్ చేసిన ఆ వ్యాఖ్యల సారాంశం ఏమిటి? తమలో తాము ఎన్ని గొడవలు పడ్డా కలిసే ఉంటామని చెప్పడమే కదా! ఈ మాట అంటున్నారంటేనే ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది. ప్రభుత్వం సమర్థంగా పని చేస్తుందని హామీ ఇవ్వకుండా వీరిద్దరూ తిట్టుకుంటే ఎవరికి కావాలి? కిందపడితే ఏంటి? మీద పడితే ఎవరికి ఆసక్తి? ఆయన అన్నట్టే అది వారి అంతర్గత వ్యవహారం. ప్రజలకు సంబంధించిన అంశం కాదు. అయితే... శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలేమిటి? చేసిన వాగ్దానాలేమిటి? ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిన వైనం ఏమిటి? వీటిని ప్రశ్నించకుండా ఎవరూనా ఎలా ఉండగలరు? సుగాలి ప్రీతి మృతి కేసు నుంచి 31 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ సంచలనం కోసం పిచ్చి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. తీరా పదవి వచ్చాక వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ మధ్య కాలంలో జరిగిన వివిధ పరిణామాలలో పవన్ పలు అవమానాలకు గురయ్యారని జనసేన కార్యకర్తలు బాధ పడ్డారు. కానీ పవన్ తన మాటల ద్వారా ఆ అవమానాలను పట్టించుకోబోనని చెప్పినట్లు అయ్యింది. ఎంత పదవిలో ఉంటే మాత్రం పవన్ టీడీపీకి ఇంతగా లొంగి ఉండాలా అన్నది జనసేన కార్యకర్తల ఆవేదన. తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirumala Stampede Incident) తర్వాత పవన్ కల్యాణ్ ఓవరాక్షన్ చేశారని టీడీపీ ముఖ్యనేతలే వ్యాఖ్యానించిన సంగతిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన జనసేన క్యాడర్ సహించలేక సోషల్ మీడియాలో టీడీపీ వారికి పోటీగా ఎలా పోస్టులు పెట్టిందో తెలియదా! ఇవన్ని ఎవరి ఇంటి విషయాలు..? అంటే జనసేన కూడా టీడీపీలో భాగమని చెబుతున్నారా? కూటమి విషయాలైతే ఎన్నడైనా చర్చించుకున్నారా? అంత దాకా ఎందుకు.. పిఠాపురంలో పోలీసులు తన మాట వినడం లేదని ఎందుకు చెప్పారు? నెల రోజుల పాటు ఎవరి మీద అలిగి ఫైళ్ల జోలికి వెళ్లకుండా ఉన్నారు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? సనాతని వేషధారణ వేసుకున్నాక, ధర్మ బద్దంగా ఉండాలి కదా! అసత్య వచనాలు పలకరాదని కదా ఆ ధర్మం చెబుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కదా ఏ ధర్మం అయినా చెప్పేది. కాని పవన్ కల్యాణ్ వాటిని పాటిస్తున్నారా?. తిరుమల లడ్డూ విషయంలో(Tirumala Laddu Row) ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి అపచారం కాదా? వలంటీర్ల పొట్టకొట్టబోనని పవన్ హామీ ఇచ్చారా? లేదా? అధికారం ఎంజాయ్ చేస్తూ వారి గురించి మాట్లాడకపోగా.. అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని వ్యాఖ్యానించడం పొట్ట కొట్టడం అవుతుందా? లేదా? ఇదేనా సనాతన ధర్మం చెప్పేది? శాసనసభలో ఆయన మాట్లాడిన విషయాలలో సత్యదూరమైనవి ఎన్ని ఉన్నాయి? వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు నినాదాలు చేసినందుకే... గవర్నర్‌కు గౌరవం ఇవ్వని పార్టీ సభలోకి అడుగు పెట్టకూడదని ఆయన కొత్త సూత్రం చెబుతున్నారే..! మరి గవర్నర్ వ్యవస్థే వద్దన్న టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? గతంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుంటే.. తెలుగుదేశం సభ్యులు ఆయన కుర్చీని కూడా లాగి పారేశారు. అలా చేసిన వారిలో ఒకరైనా రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. గత టర్మ్‌లో గవర్నర్ హరిచందన్ స్పీచ్ సమయంలో కానీ, స్పీకర్ పై కానీ టీడీపీ సభ్యులు ఎన్ని అల్లర్లు చేశారో ఒకసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. తన సహ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక విజిల్ పట్టుకువచ్చి సభలో ఈల వేస్తూ తిరిగారే. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను బెదిరించేవారే! కొందరు టీడీపీ నేతలు ఎలా దూషించారో ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు. ఇవన్ని మంచి పద్దతులేనా? అలాంటి పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబితే సరిపోతుందా?. ఏమిటో కొత్తగా స్టేట్ రికన్సిలియేషన్ కేబినెట్ (Reconciliation Cabinet) అని అంటున్నారు. స్వాతంత్రం వచ్చాక ఎన్నికలకు ముందు ఏదో జరిగిందని, ఇప్పుడు కూడా అలాగే ఉందని అనడం ఏమిటో?. బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా నెహ్రూ కేబినెట్ లో ఉన్నా ఆయా అంశాలపై విబేధించేవారని అన్నారు. అంటే ఏపీలో కూడా అలాగే చంద్రబాబును నిలదీస్తారా? ఆ ధైర్యం పవన్‌కు నిజంగా ఉందా? అలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అనేక పరిణామాలలో ఒక్కసారైనా ప్రజల పక్షాన మాట్లాడారా? శాంతిభద్రతల విషయంలో మాట్లాడినట్లే మాట్లాడి వెంటనే ఎందుకు జారిపోయారు? ప్రతిపక్షం ముఖం చాటేస్తే తామే ఆ బాధ్యత నిర్వహిస్తామని అన్నారు. 👉పవన్ ఆ పని చేసినా, చేయకపోయినా, ముందుగా సూపర్ సిక్స్ గురించి చంద్రబాబును ప్రశ్నించి ఉంటే, తన బాధ్యత ఏమిటో చెప్పి ఉంటే అప్పుడు ఆయన ఏమి చెప్పినా జనం నమ్మవచ్చు. తన శాఖకు సంబంధించి ఆయన గ్రామ సభలు, గోకులాలు అంటూ ఏవేవో చెప్పుకున్నారు. కాని వాటిని టీడీసీ వారే ఎవరూ పట్టించుకోవడం లేదన్న సంగతి ఆయనకు కూడా తెలిసి ఉండాలి. ఆంధ్రులకు కుల భావన ఉందని శాసనసభలో బాధ పడినట్లు నటించారు. మరీ ఇదే పవన్ కల్యాణ్ గతంలో కనీసం కుల భావన అయినా తెచ్చుకోండని అన్నారే! తనకైనా ఫలానా కులం వారు ఓట్లు వేయాలని అన్నది వాస్తవం కాదా! దీనికి సంబంధించి అప్పట్లో వీడియోలు వచ్చాయే! ఎవరిని మభ్య పెట్టడానికి ఈ మాటలు?. 👉విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని అంటున్నారు. సంతోషమే కానీ.. భవిష్యత్తులో కూడా జరగదని చెప్పగలిగితే బాగుంటుంది. ఒకపక్క అక్కడ అనేక మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తుంటే, మరోపక్క పవన్ ఇలా మాట్లాడుతున్నారు. బూతులు ఎవరు మాట్లాడినా తప్పే. కాని టీడీపీ, జనసేనల దూషణలకు, పెట్టిన బూతు పోస్టింగ్‌లకు ఆయన ఎలా మద్దతు ఇస్తున్నారు?. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక నేతపై మహిళల వేధింపు ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి సస్సెండ్ కూడా చేయలేక పోయారే! ఆ మాటకు వస్తే ఎన్నికల సమయంలో పవన్ ఎన్ని దూషణలకు పాల్పడింది ఆధార సహితంగా ఉన్నాయి కదా! 2009లోనే యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి కాంగ్రెస్ వాళ్ల పంచెలు ఊడగొడతానని అన్నది ఈయనే గదా అని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును జైలులో ఎందుకు పెట్టింది తెలియదా? స్కిల్ స్కామ్‌లో తొలుత కేసు పెట్టింది ఈడి కాదా? గతంలో కులాలు, మతాల మధ్య గొడవలు వచ్చేలా రోజుల తరబడి మీడియా సమావేశాలు పెట్టి లైవ్ లో మాట్లాడిన ఒక నేతను ఇప్పుడు పెద్ద పదవిలో కూటమి కూర్చోపెట్టుకుందే!. చంద్రబాబు, లోకేష్‌లతో ఏదో జిగిరి దోస్తి ఉన్నట్లు ఇప్పుడు చెబుతున్నారు కాని, 2018లో ఇదే పవన్ వారిని ఉద్దేశించి ఎన్ని తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది తెలియదా? రాజకీయాలలోకి వచ్చి చెగువేరా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ అన్నారు. తదుపరి వారిని కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి, వామపక్షాలతో కలిసి జట్టుకట్టారు. ఆ తర్వాత మళ్లీ మోదీ, చంద్రబాబు అన్నారు. .. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెబుతారు? నిజంగానే కిందా, మీద పడి పదవిలోకి వచ్చిన పవన్.. ఆ పదవి మీద మోజు పెంచుకోవడం తప్పు కాదు. కానీ అదే ప్రధానమన్నట్లుగా వ్యవహన్నారనే భావన ఏర్పడుతోంది. ప్రజల కోసం నిలబడకుండా చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం పనిచేస్తూ, సనాతని వేషం ధరించి కూడా అబద్దాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏ ధర్మం అవుతుందో ఆయనకే తెలియాలి!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.
-
ఆ మాటలు నిజంగా మనసులోంచే వచ్చాయా?
కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయాలన్నది ఒక థియరీ. దీన్ని బాగా వంటబట్టించుకున్న వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందువరుసలో ఉంటారు. రాజకీయ చరిత్ర మొత్తం ప్రజలను గందరగోళం పరచడం ద్వారా లేదంటే మాయ చేయడం ద్వారానే సాగిందని ఇట్టే అర్థమైపోతుంది. ఈ కారణం వల్లనే ప్రజలకు ఆయనపై అంత విశ్వాసలేమి!. కొన్ని ఇతర కారణాల వల్ల ఆయన నాలుగుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్నైతే సంపాదించుకోగలిగారు. కానీ ఆ స్థాయిలోనే ప్రజల నుంచి గౌరవం, ఆదరణ, మన్నన పొందుతున్నారా? సందేహమే. ఈ చర్చ ఇప్పుడెందుకు వస్తోందంటే.. తాజాగా ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అవి నిజంగానే చంద్రబాబు(Chandrababu) మనసులోంచి వచ్చాయా? లేక ఇంకోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే బదులుండదు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడంలోనూ బాబు గారు దిట్టే. తద్వారా పరిస్థితి ఏదైనా క్రెడిట్ మాత్రం తన ఖాతాలోనే పడేలా వ్యవహరిస్తూంటారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనే తీసుకుందాం.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా వాటి అమలు ఊసేలేదు. కానీ మాటలు మాత్రం బోలెడన్నిసార్లు మార్చేశారు. ఒకసారేమో.. బటన్ నొక్కితే సరిపోతుందా? అంటారు.. ఇంకోసారి సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటారు. మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్, ఏపీలో జగన్ మోడల్ సంక్షేమం విఫలమయ్యాయి అనేస్తారు. అలాగే.. సంపద సృష్టించకుండా ప్రజలకు డబ్బు పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడ? అని ప్రశ్నిస్తారు!. ఎన్నికల ముందు సంపద తాను సృష్టించగలనని గంభీర ఉపన్యాసాలు చేసేదీ ఈయనే.. అధికారంలోకి వచ్చాక సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పండని జనాన్ని అడిగేదీ ఈయనే కావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో చంద్రబాబు ఒక మాట చెప్పించారు. అదేమిటంటే 'ఒక వ్యక్తికి చేపలు ఇవ్వడం కాదని, చేపల వల ఇవ్వాలి" అనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తారని తెలిపారు. ఏమిటి దాని అర్థం? సంక్షేమ పథకాల వల్ల డబ్బు వృథా అవుతుందనా? ప్రజలకు నగదు పంపిణీ వల్ల నష్టమనే కదా? వీటిని సమర్థించే వారు కూడా ఉండవచ్చు. కానీ.. వారికి షాక్ ఇచ్చే తీరులో ఆ మరుసటి రోజే చంద్రబాబు అందరికన్నా తానే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రకటించారు. సూపర్‌సిక్స్ సహా హామీలన్నీ అమలు చేస్తానని కూడా ఆయన ప్రకటించేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చువుతుందని అంచనా. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవుతూంటేనే విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటే నమ్మగలమా?. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్షీణించిందని అంటారు. మరి అలాంటప్పుడు అవే విధానాలను కొనసాగిస్తానని చెప్పడమే కాకుండా, జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అనేవారా? కాదా? నాలుగుసార్లు సీఎం అయినా ఈ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదని అంటారు. ఒకసారి పాత రికార్డులు తిరగేస్తే వాస్తవాలు తెలుస్తాయి! 👉1994లో తొలిసారి ఆర్దిక మంత్రి అయిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా నాశనం చేసేసిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం. ఆ తరువాత ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి లాగి పడేశాక కూడా అదే మాట. 👉1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టైమ్‌లో ఉన్న మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం మొదలైన వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నడిపి మొత్తం మార్చేశారు. లోక్ సభ ఎన్నికలలో మాత్రం మద్య నిషేధాన్ని కఠినతరం చేస్తామని ప్రచారం చేశారు. 👉2004 ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారం. అప్పటి వరకు విద్యుత్ సంస్కరణల పేరుతో ఛార్జీల పెంపు, 56 ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, జన్మభూమి కింద ప్రజల నుంచి ఆయా పనులకు డబ్బులు వసూలు చేయడం వంటివి చేశారు. ఎన్నికలు వచ్చాక కోటి వరాలు అంటూ ప్రజలకు స్కీములు ప్రకటించారు. 👉2009లో సైతం నగదు బదిలీతోసహా అనేక వాగ్దానాలు చేశారు. టీడీపీ వాగ్దానాల డొల్లతనాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎండగట్టిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. 2004 నుంచి 2024 వరకు ఎన్ని విన్యాసాలు చేసింది తెలిసిన చరిత్రే. తాను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలంతా కష్టాలలో ఉన్నట్లు చెబుతారు. రైతుల రుణమాఫీతో సహా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని అంటారు. అధికారంలోకి రాగానే అవన్ని వృధా ఖర్చు అని సూక్తులు చెబుతారు. తాజాగా తొమ్మిది నెలల పాలనలో కన్నా, అంతకుముందు ఏడాది జగన్ పాలన(YS Jagan Term)లో ఆర్థికాభివృద్ది రేటు, జీఎస్టీ, జీఎస్డీపీ వంటివి అధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నా, ఆయన మాత్రం తన పంథాలో విధ్వంసం జరిగిందని ఆరోపిస్తారు. అలాగని ఆ విధ్వంసం ఏమిటో వివరిసారా? ఊహూ లేదు!పడికట్టు పదాలతో, కొత్త కొటేషన్లతో జనాన్ని మాయ చేయగలిగితే చాలన్నది ఆయన విధానంగా కనిపిస్తుంది. తాజాగా తల్లికి వందనం(Thalliki Vandanam) పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ప్రకటించారు. చేస్తారో లేదో ఇంకేమి మతలబు పెడతారో తెలియదు. కానీ.. ఏడాది కాలం ఈ పథకాన్ని ఎగవేసిన సంగతి దాచేస్తారు. పైగా మే నెలలో స్కూళ్లు తెరవరు. మరి ఏ ప్రాతిపదికన ఈ పథకానికి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తారో చూడాలి మరి!. అదే కాదు. ఒక్క ఫించన్లు, అన్న క్యాంటిన్లు, అరకొర ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ తప్ప, మిగిలిన ఏ పథకం కూడా అమలు కాలేదు. వాటికి ఇంతవరకు షెడ్యూలే ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు, రైతు భరోసా రూ.20 వేలు, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ తదితర హామీలను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తుంగలో తొక్కేశారు. చంద్రబాబు భావన ప్రకారం.. గవర్నర్ స్పీచ్‌లో చెప్పించినట్లుగా అయితే ఈ స్కీములన్నీ చేపలే అవుతాయి. కాని, చేపలు పట్టే వలలు కావు కదా! వాటి మీద క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేయరు. ఒకప్పుడు అసలు భారీ ప్రాజెక్టులంటేనే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు. అవి వెంటనే పూర్తి కావని, ఎన్నికలకు ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. కాని ఎన్నికలకు ముందు భారీ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం జోరుగా శంకుస్థాపనలు చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదలివేస్తే, అప్పటి విపక్షనేత రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాలకు వెళ్లి పూలు పెట్టి వచ్చారు. తన హయాంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా సుముఖత చూపని చంద్రబాబు... వైఎస్ చొరవతో ముందుకు వెళ్లిన తరువాత పోలవరం తన కల అంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా రూ. 85 వేల కోట్లతో ‘జల్ జీవన్’ మిషన్ కింద స్కీమును, రూ.80వేల కోట్లతో పోలవరం-బనకచర్ల స్కీమును అమలు చేస్తామని చెబుతున్నారు. వీటిలో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందంటున్నారు. అవి ఎలా ముందుకు వెళుతాయన్నది ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. సామాన్యుడికి మద్యం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చంద్రబాబు చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరచవలసిన సీఎం అలా మాట్లాడితే ఎలా? అని విమర్శిస్తున్నారు. ఇక స్వర్ణాంధ్ర, విజన్ 2047, కొత్తగా పీ-4 వంటి అంశాలతో ప్రజలను ఊహాలోకాలలోకి తీసుకువెళ్లడానికి తన ప్రసగంలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సోషల్ మీడియా యుగం వచ్చాక చంద్రబాబు మాయలన్ని తెలిసిసోతున్నాయి. అదే ఆయనకు సమస్యగా ఉంది. దాంతో సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో హామీలు అమలు చేస్తూ, నిర్మాణాత్మకంగా ప్రగతి వైపు ప్రభుత్వాన్ని నడిపితే సంతోషమే. కానీ ఆయన చేసే మాటల గారడీ రీత్యా ఆ పరిస్థితి కనబడడం లేదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: పోసాని అరెస్ట్.. అసలు జరిగింది ఇదే! -
మొత్తానికి ‘సూపర్ సిక్స్ వేస్ట్’ అని గవర్నర్‌తో చెప్పించారే!
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఎన్నికల హామీల అమలు, ప్రగతి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం దీనికి భిన్నం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల ప్రణాళిక, హామీల ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) ముగించేసింది. ఏమిటి దీనర్థం? వాగ్ధానాలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Syed Abdul Nazeer) ప్రసంగం మొత్తాన్ని తరచి చూసినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించిన విషయం పెద్దగా కనపడదు. ఎన్నికల ప్రచారంలో ఈ ఆరు హామీలపైనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రమంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాగోలా అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు, పవన్ కల్యాణ్ , లోకేష్‌లు ఈ హామీల ఎగవేతకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. హామీల అమలుకు బదులు ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవడంపైనే పాలకపక్షం దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తల, నేతల ఆస్తుల విధ్వంసం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రం ఇప్పటికే అరాచక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై విమర్శలు!. జగన్ అధికారంలో ఉండగా ప్రశంసించిన మంత్రివర్గాన్నే ఇప్పుడు గవర్నర్ విమర్శించాల్సిన పరిస్థితి. ప్రసంగాన్ని గవర్నర్ స్వయంగా కాకుండా.. పాలకపక్షం తయారు చేసి ఆయన చేత చదివిస్తుంది మరి! భారత రాజ్యాంగంలోని ఒకానొక వైరుద్ధ్యమిది. 👉గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ టాప్ 25 హామీలు అంటూ ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నారు. సంతకమైతే పెట్టారు కానీ.. గడువులోగా అమలు చేయలేదు. గవర్నర్ ప్రసంగంలో దీని గురించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. వృద్ధాప్య ఫించన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని చెప్పారు. కానీ, లక్షల సంఖ్యలో ఫించన్ల కోతకు కారణమేమిటో వివరించలేదు. అలాగే పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలందరికీ రూ.1500, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకంలో భాగంగా ఇంట్లోని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు, వలంటీర్ల గౌరవ వేతనం రూ.పది వేలకు పెంపు, అందరికీ అందుబాటులో ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పూర్ టు రిచ్, బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్ వర్తింపు, పెళ్లికానుక కింద రూ.లక్ష, పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిల్లో.. గ్యాస్ సిలిండర్లు పథకం అరకొరగా అమలు అవుతోంది. ఇసుక ఉచితం అనేది ఉత్తుత్తి మాటగానే మిగిలిపోయింది. వీటితోపాటు మిగిలిన హామీల పురోగతి, అమలుకు ఉన్న అడ్డంకులను గవర్నర్‌తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ సూపర్ సిక్స్ హామీలను ఇవ్వనట్లు గవర్నర్ ప్రసంగం సాగిందనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఏటా ఎన్నికల ప్రణాళికలోని అంశాల అమలును గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు నివేదించేది. టీడీపీ ప్రభుత్వం(TDP Government) మాత్రం అలవికాని హామీలను ఇవ్వడమే కాకుండా.. ఆచరణ ప్రశ్నార్థకంగా ఉన్న పలు అంశాలను చెప్పుకుని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందట. కుల వృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్ధిరత్వం వస్తుందట. గీత కార్మికులకు పదిశాతం మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోందని, విప్లవానికి నాయకత్వం వహిస్తోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా!. 👉యథా ప్రకారం స్వర్ణాంధ్ర -2047 సాధనకు పది సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏమిటంటే ఆ పది సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్నట్లుగా గవర్నర్‌తో చెప్పిస్తే ఏమి ప్రయోజనం?. అది నిజమో ,కాదో ప్రజలకు తెలియదా? తాము ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని అన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేసినట్లే రాశారు. వారికి కూడా తెలుగు అర్థం కాలేదా!. కేంద్ర పధకాలను పునరుద్దరించారట. తొమ్మిదివేల కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వ టైమ్ లోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు(Chandrababu)కు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. 👉ఇక రోడ్లు, ఇతర పనుల బిల్లులు రూ.పది వేల కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే. కాని దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని అనడమే ఒకింత ఆశ్చర్యం!!. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి ఆశించిన స్థాయిలో లేక, జీఎస్టీ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. మరోపక్క గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, ,గ్రీన్ కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వీటిలో బీపీసీఎల్, గ్రీన్ కోలు జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్ కో కర్నూలు జిల్లాలో రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కూటమి సర్కార్ వీటిని తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వలంటీర్లు లక్షన్నర మందిని తొలగించారు. ఇతరత్రా కొన్నివేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు ఎక్కడ వచ్చాయో ప్రభుత్వం వివరంగా చెబితే బాగుండేది. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరిని స్కీమ్‌లు, డబ్బులతో ముంచి లేపుతానని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పాత కొటేషన్ ను అందుకుంది. ఎవరికైనా చేపను ఇస్తే అది అతని ఆకలిని ఒక్క రోజే తీర్చగలదు. అదే కనుక మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి లభిస్తుందనే సూక్తిని చంద్రబాబు అనుసరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. అంటే అర్థమైంది కదా? సూపర్ సిక్స్, ఇతర హామీలు వేస్ట్ అని చెప్పడమే ఇది! ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు.. ప్రపంచ మార్కెట్లో అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు.. ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేయత్నం సాగించారు. రోడ్లను బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే రూ.15వేల కోట్ల మేర బాదిన ప్రభుత్వం ఇప్పుడు పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కాని ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. అన్నా క్యాంటిన్లు హామీ అమలు నిజమే కాని, దానితోనే పేదరికం పోయేటట్లయితే, పేదల ఆకలి తీరేటట్లయితే వాటినే రాష్ట్రం అంతటా వీధి, వీధిన పెడితే సరిపోతుంది కదా? మరి ఇది చేపల వల అవుతుందా? లేక చేపలు ఇచ్చినట్లు అవుతుందో వివరిస్తే బాగుంటుంది. మొత్తం మీద గవర్నర్ స్పీచ్‌లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ సిక్స్ హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవి అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫైబర్ నెట్ క్లోజ్ చేసేలా చంద్రబాబు కుట్ర: గౌతంరెడ్డి
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫైబర్ నెట్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైబర్ నెట్ కార్పోరేషన్(FiberNet Corporation) మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం. అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. 2014-19లో చంద్రబాబు ఫైబర్ నెట్లో భారీగా అవినీతి చేశారు. అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించాం. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సీఐడీ నిరూపించిందిచంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారు. ఫైబర్ నెట్ లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబు అవినీతి చేశారు. ఆ అవినీతిని జగన్ గుర్తించి విచారణ జరిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు అవినీతి(Chandrababu Corruption) చేసి అరెస్టు అయ్యారు. ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. సంస్థను పూర్తిగా క్లోజ్ చేసేలా కుట్ర పన్నారువైఎస్ జగన్ ప్రోత్సాహంతో మా హయాంలో రూ.190లకే ఇంటర్నెట్ ఇచ్చాం. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చర్యలు చేపట్టాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కనెక్షన్లు ఇచ్చాం. అందుకే మా హయాంలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టి ఆదాయం పెరిగింది. ఏడాదికి 1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాం. కానీ.. చంద్రబాబు కుట్రతో ఫైబర్ నెట్ ని క్లోజ్ చేయబోతున్నారు. మా హయాంలో 20 లక్షల బాక్సులను కేంద్రం నుండి ఉచితంగా వచ్చేలా మేము ఏర్పాటు చేశాం. వాటిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చి ఫైబర్ నెట్ కి ఆదాయం పెంచాలి. అంతేగానీ సంస్థలను నాశనం చేయవద్దు. తనమీద ఉన్న కేసుని తప్పించుకోవటానికి చంద్రబాబు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేసును ఎదుర్కోవాలి. రైతుల కోసం మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ పై కేసు పెట్టారు. మరి మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న చంద్రబాబు మీద ఎందుకు పెట్టలేదు?. ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మీడియా సంస్థలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
ఆ ట్రోలింగ్‌ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది. పవన్ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు, పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతుండగా, ఈ పోస్టు మరింత అగ్గి రాజేసిందంటున్నారు. ఇదిలా ఉండగా తన సోషల్ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని, గురువారం తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాదు లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.ఈరోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో కి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని (1/2)— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025 -
జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్ కోసం వస్తున్న తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్ కల్యాణ్ ఫెయిల్ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్, శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక.. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే.. కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్సీపీ పైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ బట్టలు తీసేసి.. పచ్చ బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే.. జనంలో తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు. రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు స్పందిస్తున్నట్లు లేదు. అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు వస్తే ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శకు జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న బాలిక జగన్ ను కలవడానికి పడిన తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘రైతుల గోడు వింటే కేసు పెడతారా?’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరదీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) అసలు ఆ పర్యటనకు రాకపోయినా కేసు నమోదు చేయడం. వైఎస్ జగన్, పేర్ని నానితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, గుంటూరు మేయర్ కావట్టి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిర్చి రైతుల(Mirchi Farmers) కష్టాలుపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే కక్ష కట్టి చంద్రబాబు ప్రభుత్వం తమ నేతలపై కేసు పెట్టిందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
గుంటూరులో ఘాటెత్తిన అభిమానం (చిత్రాలు)
-
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయంజగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు. సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్‌ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
ఇదీ బాబు, లోకేష్‌లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
వంశీ ఏ తప్పూ చేయలేదు.. ఇది చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్
విజయవాడ, సాక్షి: వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలుఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది.ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో, జడ్జ్ గారు ఇచ్చిన సమన్లతో, పోలీసుల నుంచి సమన్లు అందుకుని, న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జ్ గారి ముందు హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.ఇదీ కేసు చరిత్ర2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తట్టించారు.మర్నాడు ఫిబ్రవరి 20న చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు. అ తర్వాత అక్కణ్నుంచి ఒక ప్రదర్శనగా వెళ్లి వైయస్సార్సీపీ కార్యాలయం చేరుకుని అక్కడ, శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా టీడీపీ మూకలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు.ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు.పోలీసులు సుమోటోగా తెలుగుదేశం వారితో పాటు వైయస్ఆర్ సీపీ వారిపైనా కూడా కేసులు పెట్టారు. అందులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనా స్థలంలో లేరు.కుట్రపూరితంగా..ఇది జరిగిన రెండు రోజుల తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు మనుషులు పిలిపించారు.అక్కడ సత్యవర్థన్ తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఆ ఘటనా స్థలంలో లేరు కాబట్టి.2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ స్టేట్మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని కూడా చెప్పారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసు రీఓపెన్ చేశారు. వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు.అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని చంద్రబాబు కుట్రను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయినా తప్పుడు కేసు పెట్టారు.ఆ ఆఫీస్ చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. ఆయన ఎస్సీ. అలా వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ఇది.మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలలు తరబడి వైయస్ఆర్ సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.చంద్రబాబు, లోకేష్ కుట్రఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్రపన్నారు.పలు సమన్ల తర్వాత 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు హాజరైన సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్రపన్నారు.సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ, ఆ మర్నాడే 11న విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి, బెదిరించారు.ఆ మర్నాడు ఫిబ్రవరి 12న సత్యవర్థన్ అన్నతో సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని, అతడిని కిడ్నాప్ చేశారని, దీనిని ఎవరో చూసి తమకు చెప్పారంటూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు.ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అదే రోజు 13వ రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి, అందులో వంశీపై చెప్పించారు.అంటే కనీసం ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో.. అతడి స్టేట్మెంట్ నమోదు చేయక ముందే, వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది.దొంగ కేసులకు నిదర్శనంఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారు.దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.దిగజారిన ప్రజాస్వామ్యం:పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాలకు గానూ అన్నింటినీ వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశంకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.కానీ, నిన్న జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. తిరుపతి కార్పోరేషన్లో మొత్తం 49 స్థానాలుంటే, అందులో వైయస్ఆర్సీపీ 48 స్థానాలను, తెలుగుదేశం ఒక స్థానంను గెలుచుకుంది. అటువంటి చోట డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ను గెలుచుకున్నామని చెప్పుకున్నారు. అటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం ఒక్కటి కూడా గెలుచుకోలేదు.అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్ ఛైర్మన్‌ను ఎలా గెల్చుకుంటుంది? ఇక్కడ దౌర్జన్యం చేసి వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ వత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎన్నిక జరపరు. పాలకొండలో వైయస్ఆర్ సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్ చైర్మన్ పదవి వైయస్ఆర్ సీపీకే వస్తుందని ఎన్నికను వాయిదా వేయించారు.పోలీసులూ గుర్తుంచుకొండిపోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యంకు తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీస్ కు చెబుతున్నాను, మీ టోపీల కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నడంట. నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను అని. రిటైర్ అయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, మొత్తం అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. బట్టలు ఊడదీస్తాం.– న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం. – అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..ప్రతి కేసూ ఇల్లీగల్ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవ్వన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.అసలు ఎవరు, ఎవరిని బెదరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.ఇవ్వన్నీ ఊరికే పోవు. ఇవ్వన్నీ కూడా వీరికి చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్తితి అతి దారుణంగా తయారవుతుంది.వంశీ ఎందుకు టార్గెట్ అంటే..తన సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి (వంశీ) ఎదుగుతున్నాడని.. అతడు తన కంటే, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నాడని చంద్రబాబుకు కోపం. అలాగే కొడాలి నానిపైనా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం. ఇంకా అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం.కేవలం తాను, తన కుమారుడు మాత్రమే ఆ సామాజికవర్గంలో లీడర్లుగా ఉండాలని చంద్రబాబు మాట. అందుకే వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.అదో మాఫియా రాజ్యంచంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్. వారిపై బురద చల్లడం. వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అద్దం పడుతున్నాయి. -
రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
నచ్చినట్లు పాలిస్తే.. ఎవరికి నష్టం?
ఆంధ్రప్రదేలో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిధులను తమకిష్టమైన వారికి పందేరం పెట్టేందుకు టీడీపీ, జనసేనలు తామిచ్చిన హామీను కూడా పక్కనబెట్టేస్తున్నాయి. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర కూడా పడింది. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ కోసం అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేకాకుండా నీరు-చెట్టు స్కీమ్ పెండింగ్ బకాయిల పేరుతో ప్రభుత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా అప్పట్లో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పెట్టిన కేసులను సైతం ఎత్తివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటే, అవినీతికి ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అర్థమవుతుంది. 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు పనులు చేయకుండానే పెద్ద ఎత్తున బిల్లులు క్లెయిమ్ చేశారని అంచనా. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు కూడా ఈ పథకంలోనే రూ.13 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చిన నిధులను కూడా టీడీపీ వారు కైంకర్యం చేసేశారని కూడా ఆయన విమర్శించారు. నీరు-చెట్టు కింద ఆ స్థాయిలో అవినీతి జరిగితే ఇప్పుడు ఆ స్కీమ్ లో ఖర్చు చేశామని చెబుతూ వచ్చిన బిల్లులన్నిటిని చెల్లించాలని నిర్ణయించారట. సుమారు రూ.900 కోట్ల బిల్లులు ఇచ్చేస్తున్నారట. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకంలో అవినీతిని నిగ్గుతేల్చి పనులు చేసిన వారికే నిధులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా.. విజిలెన్స్ శాఖ అవినీతిపై నివేదికలు సిద్ధం చేశారు. కొందరిపై కేసులూ పెట్టారు. అప్పట్లో కొంత మంది తమకు చెల్లించాల్సిన బిల్లులపై కోర్టుకెల్లి సానుకూల తీర్పులు పొందగలిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నీరు-చెట్టు పథకం కాంట్రాక్టులు పొందిన వారి పంట పండింది. గత ప్రభుత్వపు విజిలెన్స్ నివేదికలు కూడా పక్కనబెట్ట కేసులన్నిటిని ఎత్తివేసి మరీ బిల్లులు చెల్లించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్, నేతలు, అప్పట్లో పనులు చేసిన వారిపై కక్ష కట్టి వేధిస్తోంది. బిల్లులు నిలిపి వేస్తోంది. టీడీపీ, జనసేన ,బీజేపీలకు చెందిన వారిపై మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా అవాజ్య ప్రేమ కనబరుస్తోంది. సూపర్ సిక్స్ హామీలకు డబ్బులు లేవని చెప్పే ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల బిల్లులకు మాత్రం వందల కోట్లు చెల్లించడానికి సిద్దమైన తీరు ‘ఔరా’ అనిపిస్తోంది. జనం ఏమైపోయినా ఫర్వాలేదు..తమ కార్యకర్తలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే చాలన్నట్లుగా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఆ రోజుల్లో విజిలెన్స్ అధికారులు కేసులు పెడితే అక్రమం అని అంటున్న కూటమి నేతలు, ఇప్పుడు YSRCP వారిపై పెడుతున్న విజిలెన్స్, ఇతర శాఖల కేసులు మాత్రం సక్రమమని చెబుతోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సైతం వేధిస్తూ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజా చర్యతో ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. ఇప్పుడు కక్షపూరితంగా పెడుతున్న కేసులను ఒకవేళ మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ఎత్తివేయదా? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. జగన్ టైమ్‌లో గ్రామాలలో నిర్మాణమైన అనేక భవనాలకు బిల్లులు పెండింగులో ఉన్న వాటిని మంజూరు చేయడం లేదని చెబుతున్నారు. YSRCP వారు ఎవరైనా పార్టీ మారి కూటమికి మద్దతు ఇచ్చి, ఎవరైనా కూటమి ఎమ్మెల్యేనో, లేక మంత్రినో ప్రసన్నం చేసుకుంటేనే అవి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎదురుగా కనబడుతున్న పనులకు బిల్లులు ఇవ్వకుండా, అసలు జరిగాయో లేదో తెలియని, కనిపించని నీరు చెట్టు పనులకు మాత్రం కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీ ప్రభుత్వంలో కోటి రూపాయల మించి జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర స్థాయిలో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం ఇతర నాయకులు, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా పనులు చేపడితే చాలు.. అడ్వాన్స్ మొత్తం పొందవచ్చు. నిధులు తీసుకున్న తర్వాత ఎంతమేర కాంట్రాక్టులు సజావుగా జరుగుతాయో తెలియదు. ఆ రోజుల్లో భారీ ప్రాజెక్టులను ఈపీసీ (ఎస్టిమేషన్ ,ప్రొక్యూర్ మెంట్, కనస్ట్రక్షన్ ) పద్ధతిలో నిర్మించడం కోసం అడ్బాన్స్ లు ఇవ్వాలని తలపెట్టారని, ఇప్పుడు అన్ని పనులకు ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ ఒకరు అన్నారు. సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం,ఇలా నీరు-చెట్టు స్కీమ్ బకాయిలు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లకు మాత్రం ఉదారంగా డబ్బులు ఇస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక విషయంలో కాదు.. అనేక అంశాలలో ప్రభుత్వ తీరు ఇలాగే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో చూడండి.. రాజకీయంగా తమకు సవాల్ విసురుతున్న ప్రముఖులను ఆ కేసులో ఎలాగొలా ఇరికించాలని టీడీపీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తానే వివేకాను హత్య చేశానని అంగీకరించిన దస్తగిరి అనే నిందితుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పన్నాగాలు చేస్తున్నారు. ఈ కేసును సీబీఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్నా, కొత్త కేసులు పెట్టి వైఎస్సార్సీపీ అధినేత జగన్ బంధువులు, సన్నిహితులు కొందరిని ఇరికించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ఉంది. తను జైలులో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఇరవై కోట్లు తెచ్చి ప్రలోభపెట్టాడని దస్తగిరి గతంలో ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేసి, అలాంటిది ఏమీ జరగలేదని గత నవంబర్‌లో అధికారులు తేల్చారు. దానిని కోర్టు కూడా ఓకే చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మరోసారి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించిందన్న వార్త చూస్తే రెడ్ బుక్ పాలన ఇలా ఉంటుందన్న మాట అనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు మాత్రం నిందితుడైన దస్తగిరిని సాక్షిగా ఎలా మార్చారని సీబీఐ ప్రశ్నించడం గమనార్హం. మరో వైపు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాత రాంగోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించిన తీరు కూడా రెడ్ బుక్ వ్యవహారంగానే కనిపిస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం తీసిన ఒక సినిమాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచితంగా సన్నివేశాలు పెట్టారని, మార్పింగ్ జరిగిందని అందువల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త కేసు పెట్టారు.అంతే! పోలీసులు వాయు వేగంతో స్పందించి వర్మను విచారణకు పిలిచారు. మరో కేసులో ఆయనను అరెస్టు చేయాలని ప్రయత్నించారు కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆ పని చేయలేక పోయారు. అయినా రెడ్ బుక్ వేధింపుల పర్వంలో భాగంగా ఆయనను అన్ని గంటలు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు తనను పోలీసులు హింసించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ సాగిస్తున్నారు.. ఆయనపై హింస జరగలేదని నివేదిక ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్ ప్రభావతిని కూడా తొమ్మిది గంటలు ప్రశ్నించారట. ఆమె కూడా ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. విశేషం ఏమిటంటే కులాలు, మతాల మధ్య ద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పెట్టిన కేసేమో పక్కకు పోయింది. ఆయన తనను హింసించారంటూ చేసిన ఫిర్యాదుకేమో హడావుడి చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన కేసు అంటూ అనేకమంది వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేశారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని పిటిషన్ దారుడు ఉపసంహరించుకోవడం సంచలమైంది. అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏదోరకంగా రెడ్ బుక్ ప్రయోగించాలని నిర్ణయించుకుని అరెస్టు చేశారు. తమకు కావల్సినవారు నేరాలు చేసినా కేసులు ఎత్తివేయడం, తమ ప్రత్యర్థులు నేరాలు చేసినా, చేయకపోయినా, ఏదో ఒక సాకు చూపుతూ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పడం చేస్తున్నారు. నిజంగానే రెడ్ బుక్కు పిచ్చి కుక్క మాదిరి వాడుతున్నారన్న వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్య మాదిరిగానే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం బదులు రెడ్ బుక్ పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వైనం ఏపీకి తీరని నష్టం చేస్తోంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి కుట్రల నుంచి ఏడుకొండల్ని రక్షించుకుందాం (ఫొటోలు)
-
తిరుమలపై కూటమి కుట్రలు.. భగ్గుమన్న హిందూ సంఘాలు
తిరుపతి/అమరావతి, సాక్షి: ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 👉🏼 ఏడుకొండల్ని రక్షించుకుందాంకూటమి సర్కార్‌కు హిందూ సంఘాల ప్రశ్నిలివే.. సనాతన ధర్మ రక్షణ వీరుడు, సూరుడు, ధీరుడు.. పవన్‌కల్యాణ్ ఎక్కడ?వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల దివ్య క్షేత్రానికి గుండు కొట్టడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే.. తిరుమల ఏడు కొండలను నాశనం చేయడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల ఏడు కొండలలో ముంతాజ్ హోటల్ నిర్మించడమా పవన్ కల్యాణ్ గారు?సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కల్యాణ్?తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులుతిరుమల ప్రక్షాళన అంటే తిరుమలను అపవిత్రం చేయడమా? చంద్రబాబు నాయుడు గారుతిరుమల ప్రక్షాళన అంటే.. ముంతాజ్ హోటల్ నిర్మించడమా? చంద్రబాబు నాయుడు గారుశేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా?ఏడు కొండలను పాడు చేయడమేనా? ప్రక్షాళన అంటే.. -
బాబు ఫోన్‌కు స్పందించని పవన్!
అమరావతి, సాక్షి: కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయితీ నడుస్తోంది. అనారోగ్యంతో ఇంతకాలం కీలక సమావేశాలకు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే తీర్థయాత్రలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్‌కు సైతం ఆయన స్పందించడం లేదని సమాచారం. ఈ 6వ తేదీన కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్(Pawan kalyan) హాజరు కాలేదు. ఆ వెంటనే మంత్రులు, సెక్రటరీలతో జరిపిన కీలక సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. దీంతో పవన్ ఎక్కడా? అనే చర్చ మొదలైంది. ఈలోపు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో.. అందుకే రాలేదేమోననే చర్చ నడిచింది. అయితే.. ఆ వెంటనే ఆయన మూడు రాష్ట్రాల పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. పవన్‌తో ఫోన్లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్లో పవన్ అందుబాటులోకి రావట్లేదని చంద్రబాబు చెప్పగా.. పవన్ నడుం నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఈ లోపు.. ఇవాళ పవన్ కేరళ కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగి భేషుగ్గా నడుచుకుంటూ వెళ్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ మ్యాటర్ కవర్ చేసేందుకు మనోహర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం విషయంలో.. పవన్ తీవ్ర మనస్థాపం చెందారనే ఆ మధ్య చర్చ నడిచింది. అయితే ఆ విబేధాలు తారాస్థాయికి చేరాయనే చర్చ ఇప్పుడు కూటమి పార్టీల మధ్య నడుస్తొంది. దీనిపై ఇరు పార్టీలు ఏమైనా స్పష్టత ఇస్తాయో చూడాలి. -
CBN: మాటలు స్వీటు.. చేతలు చేటు!
వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని ఒకప్పుడు అనేవారు. దీంట్లో వాస్తవం మాటెలా ఉన్నా... రాజకీయాల్లో చంద్రబాబు వంటి వారు చేసే ప్రకటనలకు మాత్రం ఈ సామెతను వర్తింపజేసుకోవచ్చు. ఎందుకంటారా? బాబుగారి ప్రకటనలు ఎప్పుడు ఎలా ఉంటాయో కనిపెట్టడం కష్టమే మరి!. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆయన చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేస్తూంటారు. వినేవారి మతిపోతుంది ఈ ప్రకటనలు వింటే. కొందరు వీటిని మతిలేని ప్రకటనలని కూడా అంటుంటారు. కాని, ఆయన తెలివిగానే ఎప్పటికి ఏది అవసరమో ఆ మాటలే మాట్లాడుతుంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన రెండు ప్రకటనలు చేశారు. సంపద సృష్టి ఎలాగో తనకు చెవిలో చెప్పమన్న ప్రకటన కూడా అలాంటిదే. ఎన్నికలకు ముందు తానే సంపద సృష్టికర్తనని వీర బిల్డప్ ఇచ్చిన ఆయన అకస్మాత్తుగా.. బేలగా.. అదెలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అని అడుగుతారని ఎవరైనా ఊహించగలరా?. ఇదొక్కటే కాదు... ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు సంపద సృష్టించకుండా దాన్ని పంచే అధికారం లేదని అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సబ్సిడీ పథకాలు అమలు చేయరాదని చెప్పడమే కదా!. ప్రజలకు నగదు బదిలీని వ్యతిరేకించడమే కదా! మరి ఇదే చంద్రబాబు(Chandrababu) ఎన్నికల సమయంలో బోలెడన్ని ఉచిత వరాల వర్షం ఎందుకు కురిపిస్తారు? ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా పోతారు?సోషల్ మీడియా యుగంలో అవన్ని వెలుగులోకి వస్తుండడంతో ఆయన ప్రభుత్వం చికాకు పడుతూ ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ ప్రయోగిస్తుంటుంది. మాట మార్చడంలో దేశంలోనే ఒక రికార్డు సాధించిన చంద్రబాబు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో సూపర్‌సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని తెగ ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు పలు గందరగోళ ప్రకటనలు చేస్తూ ప్రజలకు పిచ్చెక్కెస్తున్నారనే చెప్పాలి. ఎన్నికలకు ముందేమో సంపద గురించి చెప్పకుండా తాము వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని ఒకటికి పదిసార్లు ప్రకటించే వారు. తెలుగుదేశం మహానాడు(TDP Mahanadu)లో సూపర్ సిక్స్ హామీల ప్రకటన చేసి 'తమ్ముళ్లూ అదిరిపోయిందా" అంటూ సంబరపడితే ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా.. ఓహో అంటూ శరభ.. శరభ అని గంతులేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై శరాలు వదిలారని ప్రచారం చేశాయి. అంతవరకు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల హామీలు అమలులో భాగంగా వివిధ స్కీములలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తుంటే.. బటన్ నొక్కడం తప్ప ఏమి చేస్తున్నారని తప్పుడు కథనాలు ఇచ్చేవారు. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అదేమంత పెద్ద పనా అని వ్యాఖ్యానించారు. తాను ఇంకా ఎక్కువ చేయగలనన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అంతేకాదు.. రూ.70 వేల కోట్ల మేర స్కీములను అమలు చేస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన చంద్రబాబు అంతకు రెండు రెట్లు అధికంగా అంటే రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్కీములను బటన్ నొక్కడం ద్వారా పేదలకు అమలు చేస్తామని అనేవారు. అదెలా సాధ్యమైని ఎవరికైనా అనుమానం వస్తుందని, ముందుగానే తనకు సంపద సృష్టించే అనుభవం ఉందని దబాయించేవారు. అధికారంలోకి వచ్చాక సంపద సృష్టి మాటేమో కాని, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే రూ.80 వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా మరో రూ.40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. పోనీ వీటినేమైనా పేదల కోసం ఖర్చు చేస్తున్నారా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి వ్యయం చేస్తున్నారా అంటే అదేమీ లేదు. అభివృద్ది పనులకైనా ఖర్చు పెడుతున్నారా? అంటే అదీ కనపడదు. జగన్ టైంలో వచ్చిన ఓడరేవులు, మెడికల్ కాలేజీల వంటివాటిని ప్రైవేటు పరం చేస్తానంటున్నారు. రాయచోటి వద్ద జరిగిన ఫించన్ల పంపిణీ కార్యక్రమ సభలో ఒక రైతు.. తమకు అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. వర్కవుటు చేస్తున్నామని చెబుతూ, అవి ఇవ్వాలంటే ముందు డబ్బులు సంపాదించాలని, లేదంటే డబ్బు సంపాదించే మార్గం తనకు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు తెలివితేటలతో ఆర్థికంగా ఎదగాలని కూడా ఒక సలహా పారేశారు. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ అని, ఎంతమంది పిల్లలనైనా కనండి.. వారందరి చదువు కోసం తాను తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున డబ్బు ఇస్తానని ఎందుకు చెప్పారు?.. అని ఎవరికైనా ఒక సందేహం వస్తే అది వారి ఖర్మ అనుకోవాలన్నమాట. ఆ వెంటనే రైతు భరోసా కూడా మూడు విడతలుగా అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటిలో ప్రజలు ఏది నమ్మాలి? ఇక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 'నాకు దేశ అభివృద్ధి, భవిష్యత్తు ముఖ్యం. సరైన అభివృద్ధే సరైన రాజకీయం.., దేశంలో సంపద పెంచకుండా పంచడం సరైనది కాదు" అని సందేశం ఇచ్చారు. దీనిపై చర్చ జరగాలని అంటూ, సంపద సృష్టించకుండా దానిని పంచే హక్కు రాజకీయ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఢిల్లీలో ఆప్ పాలనను విమర్శించి వారి పాలన విఫల ప్రయోగం అని వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు 2019లో కేజ్రీవాల్‌ను గొప్ప పాలకుడని, విద్యావంతుడు అని అభివర్ణించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఇప్పుడు సంపద సృష్టించకుండా పంచే హక్కు నేతలకు లేదని అంటున్నారంటే, ఏపీలో ఇప్పట్లో సూపర్ సిక్స్ అమలు చేయలేమని చెప్పడమే అవుతుంది కదా అనే విశ్లేషణ వస్తుంది. ఒకసారేమో తాను చెప్పినదాని కన్నా ఎక్కువే ఇస్తానని అంటారు. మరో సారి డబ్బు ఎక్కడ ఉందని అంటారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచబోనని, తగ్గిస్తానని చెబుతారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలను పెంచడం ద్వారా వేల కోట్ల అదనపు ఆదాయం పొందే యత్నం చేశారు. ప్రజలకు సంపద పంచుతానని చెప్పిన చంద్రబాబు వారేదో కాస్తో, కూస్తో సంపాదించుకున్న దానిని ఇలా లాక్కుంటున్నారేమిటని సందేహం రావచ్చు. అదే సంపద సృష్టి అన్న అభిప్రాయం వస్తుందన్న మాట. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష జరిపి.. ప్రజలపై అదనపు భారం మోపలేం అని అన్నారట. మరి ఇప్పటి వరకు వేసిన భారం సంగతేమిటి? అని అడిగే అవకాశం ప్రజలకు ఉండదు. ఏ ఒక్కరు పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని అధికారులకు చెప్పారు. వేధింపులు వద్దని పైకి చెప్పడం బాగానే ఉన్నా, ప్రభుత్వ సిబ్బంది ఏమి చేస్తారో ఊహించుకోవడం కష్టం కాదు. గత ఏడాది జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చంద్రబాబు పాలనలో ఆదాయం తగ్గింది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని చంద్రబాబు అంటారు. ప్రజలపై అదనపు భారం మోపలేమని ఆయన అన్నారట. ఇంతకన్నా కపటత్వం ఏమి ఉంటుంది? జగన్ టైంలో తలసరి ఆదాయం పెరిగినా, జీఎస్డీపీ, జీఎస్టీ గణనీయంగా అభివృద్ది చెందినా.. అసలేమీ జరగలేదని చెబుతారు. అదే చంద్రబాబు గొప్పదనం. రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసుకుంటే ఇప్పుడేమో లక్ష రెండువేల కోట్ల దగ్గరే ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే చంద్రబాబు అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందనే కదా అర్థం? అయినా భజంత్రి మీడియా ఉంది కనుక ఏమి చెప్పినా చెల్లుబాటు అయిపోతోంది!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘జగన్ రాజకీయాన్ని టీడీపీవాళ్లే మెచ్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలనపై, సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై, అలాగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీతచంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాంఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారుఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారుసూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారుఔహామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారుఅమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైందిఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?అప్పుల్లో రికార్డు బద్ధలు9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లుఅమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారుమార్క్ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పుఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పుమొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారుఅన్ని అప్పులు చేసినా.. బటన్లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయిపథకాలన్నీ ఆగిపోయి.. గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయిమత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయిపిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయిందిఉద్యోగాల్లేవ్ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవువలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారుబేవరేజెస్లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారుపీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించారుఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయిఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలిఆర్థిక విధ్వంసం అంటే ఇదే.. ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాంరామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాంపది పిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టాంరెండు హార్బర్లను మా హయాంలోనే ప్రారంభించాం. మరో హార్బర్‌ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించాం కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాంబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారుమెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులువీటన్నింటిని ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నారు.. ఇది పెద్ద స్కాంజీఎల్ఐ, జీపీఎఫ్కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారుఆర్థిక విధ్వంసం అంటే ఇదేచంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేఇందుకోసం స్కామ్‌లు చేస్తున్నారుసంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందిఇసుక స్కాంలు జరుగుతున్నాయిమా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారుప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారుఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసిందిపైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను చంద్రబాబు తిడతారు ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలేప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారుపెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయిపెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారంఅలా అయితేనే వ్యాపారాలే నడిచేదిరివర్స్ టెండరింగ్ రద్దు చేశారుకాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్‌ల పేరుతో అన్యాయాలకు తెర తీశారుప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందిఇంక ఆదాయం ఎందుకొస్తది?ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదురాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందిఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదుకారణం.. రెడ్‌బుక్ రాజ్యాంగంప్రశ్నించేవారిని వేధిస్తున్నారుసంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారుఅన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారుమోసాల్లో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటినటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారుపరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడురాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడునటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయనచంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పాపులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నాఅయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారుస్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారుఅందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుందిఎవరి హయాంలో ఏం జరిగిందంటే.. 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారురాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారువైఎస్సార్సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాంకాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణమా హయాంలోనే కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయిచంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లుమా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లుసోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందిమా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాంబాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉందిమా హయాంలో 2023-2024 నాటికి.. పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాంచంద్రబాబు దిగిపోయేనాటికి.. జీడీపీ కంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉందిమా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాంఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలిరాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలిఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరుచంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది అప్పుల గురించి పరిశీలిస్తే.. చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలేఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారుమా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారురూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారుఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారుగవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది(రూ.10 లక్షల కోట్లు)శ్వేత పత్రాల సమయంలో మళ్లీ లెక్కలు మారాయి(రూ.12 లక్షల కోట్లు)చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్‌లో ప్రవేశపెట్టారుబడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి14 లక్షల కోట్ల నుంచి మొదలై.. చివరకు 6 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయారుచివరకు.. బడ్జెట్లో అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని చంద్రబాబు ఒప్పుకున్నారుఅలాంటప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది?చంద్రబాబు హయాంలో రూ.31 వేల కోట్ల అదనపు అప్పులు చేశారుమా హయాంలో రూ.17 వేల కోట్ల అప్పుల భారం తగ్గించాంజూన్ డిసెంబర్ మధ్య ఆదాయం రూ.50 వేల కోట్లుఈ నెలల్లో 0.51 నెగెటివ్ గ్రోత్ వచ్చిందిచంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారుజీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది?బాబు బిల్డప్‌కు ఈనాడు బాకాఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయనకేం కొత్త కాదుతప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటే దావోస్ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారుఏవోవో కంపెనీలు వస్తున్నాయంటూ ప్రకటనలు ఇచ్చారుఆయన బిల్డప్లకు.. ఈనాడు మామూలు ఎలివేషన్లు ఇవ్వదుఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు ఆడమని చెప్పరునిజాయితీగా బతకమని చెప్తారుచంద్రబాబు తన కొడుకు దగ్గరి నుంచి మొదలుపెడితే పార్టీలో ఉన్న అందరికీ.. అందరికీ అబద్ధాలు ఆడమని, వెన్నుపోటు పొడవమని చెబుతుంటారు దావోస్‌లో ఒక్క ఎంవోయూ కుదర్చుకోలేదుపరిశ్రమలు ఇక్కడికి వద్దామనుకుంటే .. పెట్టుబడిదారులను భయపెట్టి, కేసులు పెట్టి.. బెదరగొట్టి.. వెళ్లిపోయేలా చేశారుపక్క రాష్ట్రాలు వాళ్లతో ఎంవోయూలు చేసుకున్నారుపరిశ్రమలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?జిందాల్ లాంటి వ్యక్తులను భయపడితే.. వాళ్లు మరో 10 మందికి చెప్పరా?పైగా మా హయాంలో చేసిన ఒప్పందాలను.. ఇప్పుడు తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు12 మంది ఎంపీలున్న బీహార్.. బడ్జెట్లో ఎన్నో సాధించుకుందిబడ్జెట్లో ఏపీకి ఏం సాధించారు?కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది ఏదీ లేదుకేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఏం సాధించుకోకపోగా.. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారుచంద్రబాబు పలుకుబడి ఏపాటిదో ఇక్కడే అర్థమవుతోందిఇది విధ్వంసం కాదా?చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావుఇది విధ్వంసం కాదా?పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి ఆపేశారుస్కూళ్లలో నాడు నేడు పనులు ఆపేశారుఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేస్తున్నారుట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆపేశారువసతి దీవెనను ఆపేసి, విద్యా దీవెన అరకోరగా అమలు చేయడం.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం కాదా?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు.. ఇది విధ్వంసం కాదా?చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం.. విధ్వంసం కాదా?అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందించిన సంక్షేమ పథకాలు ఆపేయడం.. విధ్వంసం కాదా?ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం .. విధ్వంసం కాదా?ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకోవడంరాష్ట్ర ఆదాయం కాకుండా.. తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా?రెడ్‌బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?ప్రశ్నిస్తే దాడులు చేయడం.. విధ్వంసం కాదా?ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరుపతిలో.. ఉప ఎన్నికల టైంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందిఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారుఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారుచివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారుఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేమా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాంటీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలిహ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారుఅధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గంహిందూపురంలో జరిగింది చూశాం చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నికల జరిగిందిఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలినందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారుఅలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఆరోజులు త్వరలోనే..జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారుఅవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయిచొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిప్రజలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందిలిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?రాష్ట్రంలో లేని పరిస్థితులు.. ఉన్నట్లు చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారుప్రజా సమస్యలు చెప్పేందుకు చట్ట సభల్లో సమయం ఇవ్వడం లేదు.. అందుకే మీడియా ముందుకు రావాల్సి వస్తోందివైఎస్సార్సీపీ 2.0 పాలన.. కార్యకర్తలకు భరోసా ఇస్తుందని మళ్లీ చెబుతున్నా‘పెద్ద’రెడ్డి.. అంటూ ఈనాడు కథనాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్.. ఆయన తండ్రిది ఏ శాఖ?.. లిక్కర్కేసుతో వాళ్లకేం సంబంధం?ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? మద్యం రేట్లు మేం పెంచామా?మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?రేట్లుఉ పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకి మాముళ్లు ఇస్తారా?నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు?నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీతో రెండున్నర లక్షల కోట్ల రూపాయాలు సంక్షేమానికి ఖర్చు చేశాకమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరు ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లు చేస్తోంది ఇప్పుడువిశ్వసనీయత ఉండాలి.. అది ఎవరికైనా!రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలిఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలిబయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలిభయపడో, ప్రలోభాలకు లొంగోలేకుంటే రాజీపడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటి?రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందివిశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందిలంచాలు లేకుండా ప్రజలకు సంక్షమ పథకాలు అందించాందేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ నిలబడిందిస్పీకర్ కోర్టుకు స్పందించడం లేదుఅసెంబ్లీ సమావేశాలను మేం బహిష్కరించలేదుకోర్టుకు వెళ్లాంస్పీకర్ ఎందుకనో కోర్టుకు స్పందించడం లేదుఅన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలిఅసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలిజిల్లా పర్యటనల గురించి.. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది జిల్లాల పర్యటనలకు ఇంకా టైం ఉంది ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా! -
విజయవాడ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
గుంటూరు, సాక్షి: విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారాయన. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు హాజరయ్యారు. -
ఈ అరాచకాలపై ఎవ్వరూ నోరు మెదపరేం?
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి నేతల అరాచకాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ.. చోద్యం చూస్తూ ఉండిపోయింది. టీడీపీ గుండాల దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, రెండో బాస్ లోకేష్‌లు పట్టనట్లు ఉంటున్నారు. మరోవైపు.. ఆమధ్య ఏపీలో శాంతిభద్రల గురించి ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మౌనంగా ఉండిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అన్యాయాలు జరిగాయో కళ్లారా చూసింది ఏపీ. అధికార పార్టీలు ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసేశాయి. బలం లేనిచోట్ల కూడా బలవంతంగా కూటమి నేతలను గెలిపించుకుంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో.. వైఎస్సార్సీపీ నుంచి సభ్యులను తమ దారికి తెచ్చుకున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. తాము బెదిరింపులతోనే ఓటేశామని భూమన వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు మొరపెట్టుకున్న పరిస్థితి చూసిందే. హిందూపురం సహా మరికొన్ని చోట్లా అదే పరిస్థితి. పాలకొండ, పిడుగురాళ్ల, తునిలో అయితే కూటమి ఎఫెక్ట్‌తో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.చివరికి ఎమ్మెల్సీలకూ రక్షణలేని దుస్థితితో పోలీసు బాసులు ఉన్నారు. నిర్మోహమాటంగా కూటమి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారు. ఏపీలో అఘాయిత్యాలపై ప్రశ్నించిన పవన్.. ఆ తర్వాత ఏమైందోగానీ చల్లబడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి. టీడీపీ దాడులపై ప్రశ్నించే దమ్ము వాటికి లేకుండా పోయింది. దీంతో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఈ అరాచకాలతో ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పటికైనా ఏపీ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్‌గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్‌షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
బడ్జెట్లో ఏపీకి నిల్!
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార్‌లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్‌కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్.. ఇప్పుడు బడ్జెట్లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు. టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్ కల్యాణ్‌లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విలువల్లేని ఎల్లో మీడియా.. వివరణ ఇచ్చినా విషం చిమ్ముతూనే ఉంది!
తిరుపతి, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ అనుకూల మీడియా ఇస్తున్న కథనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పని గట్టుకుని ఈ విష ప్రచారం చేయిస్తోందని ఆరోపించారాయన. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని ఎల్లో మీడియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విష ప్రచారం చేస్తోంది. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించక పోయినా ఉద్దేశ్య పూర్వకంగా మీ రాసిన చెల్లుతుంది విషం చిమ్ముతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన పనిగట్టుకుని అసత్య కథనాలు రాస్తున్నారు. తప్పుడు కథనలుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ కూడా విసిరారు. ఈ అసత్య ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy ramachandra reddy) కడిగిన ముత్యంలా బయట పడతారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు నెరవేర్చకుండా మాపై విషం చిమ్ముతున్నారు. ఎల్లో మీడియా పత్రికలు కనీసం వివరణ ఇచ్చినా పత్రిక విలువలు పాటించడం లేదు. కూటమి ప్రభుత్వం పై మా పోరాటం చేస్తూనే ఉంటాం , ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది అనేది స్పష్టం అవుతోంది అని భూమన అన్నారు. -
‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు.. ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై.. బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.‘‘తల్లికి వందనం, ఫీజు రియింబర్స్‌మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటిదాకా అది జరగలేదు. ఎందుకు?. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఎందుకు ఈ విషయాల్లో మౌనంగా ఉన్నారు?. పవన్ కళ్యాణ్ స్పందించాలి... లేదంటే చంద్రబాబు మాయలో పడి మీరు మోసపోయినట్టే.. అలాగే ప్రజల వద్ద నమ్మకమూ కోల్పోతారు.ఖజానా 100 కోట్లు ఉన్న సమయంలోనే నవరత్న పథకాలను వైయస్ జగన్ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్ర ఆదాయం కూడా ఆయన హయాంలోనే పెరిగింది. 7,000 కోట్లు రూపాయలతో ఖజానా మీ చేతిలో పెడితే ఏం చేశారు?. పదిహేను శాతం వృద్ధిరేటు దాటిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టమవుతోంది. పోలవరం ,అమరావతి చంద్రబాబు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి.... చంద్రబాబు ఆస్తులు విలువ పెరుగుతుంది మినహా ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు.ప్రజలు మీరు చెప్పిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు ... వాటిపై దృష్టి పెట్టండి అని హితవు పలికారాయన.చంద్రబాబు పేదల ద్వేషి. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పింది ఎవరు?. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూములు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. మీ వాళ్ళు భూములు కొనుగోలు చేసినందుకు మీ స్వార్థం కోసం అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోవడం దారుణం అని వేణుగోపాల్ అన్నారు. -
ఇదేనా తొలిసంతకం విలువ? కూటమి సర్కార్‌పై ఆగ్రహ జ్వాలలు
కృష్ణా, సాక్షి: అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా మెగా డీఎస్సీ ఊసేత్తడం లేదు కూటమి ప్రభుత్వం. దీంతో.. అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా.. మంగళవారం అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్ధులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ‘‘కూటమి ప్రభుత్వం డీఎస్పీ అభ్యర్ధులను నయవంచన చేస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించాలి. పరీక్షల తేదీతో సహా ప్రకటన చేయాలి ... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. మరోవైపు.. డీఎస్సీ అభ్యర్ధులు సైతం కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం తొలి సంతకానికి ఉన్న విలువ ఇదేనా?. ఆరునెలల్లో మెగా డీఎస్పీ పూర్తిచేస్తామన్నారు. కనీసం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చెప్పడం లేదు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అవనిగడ్డ గ్రంధాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ ప్లకార్డులతో నిరనన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. -
బాబు అబద్ధాల బుద్ధుడు.. లోకేష్ కోసమే సంపద సృష్టి: భూమన
తిరుపతి, సాక్షి: సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ ప్రకటనపై మంగళవారం ఉదయం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాజకీయమంతా లాక్కోవడమే. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ఏమాత్రం ప్రజల సంక్షేమం పట్టించుకోరాయన. అలాగే ఇప్పుడూ చంద్రబాబు కోట్లాది మందిని మోసం చేస్తున్నారు. ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌పై నిందలు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెబుతూ ఆచరణ సాధ్యం కాదని చెబుతూ కపట నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు ప్రజా ద్రోహం, ప్రజలకు పొడిచే వెన్నుపోటు ఎలా ఉంటుందో నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ అమలుకు పరిస్థితి లేదు అని, వృద్ధి రేటు 15% పెంచిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పడం దారుణం. .. చంద్రబాబు మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారు. కరోనా సమయంలో కూడా దేశంలో ఆదర్శంగా పాలన సాగించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఒంటి కన్ను నక్కలా ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల ఫించన్లు కట్ చేశారు. విధ్యుత్ చార్జీలు పెంచము అని చెప్పి రూ. 19 వేల కోట్లు ప్రజలు పై విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. తల్లికి వందనం కాస్త.. తల్లికి తద్దినంగా మారిపోయింది. అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ ఏడుపు పథకంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోంది.సంప్రదాయ దుస్తుల నిబంధన ఏమైంది?కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు, 4 సార్లు కొండపై ఎర్రచందనం దొరికింది. వీఐపీ దర్శన సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అనే నిబంధన గాలికి వదిలేశారు. విజిలెన్స్ వ్యవస్థ నిద్ర పోతోంది. అదనపు ఈవో వెంకన్న చౌదరి ఏం చేస్తున్నారు?. సనాతన ధర్మ ఉద్యమ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలి.లోకేష్ కోసమే సంపద సృష్టి:రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలన సాగుతోంది. ఆయన ఈ ఏడు నెలల పాలనంతా వంచన, మోసం, దోపిడీతోనే సాగింది. తాను సంపద సృష్టిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు చెబితే, అది లోకేష్ కోసమని జనం గుర్తించలేకపోయారు. బాబు మాటలను గుడ్డిగా నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ప్రజల్లో చంద్రబాబు మీద తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యముందా?. .. చంద్రబాబును మోసిన పవనాందుల వారు ఏం చేస్తున్నారు?. పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారు. చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాకతప్పదు’’ అని భూమన అన్నారు. -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.వైఎస్సార్సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్(YS Jagan) విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution), కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు కూడా. అలాంటి వాళ్లకే పదవులువైఎస్సార్సీపీ(YSRCP)లో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. మండల్, బూత్ లెవల్ నియామకాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అయితే.. త్వరలో వైఎస్ జగన్ కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్ జగన్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో.. వాళ్లకే పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌ను చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు.. స్వయంగా తానే కార్యకర్తల దగ్గరకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు.. పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. పోరుబాటలో YSRCP..ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేడర్‌కు గుర్తు చేస్తున్నారు.ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది. మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది. -
వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన -
‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ స్థాయి ఇదేనా?’
ఏలూరు, సాక్షి: ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. రాష్ట్రంలో.. అందునా కూటమిలో పార్టీ పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయిన ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ‘‘కూటమి ప్రభుత్వంలో బీజేపీ(BJP) ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారు. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే 164సీట్లు వచ్చాయి. మేమందరం తిరిగితేనే కదా కూటమి గెలిచింది. కానీ, ఇప్పుడు ఎక్కడా జనసేన, టీడీపీ జెండాలు కనబడుతున్నాయి తప్ప బీజేపీ జెండాలు కనబడటం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదు. ఆఖరికి.. రోడ్లు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ సైతం మెమరాండం ఇచ్చాము.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో బీజేపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోంది. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah).. సమీక్షా సమావేశంలో బీజేపీ నేతలకు కీలక సూచనలు చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఇది జరిగి మూడు రోజులు కాకముందే.. ఈ వ్యాఖ్యలు తెరపైకి రావడం గమనార్హం. -
డిప్యూటీ సీఎంగా లోకేష్.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్లు
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్లిస్తోంది.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు.. బాబుకు వయసైపోయింది!నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’ -
వాట్సాప్ పాలన.. అలాంటి విజన్ కాదుగా!
ఎప్పటికి ఎయ్యేది ప్రస్తుతమో అప్పటికి.. ప్రజలను మాయ చేయడమనేది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిత్యకృత్యంలా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును మరచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు తయారు చేసి ప్రజలపైకి వదులుతూంటారు ఈయన. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆత్మ పరిశీలనను ఏమాత్రం చేసుకోరు. సరికదా.. తాను చేసిందే రైట్ అన్నట్టుగా వ్యవహరిస్తూంటారు. ఏ రోజుకు ఆ రోజు మీడియాలో కనిపించామా లేదా? అన్నదే ఆయన ఆలోచనగా ఉంటుంది. ఇలా బాబు గారి బుర్రకు తట్టిన సరికొత్త నినాదం ‘వాట్సప్ పాలన’!!!. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మాల చెంతకు చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎనిమిది నెలల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మరచి మరీ ఈ వ్యవస్థకు మంగళం పాడేశారు. ఇప్పుడు కొత్తగా వాట్సప్ పాలన రాగం అందుకున్నారు. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు గారు గతంలోనూ ఇలాంటి గిమ్మిక్కులు చాలానే చేశారు. ఒకసారి సుపరిపాలన అంటారు ఇంకోసారి కంప్యూటర్ పాలన అంటారు. జన్మభూమి కమిటీలతో పాలన అని రకరకాల పేర్లతో ప్రజల్లో ఏదో ఒక భ్రమ నిత్యం ఉండేలా చూస్తారన్నది తెలిసిందే. వాట్సప్ పాలన కూడా ఇదే కోవకు చెందిందా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం లభిస్తుందా? లేక బాబుగారి ప్రచార ఆర్భాటాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందా?.... వాట్సప్ పాలన ఆలోచన నిజాయితీతో కూడినదైతే తప్పు లేకపోవచ్చు. అయితే కొంచెం తరచి చూస్తే దీని లక్ష్యం ఇంకోటి ఏదో అని అనిపించకమానదు. ఎందుకంటే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని, గౌరవ వేతనాన్ని రూ.ఐదు నుంచి రూ.పది వేలకు పెంచుతామని చంద్రబాబు గత ఏడాది ఉగాది పర్వదినం రోజున దైవసాక్షిగా ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనికి ‘ఊ’ కొట్టారు. పెంచిన జీతం పక్కా అని ఊదరగొట్టారు. కానీ పాత లక్షణాలు అంత తొందరగా పోవంటారు. మాట ఇచ్చి తప్పడమనే బాబుగారి పాత లక్షణం కూడా మాసిపోలేదు. ఎన్నికలయ్యాక యథా ప్రకారం క్రమ పద్ధతిలో వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ బాబు ఒకడుగు ముందుకేసి ‘‘వలంటీర్ల వ్యవస్థ ఎక్కడుంది?’’ అని కూడా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, అందువల్ల అసలు వ్యవస్థే లేనప్పుడు జీతాలు ఇస్తామని వీరు అమానవీయ ప్రకటనలు చేశారు. అప్పటికి గాని వలంటీర్లకు చంద్రబాబు, పవన్ అసలు స్వరూపం తెలియరాలేదు. రెండు లక్షల మంది వరకూ ఉన్న వలంటీర్లకు ఉన్న కాస్తా అదరువు కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందాల్సిన సేవలూ నిలిచిపోయాయి. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వ్యాధి నియంత్రణకు ఈ వ్యవస్థ చేసిన కృషిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. గ్రామాల్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా వలంటీర్‌కు చెబితే చాలు అన్నీ జరిగిపోతాయన్న భరోసా ఉండేది. కులం, నివాస, ఆదాయం.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా గంటల వ్వవధిలో ఇంటికి చేర్చేవారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇళ్ల వద్దే వృద్దులకు ఫించన్లు అందచేసేవారు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ప్రజల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్ పాలన ఆలోచన!. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను వాట్పప్ ద్వారా అందివ్వాలన్నది ఈ వాట్సప్ పాలన ప్రాథమిక ఆలోచన. దీంతోపాటే మరో 150 రకాల ప్రభుత్వ సేవలూ అందిస్తామని చెబుతున్నారు. బాగానే ఉంది కానీ.. అంత సులువుగా అంతా జరిగిపోతుందా? ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయా? ప్రజలు వాట్సప్ ద్వారా తమ అవసరాలు తెలియజేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారా? ఆ స్థాయిలో యంత్రాంగం ఉంటుందా? వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు వస్తే ఏమి చేయాలి? ఎవరైనా వాట్పప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చా? అనేది చూడాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా ఈ వాట్సప్ పాలన అదిరిపోతుందని ఇకపై ప్రచారం చేయవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ప్రజలు మర్చిపోవడానికి దీనిని ప్లాన్ చేసి ఉండవచ్చు. ఇది డైవర్షన్ టాక్టిస్లలో ఒకటని చెప్పవచ్చు. ఇదే టైమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన ప్రచారానికి కూడా ఈ వ్యవస్థను వాడుకునే అవకాశం ఉంది. గతంలో సుపరిపాలన ,కంప్యూటర్ పాలన అంటూ రకరకాల విన్యాసాలు చేశారు. కాని అవేవీ ప్రజలకు సంతృప్తి కలిగించలేదు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి ప్రతి పనికి ఏభై శాతం వాటా చెల్లించాలని కండిషన్ పెట్టేవారు. ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తే, ఆయనను దించేసి ప్రజల వద్దకు ప్రభుత్వం అంటూ కొంతకాలం హడావుడి చేశారు. అవన్ని ఆయన తన పబ్లిసిటీ కోసమే వాడుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయం. తత్ఫలితంగా 2004లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014 టరమ్‌లో జన్మభూమి కమిటీల పాలన చేశారు. అది ప్రజలను మరింతగా వేధించింది. దాంతో 2019లో మళ్లీ పరాజయం చెందారు. ఈసారి వాట్సప్ పాలన. ఇది ఏ ఫలితాన్ని ఇస్తుందో?. ఇక.. మరోవైపు ప్రతి కుటుంబం నలుగురు పిల్లలు కలిగి ఉండాలని ఆయన ప్రచారం ఆరంభించారు. కుటుంబ నియంత్రణను తానే గతంలో ప్రచారం చేశానని, ఇప్పుడు పిల్లలను అధికంగా కనమని చెబుతున్నానని అంటున్నారు. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లే అని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. నిజంగానే 400 ఎకరాలు ఉన్నట్లే అయితే చంద్రబాబు చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే తమ కుటుంబంలో ఎందరు పిల్లలు ఉండాలన్నది డిసైడ్ చేసుకుంటారు. చంద్రబాబు ముందుగా తన కుటుంబం, బంధు మిత్రులు, తెలుగుదేశం నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ నలుగురు పిల్లల సిద్ధాంతం చెప్పి ఆచరింపచేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉన్నతాదాయ వర్గాల వారు నలుగురు పిల్లలు ఉన్నా బాగానే పోషించుకోగలుగుతారు. ప్రస్తుత సమాజంలో వారేమో ఒక్కరు లేదా ఇద్దరికి పరిమితం అవుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటే ఎవరు పోషిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికే అధిక సంతానం ఉన్న పేద కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబును నమ్మి పిల్లలను కంటే కొంప మునుగుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇంటిలో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎందరు ఉంటే వారందరికి రూ.15 వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని టీడీపీ, జనసేన జాయింట్ మేనిఫెస్టోలో ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదికి తల్లికి వందనం స్కీమ్‌కు ఎగనామం పెట్టారు.అలాగే మహిళలు చంద్రబాబును నమ్మెదెలా? అనే మరో చర్చ నడుస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పోనీ యువత అయినా విశ్వసిస్తారా? అంటే అదీ కనబడడం లేదు. నిరుద్యోగులపై యువకులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసి తుస్సుమనిపించారు. ఎప్పుడు ఈ స్కీములు అమలు అవుతాయో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు లేదా అంతకుమించి పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత నిబంధన తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరికైనా పిల్లలు కలగకపోతే వారు స్థానిక ఎన్నికలకు అర్హులు కారని ప్రభుత్వం చెబితే దారుణంగా ఉంటుంది. అది కేవలం స్థానిక ఎన్నికలకే ఎందుకు? ముందుగా శాసనసభ ఎన్నికలలో నిబంధన పెట్టేలా కేంద్రానికి చెప్పి చేయించవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలను కనడం కరెక్టా ? కాదా? అన్నది ప్రశ్న కాదు. నిజంగానే ప్రతి కుటుంబం అలా చేస్తే ప్రత్యేకించి, పేద, మధ్య తరగతి కుటుంబాలు వారందరికి సరైన విద్య చెప్పించగలుగుతాయా? వైద్యం అందించగలుగుతాయా? ప్రభుత్వాలు వారందరికి ఉపాధి అవకాశాలు చూపగలుగుతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త సంగతి చెబుతూ ప్రజలను ఏమార్చుతూ, వేరే అంశాలపై చర్చ జరిగేలా చేస్తే సూపర్ సిక్స్ వంటివాటిని జనం మర్చిపోతారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది. ‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా. -
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
మోదీ పగలబడి నవ్వింది అందుకే!
దేశ ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అభినందించడం సహజం. ఎవరూ తప్పుపట్టలేము. కానీ ప్రధానే ఇబ్బందిపడేలా పొగిడితే? ఎంత ఎబ్బెట్టు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో ఎన్డీయే సమావేశానికి హాజరైనప్పుడు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఆకాశానికి ఎత్తేయడం చూసి ప్రజలే విస్తుపోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇది ఆయన సొంతపార్టీ తెలుగుదేశం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కూడా!. .. అంత పొగిడినా మోదీ నుంచి ప్రశంసలేవీ రాకపోవడం బహుశా బాబును నిరాశకు గురి చేసి ఉంటుంది. అలాగని ఆ విషయం గట్టిగా చెప్పలేని స్థితి. కేంద్రంలో ప్రభుత్వం తమ పార్టీ మద్దతుతోనే కొనసాగుతోందన్న భ్రమలో టీడీపీ శ్రేణులు ఉన్న సమయంలో.. చంద్రబాబు మోదీని పొగిడి పార్టీలో మరిన్ని సందేహాలకు తావిచ్చారనిపిస్తోంది. బహుశా కేంద్రం స్థాయిలో తనపై ఉన్న కేసులు, భవిష్యత్తులో కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)కు పట్టం కట్టాల్సి వస్తే సమస్యల్లేకుండా చూసుకోవడం వంటివి బాబుకు ఈ పరిస్థితి కల్పించి ఉంటాయని అనుకుంటున్నారు!. చంద్రబాబు తన ప్రసంగంలో అధిక భాగాన్ని మోదీ ప్రశంసలకే కేటాయించడం సొంతపార్టీలోనే చాలామందికి నచ్చలేదట!. ఇది పార్టీ ఆత్మ స్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏదైనా మంచి పని చేస్తే ప్రధానిని మెచ్చుకున్నా ఫర్వాలేదు కానీ చంద్రబాబు తన నోటితోనే 2019 ఎన్నికలకు ముందు దారుణమైన రీతిలో విమర్శించారు. పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానమంత్రిని ‘టెర్రరిస్టు’గా అభివర్ణించారు. ముస్లింలను బతకనివ్వని నేతగా చూపించారు. చివరికి భార్యను ఏలుకోలేని వ్యక్తి అని కూడా దూషించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సైతం చంద్రబాబును తీవ్రంగానే విమర్శించే వారు. పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అంటూ ఎన్నికల సమయంలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ‘యూ టర్న్ బాబు’ అని నామకరణం చేసింది కూడా మోదీనే. కొడుకు కోసమే బాబు పనిచేస్తున్నాడని ఎద్దేవా కూడా చేశారు. దీనికి ప్రతిగా బాబు తనకు కుటుంబం ఉందని, మీకేం ఉందని మోదీని ఘాటుగా ప్రశ్నించారు అప్పట్లో. అయితే 2024నాటికి తిరిగి వారిద్దరూ కలిసిన తీరు రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు అనేదానికి ఒక నిదర్శనం!. పరువు ప్రతిష్టలు, ఆత్మాభిమానం అన్నవి సామాన్య ప్రజలకు సంబంధించినవే కానీ, ఇలాంటి పెద్ద నాయకులకు కాదని అనుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి.. మోదీ కన్నా చంద్రబాబే సీనియర్ నేత. ఆయన 1978 నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఉన్నారు. 1995లోనే తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి ముఖ్యమంత్రి అయ్యారు. తాను సీనియర్‌ను అన్న విషయాన్ని ఆయన చాలాసార్లు పదే పదే గుర్తు చేశారు కూడా. అలాంటి బాబుగారు ఇప్పుడు ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అంటున్నారు. తమ ఇద్దరిది ఒకటే స్కూల్ అని చెబుతున్నారు. తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా ఈ పొగడ్తలను వినిపించడంతో మోదీ నవ్వుతూ కూర్చున్నారు. బహుశా ఇదే చంద్రబాబు గతంలో తనను ఉద్దేశించి ఏమన్నది మోదీకి గుర్తు వచ్చి ఉండవచ్చు!. గత మూడు దశాబ్దాలలో మోదీకి, చంద్రబాబుకు మధ్య పలుమార్లు వివాదాలు వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. జరిగిన మత ఘర్షణలలో ఆయన రాజీనామాకు చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. వస్తే అరెస్టు చేయిస్తానిని కూడా హెచ్చరించారు. అప్పటికి బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు అలా మాట్లాడారు. 2009లో బీజేపీని వదలి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్), వామపక్షాలతో కూటమి కట్టి ఓటమి పాలవడంతో తిరిగి బీజేపీ వైపు మళ్లారు. 2014లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్దిగా ప్రకటించడంతో మెల్లగా ఆయనతో స్నేహం చేయడానికి నానా పాట్లు పడ్డారు. మోదీ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి మాట కలిపే యత్నం చేశారు. ఎలాగైతేనేం..2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఆ తర్వాత.. ప్రత్యేక హోదా అంశం పేరుతో బీజేపీని వ్యతిరేకించి కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని టీడీపీ ముఖ్యనేతలు దూషించేవారు. ఆ క్రమంలో మోదీని వ్యక్తిగత స్థాయిలో కూడా చంద్రబాబు విమర్శించారు. ఆ దెబ్బకు ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యం అనే భావన ఏర్పడేది. దానికి తోడు చంద్రబాబు 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల తనకు నష్టం జరిగిందని భావించిన చంద్రబాబు.. 2019లో ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో ఓడిపోవడంతో.. తిరిగి చంద్రబాబు మాట మార్చి బీజేపీని ప్రసన్నం చేసుకునే వ్యూహంలోకి వెళ్లారు. ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారు. అలాగే.. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపించారు. ఇదే టైమ్‌లో బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ సిద్దం కాకపోవడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది!... ఎలాగైతేనేం 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు.ఈ నేపథ్యంలో మోదీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగుడుతున్నారు. అది విశాఖ సభలో శ్రుతి మించిందని చెప్పకతప్పదు. మోదీ భజన చేస్తే చేశారులే.. ఏపీకి అవసరమైన కీలకమైన అంశాల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడతారేమో అని ఆశగా ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ముఖ్యంగా.. విశాఖపట్నంలో ఐదు దశాబ్దాలుగా విరాజిల్లుతున్న విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని మాత్రం కోరలేకపోయారు. పైగా పుండు మీద కారం చల్లినట్లు నక్కపల్లి వద్ద మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేయదలపెట్టిన స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి గుర్తు చేసి, ప్రధాని పాజిటివ్‌గా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ‘‘విశాఖ స్టీల్ సంగతేమిటి?’’ అని ఎవరికైనా సందేహం వస్తే అది వారి ఖర్మ. కార్మిక సంఘాలు గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలు ఆయనకు పట్టలేదు. పోనీ గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అనుకూలమని ఏమైనా చెప్పారా? అంటే అదీలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సెంటిమెంట్ అని, దానిని కాపాడుకోవాల్సిందేనని, ప్రభుత్వ రంగంలోనే నడవాలని చంద్రబాబు ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తేనే విశాఖ స్టీల్ ను సేవ్ చేయగులుగుతామని, తాము ప్రధానిని ఒప్పించగలుగుతామని చంద్రబాబు, పవన్ నమ్మబలికారు. వాటిని కూడా నమ్మి అక్కడి వారు రికార్డు స్థాయిలో కూటమి అభ్యర్దులను గెలిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారిపోయింది. పైకి మాత్రం మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తామని చెబుతూ, అక్కడ ఉద్యోగాలు పోతున్నా, ఇనుప ఖనిజం సరఫరా సమస్య అయినా పట్టించుకోవడం మానేశారు. ప్రధానమంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సహా వామపక్షాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్‌లు ప్రధాని సమక్షంలో దాని గురించి ప్రస్తావించకుండా పిరికిగా వ్యవహరించారు. అదే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అప్పట్లో ఇదే ప్రాంగణంలో జరిగిన సభలో ప్రధాని మోదీని విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయవద్దని, దానికి అసరమైన గనులు కేటాయించాలని కోరారు కదా. మోదీతో తమ సంబంధం రాజకీయాలకు అతీతమైనది అని అంటూనే, ఏపీకి కావల్సిన డిమాండ్లను తీర్చాలని విస్పష్టంగా కోరారు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగారు. కానీ.. ఇప్పుడు కూటమి నేతలు ఎవరూ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దాని గురించి మర్చిపోయారు. ఇలాంటి కీలకమైన విషయాలను చంద్రబాబు, పవన్ లు ప్రస్తావించకపోవడంతో ప్రధాని మోడీకి సమాధానం చెప్పే అవసరమే లేకుండా పోయింది.విశాఖ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకే కూటమి నేతలంతా పరిమితం అయ్యారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులకే ఇప్పుడు శంకుస్థాపనలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులకు ఆరోజుల్లో తెలుగుదేశం నేతలు అడ్డుపడే యత్నం కూడా చేశారు. పలు రాష్ట్రాలు పోటీపడినా ఏపీకి బల్క్ డ్రగ్ పార్కును జగన్ ప్రభుత్వం సాధించింది. దీనిని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు దానిని నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తే అది తమ ఘనతేనని నిస్సిగ్గుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఎన్.టి.పి.సి ఏర్పాటు చేయతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు సంబంధించిన ఒప్పందం చేసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే. అలాగే రైల్వేజోన్ కు అవసరమైన భూమిని కేటాయించింది సైతంం జగన్ సర్కారే. కానీ ఆ భూమిపై లేనిపోని వివాదాలు సృష్టించారు. చివరికి అదే భూమిలో శంకుస్థాపన చేశారు. అయినా మంచిదే ప్రధాని వచ్చి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.కాకపోతే వేగంగా ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలగాలి. శ్రమ ఎవరిదైనా ఫలితం దక్కించుకోవడంలో ,ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు మించినవారు ఉండరేమో!. ప్రధాని మోదీని రాష్ట్ర ప్రయోజనాల కోసం పొగిడితే అదో పద్దతి అనుకోవచ్చు. అలాకాకుండా ఏదో వ్యక్తిగత రాజకీయాల కోసం భజన చేస్తే ఏపీ ప్రజలకు ఏమి ప్రయోజనం?. ఇంతకీ మోదీని ఆనాడు చంద్రబాబు దూషించడాన్ని సమర్ధించాలా? లేక ప్రస్తుతం పొగడడాన్ని ఒప్పుకోవాలా?.. అంటే ఏమి చెబుదాం. అలాగే ఒకప్పుడు అవినీతిపరుడు అన్న చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మోదీని ఏమనుకోవాలి? మొత్తం మీద వీరిద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్లను చేశారా?!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి👉🏾: ‘చంద్రబాబు ఎన్డీయేకి ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం!’ -
భోగి మంటలతో .. కూటమి సర్కార్‌పై వినూత్న నిరసన
విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్‌కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?. .. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
YSRCP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయపోరాటం
గుంటూరు, సాక్షి: తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. క్రౌడ్ మేనేజ్మెంట్లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే.. తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అవి పచ్చి అబద్ధాలు: భూమనహైందవ భక్తులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధాలు అని గుర్తించాలి. భక్తులు ప్రాణాలు కోల్పోతే లెక్కలేనితంగా ఈరోజు టీటీడీ వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా నామ మాత్రంగా బదిలీ చేసి. ప్రభుత్వం జాప్యం చేస్తోంది. టీటీడీ ఈవ, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు డ్రామాలో పవన్ బకరా!
తిరుపతిలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం ‘సారీ’లతో ముగించేస్తోందా?. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వంతు పాత్ర పోషించి పరువు పోగొట్టుకుంటే.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఏకంగా పవన్ గాలి తీసేందుకే ప్రాధాన్యమిచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో మొత్తం కథ అడ్డం తిరిగినట్లు అయ్యింది. చివరకు బీఆర్ నాయుడు చర్యతో టీడీపీ అధిష్టానం కూడా కంగు తినాల్సిన పరిస్థితి. అయితే..స్వయంగా రంగంలోకి దిగి ఆయనతోనూ ఓ సారీ చెప్పించాల్సి వచ్చింది. మొత్తమ్మీద చూస్తే.. ఈ వ్యవహారంలో అసలు ఎవరి తప్పూ లేనట్టుగా తేల్చేసి అటు ప్రభుత్వాధినేతలు.. ఇటు టీటీడీ ఉన్నతాధికారులూ జారుకున్నారు. స్వామివారిపై భక్తితో భక్తులు తిరుమతి రావడమే తప్పు అని చెప్పడమే తరువాయి!!.వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం టోకన్ల జారీ కాస్తా తొక్కిసలాటకు దారితీయడం ఆరుగురు మరణించడం వెనుక టీటీడీ, పోలీసుల వైఫల్యం, అలసత్వం సుస్పష్టం. పైరవీలతో టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న లోకేష్‌ల బాధ్యతారాహిత్యం కూడా కనపడతూనే ఉంది. అంత పెద్ద ఘోరం జరిగినా దాన్ని చిన్నదిగా చూపేందుకు ప్రయత్నించారు. ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకూ చూశారు. సహకరించే మీడియా ఉండనే ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ వంతు పాత్ర పోషించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా అప్రతిష్టపాలైంది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆటలో అరటి పండు చందంగా ఎవరూ పట్టించుకోనిది.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి!. అందుకేనేమో.. ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఏవో పిచ్చి ఆరోపణలు చేశారు.గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వెళ్లారు. సాధారణంగా ముఖ్యమంత్రి వెంటే మంత్రులు ఉండటం రివాజు. కానీ వేరే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ విడిగా వెళ్లి కొంత స్వతంత్రంగా వ్యవహరించారని చాలామంది భావించారు. జరిగిన తప్పుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వం తరుఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు కూడా. అంతా ఓకే అనుకుంటున్న సమయంలోనే పవన్.. తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందా? అని ప్రశ్నించి బాబు దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు.భక్తులకు క్షమాపణ చెప్పాలన్న పవన్ మాటలను టీటీడీ బాధ్యులు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో పవన్ పిఠాపురంలో సభలో కూడా మళ్లీ అదే డిమాండ్ చేశారు. అప్పుడే పవన్ ఈ ఉదంతం నుంచి చంద్రబాబును, టీడీపీని రక్షించే యత్నం చేస్తున్నారన్న సందేహం కలిగింది. కాకపోతే ఈ విషయం అర్థం బీఆర్ నాయుడు పవన్ కల్యాణ్ ఎవరో అన్నట్లుగా మాట్లాడి గాలి తీశారు. ఎవరో ఏదో చెప్పారని తానెందుకు స్పందిస్తానని అనడం ద్వారా ఈ వ్యవహారానికి కొత్త ట్విస్టు ఇచ్చారు. ఇది కాస్తా పవన్ వర్గానికి చిర్రెత్తించింది. చంద్రబాబుకు వెంటనే నిరసన చెప్పి ఉండాలి. ఆ వెంటనే చంద్రబాబు రంగంలో దిగి బీఆర్ నాయుడును ఆదేశించడంతో ఆయన తప్పనిసరి స్థితిలో సారీ చెప్పి, తన వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించి కాదని బుకాయించే యత్నం చేశారు.నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఇతర మంత్రుల మాదిరే ఒక మంత్రి. కాకపోతే ఉప ముఖ్యమంత్రి. ఈయనకేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. ఇతర మంత్రులపై, తనకు సంబంధం లేని ప్రభుత్వ సంస్థలపై అధికారం ఉండదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని స్వతంత్రంగా వ్యక్తిత్వంతో తిరుపతిలో తొక్కిసలాటపై మాట్లాడారులే అనుకున్న వారికి కొద్ది గంటలలోనే ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది.చంద్రబాబు నాయుడు సూచనల మేరకే పవన్ ఈ కథ నడిపారన్న విశ్లేషణ వస్తోంది. లేకుంటే పవన్ తిరుపతి ఆస్పత్రిలోని బాధితులను సందర్శించి టీటీడీ చైర్మన్ తదితరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఎవరెవరు బాధ్యులో వారందరిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అనాలి. అవేవి చేయకుండా క్షమాపణల డ్రామా ఆరంభించారు. దీంతో తనకేదో పేరు వస్తుందని కూడా అనుకుని ఉండవచ్చు. కానీ అసలు విషయం బయటపడ్డాక, పవన్ కల్యాణ్ మళ్లీ భక్తులను, ప్రజలను మోసం చేశారని తేటతెల్లమవుతోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఆరుగురు మరణించిన ఘటనలో ఆ ఊసే ఎత్తకపోవడాన్ని అంతా గుర్తిస్తున్నారు. అప్పుడు వేసుకున్న సనాతని వేషాన్ని ఇప్పుడు ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హైందవ ధర్మాన్ని రక్షించడమా అని అడుగుతున్నారు.గతంలో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ యావ కారణంగా రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే కూడా పవన్ నోరు విప్పలేదు. ఇప్పుడేమో తిరుపతిలో ఎన్నడూ జరగని దారుణ ఘటన జరిగితే, దానిని సైడ్ ట్రాక్ చేయడానికి అన్నట్లుగా అదేదో తనకు పవర్ ఉన్నట్లుగా హడావుడి చేసి చివరికి సారీలతో తుస్సుమనిపించారు. విశాఖ ప్రధాని సభలో తనతో సమానంగా లోకేష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంపై, ప్రచార ప్రకటనలలో లోకేష్ ఫోటో కూడా వేయడంపై పవన్ కు కొంత అసంతృప్తి ఉందని, దానిని పరోక్షంగా వ్యక్తం చేయడానికి తిరుపతి వెళ్లి తొక్కిసలాటకు తానే బాధ్యుడిని అన్నట్లు క్షమాపణ చెప్పారని కొందరు అనుకుంటున్నారు. పవన్ చర్య కొంత మంది టీడీపీ వారికి కూడా కోపం తెప్పించింది.ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, పవన్ లు కలిసే ఈ కథ నడిపించారన్న అభిప్రాయం చివరికి కలుగుతుంది. కాకపోతే బీఆర్ నాయుడు తెలివితక్కువ వల్ల ఈ విషయం అంతా గందరగోళమై పవన్ పరువు పోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో కులాల గొడవ రావడం కూడా గమనించవలసిన అంశమే. కమ్మ సామాజిక వర్గం వారిని కాపాడుకుని మిగిలిన వారిని బలి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తాజాగా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావును ఒంటరి చేసి బోర్డు ఛైర్మన్, సభ్యులు మాటల దాడి చేశారట. అంతేకాక ,శ్యామలరావు దేవాలయానికి వెళ్లినా అధికారులు ఎవరూ ఆయనతో మాట కలపలేదట!. దీనిని బట్టి ఆయనను బదిలీ చేస్తున్నారన్న ప్రచారం ఆరంభమైంది. బీసీ వర్గానికి చెందిన శ్యామలరావును అవమానించి బలి చేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. తానేదో మానవత్వం ఉన్న వ్యక్తిగాను, అల్లు అర్జున్ వంటివారికి అది తెలియనట్లుగాను మాట్లాడిన పవన్ పిఠాపురంలో వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పవన్ పరామర్శిస్తారని అనుకున్నారు. కానీ ఆయన అలా చేయలేదు. వారి గ్రామాల నుంచి పిఠాపురం రప్పించారట. పవన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొంటే బాధిత కుటుంబాల వారు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉసూరు మంటూ ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారట. అయినా అంతిమంగా ఆయన వారిని పలకరించకుండానే వెళ్లిపోయారు. దాంతో బాధిత కుటుంబాలు తమవాళ్లు పోయారన్న విషాదంతో పాటు, ఈ అవమానపు బాధను కూడా భరించవలసి వచ్చింది.ఏది ఏమైనా రాజకీయాలలో ఎల్లప్పుడూ డ్రామానే పండదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నట్లు ఆంధ్ర ప్రజలకు సినిమా వైబ్ అనండి.. పిచ్చి అనండి ఎక్కువగానే ఉండవచ్చు. వారివల్లే పవన్ వంటివారు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కానీ సినిమా పిచ్చే ఎప్పటికీ ఉంటుందా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
సుధారాణి కుటుంబానికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి సుధారాణికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నాం తన కుటుంబ సభ్యులతో ఆమె తాడేపల్లికి వెళ్లి ఆయన్ని కలిశారు.తమపై అకారణంగా కేసులు పెట్టి వేధించారని ఈ సందర్భంగా జగన్ వద్ద సుధారాణి వాపోయారు. అయితే అధైర్య పడొద్దని, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని, సుధారాణి కుటుంబాన్ని దగ్గరుండి జగన్‌కు కలిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. -
నెపం అధికారులపైకి నెట్టేస్తే సరిపోతుందా?
తిరుమల... ఎంత ప్రతిష్టాత్మక, పవిత్రమైన దేవాలయం..? ఎంత గొప్ప పేరు ఉన్న పుణ్య క్షేత్రం..? కానీ ఈ రోజు జరుగుతున్నదేమిటి? ఆంధ్ర ప్రదేశ్‌కే కాదు.. దేశానికే గర్వకారణమైన దేవస్థానంలో వైకుంఠ ద్వార ప్రవేశ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఉదంతం ప్రపంచ వ్యాప్త హిందువులను కలచి వేస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో ఘోరాలు జరగుతున్నాయి. అకృత్యాలు, విధ్వంసాలు, అరాచకాలు చోటు చేసుకుంటున్నాయి. చివరికి తిరుమలేశుని కూడా వదలిపెట్టలేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడానికి కూడా వెనుకాడని నాయకత్వం ఇప్పుడు ఏపీలో పాలన చేస్తోంది. హిందూ మత ఉద్దారకులుగా పైకి ఫోజు పెట్టడం, లోపల మాత్రం ఎన్ని దందాలు చేయాలో అన్నీ చేయడం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినా వారిని అసౌకర్యం లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించే వారు. అయోధ్య ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదెలాగో నేర్చుకోవడానికీ టీటీడీ అధికారులను ఆయోధ్యకు ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. అది జగన్ జమానా.. మరి ఇప్పుడు...??? అంతటి ఖ్యాతి వహించిన టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమైంది. వేలల్లో వచ్చిన జనాన్నే నియంత్రించలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. యాభై మంది వరకూ గాయపడ్డారు. ఇంతటి విషాదం... దశాబ్దాలలో ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన తిరుపతి గొప్పదనాన్ని దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. తిరుమలను పరిరక్షించేందుకు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి, జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ పలు సంస్కరణలు తెచ్చింది. ఇప్పుడు ఆ పని మాని గత ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల కాలంలో ఏమైనా తప్పులు జరిగాయా? అని భూతద్దం పెట్టి అన్వేషించి వైఎస్సార్సీపీ రాజకీయ కక్ష సాధించడానికి, జగన్ ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పరువును పణంగా పెడుతోంది. కొత్తగా టీటీడీ ఛైర్మన్ అయిన ఒక టీవీ సంస్థ యజమాని బీఆర్ నాయుడు పూర్తి అసమర్థంగా వ్యవహరించారనిపిస్తుంది. గొడవ జరుగుతుందని ముందుగానే తనకు తెలుసునని ఆయన చెప్పడం గమనార్హం. గొడవ జరుగుతుందని తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేకపోయారన్న ప్రశ్నకు జవాబు ఇవ్వలేక మళ్లీ మాట మార్చారు. ఈ మొత్తం ఘటనను బాధ్యతను అధికారులపైకి నెట్టి తప్పించుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడులు చూస్తున్నారు. మరో ఘట్టం గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమల ప్రసాదం లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. అలాంటి లడ్డూపై తీవ్రమైన అనుచిత ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘోర అపచారానికి పాల్పడ్డారని భక్తులు భావిస్తారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి ని వాడారంటూ చంద్రబాబు నీచమైన ఆరోపణ చేసి గత ముఖ్యమంత్రి జగన్ కు రుద్దాలని ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ సడన్ గా సనాతని వేషం కట్టి బాండ్ బాజా వాయించారు. దానికి జగన్ మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి... కాని స్వామి వారికి అపచారం చేస్తున్నారు సుమా! అని హెచ్చరించారు. అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు ఇష్టారీతిన దుర్మార్గపు ప్రచారం చేసి తిరుమల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయి. ఒకవేళ లడ్డూకు సంబంధించి నిజంగానే ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే వాటిని సరిచేసి బాధ్యతగా ఉండవలసిన ముఖ్యమంత్రే తన రాజకీయ స్వార్థం కోసం ఒక వదంతిని ప్రచారం చేశారు. చివరికి దానిపై సీబీఐ విచారణ వేస్తే ఏమైందో అతీగతీ లేదు. అనంతరం చంద్రబాబే మాట మార్చారు. దీనివల్ల స్వామి వారి ఆలయానికి అపవిత్రత తెచ్చిన అపఖ్యాతిని చంద్రబాబు, పవన్ లు పొందారు. కేవలం జగన్‌పై ద్వేషంతో ఆయన పాలనలో వీరు తిరుమలపై అనేక విమర్శలు చేసేవారు. దానివల్ల తిరుమల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఎన్నడూ ఫీల్ అయ్యేవారు కారు. జగన్ పై మతపరమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలన్న యావ తప్ప మరొకటి ఉండేది కాదు. చంద్రబాబు ,పవన్ లు నిజాలు చెప్పరులే అని ప్రజలు భావించారు కాబట్టి సరిపోయింది కాని, లేకుంటే కూటమి పెద్దలు తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని సృష్టించడానికి యత్నించారు. తిరుమలలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంక్రాంతి పర్వదినాల నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం జరిగింది. దీనిని చాలా పవిత్రంగా భక్తులు పరిగణిస్తారు. దానికి అధికారులు కూడా విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు వచ్చినా ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ ఈసారి తిరుపతిలో తొమ్మిది చోట్ల 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఈ తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లోపం తప్ప ఇంకొకటి కాదు. కారణం ఏమైనా బైరాగి పట్టెడ అనే చోట అకస్మాత్తుగా గేటు తెరవడంతో టిక్కెట్లు ఇస్తున్నారని అనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకు వచ్చారు. అంటే అక్కడ అలా తోపులాట లేకుండా ముందుగానే అధికారులు చర్య తీసుకోలేదన్నమాట. గురువారం ఉదయం నుంచి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బుధవారం మధ్యాహ్నమే తరలివచ్చారు. అధికారులు ఈ విషయాన్ని గమనించినా వారి నియంత్రణకు తగిన ప్రణాళిక రూపొందించలేదు. అందరిని ఒక పార్కులో పెట్టేశారు. మంచినీటి వసతి కూడా కల్పించలేకపోయారు. మరో రెండు చోట్ల కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇలాంటి వాటిపై కదా.. టీటీడీ ఛైర్మన్ ,పాలక మండలి, ఉన్నతాధికారులు దృష్టి పెట్టవలసింది?. గతంలో సమర్థంగా పనిచేసిన అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి, వారిని తొలగించి తమ అంతేవాసులను నియమించుకున్నారు. తిరుపతిలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ఒక పోలీసు అధికారిని ప్రత్యేకంగా పోస్టు చేశారట. వారు ఆ పనిలో ఉంటారు కాని, ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకుంటారు? పైరవీ చేసుకుని టీటీడీ ఛైర్మన్ అయిన బిఆర్ నాయుడుకు అసలు ఇలాంటి విషయాలలో ఏమి అనుభవం ఉంది? లేకపోయినా ఫర్వాలేదు. ఆయన నిబద్ధత ఏమిటి? కేవలం ఒక టీవీ సంస్థ ద్వారా తనకు బాజా వాయిస్తే పదవి ఇచ్చేశారు. పదవి తీసుకున్న తర్వాత అయినా టీటీడీ ఉద్దరణకు కృషి చేశారా? పోసుకోలు ఇంటర్వ్యూలు, ప్రకటనలు చేస్తూ కాలం గడిపి అసలు భక్తులను ఇక్కట్ల పాలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడుతుంటారు. అయినా ఆన్ లైన్ లో కాకుండా ఇన్ని వేల మందిని, అది కూడా గంటల తరబడి వేచి ఉండేలా చేయడం అంటే ఈ ప్రభుత్వ చేతకాని తనమే కాదా? చంద్రబాబు నాయుడు గతంలో పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం, సినిమా షూటింగ్ కోసం సామాన్య భక్తుల స్నాన ఘట్టంలో స్నానం చేసి నప్పుడు కూడా ఇలాగే గేట్లు సడన్ గా తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. ఆ విషయంలో ఒక్క కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోలేదు. సీసీటీవీ ఫుటేజీ సైతం మాయమైంది. ఆయన టైమ్ లో కేసును నీరుకార్చేసినా, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కూడా దానిపై దృష్టి పెట్టలేదు. తదుపరి కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభలలో పదకుండు మంది మరణించినా, చంద్రబాబుపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. అయినా చంద్రబాబు పోలీసులదే వైఫల్యం అని దబాయించి, రోడ్లపై సభలు వద్దన్నందుకు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఇటీవల హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే, దానికి నటుడు అల్లు అర్జున్ కారణమని ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అలా చేసినందుకు, టీడీపీ, జనసేన శ్రేణులు సమర్థించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టాయి. అదే కొలమానంగా తీసుకుంటే ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకోవాలి. ఎవరిని అరెస్టు చేయాలి? టీటీడీ ఈవో, జాయింట్ ఈవో, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ మొదలైనవారిని బాధ్యులు చేస్తారా? లేదా? ఎలాంటి చర్య తీసుకుంటారు? అసలు ఈ ఘటనకు నైతిక బాధ్యతగా బిఆర్ నాయుడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? ఒకవేళ ఆయన చేయకపోతే చంద్రబాబు ఆ మేరకు ఆదేశిస్తారా? అంటే అది జరిగే పని కాకపోవచ్చు. ఎందుకంటే బిఆర్ నాయుడుని నియమించిన చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.అలాగే పనికట్టుకుని తనకు కావల్సిన అధికారులను నియమించి ,వారిని తన అడుగులకు మడుగులు ఒత్తేవారిగా మార్చుకున్న ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈపాటికి చంద్రబాబు, పవన్ లు రెచ్చిపోయి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. ఎల్లో మీడియా గోల,గోల చేసేది. ఇప్పుడు మాత్రం అంత గప్ చిప్ అయ్యారు. అదేదో అధికారులదే తప్పన్నట్లుగా కథ నడపాలని చూస్తున్నారు. మొత్తం తిరుమలకు అపవిత్రత వచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మోక్షం పొందవచ్చన్న కొండంత ఆశతో వెళ్లిన భక్తులకు చంద్రబాబు ప్రభుత్వం నరకం సృష్టించడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్‌ను నిలదీశారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్‌లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్‌లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు. ⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది. -
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు. -
జగనన్న ఉండి ఉంటే.. ఈ కష్టాలు ఉండేనా? (ఫొటోలు)
-
‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’
గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు... వరుసగా కేబినెట్(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి. వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు... ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు. చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా? -
టార్గెట్ సజ్జల.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది. ‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
Pawan Kalyan సీజ్ ద షిప్.. ప్చ్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్ అభిమానులకు ఆ డైలాగ్ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ షిప్‌ను అయితే సీజ్ చేయమని చెప్పారో.. ఆ షిప్ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ ఈపాటికే లభించినట్లు సమాచారం.పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్ చేశారు. అయితే నవంబర్ 27న కలెక్టర్ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్ దగ్గరకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు.అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్ బియ్యం అన్లోడ్ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్ సీజ్ ద షిప్ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్..కొసమెరుపు..కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ! -
విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్ తుప్పు!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. విశాఖ ప్లాంట్ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. స్టీల్ ప్లాంట్ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. CM YS Jagan wrote a letter to PM Modi on “Vizag Steel Plant Privatisation” CM Jagan requested to refrain the process of Vizag Steel Plant Privatisation and continue to invest on Esteemed organization which is producing profits recently.#VizagSteelPlant #YSJaganCares pic.twitter.com/Qe6ibOahV6— Latha (@LathaReddy704) February 6, 2021ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే ఇస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
‘నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’
గుంటూరు, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని, ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ‘ఓటేయండి తమ్ముళ్లు’ అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ‘బాదుడే బాదుడు..’ అంటూ రూ. 15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా ఆదాయం పెంచడం?’’ అని అంబటి ప్రశ్నించారు . .. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు అని అంబటి మండిపడ్డారు... వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఏకంగా 400 మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి అన్నారు.ఇదీ చదవండి: మన కేసులు ఎత్తేద్దాం! -
2027 చివర్లో జమిలి ఎన్నికలు: వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.‘‘కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు.మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చారు. కానీ, ..మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో.. ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు. ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైఎస్ జగన్(YS Jagan) సూచించారాయన. -
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్‌కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్ ఎక్కడ?’
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమంతిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు. -
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతంకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపుఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలుప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటంజనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు -
‘రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?’
గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె. సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు! -
‘బరితెగించిన ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం’
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌తో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజాపక్షాన నిలబడాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో రాజీ ప్రస్తావన ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేశారాయన. మంగళవారం వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ఆయన వాళ్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదాం’ అని పార్టీ నేతలతో అన్నారు. 👉అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే నుంచే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటినీ నిలబెట్టుకోలేకపోయింది.పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను, నెలకొల్పిన వ్యవస్ధలను ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీలాంటి వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలించారు. ఇదేకాదు..👉రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. కుట్ర పూరితంగా కేసులు నమోదు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ పరిస్థితుల నడుమ ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రజల పక్షంగా వారి తరపున నిలబడాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.ఈ పోరాట కార్యాచరణను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం ప్రకటించారు. ‘రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా రైతాంగం వెంట నడవాలి. రైతులకు సంబంధించి వారికి అండగా నిర్వహిస్తున్న కార్యక్రమం డిసెంబరు 13వ తేదీన చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.17వేల కోట్ల కరెంట్ భారం ప్రజలపై మోపింది. రెండో కార్యక్రమం విద్యుత్ ఛార్జీల భారంపై డిసెంబరు 27న చేపట్టబోతున్నాం. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టనున్నాం.అదే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తూ జనవరి ౩వ తేదీన మూడో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. ఇప్పటికే 4 క్వార్టర్లు ఫీజు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా కాలేజీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. కాబట్టి వాళ్లకు అండగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం.👉మనం చేసిన మంచినంతా నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ గట్టిగా తీర్మానం చేసింది. ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్ధాయి వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్నివర్గాల తరపున పోరాడుతూ.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఏ స్ధాయిలోనైనా అండగా నిలబడుతుందనే విషయం ఆ వర్గాలకు తెలియజేయాలి.👉రైతులకు అండగా వైఎస్సార్సీపీ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేలా అందరూ ముందుకు రావాలి. ఆయా జిల్లాల్లో చేపట్టబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రేణులు, రైతులు తరలి వచ్చేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ కేడర్ గ్రామస్ధాయి నుంచి జిల్లా స్ధాయి వరకు వెళ్లి ర్యాలీలో పాల్గొనడంతోపాటు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలి అని సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. -
Human Rights: నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!
ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి. ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’అధికారం చేపట్టాక.. పవన్ కల్యాణ్ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు. తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహంఏవో కొంపలు మునిగిపోయినట్లే!నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాధారణంగా.. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ, కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యఅన్నింటిని మేనేజ్ చేస్తున్న బాబు!దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్సీపీ. ఇక.. పోలీస్ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు.రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది. ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!. -
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. సీన్ రివర్స్!
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతోంది. ఏపీవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి పెద్దషాకే ఇస్తున్నారు. ఆర్భాటంగా జరుగుతుందని భావించిన పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్‌లో అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు తమ ప్రశ్నలతో.. నిరసనలతో కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతా సవ్యంగానే నడుస్తోందంటూ మంత్రులు, కూటమి నేతలు ప్రకటించుకున్నారు. కానీ..కర్నూల్లో.. విద్యార్థుల సమస్యలపై అడుగడుగునా తల్లిదండ్రులను కూటమి నేతలను నిలదీస్తున్నారు. కర్నూల్లో మంత్రి టిజి భరత్‌ను ఓ విద్యార్థి తల్లి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఆ భోజనం కారణంగానే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారామె. కర్నూలు నగరంలోని హైస్కూలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో మంత్రి భరత్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.అల్లూరి సీతారామరాజు జిల్లాలో..ఏజెన్సీ కూనవరం ఏపీ టీ డబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో రచ్చ రేగింది. అన్ని సబ్జెక్టులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిలబస్ పూర్తికాకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. స్కూల్ ముందు రోడ్డుపై తమ పిల్లలతో బైఠాయించారు. -
YS Jagan: ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణబాబు సర్కార్‌కు డిమాండ్లురూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణడిసెంబర్ 27వ తేదీన.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమంబాబు సర్కార్‌కు డిమాండ్లుకరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలిజనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి ఇదీ చదవండి: ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు- వైఎస్ జగన్ -
ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటం ఎలా చేయాలనే అంశంపైనా రేపటి సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.తాడేపల్లిలో రేపు జరగబోయే భేటీలో.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చించననున్నారు. అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో..రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపైన చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. అలాగే ఒక ప్రణాళికను రూపొందించి.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.భేటీలో చర్చించబోయే ప్రధానాంశాలుభారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోంది చంద్రబాబు సర్కార్.ధాన్యం సేకరణ అంశంతో పాటు రైతులను దోచుకుంటున్న దళారులుఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ రూపకల్పనఇదీ చదవండి: కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి! ఈ భేటీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలకు ఆహ్వానం వెళ్లింది. ఇదిలా ఉంటే.. పార్టీ బలోపేతం కోసం సంక్రాంతి తర్వాత వైఎస్సార్సీపీ అధినేత క్షేత్రస్థాయి పర్యటన చేపనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ప్రతీ బుధ, గురు వారాల్లో పూర్తిగా కార్యకర్తలతోనే గడుపుతూ.. వాళ్ల నుంచి సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించారాయన. -
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
ఫ్లాష్‌బ్యాక్ గుర్తుందా చంద్రబాబూ?
అమరావతి, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ప్రజా పద్దుల సంఘం(PAC) ఛైర్మన్ పదవికి ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యా బలం లేదనే సాకు చూపిస్తూ.. అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం.పీఏసీ చైర్మన్ పదవిని ఏకగ్రీవంగా.. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా(1966 నుండి) వస్తోంది. అధికార కూటమి తర్వాత ఉంది.. విపక్ష స్థానంలో వైఎస్సార్సీపీనే కాబట్టి న్యాయంగా ఆ పదవి ఆ పార్టీకే దక్కాలి. అయితే.. ఆ సంప్రదాయానికి గండికొట్టి.. తామే దక్కించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోంది. పైగా ఏకగ్రీవం చేయకుండా.. కావాలనే కూటమి పార్టీ వాళ్లతో కావాలనే నామినేషన్లు వేయించారు చంద్రబాబు. అయితే..సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నామినేషన్ సమయంలోనూ చివరిక్షణం దాకా అసెంబ్లీ సెక్రటరీ ఛాంబర్ వద్ద పెద్దడ్రామానే నడిచింది. ఇక.. మొత్తం 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు(టీడీపీ 7, జనసేన 1, బీజేపీ 1, వైఎస్సార్సీపీ 1) వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ సభ జరిగే టైంలోనే.. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.వైఎస్సార్సీపీ హయాంలో గుర్తుందా?2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించారు వైఎస్ జగన్. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి అప్పగించారు... అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా మాత్రం చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. కానీ,అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించడం గమనార్హం. పీఏసీతో పాటు అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. ఒక్కో కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు ఉంటుంది. -
AP Assembly: వాడీవేడిగా మండలి సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఊహించినట్లుగానే.. ఏకపక్షంగా సాగుతోంది. హామీలను ఎగవేసే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.