Appointments
-
తాజా కార్పొరేట్ నియామకాలు
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్‌కు నేతృత్వం వహిస్తున్న జీఎస్ఎంఏ బోర్డ్ ఛైర్మన్‌గా ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టెలిఫోనికా ఛైర్మన్, సీఈవో పదవికి హొసే మరియా అల్వరేస్ ప్యాలే రాజీనామా చేయడంతో జీఎస్ఎంఏ ఛైర్మన్ పదవి కోల్పోయారు. జీఎస్ఎంఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇటీవలే గోపాల్ విఠల్ తిరిగి నియమితులయ్యారు. అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా 2019–20లో పనిచేశారు. 1,100లకుపైగా టెలికం, హ్యాండ్సెట్, డివైస్, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, ఇంటర్నెట్ రంగ కంపెనీలు జీఎస్ఎంఏలో సభ్యులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేపు భారత్‌కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్టీవీఎస్ టూవీలర్స్ ప్రెసిడెంట్వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా గౌరవ్ గుప్తా నియమితులయ్యారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఈవీ విభాగాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కంపెనీ ఇటీవల తెలిపింది. గతంలో ఆయన ఎంజీ మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, డిప్యూటీ ఎండీ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం(నవంబర్ 11) ఆదేశాలు జారీ చేసింది.ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్,పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను నియమించారు. కాగా, ఇటీవల వైఎస్సార్సీపీలో పలు కీలక పదవులను పార్టీ ముఖ్య నేతలతో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రశ్నిస్తామనే ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్ -
YSRCPలో కీలక పదవులకు నియామకాలు
తాడేపల్లి, సాక్షి: వైస్సార్సీపీలో కీలక పదవులకు నియామకాలు జరిగాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేస్తూ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదలయ్యింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం.. కర్నూలు జిల్లాకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఇక.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. -
వైఎస్సార్సీపీలో పలు జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు జిల్లా, నగర అధ్యక్షుల నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులుగా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులుగా మార్గాని భరత్ రామ్ నియమితులయ్యారు.కాగా, మంగళవారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. పార్టీ నాయకుల సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. -
మిగిలిన గురుకుల పోస్టులను మెరిట్‌తో భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో..: గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చి ంది. అయితే ఈ నియామకాలను అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు, దిగువ స్థాయి పోస్టులను తర్వాత) చేపట్టాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనితో మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోగా.. మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన విజయ్ మనోహర్‌తోపాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జి వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చి న పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే, వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నవించారు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని.. మిగిలిన ఖాళీల్లో పిటిషనర్లను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పున కు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరాలు తెలు సుకుని చెప్పాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చే యాలంటూ.. విచారణను వాయిదా వేసింది. గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫి కేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ పుల్ల కార్తీ క్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యా యవాది చిల్లా రమేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూ డా ఉన్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికా రులు సూచించారు. అయితే ఆ నివేదిక రాక ముందే పిటిషనర్లను పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు. మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు
-
ఎస్సై నియామకాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాలకు సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సై నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్‌కు మంగళవారం క్లియరెన్స్ ఇచ్చింది. అభ్యర్థుల ఎత్తు. కొలతల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలను అడ్డుకున్న స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు విచారణ చేపట్టింది. ఆపై న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించింది. అయితే.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇక తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏం జరిగింది? ►నెలన్నర కింద న్యాయస్థానం ముందు ఎస్సై అభ్యర్థుల పిటిషన్ ►ఇప్పటికే పలు మార్లు పిటిషన్లు వేసిన అభ్యర్థులు ►అభ్యర్థుల తరపున జడ శ్రవణ్ పిటిషన్ ►ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కోర్టులో కేసులు ►తొలుత ఫలితాలు విడుదల చేయకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ►ఎస్సై రిక్రూట్మెంట్లో ఎత్తు విషయంలో అభ్యంతరాలు ►ఇప్పటికే రెండు సార్లు ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►ఎత్తు విషయంలో విఫలమయ్యారని తేల్చిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఎత్తు కొలిచిన ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ►రెండో సారి కొలిచిన తర్వాత మళ్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు పిటిషన్ ►రెండో సారి మాన్యువల్‌తో కాకుండా.. స్కానర్లతో ఎత్తు కొలిచిన బోర్డు ►రెండో పరీక్షలోనూ అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు ►అయినా హైకోర్టులో మళ్లీ పిటిషన్ వేసిన జడ శ్రవణ్ ►అభ్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారని ఆరోపణలు ►రిక్రూట్మెంట్ బోర్డు పై ఆరోపణలు తప్పని తేలితే రూ.లక్ష జరిమానా కడతారా? ప్రశ్నించిన హైకోర్టు ►అంగీకారం తెలుపుతూ మెమో దాఖలు చేయాలని ఆదేశం ►హైకోర్టు సమక్షంలో ఒక్కొక్క అభ్యర్థి ఎత్తు కొలుస్తామన్న జడ్జిలు ►ఎత్తు విషయంలో అర్హత సాధించలేకపోతే.. లక్ష కడతామని రాసివ్వాలని షరతు ►అభ్యర్థులు వెనక్కి తగ్గడంతో ఫలితాలు విడుదల చేసుకోవచ్చన్న హైకోర్టు ఇదీ చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు
అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు. వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. -
‘సింగరేణి’ నియామకాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయ వచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూని యర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022 లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 98,882 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79, 898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవ కతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేశారు. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీ క్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ జె.అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగరేణి తరఫున స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమా ర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ని యామక ప్రక్రియకు అనుమతించింది. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్.బలరామ్ తెలిపారు. త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. -
‘ఇండియా’ కమిటీల్లో నియామకాలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని వివిధ కమిటీలకు మరికొన్ని నియామకాలు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కూటమిని సన్నద్ధం చేసే క్రమంలో శుక్రవారం ప్రకటించిన సమన్వయ, ఎన్నికల వ్యూహ కమిటీలోకి వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులను తీసుకున్నారు. తాజాగా, ప్రచార కమిటీలోకి కాంగ్రెస్ నేత గుర్దీప్ సింగ్ సప్పాల్, జేడీయూ నేత సంజయ్ ఝా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్జేడీ సంజయ్ యాదవ్, ఎన్సీపీ నుంచి పీసీ చాకో, జేఎంఎం నేత చంపాయి సోరెన్, ఎస్పీకి చెందిన నందా కిరణ్మయ్, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఎం నేత అరుణ్ కుమార్, సీపీఐఎంఎల్ నుంచి రవి రాయ్, వీసీకే నుంచి తిరుమావలన్, ఐయూఎంఎల్ నేత కేఎం కాదర్ మొయిదిన్, కేసీ–ఎం నేత జోస్ కె మణి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీ నేత మెహబూబ్ బేగ్‌లను నియమించారు. టీఎంసీ నుంచి ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంది. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను నియమిస్తోందనే తీవ్ర ఆరోపణల నడుమ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరిచింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఇకపై ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలు జరపాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది ‘శక్తివంతమైన తుపాకీ కంటే బ్యాలెట్ మరింత శక్తిమయం. ఎన్నికల ప్రక్రియ అతిగా దుర్వినియోగానికి గురైందంటే అది చివరకు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది. అధికారం ముందు సాగిలపడే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికకాకూడదు. ఇంకొకరి ఆదేశాలను శిరసావహించే వ్యక్తి ప్రజాస్వామ్య తలరాతను మార్చే హోదాలో ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను మరింతగా ఇనుమడింపజేసేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం. స్వచ్ఛత తగ్గిపోతే వినాశక పరిణామాలు సంభవిస్తాయి. పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చేవరకు నూతన నియామక ప్రక్రియ అమలులో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఇన్నాళ్లూ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి కొత్త సీఈసీ, ఈసీల కోసం సిఫార్సుచేసేది. సిఫార్సులమేరకు రాష్ట్రపతి వారిని నియమించేవారు. ఇకపై కొత్త ప్రక్రియ ప్రకారం లోక్‌సభలో విపక్షనేత లేని సందర్భంలో లోక్‌సభలో సంఖ్యపరంగా అతిపెద్ద విపక్ష పార్టీ నేత త్రిసభ్య కమిటీలో సభ్యునిగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన నేపథ్యంలో వాటిని విచారించిన కోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. తీర్పును స్వాగతించిన విపక్షాలు ‘ప్రభుత్వ ప్రమేయం, ప్రభావం బారిన పడకుండా ఈసీని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు తీర్పు బాటలు పరిచింది’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తీర్పును ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘ఇంతకాలం ప్రధాని ఎన్నికల ర్యాలీలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలకు అనుగుణంగా ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఇకపై ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారనే త్రిసభ్య కమిటీ చూసుకుంటుంది’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
పీడబ్ల్యూసీలో 30,000 నియామకాలు
న్యూఢిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో సుమారు 30,000 మంది సిబ్బందిని తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ చైర్మన్ బాబ్ మోరిట్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 31,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ చైర్మన్ జాన్–పాస్కల్ ట్రైకోయిర్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ తమకు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పురోగమించేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్. తొలిసారి వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వాళ్లకు ఊరట ఇచ్చింది అగ్రరాజ్యం. వీసా కోసం పడిగాపులు పడకుండా ఉండేందుకు అదనపు చర్యలు చేపట్టింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత మూడేళ్ల నుంచి విజిటర్ వీసా కోసం వేల మంది పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వీసా ప్రాసెసింగ్‌లో ఉన్న బ్యాక్లాగ్ సమస్యను పరిష్కరించడానికి.. శనివారాల్లో ప్రత్యేక వీసా ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా అదనపు స్లాట్లతో భారీగా అప్పాయింట్మెంట్లు అందుబాటులోకి రాన్నాయి. వీసా దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే ఈ భారీ ప్రయత్నంలో భాగంగా.. జనవరి 21వ తేదీన న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్లు విజిటర వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇందుకోసం డజన్ల కొద్దీ తాత్కాలిక సిబ్బందిని నియమించారు కూడా. ఇక ఈ ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడానికి జనవరి మరియు మార్చి 2023 మధ్య వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి రానున్నారు. మరోవైపు ఎంబసీ, కాన్సులేట్లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను కూడా పెంచుతోంది. "రాబోయే రోజుల్లో.. ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్మెంట్ల కోసం అదనపు స్లాట్లను తెరుస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదిలా ఉంటే.. ఇదివరకే మునుపటి అమెరికా వీసాలతో ఉన్న దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూలను మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. అటువంటి దరఖాస్తుదారులు ఇకపై వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరుకావలసిన అవసరం లేదు. -
Passport: ఇక నుంచి వేగంగా పాస్‌పోర్టుల జారీ
సాక్షి హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ల కోసం చాలాకాలం నిరీక్షించకుండా మరిన్ని సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్లను పెంచినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు 50, తత్కాల్ 50, అమీర్‌పేట పీఎస్కేలో సాధారణ 25, తత్కాల్ 25, టోలిచౌకి పిఎస్కెలో సాధారణ 25, తత్కాల్ 25, నిజామాబాద్ తత్కాల్ 20 అపాయింట్మెంట్లను పెంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన అపాయింట్మెంట్లు 16వ తేది నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. గత డిసెంబర్ మాసంలో 5 ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా క్రేందాల్లో వరుసగా 4 శనివారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా అపాయింట్మెంట్ల లభ్యత పెంచినట్లు వివరించారు. దీనివలన గతంలో తత్కాల్ అపాయింట్మెంట్ల లభ్యత సమయం 30 రోజులకు, సాధారణ పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల లభ్యత సమయం 40 రోజులకు తగ్గిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు) -
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
వీసా అపాయింట్మెంట్ల పెంపునకు కృషి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లా ర్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్నిఫర్ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్వేర్ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు. 2019లో కోవిడ్ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్ మినిస్టర్(ఎకనామిక్) డాక్టర్ రవి కోటతోపాటు యూఎస్ఐబీసీ, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: వైద్యశాఖ నియామకాల్లో ఉమ్మడి విధానం
సాక్షి, అమరావతి: వైద్య విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. బయో మెడికల్ ఇంజినీర్, డైటీషియన్ తదితర 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్ పోస్టులను ఈ నెలలోనే భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో పబ్లిక్ హెల్త్ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అన్ని విభాగాలు, పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడిగా నియామక ప్రక్రియను చేపట్టాలని జిల్లాల ఎంపిక కమిటీల (డీఎస్సీ)కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి ఈ నెలాఖరులోగా స్రూ్కటినీ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధంచేశారు. ఉమ్మడి నోటిఫికేషన్ జారీ అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరంలేకుండా, ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల మెరిట్ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు. ఉమ్మడి నోటిఫికేషన్‌తో అభ్యర్థులకు మేలు గతంలో డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులకు అర్హతలు ఒక్కటే అయినప్పటికీ భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చేవి. అభ్యర్థులు కూడా మూడు విభాగాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అందుకు అప్లికేషన్ నుంచి మొదలు అన్ని దశల్లోనూ మూడుసార్లు అదనపు భారం, ప్రయాస పడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విభాగాల్లోను ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థులు మూడు విభాగాలకు ఒక్క దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లో ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆ విభాగాన్ని ఎంచుకునే అవకాశం వారికే కల్పించింది. ఉమ్మడి ఎంపికవిధానం ద్వారా ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు రుసుం రూ.500 కలిసి రావడంతో పాటు ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతుంది. ఉమ్మడి భర్తీ ప్రక్రియ, అభ్యర్థుల అర్హతలకు సంబంధించి జిల్లా ఎంపిక కమిటీలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు సైతం జారీచేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండే ఎంపిక కమిటీలో వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ, డీఎంఈ విభాగాలకు చెందిన అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను వీరు పరిశీలించి, రిజర్వేషన్లు పాటించి మెరిట్ జాబితాను రూపొందిస్తారు. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
మా సహనాన్ని పరీక్షిస్తున్నారా?: సీజే ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అల్టిమేటం జారీ చేసింది. భర్తీ విషయంలో అలసత్వం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం వాదనలు జరగ్గా.. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం లేనట్లు మాకనిపిస్తోంది. మా సహనాన్ని పరీక్షిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఒక వారంలో ట్రిబ్యునల్స్ ఖాళీల భర్తీపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సీజే నేతృత్వంలోని న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సోలిసిటర్ జనరల్ మెహతాకి మూడు అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపిన సీజే రమణ.. నియమకాలు చేపట్టడం, ట్రిబ్యునల్స్‌ను మొత్తంగా మూసేయడం, నియమాకాలకు తమకు(సుప్రీం) అవకాశం ఇచ్చి.. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడడం ఆప్షన్స్‌ను కేంద్రం ముందు ఉంచారు. ‘‘మేం అసహనంతో ఉన్నాం. ప్రభుత్వంతో ఇబ్బందికర వాతావరణం మేం కోరుకోవట్లేదు’’ అని సీజే వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా‘‘ప్రభుత్వమూ ఇబ్బందికర పరిస్థితుల్ని కోరుకోవట్లేద’’ని తెలిపారు. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ దాఖలు చేసిన ట్రిబ్యునల్ ఖాళీల భర్తీ పిటిషన్‌పై.. చీఫ్ జస్టీస్ రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కేంద్రానికి నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్13కి వాయిదా వేసింది. చదవండి: వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు -
2,000 మంది నియామకం: లెన్స్‌కార్ట్
న్యూఢిల్లీ: కంటి అద్దాల తయారీ, విక్రయంలో ఉన్న లెన్స్‌కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికిపైగా సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అలాగే సింగపూర్, పశ్చిమ ఆసియా, యూఎస్‌లో మరో 300 మందిని చేర్చుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. టెక్నాలజీ, డేటా సైన్స్, విక్రయాలు, సరఫరా, ఫైనాన్స్, మానవ వనరుల వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపింది. సంస్థ వృద్ధిలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతా ల్లో నిపుణులైన మానవ వనరులను కొత్తగా చేర్చుకుంటున్నట్టు లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 5,000 పైచిలుకు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. 2010లో ప్రారంభమైన లెన్స్‌కార్ట్ ఇప్పటికే కేకేఆర్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఐఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నిధులను సమీకరించింది. -
గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు
గుంతకల్లు(అనంతపురం): ‘నకిలీ అపాయింట్మెంట్’ల వ్యవహారం రైల్వే ఉద్యోగుల్లో హాట్ టాపిక్‌గా మారింది. నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం 12 మంది నకిలీ ఉత్తర్వులతో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించారు. వీరిలో చెన్నైకి చెందిన టి.రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్నాడు. మిగిలిన 11 మంది వివరాలు రైల్వే అధికారులు గోప్యంగా ఉంచారు. వాస్తవానికి ఇలాంటి నకిలీ ఉత్తర్వులతో దాదాపు 50 మందికి పైగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం అక్రమాల్లో తమిళనాడుకు చెందిన 12 మంది నుంచే కాకుండా గుత్తి, గుంతకల్లుకు చెందిన మరో 38 మంది అభ్యర్థుల నుంచి రూ. లక్షలు వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బు పర్సనల్ డిపార్టుమెంట్‌లోని కొందరు సిబ్బందితోపాటు ఒకరిద్దరు అధికారులు కూడా వాటాల రూపంలో దండుకున్నట్లు సమాచారం. ఫోర్జరీ సంతకాలతో.. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆఫీస్ ముద్రతోపాటు డీపీఓ పోర్జరీ సంతకంతో కూడిన ఉత్తర్వులు చూస్తుంటే దీని వెనుక పెద్ద గూడుపుఠానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రైల్వే ఆస్పత్రి నుంచి ఫిట్నెస్, మెడికల్ సరి్టఫికెట్లు కూడా పొందారంటే..ఇందులో పర్సనల్ డిపార్టుమెంట్ కార్యాలయ సిబ్బంది ప్రమేయం తప్పకుండా ఉంటుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. కాగా ఈ నకిలీ బాగోతం బహిర్గతం కావడంతో అప్రమత్తమైన అవినీతిపరులు తప్పిదం తమ మీదకు రాకుండా దారి మళ్లించే పథకం రచించినట్లు సమాచారం. పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు ఆదివారం గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. గుత్తి డీజిల్òÙడ్లో ఎం.విజయస్టాన్లీ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడనీ, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమను నమ్మించాడు. ఈ ఏడాది జనవరిలో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశాడని తెలిపారు. అలాగే సర్టిఫికెట్, మెడికల్, ఫిట్నెస్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లుగా వివరించాడు. తీరా జాయిన్ అయ్యే సమయంలో అవి పోర్జరీ సంతకాలతో కూడిన అపాయింట్మెంట్ లెటర్లు అని తేలడంతో తాము మోసపోయినట్లు బాధితులు బోరుమన్నారు. చనిపోయిన వ్యక్తి పేరుతో దందా.. వాస్తవానికి నకిలీ ఆర్డర్ కాపీలతో తమను మోసపుచ్చాడని నిరుద్యోగులు చెబుతున్న విజయ్‌స్టాన్లీ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కరోనాతో మృతి చెందాడు. అతని ఐడీ కార్డును ఉపయోగించుకుని ఓ వ్యక్తి తాను రైల్వే ఉద్యోగినంటూ మోసానికి తెర లేపినట్లు తెలిసింది. ఇలా 50 మంది తాము మోసపోయినట్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ కుంభకోణంలోని ప్రధాన పాత్రధారులంతా పక్కకు తప్పుకొని... చనిపోయిన స్టాన్లీబాబుపైకి నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. చదవండి: అంతేనా లోకేష్.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా! ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
వీటిలో గత పదేళ్ళుగా నియామకాలు లేవు!
హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు మోక్షం లభించట్లేదు. కోర్టు కేసులంటూ కొన్నేళ్లు.. ప్రభుత్వ అనుమతుల కోసమంటూ ఇంకొన్నేళ్లు.. తీరా ప్రభుత్వం అనుమతి ఇచ్చాక నిబంధనల రూపకల్పన పేరుతో మరికొన్నేళ్లు.. తరువాత ఎన్నికల కోడ్.. ఇలా కారణం ఏదైనా పదేళ్లుగా నియామకాలు జరగట్లేదు. సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయినా వీసీల నియామకాలు జరగకపోవడంతో అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి ముందడుగు పడట్లేదు. కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో యూనివర్సిటీల్లో పరిశోధన అటకెక్కింది. లెక్కలు తేల్చిన విద్యాశాఖ... యూనివర్సిటీల్లోని ఖాళీలు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. యూనివర్సిటీల్లో కేవలం 968 మందే (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయకపోవడం గమనార్హం. ఆరు యూనివర్సిటీల్లో లేని ప్రొఫెసర్లు.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేకుండానే శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేని దుస్థితి నెలకొంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కగట్టింది. చారిత్రక యూనివర్సిటీల్లోనూ భారీగా ఖాళీలే... వందేళ్లు దాటిన ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. గత పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలను పెద్దగా చేపట్టకపోవడం, వివిధ కారణాలతో పోస్టుల భర్తీని ఉన్నత విద్యాశాఖ వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఓయూ తరువాత ఎంతో కీలకమైన కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరే అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అభివృద్ధిపైనా లేని ధ్యాస.. యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రగతి పద్దు కింద నిధులను కేటాయించట్లేదు. ఈసారి కూడా నిర్వహణ పద్దులోనే ఆ మెుత్తాన్ని పెంచింది. గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ. 627.28 కోట్లు కేటాయించింది. అయితే అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. -
రెల్లి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం
సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్‌గా వదయ్ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు. -
‘డీఎస్సీ–2018’ నియామకాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2018 నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని అధికారులు గతంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే, హైకోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు నివేదించిన గడువులోగా కాకున్నా పది రోజులు అటు ఇటుగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని అంటున్నారు. కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కారమయ్యేలా చూసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీచర్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. అన్ని తరగతులకూ టీచర్లుండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. డీఎస్సీ–2018లోని 7,902 పోస్టుల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు.. రాష్ట్రంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. వీరిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. అయితే, ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలెక్షన్ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరకు మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైన అభ్యర్థుల ఎంపికను ఆన్లైన్ విధానంలో చేపడుతూ సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే, మరోవైపు సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం జరగడం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. -
ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు సంస్థ ఉద్యోగులకు ఎయిరిండియా భారీ షాక్ సిద్ధమవుతోంది. ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ సర్కార్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.. ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల (జూలై)15 తో క్లోజ్ చేసింది. ఈ ఖాతాలను బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా వార్తలపై విమానయాన శాఖ , ఎయిరిండియా అధికారికంగా స్పందించాల్సి వుంది. ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ సెక్రటరీ అటన్ చక్రవర్తి ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ.30 వేల కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎయిరిండియాలో సుమారు 10వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. -
జేఎల్ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హన్మకొండ(వరంగల్) : టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా చేపట్టిన నియామకాల్లో అధికారులు అక్రమాలకు తెరలేపారు. కొంతకాలంగా ఎన్పీడీసీఎల్లో చేపట్టిన ప్రతీ నియామక ప్రక్రి య వివాదాస్పదమవుతోంది. ఓ వైపు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న తమ దారి తమ దే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం అధికారులంటే ఒక తీరు.. ఉద్యోగులంటే మరో తీరుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఎంత పెద్ద తప్పు చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుం డగా.. ఉద్యోగులు మాత్రం చిన్న పొరపాటు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమ కనుసన్నల్లో అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కఠినంగా ఉన్నామని చెబుతూనే.... జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పోల్ టెస్ట్ పై కఠినంగా వ్యవహరిస్తున్నారని అనిపించుకుంటూనే.. ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపారని అభ్యర్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తిని అధికారులు స్తంభం ఎక్కించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని పాత ఐదు సర్కిళ్ల పరిధిలో రెండో విడత పోల్ టెస్ట్uమొదటిపేజీ తరువాయి నిర్వహించారు. పూర్వ అదిలాబాద్ సర్కిల్ పరిధిలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. జూన్ 20న జరిగిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి స్తంభం పరీక్షకు హాజరయ్యారు. వరంగల్ సర్కిల్లో ఓ కాంటాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికుడు స్తంభాలు ఎక్కడంలో నిపుణుడు. దీంతో రాత పరీక్షలో అర్హత సాధించి స్తంభం పరీక్షకు ఎంపికైన ఓ అభ్యర్థి.. ఇక్కడి నుంచి నిష్ణాతుడిని తీసుకెళ్లి స్తంభం ఎక్కించాడు. 2,553 పోస్టుల భర్తీకి.. తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ మండలి(టీఎస్ ఎన్పీడీసీఎల్) క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న జూ నియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినా పూర్వ జిల్లాల వారీగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామబాద్, అది లాబాద్ సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 2,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్వ విద్యుత్ సర్కిళ్ల వారీగా జనవరిలో మొదటి విడత పోల్ టెస్ట్ (స్తంభం ఎక్కే పరీక్ష) నిర్వహించారు. ఈ మేరకు 2,553 పోస్టులకుగాను అంతే సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానించగా 1,,222 మంది అభ్యర్థులు పోల్ టెస్ట్‌లో ఉత్తీ ర్ణత సాధించారని సమాచారం. అయితే, ఎందరు అర్హత సాధించారనేది అధికారికంగా ప్రకటించలేదు. ఈ పోల్ టెస్ట్ నిర్వహణ, నిర్వహణలో అక్రమాలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అర్హత సాధించినా అనర్హత వే టు వేశారని అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఓ కమిటీని నియమించారు. ఈ నిపుణుల కమిటీ బాధ్యులు పరీ క్షకు సంబంధించిన వీడియో పుటేజీ ద్వారా అభ్యర్థుల ఎంపికకు తుది రూపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినా బయటకు వెల్లడించలేదు. మరో విడత నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీల మేరకు మొదటి విడత పరీక్షలో అభ్యర్థులు ఎంపిక కాలేదు. దీంతో రెండో విడతగా మరికొందరిని స్తంభం పరీక్షకు పిలిచారు. రెండో విడత పరీక్షలోనూమాలు జరిగాయనేరోపణలు వచ్చాయి. అదిలాబాద్‌లో జరిగిన పోల్ టెస్ట్‌లో చివరకు రాత పరీ„ýక్షలో సాధించిన అభ్యర్థి తనకు బదులు స్తంభం పరీక్షకు మరో అభ్యర్థిని తీసుకువచ్చారని సహచర అభ్యర్థులు గుర్తించారు. జూన్ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్ నంర్గా ఉన్న శ్రావణ్‌కుమార్ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న బి.నవీన్ పరీక్షలో పాల్గొన్నాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని అభ్యర్థుల వాదన. ఓ వైపు పోల్ టెస్ట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతూనే చాటుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. టీఎస్ ఇకనైనా ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పందించి వీడియో చిత్రీకరణను పరీక్షించి పోల్ టెస్ట్ నిర్వహంచిన, అక్రమాలకు తెర లేపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
గురుకుల నియామకాల్లో ‘ఔట్సోర్సింగ్’ అవినీతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష వరకు వసూలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది. -
నియామకం.. అక్రమం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల నియామకం అక్రమ మార్గంలో సాగుతోంది. అస్మదీయులకైతే ఎలాంటి విధి విధానాలు లేకుండా, నిబంధనలను కూడా పక్కనపెట్టి అందలం ఎక్కిస్తున్నారు. వైస్ ఛాన్స్లర్ ఆదేశాలు లేకుండా నేరుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే ధోరణితో బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మిగులు ఉద్యోగులు అధికమైన నేపథ్యంలో ఉద్యోగాలు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్కేయూ ఇంజినీరింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఓ ఉద్యోగిని డైలీ వేజ్ కింద గత ఏడాది జూన్‌లో విధుల్లోకి తీసుకున్నారు. అయితే వీసీ అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. వాస్తవంగా ప్రతి ఉద్యోగి నియామకానికి వీసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు విరుద్ధంగా నియామకం చేపట్టారు. ఆ సమయానికి ఇన్చార్జి వీసీ ఉన్నా.. లెక్క చేయకపోవడం గమనార్హం. ఇప్పటి నుంచి జీతాలు చెల్లించకుండా ఈ ఏడాది మొదటి వారంలో ఏకంగా ఆరు నెలలకు సంబంధించి జీతం ముట్టజెప్పారు. పని చేసిన మొత్తం రోజులకు కాకుండా.. ప్రతి నెలా కేవలం 15 రోజులే పని చేశారని చూపిస్తూ గత జూన్ నుంచి డిసెంబర్ వరకు జీతం చెల్లించారు. కనీసం జీతం చెల్లింపు సమయంలోనూ మాటమాత్రమైనా ఇన్చార్జి వీసీని సంప్రదించలేదని తెలుస్తోంది. కొత్త వీసీని నియమిస్తారనే సమయంలో జీతం చెల్లించడాన్నిచూస్తే అక్రమార్కులు ఈ నియామకం విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అర్థమవుతోంది. అవుట్సోర్సింగ్లోనూ అంతులేని అక్రమాలు 2015 ఆగస్టులో తొలిసారిగా అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి ఏజెన్సీకి చెల్లించాల్సిన మొత్తం కంటే అదనంగా చెల్లించి ఉదారత చాటుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అనంతరం వచ్చిన ఏజెన్సీకి ఇదే తరహాలోనే అదనపు మొత్తాన్ని చెల్లించారు. వాస్తవానికి కేవలం 72 ఉద్యోగాలకే అనుమతి వచ్చినప్పటికీ.. ఏకంగా 140 ఉద్యోగాలు కట్టబెట్టారు. గార్డెనింగ్, స్వీపర్ కేడర్లతో 100 మందికి పైగా ఉద్యోగం కల్పించారు. వీరంతా ఎక్కడ ఉద్యోగం చేస్తారో.. ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు. ఉద్యోగాలకు గైర్హాజరైనా జీతాలు చెల్లిస్తూ అక్రమాలకు ఊతం ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి రూ.9 లక్షలు అదనంగా చెల్లించి అక్రమాలకు పాల్పడ్డారు. అనుమతి లేకుండానే నియామకం వాస్తవానికి అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగ నియామకం చేశారు. నేను ఇన్చార్జ్ వీసీగా ఉన్న సమయంలో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. వీసీ ఆదేశాలు లేకుండానే రిజిస్ట్రార్ ఉద్యోగం కల్పించారు. ఈ అంశం గత రెండు రోజుల కిందట నా దృష్టికి వచ్చింది.– ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ,మాజీ ఇన్చార్జ్ వీసీ, ఎస్కేయూ -
‘అధ్యక్ష’ నియామకాలపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి, అమరావతి : పార్టీ అనుబంధ శాఖలకు కొత్తగా నియమించిన అధ్యక్షులపై టీడీపీలో అసంతృప్తి రగులుతోంది. కీలకమైన తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్షులుగా నియమితులైన వారిపై పార్టీలోని ఇతర నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో పది అనుబంధ సంఘాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ నియామకంపై పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వారిని విస్మరించి వేరే పార్టీ నుంచి కొంతకాలం క్రితం వచ్చిన అవినాష్‌కు పదవి ఇవ్వడం సరికాదంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన అవినాష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు. ఆ పదవిలో ఉండగానే కొద్ది కాలం క్రితం టీడీపీలో చేరారు. వాస్తవానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కుతుందని పార్టీ నేతలు భావించారు. గతంలో నెల్లూరుకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ ఈ పదవి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పదవి చేపట్టారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. పలువురు నుంచి అభ్యర్థనలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు దేవినేని అవినాష్‌కు ఆ పదవి ఇవ్వడంతో టీడీపీ బీసీ నేతలు కంగుతిన్నారు. ఇప్పటికే అవినాష్ సమీప బంధువు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అవినాష్ సోదరుడు చంద్రశేఖర్ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా పార్టీలోని ముఖ్య పదవులన్నీ ఒకే వర్గానికి ఇవ్వడం ఏమిటని బీసీ నేతలు మండిపడుతున్నారు. మహిళ అధ్యక్షురాలినియామకంపైనా అసంతృప్తి తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత నియామకంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిని ఉత్తరాంధ్రకు చెందిన శోభా హైమావతి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్నా ఆమెకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు హైమావతి స్థానంలో సునీతను నియమించడంపై కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన సునీత పార్టీలో కీలక నేత కాదని, ఆమె మహిళ అధ్యక్షురాలిగా రాణించలేరని చెబుతున్నారు. బీసీ సెల్ అధ్యక్షునిగా గుంటూరుకు చెందిన బోనబోయిన శ్రీనివాసరావును నియమించడంతో ఆ పదవిని ఆశించిన మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఏడాదిలో 2,000 మంది నియామకం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల రంగంలో ఉన్న ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతోంది. ఏడాదిలో కొత్తగా 2,000 మందిని చేర్చుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ రాజీవ్ యాదవ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,200 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ‘11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. 14 లక్షల మంది కస్టమర్లున్నారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రూ.2,899 కోట్లుంది. 2021కి ఏయూఎం రూ.10,000 కోట్లకు చేర్చాలన్నది ధ్యేయం. అలాగే 40 లక్షల కస్టమర్లకు చేరుకోవాలనేది లక్ష్యం. బ్యాంకింగ్ ఔట్లెట్లు ప్రస్తుతమున్న 532 నుంచి 5,000ల స్థాయికి తీసుకెళతాం. డిపాజిట్లపై వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు 9.5%, ఎన్ఆర్ఐలకు 9 -
ఆచార్యా.. అయోమయం!
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఆచార్యుల నియామకాలు గందరగోళంగా మారాయి. నియామక ప్రక్రియ, ఉత్తర్వుల జారీ, ఆచార్యుల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలతో సహా పలు అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లోని పలు విభాగాల్లో ఎనిమిది ప్రొఫెసర్ పోస్టులకు నేరుగా నియామకాలు చేపట్టేందుకు గతంలో యూనివర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రొఫెసర్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్లు పాటించాలని కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఏఎన్‌యూలో నియామకాలపై కూడా హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇంటర్వ్యూల ఫలితాల ప్రకటనలో చాలా కాలం జాప్యం జరిగింది. అసలు పోస్టులు భర్తీ చేస్తారా లేదా అనే గందరగోళం నెలకొంది. ఈ అంశం కోర్టులో కొనసాగుతుండగానే గత అక్టోబర్ చివరివారంలో కాస్ (కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్) కింద పలు విభాగాల్లో ఏడుగురు అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఇది జరిగిన నెలన్నరకే కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాయంటూ ఈనెల 22న జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రొఫెసర్ పోస్టు ఇంటర్వ్యూల్లో జరిగిన నియామకాలకు ఆమోదం తెలిపారు. సర్వీసు పరిగణనలో లోపాలు దీనితోపాటు ప్రొఫెసర్ పోస్టుల ఎంపికలో గత సర్వీసులను పరిగణనలోకి తీసుకోవడంలో లోపాలు జరిగాయని పలువురు «అధ్యాపకులు వాపోతున్నారు. యూనివర్సిటీలో గతంలో పనిచేసిన టీచింగ్ అసిస్టెంట్ సర్వీసులను పరిగణనలోకి తీసుకోకుండా బయట అన్ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకుల తాత్కాలిక సర్వీసులను పరిగణనలోకి తీసుకుని ప్రొఫెసర్లుగా నియమించడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. దీనితోపాటు ఏపీఏ స్కోర్ కోసం సమర్పించే సర్టిఫికెట్లలో ఏకకాలంలో రెండు సదస్సులకు హాజరైనట్లు సర్టిఫికెట్లు కూడా కొందరు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఆరోపణలు యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్ పోస్టులకు కోర్టు అడ్డంకులు లేవని, అందుకే పాలక మండలిలో నియామకాలకు ఆమోదం తెలిపామని యూనివర్సిటీ ఉన్నతాధికారులు చెబుతుండగా మరో వైపు నియామకాల్లో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను హైకోర్టులో వేసిన పిటీషన్ ఆధారంగా ఏఎన్‌యూలో నియామాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవద్దని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జి. నరసింహారెడ్డి అనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలకమండలి సమావేశం ముందు రోజే ఏఎన్‌యూ వీసీ, రిజిస్ట్రార్లకు లేఖ పంపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండానే పాలకమండలిలో నియామకాలకు ఆమోదం తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అవుతుందని పిటీషనర్ పేర్కొన్నారు. నియామక ఉత్తర్వుల్లో లోపించిన స్పష్టత ప్రొఫెసర్లుగా నియమితులైన ఎనిమిది మందికి అదే రోజున నియామక ఉత్తర్వులు అందజేశారు. అప్పటివరకు న్యాయపరమైన సమస్యలేమీ లేవని చెప్పుకొచ్చిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వుల్లో మాత్రం కోర్టు ఉత్తర్వులకు లోబడే ఈ పోస్టుల్లో కొనసాగింపు ఉంటుందని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులేమీ లేనపుడు ఇక న్యాయపరమైన సమస్యలు ఎందుకు వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టుల్లో చేరిన వారిలో ఏడుగురు ప్రస్తుతం ఏఎన్‌యూ కళాశాలల్లో పలు హోదాల్లో రెగ్యులర్ అధ్యాపకులుగా ఉన్నారు. ప్రొఫెసర్లుగా చేరితే గత ఉద్యోగాలకు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ప్రొఫెసర్ ఉద్యోగాల్లో చేరిన తరువాత కోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వస్తే ప్రొఫెసర్ ఉద్యోగం పోతుంది. అప్పుడు రెండు ఉద్యోగాలకు అనర్హులవుతారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగాలకు రిజైన్ చేయకుండా లీన్ (దీర్ఘకాలిక సెలవు) పెట్టి ప్రొఫెసర్ ఉద్యోగాల్లో చేరాలని కూడా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. ఇతర యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు, విదేశాలకు వెళ్లే వారికే లీన్ ఇస్తారని, ఒకే యూనివర్సిటీలో పనిచేసే వారికి లీన్ నిబంధన ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రొఫెసర్ పోస్టుల్లో నెలకొన్న గందరగోళంతో భవిష్యత్‌లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
నకిలీ ఉద్యోగాల వల.. తప్పించుకునేదెలా!
విదేశాల్లో, ఎంఎన్సీల్లో, ప్రముఖ కంపెనీల్లో కొలువులంటూ ఎరరైల్వేలో, రక్షణ రంగంలో, పీఎస్‌యూల్లో ఉద్యోగాలపేరిట భారీగా మోసంనకిలీ జాబ్ సైట్స్, నకిలీ ఈ–మెయిల్స్, ఫేక్ కన్సల్టెన్సీలతో నిరుద్యోగులను వంచిస్తున్న వైనంఫేక్ ఆఫర్ లెటర్లతో లక్షలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లుఅప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు ‘నాగేశ్వరరావు ఓ ప్రభుత్వరంగ సంస్థలో శాస్త్రవేత్తగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. విశ్రాంత సమయంలోఖాళీగా ఉండలేక తన అనుభవానికి తగ్గ పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ జాబ్‌పోర్టల్‌లో రెజ్యూమె అప్లోడ్ చేశారు. కొన్నిరోజుల తర్వాత లండన్‌లో ఓ నిర్మాణ కంపెనీలో జాబ్, భారీవేతనంతో ఉద్యోగమంటూ ఆఫర్ వచ్చింది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు, వీసా ప్రాసెసింగ్ ఫీజులు, పోలీస్ క్లియరెన్స్ ఫీజు, యాంటీ టెర్రరిజం ఫీజు.. మొదలైన పేర్లతో పలు దశల్లో నాగేశ్వరరావు నుంచి డబ్బుగుంజడం మొదలుపెట్టారు. మొత్తంమీద రూ.19 లక్షలు వదిలించుకున్న తర్వాత అసలు మోసంబయటపడింది. మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించారు నాగేశ్వరరావు.’ ‘సంధ్యారాణి ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేసింది. ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహమైంది. ఐదేళ్ల బాబుఉన్నాడు. భర్త అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం సంధ్యారాణి తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఓ జాబ్ పోర్టల్‌లో రెజ్యూమె అప్లోడ్ చేసింది. ప్రముఖ బ్యాంకులో జాబ్ఆఫర్ అంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ పేరుతో రూ.3,500 చెల్లించాలని చెప్పడంతో ఆమె ఆ మొత్తాన్ని అకౌంట్లోజమచేసింది. బ్యాంకు లెటర్‌ప్యాడ్‌తో ఆఫర్ లెటర్ పంపించారు. ఉద్యోగం సొంతం కావాలంటే.. మరికొంత చెల్లించాలన్నారు. వివిధ దశల్లో రూ.5 లక్షలు వసూలు చేశారు. తీరా జాయినింగ్ లెటర్ తీసుకొని వెళ్లేసరికి..ఆ ఆఫర్ లెటర్‌కు, సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దాంతో మోసపోయానని తెలుసుకున్న సంధ్యారాణి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ :ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇలా ఎంతోమంది నిరుద్యోగులు ఫేక్ ఉద్యోగ ఆఫర్లతో భారీగా మోసపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు పోటీ నానాటికీ తీవ్ర మవుతోంది. ఉద్యోగాలు లభించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో టాప్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అనేసరికిæ నిరుద్యోగులు రూ.లక్షలు అప్పుచేసి మరీ చెల్లిస్తు న్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చితికి పోతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు లక్షలు కొల్లగొడుతున్నారు. సంస్థలు విడుదల చేసే ఆఫర్ లెటర్ మాదిరిగానే ఉండే లెటర్ హెడ్‌తో ఉద్యోగార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. జాబ్ పోర్టల్స్ నుంచే ♦ నేటి ఆన్లైన్, ఇంటర్నెట్ యుగంలో ఎక్కడి నుంచైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునే అవకాశముంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సహాయంతో దేశ విదేశాల్లో కొలువులు వెతుక్కునే వీలుంది. అందుకోసం జాబ్ పోర్టల్స్‌లో నిరుద్యోగులు రెజ్యూమెలు అప్ లోడ్ చేస్తుంటారు. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది. నిరుద్యోగులు జాబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేసిన రెజ్యూమెల నుంచి సైబర్ నేరగాళ్లు అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నారు. అమాయకులకు ఉద్యోగాల ఎరవేసి భారీగా డబ్బులు గుంజి కనిపించకుండా పోతున్నారు. ఫేక్.. గుర్తించండిలా! ♦ కొందరు ముఠాగా ఏర్పడి ఒకరు హెచ్ఆర్గా, మరొకరు టెక్నికల్ పర్సన్‌గా పరిచయం చేసుకొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు చెప్పి... హడావుడి చేస్తుంటారు. కొందరు ఏకంగా రైల్వేలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణ సైతం ఇస్తూ పోలీసులకు చిక్కడం తెలిసిందే. ఇలాంటి వాళ్లు నిరుద్యోగులకు తరచూ ఫోన్లు చేస్తూ సంభాషణలు కొనసాగిస్తారు. ఆ క్రమంలో ఏదో ఒక సందర్భంలో రిజిస్ట్రేషన్ పేరిటగానీ లేక మరేదైనా కారణం చెప్పి తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయమని కోరుతారు. వీరు కచ్చితంగా ఫేక్ అని నిర్ధారించుకోవచ్చు. ♦ ఎంపిక ప్రక్రియ ఏ దశలోనైనా ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బులు అడుగు తున్నారంటే అది కచ్చితంగా మోసం అని భావించాలి. కంపెనీ పెద్దదైనా, చిన్నదైనా.. అభ్యర్థుల నుంచి డబ్బులు అడగవనే విషయాన్ని గుర్తించుకోవాలి. ♦ ఇంకొందరు మోసగాళ్లు మరో అడుగు ముందుకేసి.. ఆఫర్ల లెటర్లు సైతం జారీ చేస్తారు. ఫలానా తేదీలో కంపెనీలో చేరాలని నమ్మబలుకుతారు. ఈలోపు కొంత మొత్తాన్ని తమ ఖాతాలో వేయమంటారు. వీరు కూడా నకిలీలే! ♦ బ్యాంక్ అకౌంట్స్, టాక్స్ ఫామ్స్, పాన్ నెంబర్, ఆధార్ కార్డ్.. ఇలాంటివి అడుగుతున్నారంటేనే అనుమానించాలి. ♦ ఆఫర్ లెటర్ లేదా ఉద్యోగం నిజమైనదే అని న మ్మించేందుకు ఫోటోలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫి కెట్లు, మెడికల్ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్లు సమర్పించమని అడుగుతారు. ♦ నేరగాళ్లు జారీచేసే ఆఫర్ లెటర్లను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ జారీచేసే అపాయింట్మెంట్ లెటర్‌కు, నకిలీలు ఇచ్చే లెటర్లకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఫేక్ ఆఫర్ లెటర్లలో.. ఉద్యోగంలో భాగంగా నిర్వర్తించాల్సిన పాత్ర, విధుల గురించి స్పష్టత ఉండదు. గ్రామర్ తప్పులు, స్పెల్లింగ్ పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆఫర్ లెటర్లలో సంస్థల లోగోలు, హోలోగ్రాంలను క్షుణ్నంగా పరిశీలిస్తే అవి నకిలీ అని తేలుతుంది. ♦ ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్స్ లోనే ఆఫర్లెటర్స్ ఇస్తున్నారు. విదేశాల్లో జాబ్స్, భారీగా జీతాలు అంటూ ఆకర్షిస్తున్నారు. డిపాజిట్ రూపంలో కొంత మొత్తం, వీసా ప్రాసెసింగ్‌కు మరికొంత చెల్లించమని కోరుతున్నారు. ఈ–మెయిల్స్ డొమైన్ పేరు కూడా సంస్థ పేరుతోనే ఉంటున్నాయి. ♦ మనం చదివిన కోర్సుకు సంబంధం లేని ఉద్యో గాలు కూడా ఈ–మెయిల్స్ ద్వారా వస్తుంటాయి. ఇలాంటివి పట్టించుకోకపోవడం మేలు. ♦ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వినిపించే పదం ‘బ్యాక్‌డోర్’. టాప్ ఐటీ కంపెనీలో నేరుగా జాబ్ ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేస్తాయి కొన్ని నకిలీ కన్సల్టెన్సీలు. సాఫ్ట్వేర్ సంస్థలుగానీ, ఇతర ఏ కంపెనీలు అయినా ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తాయి అనే విషయాన్ని గమనించాలి. ♦ మరికొందరు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సంస్థ అని చెప్పి.. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగావకాశం కల్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు గుంజి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి కేసులు ఇప్పుడు అనేకం. ♦ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలంటూ.. ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇటీవల కాలంలో ♦ సర్వసాధారణ మయ్యాయి. ఉదాహ రణకు కొద్ది రోజుల క్రితం తెలంగాణ అగ్రి డవలప్ మెంట్ కార్పొరేషన్లో కొలు వులు అంటూ.. నోటి ఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజు వ సూలు చేశారు. ఇలా దరఖాస్తు ఫీజు రూపే ణ కూడా వందల మంది నష్టపోతున్నారు. అప్రమత్తత అవసరం ♦ కంపెనీలు నియామకాల్లో పారదర్శ కత పాటిస్తున్నాయి. తమ అధికారిక వెబ్సైట్లలో ఖాళీల వివరాలను, తమ అవసరాలను పొం దుపరుస్తున్నాయి. అలానే, లింక్డ్ ఇన్ వంటి ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌ల్లో సంస్థలు ఉద్యోగ అవ కాశాలను పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నమ్మదగ్గ మార్గాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తే మోసపోవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ♦ మీకున్న నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని రిఫరల్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు. కంపెనీ కాకుండా థర్డ్ పార్టీ నుంచి ఉద్యోగ అవకాశం వస్తే నెట్వర్క్ ద్వారా నిజానిజా లను తెలుసుకోవాలి. ♦ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సమయం లో వ్యక్తిగత సమాచారం అవసరమై నంత వరకే చెప్పాలి. కంపెనీలు వ్యక్తిగత వివరాలు కొంతమేరకు అడిగినా..∙మరీ లోతుగా అడిగే అవకాశం ఉండదు. తార్కికంగా ఆలోచించి సమాధానాలు ఇవ్వడం మేలు. ♦ అపరిచిత వ్యక్తుల నుంచి, కన్సల్టెన్సీల నుంచే వచ్చే ఉద్యోగ ఆఫర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఆయా సంస్థల అధికారిక ఈ– మెయిల్స్‌కు, ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసైనా వివరాలు తెలుసుకోవాలి. నేరుగా వెళ్లి కనుక్కోండి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడే తాప త్రయాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుం టున్నారు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట అన్ని వయసుల వారు మోసపోతున్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలంటూ.. ఎర వేస్తూ రూ.లక్షలు లాగుతున్నారు. కాగ్నిజెంట్, ఐబీఎం, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేస్తున్నారు. కాబట్టి ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలి. మన హైదరాబాద్‌లో ఆయా ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా అక్కడికి వెళ్లి ఉద్యోగ వకాశాల గురించి వాకబు చేయాలి. సంస్థలు జీతాలు ఇచ్చి నియమించుకుం టాయి. అంతేకానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇయ్యవు అనే విషయాన్ని గుర్తించాలి. ఆఫర్ లెటర్లో కంపెనీల లోగోలు, లెటర్ హెడ్స్ తదితర వివరాలను ధ్రువీకరించుకోవాలి. అపరిచితులకు డబ్బులు బదిలీచేసే ముందు తార్కికంగా ఆలోచించాలి. – ఎస్.హరినాథ్, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్, రాచకొండ. -
ఇష్టారాజ్యంగా నిర్ణయాలు
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై సిబ్బందిలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రిపుల్ఐటీ ప్రారంభంలో నాన్ టీచింగ్ స్టాఫ్ కింద తీసుకున్న హెచ్ఆర్టీలు దాదాపు 25 మందిని ఇటీవలే ఐటీ మెంటార్ల పేరుతో టీచింగ్ స్టాఫ్‌గా మార్చడంతో పాటు జీతాలను కూడా పెంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరిగిందిదీ.. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసినప్పుడు హోమ్ రూమ్ ట్యూటర్ల(హెచ్ఆర్టీ)లను తీసుకోవడం జరిగింది. వీరు ప్రతి తరగతికి ఒకరు చొప్పున ఉన్నారు. వీరిని అప్పట్లో పీజీ డిప్లొమా ఇన్ ఐటీ అర్హతతో తీసుకుని అప్పట్లో నెలకు రూ.10వేల చొప్పున జీతం ఇచ్చారు. తరగతిలో మెంటార్ లేనప్పుడు తరగతిని పర్యవేక్షించడం, ల్యాప్‌ట్యాప్‌ల వాడకాన్ని విద్యార్థులకు నేర్పించడం, విద్యార్థులకు నిర్వహించే స్టడీ అవర్స్‌ను పర్యవేక్షించడం వీరి పని. నాలుగేళ్లు గడిచిన తర్వాత హెచ్‌ఆర్‌టీలను రద్దు చేసి వీరినే ఐటీ ఎస్ఎస్లుగా మార్చి జీతాన్ని రూ.15వేలుకి పెంచారు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా మార్చడంతో పాటు వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. ఈ మూడు రకాల హోదాలు కూడా నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించినవే. అనంతరం కొంతకాలానికి వారి జీతాన్ని రూ.25వేలకు పెంచారు. నోటిఫికేషన్ లేదు.. ఇక్కడ టీఏలుగా పనిచేస్తున్న వారు ఉద్యోగం చేసుకుంటూనే నాగార్జున యూనివర్సిటీ నుంచి దూరవిద్యా విధానంలో ఎమ్మెస్సీ ఐటీ చదివారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు టీఏలను ఐటీ మెంటార్లు(టీచింగ్ స్టాఫ్)గా మారుస్తూ, జీతాన్ని కూడా రూ.33వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీచేసి వారందరికి ఆర్డర్లను అందజేసింది. ప్రస్తుతం ఇదే వివాదాస్పదం అవుతోంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రమాణాలు పతనం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐటీ మెంటార్లను నియమించాల్సి ఉంటే నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోవాలే గాని ఇలా చేయడమేమిటని మెంటార్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హెచ్ఆర్టీలందరూ 20వ శతాబ్దపు గురుకులంలో చదువుకున్న విద్యార్థులు కావడం వల్లనే కావాలనే వారికి ఇలా లబ్ది చేస్తున్నారనే ప్రచారం ట్రిపుల్‌ఐటీలో జరుగుతోంది. -
వైఎస్సార్సీపీలో పలువురి నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్సీపీలో గురువారం పలువురి నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ హర్షవర్ధన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెలికాని రాజమోహన్ రావులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
గెస్ట్ లెక్చరర్ల నియామకాలపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో దాదాపు 1,200 మంది గెస్ట్ లెక్చరర్ల నియామకాలను పారదర్శకంగా మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా చేపడుతున్నామని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ అశోక్ చెప్పారు. అయితే ఒక సంఘం నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని ఆరోíపించారు. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయడం కుదరదన్న విషయంలో ఓ సంఘం నేతలు అపార్థం చేసుకుంటున్నారని, పాత వారిని అలాగే కొనసాగించాలని పట్టు పడుతున్నారని విమర్శించారు. కొత్త వారి నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వవద్దని ప్రిన్సిపాళ్లకు ఒక సంఘం సమాచారం పంపించిందని ఆరోపించారు. పాత వారిని రెన్యువల్ చేయాల్సిందేనంటూ ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీకి హక్కులు ఉండవన్న విషయాన్ని గుర్తించడం లేదన్నారు. గతంలో గౌరవ వేతనం తీసుకున్న వారికి, అనుభవం కలిగిన వారికి ఆయా సర్టిఫికెట్లను జారీ చేయాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. దీంతో ఇదివరకు గెస్ట్ లెక్చరర్లుగా పని చేసిన వారికి ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు 205 కాలేజీల్లో నోటిఫికేషన్లు జారీ చేశామని, మరో 142 కాలేజీలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు వద్దంటే ఎలా?: ఇంటర్ విద్యా జేఏసీ 1,200 మంది గెస్ట్ లెక్చరర్లు జూన్, జూలైల్లో పనిచేశారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లోనూ పాల్గొన్నారని, ఇప్పుడు వారిని అకస్మాత్తుగా రోడ్డు న పడేస్తే ఎలాగని ప్రశ్నించారు. 2016–17లో పనిచేసిన వారందరిని 2017–18లో తీసుకున్నారని, ఇప్పుడు వారిని పక్కకు పెట్టడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రిన్సిపాళ్లకు బాధ్యతలు అప్పగించ డం వల్ల స్థానికంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, వారు పనిచేసే పరిస్థితి లేదని వెల్లడించారు. ‘సరైన షెడ్యూల్ లేకుండా ఎలా?’ ఉన్నతాధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్ అన్నారు. ఏ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలి.. ఎన్ని రోజులు దరఖాస్తులు స్వీకరించాలి.. డెమో, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహించాలన్న వివరాలతో కూడిన షెడ్యూల్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యాల విషయంలోనూ స్పష్టత లేదన్నారు. -
వెఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,హైదరాబాద్ : వైఎస్సార్సీపీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. జనగాం జిల్లా కార్యదర్శిగా నోముల జైపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడిగా గుగ్గిళ్ల శ్రీధర్, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా దండేంపల్లి కార్తీక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మానేగల్ల మంజులను నియమించినట్లు పార్టీ వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నర్మెట మండల అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, చిల్పుర్ మండల అధ్యక్షుడిగా పొదేలా రత్నాకర్, స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా పీయాల రాజి రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా అప్పం కిషన్, గోవింద నాయక్ భుక్యాలను నియమించారు. -
పత్తాలేని పాలక మండళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో పాలన గాడితప్పుతోంది. విధానపరౖ నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లు (ఈసీ) లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఉద్యోగులు, అధ్యాపకుల నియామకాలు, పదోన్నతులు, వేతనాల పెంపు, అభివృద్ధి పనులు.. ఇలా అన్నింటికీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల అనుమతి తప్పనిసరి కావడం, ఏళ్ల తరబడి ఈసీల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో వర్సిటీల పాలన దెబ్బతింటోంది. కొన్ని వర్సిటీలకు పదేళ్లుగా ఈసీలు లేకున్నా పట్టించున్న పరిస్థితి లేదు. వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా.. ఈసీలు లేక అన్నింటికీ ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి నెలకొంది. శాతవాహన, కేయూకు 2009 నుంచే.. రాష్ట్రంలోని శాతవాహన, కాకతీయ వర్సిటీలకు 2009 నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అంతకుముందు నియమించిన ఈసీల పదవీకాలంలో ముగియడం, తరువాత ఈసీలను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వర్సిటీ ఈసీని 2011లో రద్దు చేశాక మళ్లీ నియమించలేదు. మిగతా వర్సిటీలదీ ఇదే పరిస్థితి. 2011లో ఉస్మానియా, జేఎన్టీయూకే ఈసీలను నియమించినా వాటి పదవీకాలం 2014తో ముగిసింది. ఆ తరువాత రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ ఈసీలను నియమించలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా వాటిపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. 10 లక్షలకు మించి ఖర్చు చేయాలంటే.. వర్సిటీల్లో అభివృద్ధి పనులను చేపట్టడంలో ఈసీ నిర్ణయమే కీలకం. రూ.10 లక్షలకు మించిన వ్యయంతో ఏ పని చేయాలన్నా, ఎలాంటి కొనుగోళ్లు చేపట్టాలన్నా ఈసీ ఆమోదం ఉండాలి. 12–13 మంది ఉండే పూర్తి స్థాయి ఈసీ లేకున్నా ఐదుగురు సభ్యులు (కోరం) ఉన్న ఈసీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఏ నిర్ణయమైనా పరుగెత్తాల్సిందే పాలక మండళ్లు లేకపోవడంతో వర్సిటీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఐఏఎస్ అధికారుల వద్దకు వీసీలు పరుగెత్తాల్సి వస్తోంది. రూ.10 లక్షలలోపు పనికైనా రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు ఈసీలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను వర్సిటీలు రాబట్టుకోలేకపోతున్నా యి. ఎక్స్ ఆఫిషియో సభ్యులు వర్సిటీల బాగోగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అధిక మొత్తంలో నిధులు కావాలని అడిగే పరిస్థితి లేదు. వర్సిటీ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో ఈసీలు లేకుండా చేపట్టిన నియామకాలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. 2010లో కాకతీయ వర్సిటీ జంతు శాస్త్ర విభాగంలో ఇద్దరు అధ్యాపకుల నియామకాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయి పాలక మండలి లేకుండా నియామకాలు ఎలా చేపడతారంటూ కోర్టుకెక్కారు. నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా పోస్టింగ్ పొందారు. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలోనూ నలుగురు అధ్యాపకుల నియామకాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్సిటీల్లోని 1,061 పోస్టుల భర్తీ ఈసీ నియామకాలతో ముడిపడి ఉండటంతో ముందుకు సాగడం లేదు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పలు పదవులకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొండూరు చంద్రశేఖర్‌ను నియమించామన్నారు. పార్టీ వనపర్తి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా సి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వొడ్ల సుమంతాచారి, కార్యదర్శులుగా రాచురి ఆంజనేయులు, జె.రవికుమార్‌లను నియమించినట్లు వెల్లడించారు. -
జూన్ నాటికి వర్సిటీల్లో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో బుధవారం గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి తరఫున ఆయన సమాధానమిచ్చారు. కడియం మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో 1,661 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపామన్నారు. వాటికి ఆయా వర్సిటీలు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీలు జరుగుతాయన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11 వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ. 420 కోట్లు కేటాయించిందన్నారు. 2004–14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం రూ.1.29 లక్షల కోట్లు కాగా, 2014 నుంచి ఇప్పటివరకు చేసిన పెట్టుబడి వ్యయం రూ.1.24 లక్షల కోట్లు ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందనడానికి ఈ లెక్కలే నిదర్శనమన్నారు. -
నియామకాలకు బ్రేక్..!
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన ప్రక్రియకు బ్రేక్ పడింది. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్దంగా నియామకాలు చేపడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు, విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పలు విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ఇప్పటికే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అదే విధంగా వైవీయూలో నియామక ప్రక్రియ, రోస్టర్ విధానంలో తప్పులతడకపై సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో వైవీయూకు చెందిన పరిశోధక విద్యార్థులు బి.బాలాజీనాయక్, వి.శ్రీనివాసులు, ఎం. నాగేంద్రనాయక్లు కోర్టును ఆశ్రయించారు. రిట్‌పిటీషన్ నంబర్ 12500/2018ను కోర్టు స్వీకరించడంతో పాటు ఈ నియామక ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు స్టే ఇస్తూ గురువారం తీర్పునిచ్చింది. రోస్టర్ విధానం, జీఓనం.117, ఎస్టీ రిజర్వేషన్లో నిబంధనలు పాటించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్టే ఇవ్వడం గమనార్హం. దీంతో వైవీయూలో 2017 అక్టోబర్ 18న విడుదల చేసిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్‌తో పాటు 2018 జనవరి 3,4 తేదీల్లో వేర్వేరుగా ఇచ్చిన జనరల్ నోటిఫికేషన్లు సైతం నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు విశ్వవిద్యాలయానికి చేరుకోగా వాటిని స్క్రూటినీ చేసే పనిలో అధికారులు ఉండగానే.. నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. యూజీసీ నిబంధనలు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగినవి. ఈ నిబంధనల ప్రకారం ఒక విభాగం ఏర్పాటు కావాలంటే అందులో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలన్న నిబంధన ఉంది. అదే విధంగా 12బీ, 2ఎఫ్ కలిగిన విద్యాలయాలకు యూజీసీ గ్రాంట్స్, ఇతరత్రా నిధులు లభిస్తాయి. ఇందులో ఏవైనా కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలన్నా, నూతన పోస్టులు మంజూరు చేయాలన్నా విశ్వవిద్యాలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 390 జీఓను జారీ చేసి హైపవర్ కమిటీ పేరుతో రేషనలైజేషన్ ప్రక్రియ, పోస్టులను కన్వర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా కొన్ని కోర్సులు కనుమరుగు కావడంతో పాటు పోస్టులు కూడా గల్లంతు అయ్యే పరిస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్ల అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా తలకిందులయ్యాయి. దీంతో కేవలం ఒక్క వైవీయూలోనే 43 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు వాటిని 18 పోస్టులకు కుదించారు. ఈ 18 పోస్టుల్లో సైతం మళ్లీ 12 పోస్టులను బ్యాక్లాగ్ కింద కేటాయించారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నప్పటికీ 5 విభాగాలను హేతుబద్దీకరణ పేరుతో మూసివేతకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ 2017 జనవరిలో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైవీయూ నుంచి ఫిజిక్స్ అధ్యాపకుడు వై.పి. వెంకటసుబ్బయ్య కోర్టును ఆశ్రయించడంతో దీనిపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు వెలువరిచింది. దీంతో ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా నియామకాలు చేపట్టేందుకు వేర్వేరు జీఓలను విడుదల చేసింది. దీంతో ఒక్కో విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. నియామక ప్రక్రియకు సంబంధించి వైవీయూకు 2017 జూన్ 30వ తేదీన జీ.ఓ ఎంఎస్ నెం.28ను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌లో వైవీయూ జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ నియామక ప్రక్రియ కోసం జారీ అయిన జీఓనెం. 28పై స్టే విధించింది. దీనిపై ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించగా నియామక ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పరిశోధక విద్యార్థులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కడంతో నియామక ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. -
ఆటో రంగంలో తగ్గనున్న నియామకాలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో నియామకాలు నెమ్మదించనున్నాయని ఫిక్కి–నాస్కామ్, ఈవై అధ్యయనం పేర్కొంది. ఈ రంగంలో నియామకాలు చారిత్రకంగా చూస్తే 3 నుంచి 3.5 శాతం మేర వృద్ధి చెందగా, 2 నుంచి 2.5 శాతానికి తగ్గుతాయని ఈ నివేదిక తెలిపింది. నూతన టెక్నాలజీల ప్రవేశం, ఆటోమేషన్ పెరగడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. నూతన తరం టెక్నాలజీల రాకతో కొత్త నైపుణ్యాల అవసరం ఈ రంగంలో ఏర్పడిందని ‘భారత్‌లో ఉద్యోగాల భవిష్యత్తు’ పేరుతో నిర్వహించిన అధ్యయనం వివరించింది. ఇంకా ఏం చెప్పిందంటే? ‘‘ఆటోమొబైల్ రంగం 2017 మార్చి నాటికి 1.28 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాల సంఖ్య 2022 నాటికి 1.43 కోట్లకు పెరుగుతాయి. ఇందులో 60–65 శాతం మేర ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను సంతరించుకోవాల్సి ఉంటుంది. వెల్డింగ్, ప్రెస్, క్యాస్ట్, పెయింట్ షాపుల్లో రోబోలను ఇప్పటికే 70–100 శాతం మేర వినియోగిస్తున్నారు. రోబోల వాడకం పెరిగే కొద్దీ పెయింటింగ్, వెల్డింగ్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది. అదే సమయంలో రోబోటిక్ ప్రోగ్రామింగ్, నిర్వహణకు డిమాండ్ ఏర్పడుతుంది. వచ్చే ఐదేళ్లలో కనెక్టెడ్ కార్ల ప్రవేశం కారణంగా బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, కొత్త టెక్నాలజీలు అన్నవి డిజైన్, ఆపరేషన్ స్థాయిలో అవసరం అవుతాయి. ఆటోమొబైల్ అనలైటిక్స్ ఇంజనీర్, 3డీ ప్రింటింగ్ టెక్నీషియన్, మెషిన్ లెర్నింగ్, వాహన సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనే ఉద్యోగాలు వస్తాయి’’. కొత్త టెక్నాలజీలకు సన్నద్ధం కావాలి... ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, భారత్‌లో తయారీ కింద పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆటోమోటివ్ రంగంలో రానున్న సంవత్సరాల్లో నైపుణ్య కార్మికులకు డిమాండ్ పెరగనుంది. కొత్త టెక్నాలజీలు వచ్చినందున పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యోగులకు తిరిగి శిక్షణనివ్వడం ద్వారా కొత్త తరహా బాధ్యతలకు సన్నద్ధం కావాలి’’ అని ఈవై పార్ట్నర్కు చెందిన అనుగార్ మాలిక్ పేర్కొన్నారు. -
సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు!
సాక్షి, మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)ల నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఐటీడీఏల ఆధ్వర్యంలో అధికారులు నిరుద్యోగ యువతీయువకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలిచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు తీసుకొని అర్హతల్లేని వారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరానికి 48 మంది అభ్యర్థులను సీఆర్టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా.. కనీసం కలెక్టర్ అనుమతి తీసుకోకుండా ఈ నియామకపు ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ఐటీడీఏలో ఏటీడబ్ల్యూవోలుగా పనిచేసిన అధికారులు కీలకంగా వ్యవహరించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసి, అడ్డదారుల్లో నియామకాలు తెలుస్తోంది. వీరిలో 22మంది సీఆర్టీలను మహబూబాబాద్ జిల్లాకు, 16 మందిని భూపాలపల్లి జిల్లాకు, నలుగురిని వరంగల్ అర్బన్ జిల్లాకు, నలుగురిని రూరల్ జిల్లాకు, ఇద్దరిని జనగామ జిల్లాకు కేటాయించారు. ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేవ్ వీరంతా గత విద్యా సంవత్సరం మొత్తం పాఠశాలల్లో పనిచేసినా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా 48 మందిలో 36 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు. మిగతా వారిని తీసుకోలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేసిన సీఆర్టీలు కూడా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అర్హతల్లేని వారికి ఉద్యోగాలు ప్రస్తుత విద్యా సంవత్సరానికిగానూ ఆశ్రమ పాఠశాలల్లో నియమించిన సీఆర్టీల్లో పలువురికి అర్హతలు లేకున్నా ఉద్యోగాల్లో నియమించినట్టు అవగతమవుతోంది. ఇంటర్, టీటీసీ చదివిన వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో, తెలుగు పండిట్ చదివిన వారిని గణితం స్కూల్ అసిస్టెంట్‌గా నియమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ప్రీతిమీనా ఇటీవల మహబూబాబాద్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఓ సీఆర్టీతో ఇంగ్లిషు పాఠం చదివించారు. సరిగా చదవడం రాకపోవడంతో విస్మయం చెందారు. సీఆర్టీలు అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందుతున్నారనే నిర్థారణకు వచ్చిన ఆమె, త్వరలో జిల్లాలోని సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్షను నిర్వహించాలని, వారి సర్టిఫికెట్లను పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చారు. విచారణ జరుగుతోంది సీఆర్టీల నియామకంపై ఆరోపణలు రావడంతో కలెక్టర్‌కు నివేదించాం. వేతనాలు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంపై కలెక్టర్‌కు రాశాం. విచారణ జరుపుతున్నారు. సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని నియమించుకొని మిగతా వారిని పక్కకు పెట్టడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనలో కలెక్టర్ ఉన్నారు. – నారాయణస్వామి, డీటీడబ్ల్యూవో, మహబూబాబాద్ -
రాయలసీమ యూనివర్సిటీకి హైకోర్టు అక్షింతలు
– అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై మూడు వారాలు స్టే – వారంలోపు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి పని చేస్తున్న అధ్యాపకులను రెన్యూవల్ చేయకుండా మే నెలలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టులలో పీజీతో పాటు పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్ ఏదో ఒక విద్యార్హత కలిగి ఉండాలని అందులో పేర్కొంది. అయితే ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎంత మంది అవసరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర నిబంధనలు తెలపకపోవడంతో పాటు వర్సిటీ అధికారులు వాటిని పాటించకపోవడంతో నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని బాధితులు గతనెల 28న హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు అదే రోజు నియామకాలపై స్టే విధించింది. అయినా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వర్సిటీ పాలకులు మరుసటి రోజే అంటే 29వ తేదీన కూడా దాదాపు 30 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి బాధితులు తీసుకెళ్లడంతో జూలై 4వ తేదీన ఇరువురు వాదనలు విని రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా అనర్హులను నియమించుకోవడమే కాక ఆ విషయాలను దాచి సుప్రీం కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తారా అని నియామకాలపై మూడు వారాలకు స్టే విధించింది. వారంలోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
పీఈటీ నియామకాలు నిలిపివేయండి: హైకోర్టు
హైదరాబాద్: గురుకులాల్లో పీఈటీ నియామకాలను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30 న జరిగే గురుకుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. రెస్పాన్డెంట్స్ కు నోటీసులు పంపింది. ఉన్నత విద్యాశాఖ చైర్మన్, సెక్రెటరీ, విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీటీఈ అండ్ గెజిట్ ఆఫ్ ఐఎన్‌డీఏఐ నిబంధనల ప్రకారం బీపీఈడీ చెయ్యాలంటే కనీసం జిల్లా స్థాయి క్రీడా నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపింది. కానీ ప్రభుత్వం ఎన్సీటీఈ నామ్స్ పట్టించుకోకుండా గురుకుల ఉపాద్యాయ పోస్టులకు అందరికి అవకాశం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కె. రెడ్యానాయక్ , నవీన్ కుమార్ అనే ఇద్దరు క్రీడాకారులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఆడిన వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్న పిటీషనర్లు పేర్కొన్నారు. తదుపరి విచారణలో కోర్ట్ ఆదేశాలు ఇచ్చేంత వరకు పీఈటీ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
అనంతపురం : జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీల్లో నియమించారు. ఆ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ఎ.దశరథనాయుడును నియమించారు. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వై.సుధాకర్‌ను జిల్లా సంయుక్త కార్యదర్శిగా, ధర్మవరానికి చెందిన బీరే ఎర్రిస్వామిని చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా, అనంతపురం నగరానికి చెందిన మల్లెమీద నరసింహులును ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే పామిడి మండల కమిటీ అధ్యక్షుడిగా కె.నారాయణరెడ్డిని, గుంతకల్లు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా సుంకప్పను నియమించారు. -
ఈ ఏడాది 20 వేల నియామకాలు
♦ ఉద్యోగాల కోత అంశాన్ని ఎక్కువ చేసి చూపారు ♦ ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్ రావు న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ తాజాగా ఈ ఏడాది 20,000 నియామకాలను చేపడతామని ప్రకటించింది. పనితీరు మదింపు అధారంగా కేవలం 400 మందిని మాత్రమే ఇంటికి వెళ్లాలని కోరామని పేర్కొంది. ఉద్యోగాల కోత భారీ స్థాయిలో ఉందని వచ్చిన వార్తలను కంపెనీ కొట్టిపారేసింది. ఉద్యోగుల తొలగింపు అంశాన్ని ఎక్కువ చేసి చూపారని మండిపడింది. టెక్నాలజీ ఆధారిత పరివర్తన క్రమంలో పలు కొత్త అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. ‘పనితీరు మదింపు ప్రక్రియ ప్రతి సంవత్సరం ఉంటుంది. దీని ఆధారంగానే తొలగింపులు ఉంటాయి. వీటి సంఖ్య కేవలం 300–400 స్థాయిలో ఉంది. ప్రస్తుత తొలగింపులు ఎప్పటిలాగే స్థిరంగానే ఉన్నాయి’ అని వివరించారు. గతేడాది 20,000కుపైగా మందిని నియమించుకున్నామని, ఇదే సంఖ్యను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈయన సంస్థ కో–చైర్మన్ రవి వెంకటేశన్ తో కలిసి శుక్రవారం ఐటీ మంత్రి రవి శంకర ప్రసాద్‌తో అరగంటపాటు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాం. అధిక ఉద్యోగాలను సృష్టిస్తాం. కేవలం అతితక్కువ సంఖ్యలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. అది కూడా పనితీరు ప్రాతిపదికన’ అని పేర్కొన్నారు. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వారి వేతనాలు కొద్దిమేర తగ్గించుకోవడం, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం వంటి అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా ఉద్యోగాల కోతను అడ్డుకోవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఈయన స్పందించలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయని ప్రసాద్ పేర్కొన్నారు. -
ఉబెర్‌లో నియామకాలు..
న్యూఢిల్లీ: భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, డిజైనర్లు మొదలైన వారిని తీసుకుంటున్నట్లు ఉబెర్ ఇండియా ఇంజినీరింగ్ విభాగం హెడ్ అపూర్వ దలాల్ తెలిపారు. అయితే ఎంత మందిని రిక్రూట్ చేసుకోనున్నది వెల్లడించలేదు. ఉబెర్ కొత్తగా పేమెంట్స్, బుకింగ్స్ తదితర విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా కస్టమర్లు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కూడా చర్చలు జరుపుతోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుల్లో ఇంజనీరింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉబెర్‌కు అమెరికా తర్వాత భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌లో 29 నగరాల్లో ఉబెర్ ట్యాక్సీ సేవలు అందిస్తోంది. -
వెఎస్సార్సీపీ తెలంగాణలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో శనివారం పలువురిని నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందాడపు వెంకటరాంరెడ్డి, వేమిరెడ్డి రోషిరెడ్డి, ఆలస్యం సుధాకర్, సంయుక్త కార్యదర్శిగా వనంరెడ్డి నాగిరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
వైఎస్సార్ సీపీ తెలంగాణ విద్యార్థి విభాగంలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగంలో మంగళవారం పలువురి నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అనుమతితో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్‌చారి ఈ నియామకాలు చేశారు. రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులుగా ఎం.కౌటిల్‌రెడ్డి, ఏనుగుల సందీప్‌రెడ్డి, కార్యదర్శులుగా షేక్ మీరావలి, జిల్లాల సుధాకర్, ఎం.శివశంకర్‌రెడ్డి, ఎం.అరవింద్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పి.సంతోష్‌కుమార్, కేతావత్ శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా జి.వినోద్‌రెడ్డి, ఎన్.విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పి.నాగార్జున నియమితులయ్యారు. 12 జిల్లాలకు అధ్యక్షులు ఇక 12జిల్లాల్లో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులను కూడా నియమించారు. ఆదిలాబాద్‌కు వై.రాజశేఖరరెడ్డి, ఓగ్గు మహేశ్‌చంద్ర (రాజన్న సిరిసిల్ల), గొల్లపల్లి ప్రసాద్ (మంచిర్యాల), వి.అక్షయ్ (కరీంనగర్), కుక్కల నాగేశ్వరరావు (ఖమ్మం), గుల్లగట్లు శ్రీకర్–పఠాన్ (మహబూబాబాద్), కె.సాయిచందర్‌రెడ్డి (సంగారెడ్డి), డి.రాహుల్‌గౌడ్ (రంగారెడ్డి), వి.ప్రవీణ్‌కుమార్ (మహబూబ్‌నగర్), కె.యోగేశ్వర్ (నిర్మల్), ఎండీ సిరాజుద్దీన్ (నల్లగొండ), బి.మహేందర్ (జనగాం)లను నియమిం చారు. ఇక మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా చంద్రగౌడ్, వి.నవీన్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులుగా అఖిల్‌చారి, డి.వేణుప్రసాద్‌గౌడ్‌లను నియమిం చారు. -
20 వరకు 1999 గ్రూప్–2 నియామకాలొద్దు
ఏపీ సర్కారుకు ఏపీఏటీ ఆదేశం హైదరాబాద్: గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి 1999 నోటిఫికేషన్ కింద ఈ నెల 20 వరకు నియామకాలు చేపట్టరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీఏటీ సభ్యుడు జానకి రామారావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో గుర్తించిన ఖాళీల్లో పోస్టులను (రీఆప్షన్) ఎంచుకునే అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో డీసీటీవోగా పని చేస్తున్న వై.హరికృష్ణ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1999 నోటిఫికేషన్ ప్రకారం పిటిషనర్ ఏపీటీవోగా ఎంపికయ్యారని, 2010 వరకు ఉన్న ఖాళీలను గుర్తించాలని హైకోర్టు, ట్రిబ్యునల్ ఆదేశాలి చ్చాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నరసింహ వాదనలు వినిపించారు. 2011లో 111 ఖాళీలను గుర్తించారని, పిటిషనర్‌కు తిరిగి పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదని, అందులో 79 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు పిటిషనర్ సొంత జోన్లోనే ఉన్నాయన్నారు. రీఆప్షన్ కోసం విజ్ఞప్తి చేసినా ఏపీపీఎస్సీ పట్టించుకోకుండా డిసెంబర్ 24న జాబితాను ప్రకటించిందని, ఈ నియా మకాలు జరిగితే పిటిషనర్‌కు అన్యాయం జరుగుతుం దని వివరించారు. అయితే పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. దీంతో అప్పటి వరకు 1999 నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. -
నవంబర్‌లో నియామకాలు
14 శాతం జంప్: నౌకరి.కామ్ నివేదిక న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నవంబర్ నెలలో నియామకాలు 14 శాతంమేర పెరిగాయని నౌకరి.కామ్ తన నివేదికలో తెలిపింది. దీనికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సాఫ్ట్వేర్సర్వీసెస్ వంటి రంగాలు కారణంగా నిలిచాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌లో నౌకరి జాబ్ స్పీక్ ఇండెక్స్ 1,817కు పెరిగింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. పట్ణణాల వారీగా చూస్తే.. పుణేలో నియామకాలు గరిష్టంగా 32 శాతంమేర పెరిగాయి. కొత్త సంవత్సరంలోనూ నియామకాల జోరు కొనసాగవచ్చు. వార్షిక ప్రాతిపాదికన చూస్తే.. బీఎఫ్ఎస్ఐ నియామకాలు 42 శాతంమేరపెరిగాయి. ఇన్సూరెన్స్ రంగంలో నియామకాలు 43 శాతంమేర ఎగశాయి. ఇక ఐటీ సాఫ్ట్వేర్/సాఫ్ట్వేర్ సర్వీసెస్, బీపీవో/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు వరుసగా 14 శాతం, 15 శాతం పెరిగాయి. నియామకాల వృద్ధిమెడికల్/హెల్త్‌కేర్ రంగంలో 24 శాతంగా, టీచింగ్/ఎడ్యుకేషన్ విభాగంలో 35 శాతంగా ఉంది. పట్టణాల వారీగా నియామకాల వృద్దిని పరిశీలిస్తే.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 12 శాతంగా, ముంబైలో 18 శాతంగా, బెంగళూరులో 20శాతంగా నమోదయ్యింది. అలాగే నియామకాలు చెన్నైలో 12 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, పుణేలో 32 శాతం పెరిగాయి. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పలు నియామకాలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్ రామిరెడ్డి, కె రమేష్ రెడ్డిలను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా.. తాడిపత్రి నియోజక వర్గ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ని నియమించారు. అలాగే రాష్ర్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కె ధనుంజయ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా సాంబశివారెడ్డిలు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. -
కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు
ఈ నెలాఖరులోగానే నియామకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో టీపీసీసీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు అదనంగా ఆవిర్భవించిన మరో 21 జిల్లాలకు సారథులను నియమించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలని నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షులు లేకుండా ఖాళీగా ఉన్న జిల్లాలతోపాటు కొత్తగా 21 జిల్లాలకు అధ్యక్షులను నియమించడానికి పార్టీ ముఖ్యుల నుంచి, ఆశావహుల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డిజిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అధ్యక్షులను వీలైనంత తొందరలోనే నియమించాలని భావిస్తున్నారు. పార్టీలో పని చేయగలిగే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానం ఆమోదం పొందాలని టీపీసీసీ భావిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల వారీగా సమస్యలు, పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. జిల్లాల పరిధి కూడా తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో పని చేయగలిగే నాయకులుంటే పార్టీని బలోపేతం చేయడం సులభమని టీపీసీసీ అంచనా వేస్తోంది. ఉత్సాహంగా పనిచేస్తూ, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోగలిగిన నాయకుల కోసం జిల్లాల వారీగా అన్వేషణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడున్న జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగించనుంది. జిల్లా అధ్యక్షులు ఏ జిల్లా పరిధిలోకి వచ్చారో, ఆ జిల్లాకు పాత అధ్యక్షుడినే కొనసాగించాలని నిర్ణయించింది. -
31 జిల్లాలకు డీఐఓల నియామకం
- అర్థరాత్రి దాటాక నీటి పారుదల శాఖ ఉత్తర్వులు హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన నేపధ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులు(డీఐఓ)లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం వేకువజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఇకపై జిల్లా ఇరిగేషన్ అధికారులుగా ప్రభుత్వం హోదా కల్పించింది. ఆదిలాబాద్‌కు ఇ.ఇ. డి.సుశీల్ కుమార్, నిర్మల్‌కు బి.వి.రమణారెడ్డి, మంచిర్యాలకు ఎం.వేణుగోపాలరావు, కొమురంభీం ఆసిఫాబాద్‌కు జె.గుణవంత్ రావు, కరీంనగర్‌కు టి. శ్రీనివాసరావు గుప్తా, జగిత్యాలకు సిహెచ్.బుచ్చిరెడ్డి , పెద్దపల్లికి ఎల్.సత్యవర్దన్, సిరిసిల్లకు బి.చిరంజీవులు, వరంగల్‌కు ఎ.శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్‌కు ఎల్.వై. రత్నం, జనగామకు ఎం.రామ్‌ప్రసాద్, జయశంకర్ భూపాలపల్లికి కె.రవీందర్, ఖమ్మంకు సిహెచ్. చిట్టిరావు, భద్రాద్రి కొత్తగూడెంకు కె.వెంకటేశ్వరరెడ్డి, నిజామాబాద్‌కు పి.రాధాకిషన్‌రావు, కామారెడ్డికి కె.మధుకర్ రెడ్డి, మెదక్‌కు బి.యేసయ్య, సిద్ధిపేటకు డి.రవీందర్ రెడ్డి, సంగారెడ్డికి పి.రాములు, వికారాబాద్ కు టి.వెంకటేశం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌కు ఎస్. భీమ్ ప్రసాద్, మహబూబ్‌నగర్‌కు డి.నరసింగరావు, నాగర్ కర్నూలుకు బి.గోవిందు, వనపర్తికి ఎస్.శ్రీనివాసులు, గద్వాలకు కె. శ్రవణ్ కుమార్, నల్లగొండకు హమీద్ ఖాన్, సూర్యాపేటకు ఎన్.సంజీవరెడ్డి, యాదాద్రి జిల్లాకు ఇరిగేషన్ అధికారిగా సుధీర్‌ను నియమించారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎం.అరుణ్‌కుమార్ (కృష్ణా), అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వి.మల్లికార్జునరావు (బాబ్జీ)(ప.గోదావరి), విజయవాడ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ మొహియుద్దీన్ (కృష్ణా)లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. -
సీజీఆర్‌ఎఫ్‌లో నియామకాలు
సాక్షి,విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పడిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) పునర్నిర్మాణానికి తొలి అడుగుపడింది. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసకు చెందిన దుంపల ధర్మారావును సీజీఆర్ఎఫ్ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారావు గతంలో జిల్లా సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి, మార్చి 2015న పదవీ విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసిమేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సీజీఆర్ఎఫ్ చైర్‌పర్సన్‌గా మూడేళ్ల పాటు ధర్మారావు కొనసాగుతారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఎండీ ఎంఎం నాయక్‌ను ఆయన్ని అభినందించారు. ఐదు జిల్లాల్లోని వినియోగదారులెవరైనా సీజీఆర్‌ఎఫ్‌కు రాతపూర్వకంగా విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని, తక్షణమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ధర్మారావు చెప్పారు. అదే విధంగా సీజీఆర్‌ఎఫ్‌కు స్వతంత్ర సభ్యునిగా ఏపీఈఆర్సీ సూచించిన పాండే బాలాజీ ప్రసాద్‌ను సీఎండీ నియమించారు. సీజీఆర్ఎఫ్ పునర్మిర్మాణంలో జరిగిన నియామకాల వల్ల ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీఈపీడీసీఎల్ అధికారుల విధుల్లో మార్పులు చేశారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––– అధికారి పేరు ప్రస్తుత స్థానం మార్పు తర్వాత స్థానం –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆర్.శ్రీనివాసరావు చైర్పర్సన్ సీజీఎం, క్యాలిటీ కంట్రోల్ పి.ఎస్.కుమార్ అకౌంట్స్ సభ్యుడు సీజీఎం,ఇంటర్నల్ఆడిట్ ఎం.వై.కోటేశ్వరరావు లీగల్ సభ్యుడు జీఎం, హెచ్ఆర్డి–1 కె.బాలాజీ జీఎం,రెవెన్యూ అకౌంట్స్ సభ్యుడు పి.వి.రమణరావు జీఎం,ఆర్ఎ టెక్నికల్ సభ్యుడు యుకెవి రామకష్ణరాజు జీఎం,హెచ్ఆర్డి జీఎం,హెచ్ఆర్డి–2 -
వైఎస్సార్సీపీ రాష్ట్రకమిటీలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాస్‌రావు (కరీం నగర్), గుండెరెడ్డి రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సంయుక్త కార్యదర్శిగా పారిపెల్లి వేణుగోపాల్‌రెడ్డి (కరీంనగర్) నియమితులయ్యారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్‌చారి (రంగారెడ్డి), సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా సందమల్ల నరేశ్(కరీంనగర్)లను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
పీఈటీల ఎంపిక పారదర్శకంగా జరగలేదు
అభ్యర్థుల ఆందోళన స్పందించిన అధికారులు నియామకాల రద్దు 5న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయం గాంధారి : గిరిజన బాలుర గురుకుల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా జరగలేదని అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐదు గిరిజన గురుకుల పాఠశాలల కోసం మండల కేంద్రంలో గల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం వైవా నిర్వహించారు. ఐదు పీఈటీ పోస్టులకు కోసం 170 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైవా నిర్వహించి ఐదు పోస్టులకు గాను 15 మందిని ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. అయితే నియామకాలు పారదర్శకంగా జరగలేదని జాబితాలో పేర్లు లేని అభ్యర్థులు ఆందోళన చేశారు. పాఠశాల నోడల్ ప్రిన్సిపాల్ బలరాం నాయక్‌తో వాగ్వాదానికి దిగారు. నియామకాలు రద్దు చేసి రాత పరీక్ష నిర్వహించి అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో రిటైర్డ్ పీడీ మన్నాన్, మరో పీడీ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ప్రిన్సిపాల్ అభ్యర్థులకు నచ్చజెప్పి నోడల్ జిల్లా సమన్వయ అధికారి చంద్రశేఖర్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించారు. స్పందించిన డీసీవో అభ్యర్థుల కోరిక మేరకు పీఈటీల నియామకాలను రద్దు చేసి ఈనెల 5న రాత పరీక్ష నిర్వహించాలని సూచించారు. దీంతో నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించగా అభ్యర్థులు ఆందోళన విరమించారు. నియామకాలను కన్వీనర్ గంగాధర్, ఏడీసీవో కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు నోడల్ ప్రిన్సిపాల్ తెలిపారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్ దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. భారత్‌లోకి అమెజాన్ సర్వీస్ ‘ప్రైమ్’ ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్‌ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్‌పై ప్రై మ్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫీ ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రై వేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి. రూ.59,547 కోట్ల రుణాలు రద్దు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. వీటిల్లో ఎస్బీఐ రూ.15,763 కోట్ల రుణాల్ని రద్దు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ పేర్కొన్నారు. ఇక పీఎన్బీ రూ.7,340 కోట్ల రుణాల్ని, ఐడీబీఐ రూ.5,459 కోట్ల రుణాల్ని, కెనరా బ్యాంక్ రూ.3,387 కోట్ల రుణాల్ని రద్దు చేశాయని తెలిపారు. 5 కోట్లకు చేరువలో ఎంఎఫ్ ఖాతాలు దేశంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్ ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. జూన్ త్రైమాసికం చివరకి ఎంఎఫ్ ఖాతాల సంఖ్య కొత్తగా 12.61 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు ఎగసింది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. మొత్తం ఎంఎఫ్ ఖాతాల్లో 95 శాతం వాటాను ఆక్రమించిన రిటైల్ ఖాతాలు వరుసగా ఏడవ త్రైమాసికంలోనూ పెరుగుతూ వచ్చాయి. ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువు పొడిగింపు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్‌ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి హిందుజా గ్రూపునకు చెందిన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలోని విశాఖపట్నంలో నెలకొల్పిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లో గత సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక్కోటీ 520 మెగావాట్ల సామర్థ్యంతో హిందుజా ఇక్కడ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. మెర్సిడెస్ నుంచి‘ ఏఎంజీ-43’ మోడల్ మెర్సిడెస్’ తాజాగా ‘ఏఎంజీ ఎస్ఎల్సీ 43’ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువ చ్చింది. దీని ధర రూ.77.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ టూ సీట్స్ టాప్‌లెస్ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజిన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బెజోస్ ముందుకు.. బఫెట్ వెనక్కు.. అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ తాజాగా బార్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్‌ను వెనక్కు నెట్టారు. దీంతో బెజోస్ ప్రపంచపు మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత బెజోస్ సంపద విలువ 65.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బఫెట్ సంపద విలువ 64.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ అంశాలను ఫోర్బ్స్ రియల్ టైమ్ వెల్త్ ట్రాకర్ వెల్లడించింది. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా 78 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ కొనసాగుతున్నారు. డీల్స్.. ⇒ యాహూ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లిస్తోంది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్‌తో (అమెరికా ఆన్లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. ⇒ ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జాబాంగ్ను చేజిక్కించు కుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు). ⇒ చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ⇒ హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ⇒ ఎల్ఐసీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకారం.. ఇకపై యాక్సిస్ బ్యాంక్ తన బ్రాంచీల్లో ఎల్ఐసీ బీమా పాలసీలను విక్రయిస్తుంది. ⇒ ఈ-క్లాసిఫైడ్ సంస్థ క్వికర్, ఆన్లైన్ హైరింగ్ ప్లాట్ఫార్మ్ హైరీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ⇒ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని కొనుగోలు చేసింది. -
వైఎస్సార్సీపీ తెలంగాణలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీకి సంబంధించి వివిధ అనుబంధ విభాగాల్లో పలువురిని నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శిగా కోడి మల్లయ్య యాదవ్ (హుజుర్నగర్), రాష్ర్ట కార్యవర్గసభ్యులుగా కర్ల సుందరబాబు (నల్లగొండ), లింగం సత్యనారాయణరెడ్డి (మేళ్లచెర్వు) నియమితుల య్యారు. రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా కస్తాల ముత్తయ్య (హుజుర్నగర్), రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా రహీమ్ షరీఫ్ (నారాయణపురం), బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కర్నె వెంకటేశ్వర్లు (హుజుర్నగర్), రాష్ట్ర యూత్ కార్యదర్శిగా మంద వెంకటేశ్వర్లు (హుజుర్నగర్)లను నియమించారు. నల్లగొండ జిల్లా పార్టీ అధికార ప్రతి నిధిగా సుతారి శ్రీను (హుజుర్నగర్), ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బాలెంల మధు (మోత్కురు), మైనారిటీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ ఫయాజ్ (నల్లగొండ), బీసీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ముషం రామానుజం (నకిరేకల్) నియమితులయ్యారు. రాష్ర్ట మహిళా కమిటీలో నియామకాలు..: రాష్ర్టపార్టీ మహిళా కమిటీలో పలు నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా జూలి బెన్నాల (శేరిలింగంపల్లి), క్రిస్టోలైట్ (అంబర్‌పేట), గాదె రమారెడ్డి (ఎల్బీనగర్), ఎం.పుష్పలత (చేవెళ్ల), వనజ (కూకట్పల్లి), మేరి (జూబ్లీహిల్స్), యర్రంరెడ్డి ఇందిరారెడ్డి (శేరిలింగంపల్లి), కార్యదర్శులుగా సూర్యకుమారి (ఎల్బీనగర్), జ్యోతి రెడ్డి (జూబ్లీహిల్స్), నేహా (మహేశ్వరం), అల్ఫరాన్‌సమ్మ (ఇబ్రహీంపట్నం), విష్ణుప్రియ (శేరిలింగంపల్లి), బొక్కనపల్లి రాజమ్మ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా రాగ సంధ్య(కూకట్పల్లి), పద్మ (జూబ్లీహిల్స్), లక్ష్మీదేవి (మహేశ్వరం), గడ్డం జలజ (కరీంనగర్), వి.రాణిరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు. ఇదిలా ఉండగా మహిళా కమిటీలో భాగంగా జీహెచ్ఎంసీ అధ్యక్షురాలిగా శ్యామల, నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కుముద్దీని నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో ఆయా విభాగాల్లోని పలు పోస్టుల్లో నియమించినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలి పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. -
వైఎస్సార్ సీపీ కమిటీలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు జరిగాయి. రాష్ర్ట పార్టీ ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డిని ఖమ్మం జిల్లా పరిశీలకునిగా నియమించారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి భాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బెంబడి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రపార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్,రాష్ట్ర పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె.జార్జ్ హెర్బట్‌లను నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శులుగా ఎండీ సలీం, దొంతిరెడ్డి సైదిరెడ్డి(నల్లగొండ), కడారి బాలకృష్ణారెడ్డి (మెదక్), చిలకల అరుణారెడ్డి (రంగారెడ్డి), రమణబోయిన బ్రహ్మయ్య (హైదరాబాద్)లు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆయా నియామకాలను చేసినట్లు రాష్ట్రపార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీకి సంబంధించి పలు నియామకాలు చేశారు. రాష్ట్ర కమిటీలో 10 మంది కార్యదర్శులు, నలుగురు సంయుక్త కార్యదర్శులకు చోటు కల్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం వీటిని ప్రకటించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా ఎండీసయ్యదుద్దీన్ ముక్తార్(నిజామాబాద్),సంగాల ఇరిమియా, పూజారి సాంబయ్యగౌడ్(వరంగల్), సెగ్గెం రాజేశ్, సొల్లు అజయ్‌వర్మ(కరీంనగర్), రమా ఓబుల్‌రెడ్డి, వి.విజయప్రసాద్, కొళ్ల యాదయ్య, బనగాని రఘురామిరెడ్డి(రంగారెడ్డి), ఎండీ సాబీర్‌హుస్సేన్(ఆదిలాబాద్), సంయుక్త కార్యదర్శులుగా దుబ్బా క గోపాల్‌రెడ్డి(రంగారెడ్డి), వరాల శ్రీనివాస్, యల్లంకి రమేశ్, గాలి ప్రశాంత్‌బాబు (కరీంనగర్) నియమితులయ్యారు. జిల్లాల పరిశీలకులు వీరే... రాష్ట్రంలోని 10 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర నాయకులు నియమితులయ్యారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిశీలకుడిగా కె.శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాశ్, ఆదిలాబాద్ పరి శీలకుడిగా జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిశీల కుడిగా నర్రా భిక్షపతి, మెదక్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, మహబూబ్‌నగర్ పరిశీలకుడిగా హెచ్ఏ రెహ్మాన్, వరంగల్ పరిశీలకుడిగా వేముల శేఖర్‌రెడ్డి, రంగారెడ్డి పరిశీలకుడిగా జి.రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. మహిళా విభాగానికి అమృతాసాగర్... పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.అమృతాసాగర్, రాష్ట్ర వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బండారు వెంకటరమణ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాశ్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అక్కెనపల్లి కుమార్‌ను నియమించారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా అప్పాము కిషన్(భూపాలపల్లి), జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా కంధాడి అచ్చిరెడ్డి(పాలకుర్తి), జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మారంరెడ్డి కౌటిల్‌రెడ్డి నియమితులైనట్లు వైఎస్సార్సీపీ పార్టీ తెలిపింది. -
జేసీజే నియామకాలకు లైన్ క్లియర్
హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జిల (జేసీజే) నియమకాలకు లైన్ క్లియర్ అయింది. 2014 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన జేసీజే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే ఆదేశాలు 2015 నోటిఫికేషన్‌కు సైతం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు జూనియర్ సివిల్ జడ్జీల పోస్టులను భర్తీ చేయవద్దని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరువాత ఇదే అంశంపై మరి కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను, ఇతర వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. 2014, 2015 సంవత్సరాల్లో జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పిటిషన్ల కొట్టివేతకు కారణాలు తెలియరాలేదు. -
సీఎం వద్దకు డీఎస్సీ ఫైలు!
♦15,628 టీచర్ పోస్టులతో ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ ♦సీఎం ఆమోదం రాగానే ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ ♦నియామక పరీక్షను ఎవరికి అప్పగించాలనే దానిపై స్పష్టత కోరిన అధికారులు ♦నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,628 ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలకు సంబంధించిన ఫైలు ఎట్టకేలకు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. దీంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు రాతపరీక్ష (టీఆర్టీ) నిర్వహణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయాన్ని కూడా తేల్చాలని ప్రతిపాదనల్లో కోరినట్లు తెలిసింది. గతంలో భావించినట్లుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) టీఆర్టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలా, జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో నిర్వహించాలా అన్నది తేల్చాలని పేర్కొంది. నియామకాల ఫైలు సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా తగ్గిపోతున్న పోస్టులు 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖవర్గాలు చెప్పాయి. తర్వాత హేతుబద్ధీకరణ పేరిట 2015కు వాయిదా వేశాయి. ఆ సమయంలో ఉద్యోగుల లెక్కలు తీసినపుడు దాదాపు 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విభజన కమిటీ తేల్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించాక హేతుబద్ధీకరణ జరిగింది. అప్పుడు దాదాపు 17 వేల ఖాళీలున్నట్లు విద్యాశాఖ అధికారులు తేల్చారు. కనీసం ఈ పోస్టుల భర్తీకైనా వెంటనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు భావించారు. కానీ అదీ జరగలేదు. 2015 చివరలోనో, 2016 జనవరిలోనో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని భావించారు. అదే సమయంలో నవ ంబర్ 16న టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఎన్నికలు, ఇతర కారణాలతో అదీ వాయిదా పడింది. మరోవైపు అధికారులు మరోసారి హేతుబద్ధీకరణ చేయగా... పోస్టుల సంఖ్య తెలుగు మీడియంలో 10,927, ఉర్దూ మీడియంలో 1,215కు పడిపోయింది. వీటితోపాటు గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నవాటిని కలుపుకొని మొత్తం 15,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం లెక్క వేసింది. వీటి భర్తీకి జనవరి 2న కేబినెట్ కూడా ఆమోదముద్ర వేయడంతో... వెంటనే టెట్ నోటిఫికేషన్, ఏప్రిల్ నెలాఖరుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 9న టెట్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసి, మళ్లీ ఆపేశారు. ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో... ఎట్టకేలకు ఈనెల 15 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతోపాటే టీఆర్టీ నిర్వహణపై తేల్చాలని సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎలాంటి వాయిదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని వారు కోరుతున్నారు. రెండేళ్లుగా వాయిదాలు రాష్ట్రంలో 2013 నుంచి ఉపాధ్యాయ నియామకాల వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ శిక్షణ పొందుతున్నారు. వాస్తవానికి 2013లో నోటిఫికేషన్ వస్తుందని భావించినా, రాష్ట్ర విభజన, ఆందోళనల నేపథ్యంలో నోటిఫికేషన్‌ను నిలిపివేయడంతో నియామకాల ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత త్వరలోనే డీఎస్సీ అంటూ, ఇంకా సమయం పడుతుందంటూ ప్రభుత్వ పెద్దల విరుద్ధ ప్రకటనలతో వారంతా ఆందోళనలో మునిగిపోయారు. -
ఏయూ బడ్జెట్ రూ.428 కోట్లు
ఆమోదించిన పాలకమండలి సమావేశం లోటు లేకుండా రూపకల్పన కొత్త కేంద్రాలు.. నియామకాలకు పెద్దపీట కాలం చెల్లిన కోర్సుల తొలగింపునకు కమిటీలు ఏయూ క్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 428.16 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య ఇ.ఏ నారాయణ చెప్పారు. బుధవారం ఏయూ పాలక మండలి సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ 298.2 కోట్లు వస్తుందని, అంతర్గత నిధుల నుంచి రూ.129.91 కోట్లు సమకూర్చుకుంటామని చెప్పారు. ఎటువటి లోటు లేకుండా బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు. ఈ నిధుల నుంచి తాత్కాలిక, రెగ్యులర్ సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, కొత్త నియామకాలు, అభివృద్ధి పనులు, అకడమిక్ కార్యక్రమాలకు కేటాయింపులు జరిపామన్నారు. బడ్జెట్‌పై పాలకమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆమోదించారని చెప్పారు. కొత్త కేంద్రాలు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సెంటర్ ఫర్ జెరంటాలజీ, సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ డేటా అనాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపై అపీల్‌కు వెళ్లాలని ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇకపై వర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందిని వర్సిటీలోకి ఎబ్జార్బ్ చేయకూడదని నిర్ణయించామని చెప్పారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్ర దావ్రా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఏయూ అంతార్జాతీయ ర్యాంకింగ్‌కు సిద్ధమవుతోందని, ఏయూను స్ఫూర్తిగా తీసుకుని ఎస్వీయూ, ఏఎన్‌యూ, మహిళా వర్సిటీ, ఎస్కేడీ, జేఎన్టీయూ(కె), జెఎన్టీయూ(ఏ)లు అంతర్జాతీయ ర్యాంకింగ్‌లకు దరఖాస్తు చేస్తున్నాయన్నారు. పాలక మండలి సభ్యుడు పి.సోమధానరావు మాట్లాడుతూ వర్సిటీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. వాటిని గుర్తించి రక్షణ గోడలు నిర్మించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. లీజ్‌కు ఇచ్చిన స్థలాలపై పునఃపరిశీలన జరుపుతామన్నారు. భవనాలు, హాస్టల్స్, నివాస గృహాలకు మరమ్మతులు, సందరీకరణ చర్యలు వేగవంతం చేస్తారని వివరించారు. నైపుణ్యాలు అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధి ఆధారిత కోర్సులు నిర్వహిస్తామన్నారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించడానికి కళాశాల వారీగా కమిటీలను చేసి అధ్యయనం చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు ఉన్నత విద్యామండలి అనుమతి కోరుతామన్నారు. ప్రస్తుతం వర్సిటీలో ఉన్న ఖాళీల్లో వారిని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆచార్య జీఎస్ఎన్ రాజుపై నియమించిన కమిటీ తన నివేదికను నెలాఖరు నాటికి ఉన్నత విద్యామండలికి అందిస్తుందని ఆచార్య ఎం.ప్రసాదరావు తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్లు జి.శశిభూషణ రావు, ఎం.సుందరరావు, ఎన్.బాబయ్య, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ వివరాలను వెల్లడించలేదు. పారిశ్రామికవేత్తలు గైర్హాజరు ప్రభుత్వం ఇటీవల పాలకమండలి సభ్యులుగా పారిశ్రామికవేత్తలను నియమించింది. అయితే బుధవారం జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి సభ్యులైన పారిశ్రామికవేత్తలు గ్రంధి మల్లికార్జునరావు, డాక్టర్ మురళీ దివిలు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నట్లు వారు ముందుగానే వర్సిటీకి సమాచారం పంపినట్లు తెలిసింది. అదే విధంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్లు కూడా హాజరుకాలేదు. ఆదాయం ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్.. 298.20 కోట్లు అంతర్గత వనరులు.. 129.91 కోట్లు ఖర్చు సిబ్బంది వేతనాలు.. 157.00 కోట్లు పెన్షన్లు... 128.00 కోట్లు కొత్త నియామకాలు.. 25.00 కోట్లు అభివృద్ధి పనులు.. 23.36 కోట్లు అకడమిక్ కార్యక్రమాలు.. 59.65 కోట్లు తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు.. 18.00 కోట్లు కొత్త కేంద్రాలు సెంటర్ ఫర్ జెరంటాలజీ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ డేటా అనాలసిస్ -
హైదరాబాద్‌లో 15% పెరిగిన నియామకాలు
న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. గతేడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో హైదరాబాద్‌లో నియామకాలు 15 శాతంమేర పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా నియామకాల వృద్ధి 18 శాతంగా నమోదయ్యింది. ఇందులో ఐటీ-సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ రంగాలు కీలకపాత్ర పోషించాయని నౌకరీ.కామ్ సర్వేలో వెల్లడైంది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ గత నెలలో 1,937కు ఎగసింది. గతేడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇది 18 శాతం పెరిగింది. రంగాల వారీగా చూస్తే.. ఐటీ-సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో నియామకాల వృద్ధి 28 శాతంగా, ఐటీఈఎస్ రంగంలో 17 శాతంగా, టెలికం రంగంలో 6 శాతంగా నమోదయ్యింది. కాగా బీఎఫ్ఎస్ఐ రంగంలో నియామకాలు 5 శాతంమేర తగ్గాయి. ఐటీ-సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుల డిమాండ్ 21 శాతంమేర, ఐటీఈఎస్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ 26 శాతంమేర, సేల్స్ ప్రొఫెషనల్స్ డిమాండ్ 15 శాతంమేర పెరిగింది. నగరాల వారీగా చూస్తే.. నియామకాల వృద్ధి ముంబైలో 24 శాతంగా, ఢిల్లీ/ఎన్సీఆర్లో 23 శాతంగా, బెంగళూరులో 22 శాతంగా, కోల్‌కతాలో 21 శాతంగా, పుణేలో 13 శాతంగా, చెన్నైలో 12 శాతంగా ఉంది. -
ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా?
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఎక్కడా పొంతన లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వశాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వందల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం శోచనీయమన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణవ్యాప్తంగా 2 లక్షల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3,500 పెంచాలని, 1,200 గ్రూప్-1, 8,000 గ్రూప్-3, 36,000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులను 15,600 నుంచి 39 వేలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీల వెంకటేశం, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
డీఎస్సీ షెడ్యూలు విడుదల
- వారంలో స్కూల్ అసిస్టెంట్ల షెడ్యూలు - మంత్రి గంటా వెల్లడి విశాఖపట్నం ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూలును విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో ఉంచడంతో మొదలయ్యే ప్రక్రియ మార్చి 5న జరిగే నియామకాలతో ముగుస్తుందని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన షెడ్యూలు ప్రక్రియను వివరించారు. ఫిబ్రవరి 1న అభ్యర్థుల మెరిట్ లిస్టును వెబ్సైట్లో పెడతామన్నారు. 5న ఎంపికైన అభ్యర్థుల పేర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా సిద్ధం చేస్తామన్నారు. 8న ఈ అభ్యర్థుల జాబితాను జిల్లా ఎంపిక కమిటీ ఖరారు చేస్తుందని తెలిపారు. 9 నుంచి 15 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన, అప్లోడ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 17న అనర్హత అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 22న మరోసారి ప్రదర్శిస్తామని చెప్పారు. 24న ఖాళీల జాబితాను డీఈవోలు అందజేస్తారని, 25న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, 29న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు. మార్చి ఒకటో తేదీన వెబ్ కౌన్సెలింగ్, 5న ఆయా అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇన్నాళ్లూ డీఎస్సీ కోర్టు వివాదాల్లో ఉన్నందున నియామకాల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8086 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల భర్తీపై కోర్టులు తీర్పులను రిజర్వ్‌లో ఉంచాయన్నారు. అవి కూడా వారం రోజుల్లో పరిష్కారమవుతాయని, ఆ వెంటనే స్కూల్ అసిస్టెంట్ల నియామకపు షెడ్యూలు ప్రకటిస్తామని చెప్పారు. జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయని మంత్రి గంటా పునరుద్ఘాటించారు. నాలుగునెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వాలు ఆఖరు నిమిషంలో జంబ్లింగ్‌ను రద్దు చేస్తూ వచ్చాయని, దీంతో కొన్ని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి తమ ఇబ్బందులను తెలియజేశాయన్నారు. అయినప్పటికీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న ఉద్దేశంతో జంబ్లింగ్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆయ సెంటర్లలో అవకతవకలు జరగకుండా వీడియో రికార్డింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. -
నెలాఖరులోగా రెండు వేల మందికి అపాయింట్మెంట్లు
- టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి - ప్రభుత్వం కోరితే డీఎస్సీ నిర్వహణకూ సిద్ధంగా ఉన్నాం - గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పణ సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో తొమ్మిది పోటీ పరీక్షలు నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)దేనని సంస్థ చైర్మన్ ఘంటా చ క్రపాణి అన్నారు. ఈ నెలాఖరుకల్లా సుమారు రెండు వేలమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ ఏర్పడి ఏడాది పూర్తయినందున చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2014-15 వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం ఘంటా చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పని తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, మరింత మెరుగ్గా పనిచేసేందుకు పలు సూచనలిచ్చారని చెప్పారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రస్తుత విధానాలు, తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, యూపీఎస్సీ చైర్మన్ పాల్గొనే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించినట్లు చక్రపాణి తెలిపారు. పునరావాస కేంద్రం కాకుండా.. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొంతమంది వ్యక్తులకు పునరావాస కేంద్రమనే అభిప్రాయం ఉండేదని, సమర్థులైన సభ్యులతో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ.. వర్క్ స్టేషన్‌ను తలపిస్తోందని చైర్మన్ చక్రపాణి అన్నారు. కమిషన్ నిర్వహించిన తొమ్మిది పోటీ పరీక్షల్లో ఆరు ఆన్‌లైన్‌లోనూ, మూడు సంప్రదాయ పద్ధతిలోనూ నిర్వహించామన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచామని, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి కాగా, సివిల్ ఇంజినీర్లకు ఈ నెలాఖరులోగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ నిర్వహణ విషయమై విద్యాశాఖ తమతో చర్చించిందని, డీఎస్సీ నిర్వహణకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి చెప్పామన్నారు. పురపాలక శాఖలో వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు మథీనుద్దీన్ ఖాద్రీ, విఠల్, చంద్రావతి, వివేక్, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్, సాయిలు ఉన్నారు. -
నియామకాల వృద్ధిలో హైదరాబాద్ టాప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాల వృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో ఇక్కడ నియామకాల వృద్ధి 24 శాతంగా నమోదయ్యింది. దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఇక గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నియామకాల వృద్ధి 9 శాతంగా నమోదయ్యింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలతో సహా ఇతర రంగాల్లో కూడా నియామకాల జోరు కొనసాగిందని నౌకరీడాట్‌కామ్ పేర్కొంది. ఇక అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 25 శాతం పెరిగాయని నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే.. టెలికం రంగంలో నియామకాల వృద్ధి అత్యధికంగా 61 శాతంగా నమోదయ్యింది. -
గతవారం బిజినెస్
నియామకాలు * ఆంధ్రాబ్యాంక్ ఎండీగా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. * ఆర్కే టాకూర్ యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. * కార్పొరేషన్ బ్యాంక్ ఎండీగా గార్గ్ నియమితులయ్యారు. * ఇండియన్ బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. * ఎస్బీఐ ఎండీగా పి.కె.గుప్తా నియమితులయ్యారు. * రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ సీఈవోగా జాసన్ కొఠారి పదవీ బాధ్యతలు చేపట్టారు. కీలక పరిశ్రమల వృద్ధి రేటు 3.2 శాతం ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్‌లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అంటే 2014 సెప్టెంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే 2015 సెప్టెంబర్‌లో ఉత్పత్తి విలువ 3.2 శాతం ఎగసిందన్నమాట. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 2.6 శాతమే. తాజా 3.2 శాతం వృద్ధి నమోదుకు ఎరువులు, విద్యుత్ రంగాలు కారణం. చప్పగా కాఫీడే లిస్టింగ్ కాఫీ డే ఎంటర్‌ప్రెజైస్ స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.328తో పోల్చితే కాఫీ డే ఎంటర్‌ప్రై జెస్ షేర్ ధర బీఎస్ఈలో 4.5 శాతం నష్టంతో రూ.313 వద్ద లిస్టయింది. అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు 18 శాతం నష్టంతో రూ.270 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో కూడా ఇదే తీరు. ఇంట్రా డేలో రూ.266(19 శాతం) కనిష్ట స్థాయికి పతనమైంది. మార్కెట్ క్యాప్ రూ.5,565 కోట్లుగా నమోదైంది. ఇక మేడిన్ చైనా విమానాలు విమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని సోమవారం ఆవిష్కరించింది. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. వచ్చే బడ్జెట్ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు! కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రక్రియ వచ్చే బడ్జెట్ నుంచీ ప్రారంభమవుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగానికి ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా ఉపసంహరణ జాబితా కూడా కొద్ది రోజుల్లో విడుదల చేస్తామంటూ సూచనాప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ బేసిక్ పన్ను రేటును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని ఆర్థికమంత్రి గత బడ్జెట్లో ప్రకటించారు. రెండో షెడ్యూల్ జాబితాలో బంధన్ బ్యాంక్ ఇటీవల ప్రారంభమైన బంధన్ బ్యాంక్‌ను ఆర్బీఐ చట్టం రెండో షెడ్యూల్ జాబితాలో చేర్చినట్లు ఆర్ బీఐ వెల్లడించింది. దీంతో బంధన్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి బ్యాంకు రేటుకు రుణాలను తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుకు క్లియరింగ్ హౌసింగ్ సంబంధిత సభ్యత్వాన్ని ఇచ్చింది. భారత్‌లోకి యాపిల్ వాచ్‌లు భారత్‌లో యాపిల్ స్మార్ట్‌వాచ్‌ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటి ధర రూ.30,900-రూ.14 లక్షల శ్రేణిలో ఉంది. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు ‘యాపిల్ వాచ్ ఎడిషన్’,‘యాపిల్ వాచ్’,‘యాపిల్ వాచ్ స్పోర్ట్’ అనే మూడు వేరియంట్లలో, 38 మిల్లీమీటర్లు, 42 మిల్లీమీటర్లు అనే రెండు డిస్ప్లే పరిమాణాల్లో లభ్యమవుతున్నాయి. ఈ యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో కాల్ రిసీవింగ్, ఈ-మెయిల్స్ చెకింగ్, మ్యూజిక్ కంట్రోల్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌లు వినియోగదారులకు యాపిల్ ప్రీమియమ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. రూ.14 లక్షల విలువైన యాపిల్ టాప్ మోడల్‌ను కస్టమర్ల ఆర్డర్‌పైన మాత్రమే తెప్పిస్తామని యాపిల్ రిటైల్ ప్రతినిధి తెలిపారు. రూ.70 వద్ద ఐడీఎఫ్సీ బ్యాంక్ లిస్టింగ్ ఐడీఎఫ్సీ బ్యాంక్ షేర్లు శుక్రవారం బీఎస్ఈలో రూ. 70.50 వద్ద లిస్టయ్యింది. షేరు చివరికి బిఎస్ఈలో 70.70 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 70.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఐడీఎఫ్సీ బ్యాంకు స్క్రిప్ రూ. 73.45-67 మధ్య తిరుగాడింది. రెండు ఎక్స్చేంజీల్లోను కలిపి సుమారు రెండున్నర కోట్ల షేర్లు చేతులు మారాయి. డీల్స్.. * దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) .. తాజాగా సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ దాదాపు 690 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. * ఫ్రాన్స్‌కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్‌స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్‌స్తోమ్ తెలిపింది. * ఆసియా దేశాల మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి ప్రై వేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ అమెరికాకు చెందిన మీడియా హోల్డింగ్ కంపెనీ చెర్నిన్ గ్రూప్‌తో చేతులు కలిపింది. 300 మిలియన్ డాలర్ల నిధులతో.. ఎమరాల్డ్ మీడియా పేరిట ప్రత్యేక వెంచర్ ఏర్పాటు చేసింది. -
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు
కోర్టు కేసులు వీలైనంత సత్వరం పరిష్కరించి.. రెండు వారాల్లో డీఎస్పీ నియామకాలు జరుపుతామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డీఈవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలియజేశారు. రేషనలైజేషన్ అవకతవకలకు పాల్పడ్డ కృష్ణా జిల్లా డీఈవో.. మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు డీఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది. మరో వైపు 9,10 తరగతులకు సంబంధించి పాత విధానమే కొనసాగుతుందని గంటా స్పష్టంచేశారు. -
సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ
న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నియామకాల వృద్ధి సెప్టెంబర్ నెలలో 18 శాతంగా నమోదైంది. టెలికం, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల వృద్ధి అధికంగా ఉంది. హైదరాబాద్‌లో నియామకాల వార్షిక వృద్ధి 25 శాతంగా నమోదైంది. రానున్న కాలంలో నియామకాల జోరు మరింత పెరిగే అవకాశముందని నౌకరీ.కామ్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నౌకరీ జాబ్ ఇండెక్స్ 18 శాతం వృద్ధితో 1,796కు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. టెలికం, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఐటీ, ఐటీఈఎస్, వాహన రంగ నియామకాల్లో స్థిర వృద్ధి నమోదు అయ్యిందని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేశ్ తెలిపారు. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో నియామకాల వార్షిక వృద్ధి అత్యధికంగా 29 శాతంగా నమోదైంది. -
నేతల కనుసన్నల్లోనే...
అనంతపురం సెంట్రల్ : ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, నియామకం రెండూ రాజకీయనాయకుల చేతుల్లోనే జరిగిపోతున్నాయి. ప్రతి స్థానానికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను జోడించి తొలగింపులు, నియామకాలు చేపడుతున్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థలో ఇటీవల ఒకేసారి 437 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. పనితీరులో వెనుకబడిన వారిని మాత్రమే తొలగించామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. 75 శాతం కన్నా తక్కువ పనిదినాలు కల్పించిన వారిని తొలిగించామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పనిదినాలు కల్పించడంతో పాటు సర్వీసులో నయా పైసా కూడా నిధులు పక్కదారి పట్టకుండా పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించగా తొలగింపులు విరుద్ధంగా జరిగాయని, వెంటనే విధుల్లో కొనసాగించాలని ఉత్తర్వులు వస్తున్నాయి. ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరలో 437 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు గత 18వ తేదీన 82 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం స్థానాల్లో అధికారపార్టీకి చెందిన వారినే నియమించాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 82 స్థానాలకు కేవలం 8 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కూడా అన్నీ సక్రమంగా లేవని తెలుస్తోంది. నిబంధనల మేరకు సర్పంచు రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు 25 రోజులు తప్పనిసరిగా పని చేసిన వారు అర్హులు. దీనికి తోడు జన్మభూమి కమిటీలు ఆమోదించాలని మెలికపెట్టారు. దీంతో అధికారపార్టీకి చెందిన వారు మాత్రమే అర్హులన్నట్లు తయారైంది. రిజర్వేషన్లు, పనిదినాలు అన్నీ సక్రమంగా ఉన్నా జన్మభూమి కమిటీలు ఆమోదించడం లేదు. ఒకసారి ఎమ్మెల్యేను కలిసి అక్కడి నుంచి లేఖ తీసుకుని రావాలని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కటాక్షం ఉంటేనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుందని అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ధర్మవరం నియోజకవర్గంలో ముందే నియామకాలు : ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు చేయాల్సిన పనిని అక్కడున్న రాజకీయ నేతలే చేసేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయని స్థానాల్లో అనధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించుకున్నారు. ముదిగుబ్బ మండలంలో ఈ పరిస్థితి ఎక్కువశాతం నెలకొంది. దీంతో అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవడానికే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తొలుత విడుదల చేసిన 82 స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాళీ ఏర్పడిన 437 స్థానాలకు భర్తీ విషయం హైకోర్టుకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని కొంతమంది బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. అధికారులు త్వరలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు నుంచి ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఫీల్డ్ అసిస్టెంట్ల నియమాకం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. -
వర్సిటీలపై సర్కారు దృష్టి
* సిబ్బంది నియామకానికి చర్యలు * డిసెంబర్ నాటికి నోటిఫికేషన్లు జారీ! * రూసా నిధులు రావాలంటే సిబ్బంది ఉండాల్సిందే * ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యాశాఖ ఆలోచనలు * వర్సిటీల చట్టానికి తుది రూపు.. త్వరలో సీఎంకు ఫైలు * అమల్లోకి వచ్చాక వీసీలు, సిబ్బంది నియామకం సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో సిబ్బంది లేక బోధన కుంటుపడింది. దీనికి తోడు ఉన్నత విద్యాభివృద్ధికి రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద కేంద్రం నిధులు ఇవ్వాలంటే వర్సిటీల్లో రెగ్యులర్ వైస్ చాన్సలర్లతో పాటు బోధన సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బోధన సిబ్బంది నియామకాల పైనా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నియామకాల ద్వారా వర్సిటీలను గాడిలో పెట్టాలన్న యోచనతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీల కోసం కొత్తగా చట్టాన్ని రూపొందిస్తోంది. ప్రస్తుతం చట్టం రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ఇందులో ప్రధానంగా వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఎక్కువగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వర్సిటీలకు గవర్నర్‌ను చాన్సలర్‌గా కాకుండా.. ఒక్కో వర్సిటీకి ఒక్కొక్క రంగానికి చెందిన ప్రముఖుడ్ని చాన్సలర్‌గా నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం న్యాయ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీల చట్టం డ్రాఫ్ట్ కాపీ సిద్ధం కావచ్చింది. విదేశాల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తిరిగి రాగానే ఆయన అనుమతితో సీఎం కేసీఆర్ ఆమోదం కోసం చట్టం డ్రాఫ్ట్ కాపీని పంపించనున్నారు. దానికి సీఎం వెంటనే ఓకే చెబుతారా? లేక చైనా పర్యటనకు వెళ్లి వచ్చాక ఆమోదిస్తారా.. అన్నది తేలాల్సి ఉంది. సీఎం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. ఆ తరువాత చాన్సలర్లు, వైస్ చాన్సలర్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు, సిబ్బంది నియామకాలను ఒక్కొక్కటిగా చేపట్టనుంది. మొత్తానికి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు డిసెంబర్ నాటికి యూనివర్సిటీల వారీగా నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10 వర్సిటీలకు కొత్త వీసీలు.. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో (ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, అంబేడ్కర్ ఓపెన్, జేఎన్టీయూహెచ్, జేఎన్‌ఏఎఫ్‌యూ) ఏ ఒక్క విశ్వ విద్యాలయానికి పూర్తిస్థాయి వైస్ చాన్సలర్లు (వీసీ) లేరు. ఆయా యూనివర్సిటీల్లో ముందుగా చాన్సలర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టనుంది. వారి నియామకాలు పూర్తి కాగానే వీసీలను నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. సగం సిబ్బంది లేరు.. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 2,232 మంజూరైన పోస్టులు ఉంటే ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. పాలమూరు వర్సిటీ ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. శాతవాహనలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి 21 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఓయూలో 1,230 వరకు మంజూరైన పోస్టులుంటే 600 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలో 14 పోస్టులు ఉంటే నలుగురే పనిచేస్తున్నారు. -
మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో నియామకాల జోరు
న్యూఢిల్లీ: మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో నియామకాలు పెరిగాయి. ఈ రంగంలో నియామకాల వృద్ధి గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం పెరిగింది. నియామకాల పెరుగుదలకు డిజిటల్ మీడియా, శాటిలైట్ టీవీ వంటి తదితర విభాగాల విస్తరణే కారణం. ఈ విషయం టైమ్స్జాబ్స్డాట్కామ్ సర్వేలో వెల్లడైంది. గత ఏడాది కాలంలో ఎంటర్టైన్మెంట్, మీడియా, జర్నలిజం నిపుణుల డిమాండ్ బాగా పెరిగింది. వీరిలో ముఖ్యంగా ప్రారంభ స్థాయి, ఐదేళ్లలోపు అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా (60 శాతంగా) ఉంది. ఈ డిమాండ్‌లో 50 శాతం ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల నుంచే ఉంది. తర్వాతి స్థానాల్లో హైద రాబాద్, పుణే, అహ్మదాబాద్‌లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో మీడియా సంబంధిత యాప్‌ల వినియోగం పెరిగిందని తద్వారా సోషల్ మీడియా నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింఈని టైమ్స్జాబ్స్డాట్కామ్ వెల్లడించింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో మరిన్ని నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఏపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాల్లో ఆదివారం మరిన్ని నియామకాలు జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ కింది వారిని ఆయా పదవుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా మహ్మద్ గౌస్ బేగ్(అనంతపురం-అర్బన్), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(సూళ్లూరుపేట-నెల్లూరు), సంయుక్త కార్యదర్శులుగా దేవరకొండ రమాభాస్కర్, అన్నపరెడ్డి హర్షవర్థన్‌రెడ్డి(తాడికొండ-గుంటూరు), ఇందూరు నర్సింహారెడ్డి(ఆత్మకూరు-నెల్లూరు), ఎం.పి.సురేష్(వైఎస్సార్‌జిల్లా),దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి(తిరుపతి), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గబ్బల వెంకటేశ్(అనంతపురం అర్బన్), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.సందీప్‌రెడ్డి(గుంతకల్), రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా డి.మహేష్(గుంతకల్), రాష్ట్ర వైఎస్సార్ సేవాదళ్ కార్యదర్శిగా త్యాగరాజు(గుంతకల్), బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.ప్రవీణ్‌యాదవ్(గుంతకల్), రైతు విభాగం కార్యదర్శిగా ఎం.నాగిరెడ్డి(గుంతకల్), మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎం.అన్సర్‌వలి(గుంతకల్), రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శిగా కె.మల్లికార్జున(గుంతకల్), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా కె.శ్రీదేవి(అనంతపురం), రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రధాన కార్యదర్శిగా వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి(సూళ్లూరుపేట), విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎం.రమేష్‌రెడ్డి(తంబళ్లపల్లి) నియమితులయ్యారు. -
తెలంగాణ సెట్స్ కన్వీనర్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ సెట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్లను నియమించింది. ఎంసెట్ కన్వీనర్‌గా ఎన్వి రమణారావు (జేఎన్టీయూహెచ్), లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్‌గా ఎంవీ రంగారావు (కేయూ), ఈసెట్ కన్వీనర్‌గా ఎం.యాదయ్య (జేఎన్టీయూహెచ్), ఐసెట్ కన్వీనర్‌గా కె.ఓంప్రకాశ్ (కేయూ), ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రసాద్ (ఓయూ), పీఈసెట్ కన్వీనర్‌గా జె.ప్రభాకర్‌రావు (ఓయూ), పీజీ ఈ సెట్ కన్వీనర్‌గా వేణుగోపాల్‌రెడ్డి (ఓయూ) నియమితులయ్యారు. -
ఇస్రో చీఫ్‌గా కిరణ్‌కుమార్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఇస్రో చైర్మన్‌గా కిరణ్ నియామకానికి కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డెరైక్టర్‌గా పని చేశారు. కర్ణాటకకు చెందిన కిరణ్ 1975లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ ప్రయోగాల్లో కీలక భూమిక పోషించారు. భాస్కర ఉపగ్రహం విజయవంతం కావడంలోనూ ఆయన పాత్ర కీలకం కిరణ్ 1971లో బెంగళూరులోని నేషనల్ కాలేజ్‌నుంచి భౌతిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొందారు. -
కర్నూలులో నేడు, రేపు వైఎస్సార్సీపీ సమీక్షలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సమీక్షా సమావేశాలు ఈ నెల 9, 10 తేదీల్లో కర్నూలులో జరుగుతాయని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమీక్షల్లో ప్రధానంగా సంస్థాగత వ్యవహారాలపైనే చర్చ జరుగుతుంది. వైఎస్సార్సీపీలో పలు నియామకాలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా మిట్టపల్లి రమేష్‌బాబు(నర్సరావుపేట), మాసీమ బాబు(ఆర్వీ సుబ్బారెడ్డి-కమలాపురం), సీఈసీ సభ్యునిగా కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు(భీమిలి), పెందుర్తి(విశాఖపట్నం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా అన్నమారెడ్డి అదీప్‌రాజ్(పెందుర్తి) నియమితులయ్యారు. -
వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పలువురికి చోటు దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధిన నియామకాలకు ఆమోదం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్ రాజశేఖర్ రెడ్డి (చిత్తూరు )-రాష్ట్ర కార్యదర్శి ఎస్.చక్రధర్ (చిత్తూరు)- రాష్ట్ర ఉప కార్యదర్శి హేమంత్ యాదవ్ (చిత్తూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల తులసీరాం యాదవ్ (నెల్లూరు)-రాష్ట్ర కార్యదర్శి ఎస్ హజీ(నెల్లూరు)-రాష్ట్ర ఉప కార్యదర్శి శివశంకర్ గుప్తా (నెల్లూరు)-రాష్ట్ర ఉపకార్యదర్శి జి.మహేశ్ రెడ్డి (నెల్లూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్.డేవిడ్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ స్వరూప్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి నవహర్ష (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ విభాగాలకు సంబంధించి పలు నియామాకాలను ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కర్నూలు జిల్లాకు చెందిన డి.యుగంధర్, గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన పి.హనిమి రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్.అశోక్‌లను నియమించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కృష్ణా జిల్లాకు చెందిన తాతినేని పద్మావతి, కర్నూలుకు చెందిన కాటసాని జ్యోతిలను నియమించారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి పద్మనాభ రెడ్డిని సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిజిసి) సభ్యునిగా నియమించారు. గుంటూరుకు చెందిన పేరిరెడ్డిని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా పులివెందులకు చెందిన వి.అరవింద్నాథ్ రెడ్డిని, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన ఎస్.పరీక్షిత్ రాజును నియమించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కర్రి నారాయణ రావు, చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన ఏ.విద్యానాథ్ రెడ్డి, కడపకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డిలను నియమించారు. ** -
వైసీపీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొర, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిశీలకుడుగా ముక్కు కాశిరెడ్డి, కార్యదర్శులుగా అత్తారు చాంద్‌బాష, డాక్టర్ నన్నపనేని సుధ, వరుదు కల్యాణి, ఏ. వరప్రసాదరెడ్డి, జి. వెంకటరమణ, వై. మధుసూదన్‌రెడ్డి, నజీర్ అహ్మద్, ఏ పేరిరెడ్డి, జి.వి. సుధాకర్‌రెడ్డి, గంపా గిరిధర్ నియమితులైనట్టు పేర్కొన్నారు. -
ఏయూ నియామకాలు సరికాదు
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మూడు నియామకాలు సరికాదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. బుధవారం సర్య్కూట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నకుమంత్రి సమాధానమిచ్చారు. ప్రాధమిక విచారణలో ఇది అక్రమమని తేలిందన్నారు. కొద్ది వారాల క్రితం వర్సిటీలో వివిధ పథకాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు అబ్జార్బ్ పేరుతో వర్సిటీలోని సోషల్ వర్క్, సోషియాలజీ, అకడమిక్ స్టాఫ్ కళాశాలలో నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో కమిటీ నియమించి విచారణ జరిపించాలని ఆదేశించారు. కమిటి ప్రాధమిక విచారణలో నియామకాలు తప్పుపట్టిం దన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్.ఏ.డి పాల్‌ను అకడమిక్ స్టాఫ్ కళాశాలలో, డాక్ట ర్ హరనాథ్‌ను సోషల్ వర్క్ విభాగంలో, సార్క్ అధ్యయన కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ శ్రీమన్నారాయణను సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. వీటి ని అబ్జార్బ్ చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిపే ఉద్యోగాల భర్తీలో వీటిని ఖాళీలుగా చూ పే అవకాశం ఉండదంటూ వర్సిటీలో దుమా రం రేగింది. ఎటువంటి నోటిఫికేషన్, ఇంట ర్వ్యూలు లేకుండా నియామకాలు జరపడంపై నిరుద్యోగులు సైతం తీవ్ర ఆవేదన చెందారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ప్రాధమిక విచారణతో తప్పు తేలడంతో వర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే విషయం త్వరలో తేలే అవకాశం ఉంది. విద్యార్థులతో ఆటలొద్దు: గంటా సాక్షి, విశాఖపట్నం : స్థానికత అంశంలో విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ప్రభుత్వ అతిథి గృహంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌కు ఇది సరికాదని మంత్రి హితవుపలికారు. సినీ పరిశ్రమ విశాఖ వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ ఒకరిద్దరి అభిప్రాయమో కాకుండా సినీ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధుల సలహా, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు తెలపారు. బీఈడీ, డీఎడ్ చదువుతోన్న తాజా అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై న్యాయపరమైన అంశాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రంగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, విద్యాశాఖలోనే 62 శాతం సిబ్బంది లోటున్నట్టు లెక్కలు చెప్తున్నాయన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసమే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని, వారికి నష్టం కలగని రీతిలోనే తవ్వకాలు చేపడతారన్నారు. గిరిజనులు వ్యతిరేకిస్తే బాక్సైట్ తవ్వకాల్ని నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. -
జిల్లా, జోనల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులకే విభజనతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు జిల్లా, జోనల్ స్థాయి (స్థానిక కేడర్) పోస్టుల్లో పదోన్నతులు, నియామకాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు కూడా అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో ఏపీలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతలు లభించనున్నాయి. అలాగే జిల్లా, జోనల్ స్థాయి పోస్టులకు కొత్తగా నియామకాలను కూడా చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. -
ట్రామాకేర్‌లో అడ్డగోలు నియామకాలు!
శ్రీకాకుళం కలెక్టరేట్,న్యూస్‌లైన్: ట్రామాకేర్‌లో వివిధ రకాలకు చెందిన 43 ఉద్యోగాలకు సంబంధించి జాబితాలను రిమ్స్ అధికారులు సిద్దం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వీటిని పూర్తి చేసేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సక్రమంగా వీటిని భర్తీ చేస్తే ఆరు నెలల కిందటే ఉద్యోగ నియామకాలు పూర్తయ్యేవి. ట్రామాకేర్ సెంటర్ ఉద్యోగాల నియామకాలు ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఉద్యోగ నియామకాలు జాప్యం జరుగుతాయనే నెపంతో ఈ బాధ్యతను రిమ్స్ అధికారులు తీసుకున్నారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అధికారులు అడుగడుగునా తప్పులు చేశారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ఈ తప్పుల పరంపరంకొనసాగింది. నాటి జాబితాల్లో తప్పులపై కథనాలను ‘సాక్షి’ ఐదు రోజుల పాటు ప్రచురించింది. అదే సమయంలో ప్రధానంగా డ్రైవర్ పోస్టు, స్టాఫ్‌నర్సు, రేడియోలజీ, ఈసీజీ టెక్నీషియన్ నియామకాలకు సంబంధించి రోస్టర్, లోకల్, నాన్‌లోకల్, మెరిట్‌లు పాటించలేదని సంబంధిత అభ్యర్థులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ ఈ నియామకాలు నిలుపు చేశారు. అంతే కాకుండా ఆ జాబితాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ జాబితాలను కలెక్టరేట్ సిబ్బంది పరిశీలించి స్పష్టంగా లేవని, దరఖాస్తులతో సహా అందజేయాలని ట్రామాకేర్ ఫైల్‌ను వెనక్కి పంపారు. తర్వాత ఎన్నికలు రావడంతో ఐదారు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి మేరకు పాతజాబితాలో స్వల్ప మార్పులతో మళ్లీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సారి కూడా రిమ్స్ అధికారులు గతంలో చేసిన పొరపాట్లే పునరావృతం చేస్తున్నారు. మెరిట్ జాబితాను ప్రచురించడం, రోస్టర్ పాయింట్లను నోటీస్ బోర్డులో తెలియజేయడం, అనంతరం మెరిట్ రోస్టర్ నాన్‌లోకల్, లోకల్ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన నియామకాలను పాటించకుండా రహస్యంగా నిర్వహిస్తున్నారు. దీంతో గతంలో లాగే మళ్లీ అడ్డగోలు నియామకాలకు తెరతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందని గతంలో ఫిర్యాదు చేసిన వారు, న్యాయస్థానం ఆశ్రయించినవారు భావిస్తున్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా జాబితా సిద్ధం చేస్తున్నారని, ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన జిల్లా ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం, నియామకాలు జరపాలని సిఫార్సు చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే రిమ్స్‌లో ప్రతి నియామకం వివాదాస్పదం కావడం రోస్టర్, మెరిట్‌కు ప్రాధాన్యత లేకపోవడంతో ప్రస్తుతం భర్తీ చేయనున్న 43 పోస్టుల్లో కూడా తప్పులు దొర్లాయని, మాజీ మంత్రి సిఫార్సుల మేరకే నియామకాలుచేపడతారనే ప్రచారం సాగుతోంది. చక్కదిద్దుకుని వెళతారా? రిమ్స్‌లో డీడీ, సూపరింటెండెంట్, డెరైక్టర్లు ఆ పోస్టుల నుంచి బయట పడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. తాము వెళ్లే ముందు వీటిని చక్కబెట్టుకుని వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. దీనికి ముందే ఈ తంతునంతా పూర్తి చేసి అనుకున్నట్టుగా నియామకాలు చేపట్టేందుకు రిమ్స్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. -
26 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ఉర్దూ నేర్చుకోవాలి. ఆరో తరగతి నుంచి మాత్రం తెలుగు నేర్చుకోవాలి. కానీ ఎక్కడా ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల్లేరు. ఫలితంగా ముస్లింలున్న గ్రామాల్లో విద్యార్థులు ఏ భాషలోనూ పట్టు సాధించడం లేదు. రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. జిల్లావ్యాప్తంగా ఏడు ముస్లిం గ్రామాల్లో ఆరేళ్లుగా ఉర్దూ ఉపాధ్యాయుల్లేరు. ముస్లిం విద్యార్థులు మాతృభాషకు నోచుకోవడం లేదు. నక్కపల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో ఉర్దూ బోధించే పాఠశాలలు 35 ఉన్నాయి. వీటిలో 31 ప్రాథమిక, 4 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆరు నుంచి 10 వరకు పూర్తిగా ఉర్దూ భాషలో బోధించే ఉన్నత పాఠశాల పెదగంట్యాడ మండలం ఇస్లాంపేటలో ఉంది. ఆరేళ్లుగా ఉర్దూ ఉపాధ్యాయుల్లేరు ముస్లింలు నివసించే గ్రామాల్లో ఉర్దూ పాఠశాలలను నెలకొల్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉర్దూ పాఠశాలల్లో 26 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని 7 ముస్లిం గ్రామాలైన పెదదొడ్డిగల్లు, పెదబోదిగల్లం, అప్పలపాయకరావుపేట, చినబోదిగల్లం, రామకృష్ణాపురం, సీతారాంపురం, చెల్లాపురం పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణం. ఈ పాఠశాలల్లో ఆరేళ్లుగా ఉర్దూ బోధించే ఉపాధ్యాయుల్లేరు. ఒక్కొక్క పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, గత ఏడాది వరకు ఇక్కడ నియామకాలు చేపట్టలేదు. ఈ ఏడాది భర్తీ చేసినా ఒక్కొక్కరిని మాత్రమే నియమించారు. ఆరేళ్లుగా ఇక్కడ చదివిన విద్యార్థులు మాతృభాషకు నోచుకోలేదు. రెంటికీ చెడ్డ రేవడి ఎలిమెంటరీ వరకు ఇక్కడ ఉర్దూలోనే బోధించాలి. ఇంట్లో ఉర్దూ మాట్లాడుతూ పాఠశాలలో తెలుగు నేర్చుకోవడం విద్యార్థులకు కష్టమవుతోంది. అరకొరగా నేర్చుకున్నా ఆరో తర గతిలో ప్రవేశించాక ఉర్దూను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు ఉండటం లేదు. ఏటా ఈ గ్రామాల్లో సుమారు 200 మంది ముస్లిం విద్యార్థులు ఎలిమెంటరీ నుంచి హైస్కూల్ స్థాయికి వెళ్తున్నారు. పెదబోదిగల్లంలో జెడ్పీ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలో సుమారు 50 మంది ఉర్దూ విద్యార్థులున్నారు. ఇక్కడ తెలుగు మీడియంలోనే బోధిస్తారు. ఉర్దూ మీడియంలో చదివిన విద్యార్థులు హైస్కూల్ స్థాయిలో ఉపాధ్యాయుల్లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సగం విద్యాసంవత్సరం అక్షరాలు నేర్పించేందుకే సరిపోతోందని హైస్కూలు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పెదబోదిగల్లం హైస్కూల్లో లాంగ్వేజ్ సబ్జెక్ట్‌గా ఉర్దూను ప్రవేశపెట్టి ఉపాధ్యాయుడ్ని నియమిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని ఉపాధ్యాయులు అంటున్నా రు. వీరికోసం ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం లేదా హైస్కూళ్లలో తెలు గు, హిందీ మాదిరిగా ఉర్దూను కూడా లాం గ్వేజిగా చేసి ఉపాధ్యాయుడ్ని నియమించాలని ఈ ప్రాంత ముస్లింలు కోరుతున్నారు. ఉర్దూకు దూరమవుతున్న విద్యార్థులు ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ముస్లిం విద్యార్థులు మాతృభాషకు దూరమవుతున్న విషయం వాస్తవమే. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని ైెహ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని, ఇక్కడ ఒక ఉర్దూ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. - ఎమ్డీ గౌస్లాలీ, ఏఎంవో, ఆర్వీఎం(ఉర్దూ) -
ముడుపులిచ్చికో.. పోస్టింగ్ పుచ్చుకో
వైద్యుల నియామకాల్లో భారీగా అవకతవకలు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సర్వీసు వెయిటేజీ మార్కులు డబ్బులిచ్చిన విదేశీ డిగ్రీ అభ్యర్థులకు దండిగా మార్కులు సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నియామకాలు లేవు. మరోపక్క వయసైపోతోంది. రాక రాక వచ్చిన నోటిఫికేషన్‌లోనైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామనుకున్న నిరుద్యోగ వైద్య పట్టభద్రుల కలను ముడుపులందుకున్న అధికారులు చెరిపేస్తున్నారు. ప్రతిభను పక్కనబెట్టి పోస్టులను అమ్ముకుంటున్నారు. ఒక్కో పోస్టును రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు రేటు కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అమ్మకాలతో మొత్తం ఎంపిక జాబితాను తారు మారు చేసి అనర్హులకు పోస్టులు కట్టబెట్టినట్లు వెల్లడైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం చేపట్టిన 1125 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకంలో చాలా అవకతవకలు బయటపడ్డాయి. చివరకు అభ్యర్థులు ధర్నాలు, ఆందోళనలు చేసి ఒత్తిడి తేగా.. అధికారులు వారి అభ్యంతరాలను స్వీకరించారు. ఒకటి కాదు రెండు కాదు 300 మంది దరఖాస్తులను స్వీకరించి వారిని తిరిగి జాబితాలో చేర్చారంటే ఏమేరకు అవినీతి జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా.. శ్రీలక్ష్మి అనే వైద్యురాలికి తొలి జాబితాలో పేరే లేదు. ఆ తర్వాత గొడవ చేస్తే ఆమెకు 77వ ర్యాంకు కేటాయించారు. ఇదెలా సాధ్యం అంటే సమాధానం లేదు. ఇలాంటివి కోకొల్లలు. అభ్యర్థుల వెయిటేజీ మార్కుల ను తారుమారు చేశారు. కాంట్రాక్టు సర్వీసు వైద్యులకి చ్చే 15 శాతం వెయిటేజీ మార్కులను ఇష్టారాజ్యంగా వేసినట్టు వెల్లడైంది. అంతేకాదు అభ్యర్థి ఎంబీబీఎస్ పాసైనప్పటి నుంచి ఆ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా, ఆ పని చేయలేదు. ఇక అభ్యర్థుల జోన్లకు జోన్లే మార్చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారి సర్వీసునూ పరిగణనలోకి తీసుకోకుండా మార్కులు వేశారు. రష్యా, చైనా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్ తదితర విదేశాల్లో డిగ్రీలు చేసిన వారు మార్కుల కోసం భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. చివరకు వికలాంగ అభ్యర్థుల శాతాన్ని కూడా లెక్కించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు తారుమారే.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకంలో 300 పైగా దరఖాస్తుదారులను జాబితాలో చేర్చడమంటే పాత ర్యాంకులు తారు మారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేపట్టడం, ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం చూస్తుంటే అసలు ఈ జాబితానే నిలిపేసి కొత్త జాబితా రూపొందిస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా వైద్య విధాన పరిషత్‌లోనూ స్పెషలిస్టుల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ నియామకాల్ని సక్రమంగా చేపట్టాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సూచించినట్టు తెలిసింది. -
తెలంగాణ, సీమాంధ్ర నేతల సమావేశాలు
-
ఆ నియామకాలు రాజకీయమే!
సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకం జరిగిన తీరును చూస్తుంటే, అవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్లుగా వి.వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు గండ్ర మోహనరావు, కె.వివేక్ రెడ్డిలు వాదనలు వినిపించగా, కమిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి, ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిష్ణాతులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని, కాని ఈ కేసులో ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులను ఆహ్వానించడం గానీ, ప్రకటన జారీ చేయడం గానీ చేయలేదని మోహనరావు కోర్టుకు నివేదించారు. అంతేకాక కమిషనర్ల నియామకం వ్యవహారాన్ని చూసే కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత సైతం ఈ నియామకాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు నియామకానికి ముందే వారు నిర్వర్తిస్తున్న పదవులకు రాజీనామా చేయాలని, అయితే వెంకటేశ్వర్లు మాత్రం న్యాయవాదిగా నేటికీ కొనసాగుతున్నారని తెలిపారు. ఈ వాదనలను శ్రీధర్‌రెడ్డి తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియామకం జరిగిన తరువాతనే వారు తమ తమ పదవులకు, వ్యాపారాలకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందంటూ తీర్పును చదివి వినిపించారు. ప్రతిపక్ష నేత ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని డి.వి.సీతారామ్మూర్తి తెలిపారు. తమ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వెంకటేశ్వర్లు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై సోమవారం బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందంటూ అందుకు సంబంధించి లేఖను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఇలా లేఖ తీసుకురావడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవి రాజకీయ నియామకాలుగా కనిపిస్తున్నాయని, అందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయంటూ తీర్పును వాయిదావేస్తున్నట్లు తెలిపింది. కాగా, సమాచార కమిషనర్ల నియామకంపై దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరో ధర్మాసనానికి నివేదించింది.