
వెఎస్సార్‌సీపీ తెలంగాణలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీలో శనివారం పలువురిని నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా మందాడపు వెంకటరాంరెడ్డి, వేమిరెడ్డి రోషిరెడ్డి, ఆలస్యం సుధాకర్, సంయుక్త కార్యదర్శిగా వనంరెడ్డి నాగిరెడ్డి నియమితులయ్యారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.