వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు | YSR Congress Telangana in Appointments | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు

Published Sat, Jul 2 2016 3:52 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు - Sakshi

వైఎస్సార్‌సీపీ తెలంగాణలో పలు నియామకాలు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ కమిటీకి సంబంధించి వివిధ అనుబంధ విభాగాల్లో పలువురిని నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శిగా కోడి మల్లయ్య యాదవ్ (హుజుర్‌నగర్), రాష్ర్ట కార్యవర్గసభ్యులుగా కర్ల సుందరబాబు (నల్లగొండ), లింగం సత్యనారాయణరెడ్డి (మేళ్లచెర్వు) నియమితుల య్యారు. రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా కస్తాల ముత్తయ్య (హుజుర్‌నగర్),  రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా రహీమ్ షరీఫ్ (నారాయణపురం), బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కర్నె వెంకటేశ్వర్లు (హుజుర్‌నగర్), రాష్ట్ర యూత్ కార్యదర్శిగా మంద వెంకటేశ్వర్లు (హుజుర్‌నగర్)లను నియమించారు.

నల్లగొండ జిల్లా పార్టీ అధికార ప్రతి నిధిగా సుతారి శ్రీను (హుజుర్‌నగర్), ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బాలెంల మధు (మోత్కురు), మైనారిటీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ ఫయాజ్ (నల్లగొండ), బీసీ సెల్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ముషం రామానుజం (నకిరేకల్) నియమితులయ్యారు.
 
రాష్ర్ట మహిళా కమిటీలో నియామకాలు..: రాష్ర్టపార్టీ మహిళా కమిటీలో పలు నియామకాలు చేశారు. ప్రధాన కార్యదర్శులుగా జూలి బెన్నాల (శేరిలింగంపల్లి), క్రిస్టోలైట్ (అంబర్‌పేట), గాదె రమారెడ్డి (ఎల్‌బీనగర్), ఎం.పుష్పలత (చేవెళ్ల), వనజ (కూకట్‌పల్లి), మేరి (జూబ్లీహిల్స్), యర్రంరెడ్డి ఇందిరారెడ్డి (శేరిలింగంపల్లి), కార్యదర్శులుగా సూర్యకుమారి (ఎల్‌బీనగర్), జ్యోతి రెడ్డి (జూబ్లీహిల్స్), నేహా (మహేశ్వరం), అల్ఫరాన్‌సమ్మ (ఇబ్రహీంపట్నం), విష్ణుప్రియ (శేరిలింగంపల్లి), బొక్కనపల్లి రాజమ్మ (కరీంనగర్), సంయుక్త కార్యదర్శులుగా రాగ సంధ్య(కూకట్‌పల్లి), పద్మ (జూబ్లీహిల్స్), లక్ష్మీదేవి (మహేశ్వరం), గడ్డం జలజ (కరీంనగర్), వి.రాణిరెడ్డి (రంగారెడ్డి)లను నియమించారు.

ఇదిలా ఉండగా మహిళా కమిటీలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధ్యక్షురాలిగా శ్యామల, నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా విజయలక్ష్మి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కుముద్దీని నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో ఆయా విభాగాల్లోని పలు పోస్టుల్లో నియమించినట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలి పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement