అనంతపురం : జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీల్లో నియమించారు. ఆ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ఎ.దశరథనాయుడును నియమించారు. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వై.సుధాకర్‌ను జిల్లా సంయుక్త కార్యదర్శిగా, ధర్మవరానికి చెందిన బీరే ఎర్రిస్వామిని చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా, అనంతపురం నగరానికి చెందిన మల్లెమీద నరసింహులును ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే పామిడి మండల కమిటీ అధ్యక్షుడిగా కె.నారాయణరెడ్డిని, గుంతకల్లు పట్టణ కమిటీ అధ్యక్షుడిగా సుంకప్పను నియమించారు.