ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పదోన్నతులు, నియామకాలు, బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులకే విభజనతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు జిల్లా, జోనల్ స్థాయి (స్థానిక కేడర్) పోస్టుల్లో పదోన్నతులు, నియామకాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు కూడా అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో ఏపీలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతలు లభించనున్నాయి. అలాగే జిల్లా, జోనల్ స్థాయి పోస్టులకు కొత్తగా నియామకాలను కూడా చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1.48 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది.
జిల్లా, జోనల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Published Thu, Jul 24 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement