పీఈటీ నియామకాలు నిలిపివేయండి: హైకోర్టు
Published Fri, Jun 30 2017 1:21 PM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
హైదరాబాద్: గురుకులాల్లో పీఈటీ నియామకాలను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 30 న జరిగే గురుకుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. రెస్పాన్డెంట్స్ కు నోటీసులు పంపింది. ఉన్నత విద్యాశాఖ చైర్మన్, సెక్రెటరీ, విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెలంగాణ పబ్లిక్ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్‌సీటీఈ అండ్ గెజిట్ ఆఫ్ ఐఎన్‌డీఏఐ నిబంధనల ప్రకారం బీపీఈడీ చెయ్యాలంటే కనీసం జిల్లా స్థాయి క్రీడా నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపింది.
కానీ ప్రభుత్వం ఎన్‌సీటీఈ నామ్స్ పట్టించుకోకుండా గురుకుల ఉపాద్యాయ పోస్టులకు అందరికి అవకాశం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కె. రెడ్యానాయక్ , నవీన్ కుమార్ అనే ఇద్దరు క్రీడాకారులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఆడిన వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్న పిటీషనర్లు పేర్కొన్నారు. తదుపరి విచారణలో కోర్ట్ ఆదేశాలు ఇచ్చేంత వరకు పీఈటీ నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement