సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీలో పలు నియామకాలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాస్‌రావు (కరీం నగర్), గుండెరెడ్డి రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సంయుక్త కార్యదర్శిగా పారిపెల్లి వేణుగోపాల్‌రెడ్డి (కరీంనగర్) నియమితులయ్యారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కె.విశ్వనాథ్‌చారి (రంగారెడ్డి), సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా సందమల్ల నరేశ్(కరీంనగర్)లను నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్రకమిటీలో నియామకాలు
Published Sun, Aug 14 2016 2:28 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement