వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి.
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎం.అరుణ్‌కుమార్ (కృష్ణా), అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వి.మల్లికార్జునరావు (బాబ్జీ)(ప.గోదావరి), విజయవాడ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ మొహియుద్దీన్ (కృష్ణా)లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.