
ఉబెర్‌లో నియామకాలు..
భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ గణనీయంగా నియామకాలు చేపట్టనుంది.
న్యూఢిల్లీ: భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, డిజైనర్లు మొదలైన వారిని తీసుకుంటున్నట్లు ఉబెర్ ఇండియా ఇంజినీరింగ్ విభాగం హెడ్ అపూర్వ దలాల్ తెలిపారు. అయితే ఎంత మందిని రిక్రూట్ చేసుకోనున్నది వెల్లడించలేదు.
ఉబెర్ కొత్తగా పేమెంట్స్, బుకింగ్స్ తదితర విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా కస్టమర్లు చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కూడా చర్చలు జరుపుతోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుల్లో ఇంజనీరింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉబెర్‌కు అమెరికా తర్వాత భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌లో 29 నగరాల్లో ఉబెర్ ట్యాక్సీ సేవలు అందిస్తోంది.