
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల రంగంలో ఉన్న ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెద్ద ఎత్తున నియామకాలను చేపడుతోంది. ఏడాదిలో కొత్తగా 2,000 మందిని చేర్చుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ రాజీవ్ యాదవ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,200 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ‘11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది.
14 లక్షల మంది కస్టమర్లున్నారు. అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.2,899 కోట్లుంది. 2021కి ఏయూఎం రూ.10,000 కోట్లకు చేర్చాలన్నది ధ్యేయం. అలాగే 40 లక్షల కస్టమర్లకు చేరుకోవాలనేది లక్ష్యం. బ్యాంకింగ్ ఔట్‌లెట్లు ప్రస్తుతమున్న 532 నుంచి 5,000ల స్థాయికి తీసుకెళతాం. డిపాజిట్లపై వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు 9.5%, ఎన్‌ఆర్‌ఐలకు 9
Comments
Please login to add a commentAdd a comment