భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు.
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చీఫ్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. ఇస్రో చైర్మన్‌గా కిరణ్ నియామకానికి కేంద్ర కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డెరైక్టర్‌గా పని చేశారు. కర్ణాటకకు చెందిన కిరణ్ 1975లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్, మార్స్ ఆర్బిటార్ ప్రయోగాల్లో కీలక భూమిక పోషించారు. భాస్కర ఉపగ్రహం విజయవంతం కావడంలోనూ ఆయన పాత్ర కీలకం కిరణ్ 1971లో బెంగళూరులోని నేషనల్ కాలేజ్‌నుంచి భౌతిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొందారు.