‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ | YSRCP President YS Jagan Mohan Reddy Tweets For Party Victory | Sakshi
Sakshi News home page

‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’

Published Fri, Mar 28 2025 3:05 PM | Last Updated on Fri, Mar 28 2025 5:18 PM

YSRCP President YS Jagan Mohan Reddy Tweets For Party Victory
  • స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయంపై వైఎస్ జగన్ హర్షం
  • ఎల్లప్పుడూ పార్టీకి వెన్నుముకలా నిలుస్తున్న కార్యక్తర్తలకు నా హ్యాట్సాఫ్‌
  • పార్టీ కేడర్ అభినందనలు తెలిపిన వైఎస్ జగన్‌

తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో  పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు వైఎస్ జగన్ తన సోషల్ మీడియా అకౌంట్‘ఎక్స్’ ద్వారా   వైఎస్సార్‌సీపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.‘స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయటం హర్షించదగ్గ విషయం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా..కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని..జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా  వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులను గెలిపించుకున్నారు.

స్థానిక సంస్థల ఉపఎన్నికలపై వైఎస్ జగన్ ట్వీట్

విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న  కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 

 

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement