
దైవ దర్శనానికి వెళ్తుండగా..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): దైవ దర్శనానికి వెళ్తుండగా టెంపో వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర ఘటన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్‌రోడ్డుపై సోమవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. కొల్లూరు ఎస్‌ఐ రవీందర్ కథనం మేరకు.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన హరి కిసాన్ హజారీ బీదర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. తిరుపతి, శ్రీశైలం వెళ్దామని తనకు తెలిసిన వ్యక్తి మాదయ్య(45) టెంపో వాహనం అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు తల్లి సునీత బాయి, అతడి భార్య శిల్పరాణి, కూతురు అనుష్క, కుమారుడు ఆయూష్, తమ్ముడు దీపక్ కిసాన్ సింగ్, అతడి భార్య అమృత, కూతురు ఆరాధ్య, చెల్లెలు హారతి, ఆమె భర్త అజయ్ సింగ్, పిన్ని జీవన్ బాయి, వారి ఇంట్లో డ్రైవర్ ధనరాజ్‌తో కలిసి ఇంటి నుంచి దైవ దర్శనానికి బయలుదేరారు. ముత్తంగి సమీపంలోకి రాగానే రింగ్‌రోడ్డు ఎక్కారు. సోమవారం తెల్లావారుజామున 2 గంటల సమయంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డుపై ముందు ఉన్న వాహనాన్ని తప్పించబోయి టెంపో మొదట డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన 12 మందిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హరి కిసాన్ హజారీ, కుమార్తె అనుష్క, ధన్‌రాజ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్శనానికి వెళ్లొస్తుండగా కారు ప్రమాదం
– నలుగురికి గాయాలు
కొండపాక(గజ్వేల్): మంచిర్యాలలోని శివాలయంలో దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో గల కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన తన్మయి, గీత, రోహిత్ రుద్రన్స్ కలిసి కారులో ఆదివారం మంచిర్యాలలోని శివాలయంలో దర్శనం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుద్దెడ శివారులోకి రాగానే వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న ట్రాక్టరును ఢీకొడుతూ డివైడర్ దాటుకొని అవతలి వైపును కారు దూకెళ్లింది. ఈ ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక 108 అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్రీ టౌన్ కేసు నమోదు చేశారు.
టెంపో వాహనంబోల్తా పడి ఒకరు మృతి
12 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఘటన

దైవ దర్శనానికి వెళ్తుండగా..

దైవ దర్శనానికి వెళ్తుండగా..