
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
సంగారెడ్డి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులో ప్రభుత్వం టీఎన్జీఎస్ నూతన భవన నిర్మాణంకు కేటాయించిన స్థలంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లతో కలిసి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. అలాగే భవన నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామని, కలెక్టర్ ఉద్యోగుల పక్షానే ఉంటారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. టీఎన్జీవోస్‌కు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి జావేద్ అలీ, సంఘం జిల్లా కార్యదర్శి వి.రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, పి.వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ జిల్లా లోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
టీఎన్జీవో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ