
కారు ఢీకొట్టిన ప్రమాదంలో బైకిస్టు దుర్మరణం
వర్గల్(గజ్వేల్): బైకును వెనక నుంచి కారు ఢీకొట్టడంతో బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌రహదారిపై జరిగింది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం... మర్కూక్ మండలం ఎర్రవల్లికి చెందిన సంద గణేశ్(40)కు భార్య పద్మ, 14 యేళ్లలోపు మనోజ్, మానస అనే ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువుల కోసం గజ్వేల్‌లో ఉంటూ టిప్పర్, జేసీబీ పనులు చూసుకుంటున్నాడు. గురువారం సాయంత్రం బైక్‌పై గజ్వేల్ నుంచి గౌరారం వైపు వస్తున్నాడు. సింగాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద వెనక నుంచి కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకుకేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.