
ఓరుగల్లుకు గులాబీ దండు
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
25
గులాబీ శ్రేణులు, జిల్లా ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం చేశారు. వారం పది రోజులుగా ఆ పార్టీ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడు తూ... ఈ సభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ముందునుంచి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలుస్తోంది. ఎల్కతుర్తికి సమీప జిల్లాల నుంచి తరలించే సంఖ్యకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడి నుంచి జనాలను తరలించేందుకు హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లనున్న పార్టీ శ్రేణులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఓరుగల్లు భారీ బహిరంగసభకు తరలివెళ్లేందుకు గులాబీ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో జనాలను ఈ సభకు తరలించేందుకు ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ శ్రేణులు, బీఆర్‌ఎస్ అభిమానులు ఆదివారం ఉదయం బయలుదేరనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేల మందిని తరలించాలని ఆ పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు నాయకులు ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. వీటికితోడు ప్రైవేటు వాహనాల్లో కూడా ఈ సభకు తరలివెళ్లాలని భావిస్తున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
సంగారెడ్డి జిల్లాకు బహిరంగసభ స్థలం చాలా దూ రం. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలు ఎక్కువ దూరం ఉంటాయి. అయినప్పటికీ వీలైనంత ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేయాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కాగా, ఉమ్మడి మెదక్ గులాబీ పార్టీకి మంచి పట్టున్న జిల్లా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కూడా ఈ పార్టీ తన పట్టును నిలుపుకున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏమాత్రం తగ్గకుండా జన సమీకరణ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఈ బాధ్యతలను తీసుకున్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ బాధ్యతలను గ్రామాల వారీగా నియమించిన ఇన్ చార్జిలకు అప్పగించారు. మండలాలు, పట్టణాల వారీగా పర్యవేక్షకులను నియమించుకున్నారు.
న్యూస్‌రీల్
హరీశ్‌రావు దిశానిర్దేశం..
నియోజకవర్గానికి
ఐదు వేల చొప్పున తరలింపు
జన సమీకరణకు ఏర్పాట్లు పూర్తి
పక్షం రోజులుగా ప్రణాళిక.. ప్రచారం
ఎల్కతుర్తి బహిరంగసభను విజయవంతం చేసేందుకు గులాబీ పార్టీ నాయకులు గత పక్షం రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టారు. స్వయంగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు గోడలపై రాతలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండలాలు, పట్టణాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు జరిపారు. ఆయా మండల కమిటీలు, పట్టణ కమిటీల్లోని బాధ్యులకు ఈ జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు.

ఓరుగల్లుకు గులాబీ దండు

ఓరుగల్లుకు గులాబీ దండు