
కష్టాల ‘విజయ’కు ఊరట
● సాత్విక భవిష్యత్తుకుఎమ్మెల్యే హరీశ్ రావు భరోసా ● ఆయన చొరవతో వ్యాపారి చేయూత
సిద్దిపేటజోన్: ఇటీవల విద్యార్థుల అవగాహన సదస్సులో తన తల్లి విజయ పడుతున్న కష్టం తలుచుకొని ఏడ్చిన సాత్వికకు దాతలు చేయూతనందిస్తున్నారు. సాత్విక ఆర్థిక పరిస్థితిపై సాక్షిలో ఈనెల 23న ప్రచురితమైన కష్టాల కడలిలో విజయ తీరం వైపు కథనానికి దాతలు ముందుకు వచ్చారు. సాత్విక కుటుంబ పరిస్థితుల గూర్చి ఆరా తీసిన ఎమ్మెల్యే హరీశ్ రావు చొరవతో ఆర్థిక సాయం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి చిన్నారి సాత్విక, తల్లి విజయను పిలిపించి వారితో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం తన మిత్రుడి సహాయంతో హైదరాబాద్ వ్యాపారి తిరుమల్‌రెడ్డి ద్వారా రూ.2 లక్షల చెక్కును విజయకు అందించారు. అమ్మ ప్రేమ చాలా గొప్పదని, మంచిగా చదివి భవిష్యత్తులో ఉద్యోగం సాధిస్తే అమ్మ కష్టాలు తీరినట్టేనని సాత్వికతో ఎమ్మెల్యే ఆత్మీయంగా అన్నారు. భవిష్యత్తులో విద్యాపరంగా అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు.

కష్టాల ‘విజయ’కు ఊరట