
అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్
సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటజోన్ /ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ సభ సందర్భంగా జనసమీకరణ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ 25ఏండ్ల రజతోత్సవ కీర్తి, ఉద్యమానికి పురుడు పోసింది సిద్దిపేటేనని పేర్కొన్నారు. 27న పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వల్ల ఎంత వేగంగా అధికారంలోకి వచ్చిందో.. అంతే వేగంగా హామీల ఎగవేతతో ప్రజల్లో ఆదరణ పడిపోయిందన్నారు. సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం 40శాతం నూకలను ప్రజలకు ఇస్తోందని ఆరోపించారు. సిద్దిపేట పై ప్రభుత్వం కక్ష గట్టి నిధులను ఆపేసిందని ఆరోపించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జడ్పీ మాజీ చైర్మన్ రోజాశర్మ, నాయ కులు రాజనర్స్, సంపత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని రామ రాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని, హనుమాన్ మాలధారులతో కలిసి భిక్ష చేశారు.
నెలాఖరులోగా న్యాక్ భవనం..
సిద్దిపేట అర్బన్: న్యాక్ భవనం పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మె ల్యే హరీశ్‌రావు ఆదేశించారు. మందపల్లి గ్రామ శివారులో నిర్మితమవుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) భవనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం అందుబాటులోకి వస్తే ఎల్‌అండ్‌టీ సంస యేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనుందని తెలిపారు.